∙డొల్లు కర్తరీ ప్రారంభం: ది.04–05–2026 రా.12:59లకు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ తదియ సోమవారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం. ∙పెద్ద కర్తరీ ప్రారంభం: ది.11–05–2026 రా.11:00లకు వైశాఖ బహుళ నవమి తత్కాల దశమి సోమవారం నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. ∙కర్తరీ త్యాగం: 29–05–2026 ఉ.7:57 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ శుక్రవారం రోజు కర్తరీ త్యాగం అవుతుంది. మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మల ప్రారంభానికి కర్తరీ కాలంలో చేయరాదు.
దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్‌లు, పెంకుటిళ్ళు, పైకప్పు పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ∙రాబోవు ప్లవంగ నామ సంవత్సరం (2027–28) కర్తరీ నిర్ణయము ∙ది.05–05–2027 ప్లవంగ చైత్ర బహుళ చతుర్దశీ బుధవారం డొల్లు కర్తరీ ప్రారంభం. ∙ది.12–05–2027 వైశాఖ శుద్ధ సప్తమీ మంగళ/బుధ నిజ కర్తరీ ప్రారంభం.
∙ది.29–05– 2027 వైశాఖ బహుళ నవమీ శనివారం కర్తరీ త్యాగం. (సౌరమానం, చాంద్రమానం బార్హస్పత్య మానం అన్ని పంచాంగాలలోనూ కేవలం మాసం యొక్క ఆరంభం మార్పు తీసుకుంటుంది. చాంద్రమానం వారికి అమావాస్య వెళ్ళిన మరునాడు మాసం ప్రారంభం అవుతుంది. సౌరమానం వారికి రవి సంక్రమణం మరునాటి నుండి మాసం ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని అంశాలలోనూ తిథి, వార నక్షత్రాలు ఒక్కటే ఉంటాయి.)
-పంచాంగ కర్త
శ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు
ఫోన్లు: 08676 2414336 /98485 20336


