రాజు గురువు: ద్విజులు సత్కర్మ నిరతులై ఉందురు. రాజులు, ప్రజలు న్యాయముగా సంచరించెదరు. రాజనీతి బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టిచే సస్యములు ఫలించును. అందరూ స్వధర్మ ఆచరణలో మంచి బుద్ధి ప్రదర్శించెదరు.
మంత్రి కుజుడు: కలహములు, యుద్ధ, చోర, అగ్ని, రోగ భయములు పెరుగును. వాయుపీడ అధికము. వర్షము మధ్యమముగా ఉండును. పంటలకు తెగుళ్ళు రాగలవు. ధాన్యాదుల ధరలు పెరుగును.
సేనాధిపతి చంద్రుడు: ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు ధరలు పెరుగును. మంచి వర్షములు ఉండును. సస్యములు బాగుగా ఫలించును. పశువులు క్షీరసమృద్ధి కలిగి ఉండును.
సస్యాధిపతి శుక్రుడు: పంటలు బాగుగా పండును. తెల్లని ధాన్యము, తెల్లని భూమి బాగా ఫలించును. దేశమంతటను సుభిక్ష క్షేమారోగ్య సంపదలు ఉండును. సమస్త ధాన్యములు, వస్తువులకు ధరలు సరసమై ఉండును.
ధాన్యాధిపతి బుధుడు: మధ్యస్థాయి వర్షములు పంటలు మధ్యస్థాయిగా ఫలించును. జనులకు భయము కలుగును. సూక్ష్మధాన్యములు బాగా ఫలించును.
అర్ఘాధిపతి రవి: సువృష్టి సస్యాభివద్ధి కలుగును. ధరలు అధికం అవుతాయి. రాజులు సుఖించెదరు. ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. నిత్యావసర సరుకులు ధరలు పెరుగును.
మేఘాధిపతి చంద్రుడు: సర్వదేశములందు సువృష్టి. ధాన్యజాతులు అన్నియు ఫలించును. గోవులు విశేషంగా పాలిచ్చును.
రసాధిపతి రవి: నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలగు రస జాతుల ధరలు లేనట్లుండును. ‘‘కార్పాస తైలేక్షు గుడాదికానాః’’ అని పాఠాంతరం ఉన్నది.
నీరసాధిపతి శుక్రుడు: కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకే లభించును.
-పంచాంగ కర్త
శ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు
ఫోన్లు: 08676 2414336 /98485 20336


