Parenting issue
-
పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు
పేరెంటింగ్ నియమాలు తరానికీ తరానికీ మారుతున్నాయి. కొత్త తరం పేరెంటింగ్‌లో చాలా ఫ్లెక్సిబుల్‌గా, ఎంçపతీతో ఉంటోంది. పిల్లలతో చాలా దృఢమైన బంధాన్ని కోరుకుంటోంది. పిల్లల ఎమోషనల్ వెల్ బీయింగ్ కోసం ఎటువంటి భయాలూ, బిడియాలూ లేకుండా తాము అనుకున్నది ధైర్యంగా కమ్యూనికేట్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లల స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే రోల్‌మోడల్ పేరెంటింగ్ రూల్ పాటించాలనుకుంటున్నారు. యాభైఏళ్ల కిందట పేరెంటింగ్‌లో క్రమశిక్షణ అనే పదం వీర విహారం చేసేది. నాన్న ఇంట్లో ఉంటే పిల్లల అల్లరి వినిపించకూడదు, పుస్తకం పట్టుకుని కనిపించాలి. నాన్న ప్రశ్నిస్తే వినయంగా సమాధానం చెప్పాలి. నాన్న ఎదుట పడాలంటే భయం. ఈ చట్రంలో పెరిగిన తరం, ఆ తర్వాతి తరం ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. ఈ జెన్ జెడ్ పేరెంట్స్ తమ పిల్లల విషయంలో భౌతికపరమైన క్రమశిక్షణ పాటించడం కంటే తల్లిదండ్రుల మాట మీద విశ్వాసం, అర్థం చేసుకోవడం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇంటి నిండా బొమ్మలే!జెన్ జెడ్ పేరెంట్స్ తమ బాల్యంలో ఎదురైన సంఘటనలను బేరీజు వేసుకుంటూ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోననే నియమావళిని రూపొందించుకుంటున్నారు. బాల్యంలో తాము నొచ్చుకున్న సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ పిల్లల మనసు గాయపరచకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు. ఇందులో విపరీతమైన షాపింగ్ ఒకటి. గత తరం పేరెంట్స్ చేతిలో డబ్బు పరిమితంగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా అందుతోంది. రోజువారీ శ్రామికుల కుటుంబాలు కూడా తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని సరదాలకు ఖర్చుపెడుతున్నాయి. అప్పట్లో ఏడాదికో రెండేళ్లకో ఒక బొమ్మ కొనిస్తే... ఇప్పుడు ప్రతి ఇంట్లో పాతిక–ముప్పై బొమ్మలకు తక్కువ కాకుండా షెల్ఫ్‌లు నిండిపోతున్నాయి. పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే క్రమంలో ‘నో’ చెప్పడాన్ని ప్రోత్సహిస్తున్న జెన్ జెడ్ పేరెంటింగ్ పిల్లలకు తాము కూడా ‘నో’ చెప్పవచ్చనే సంగతి మర్చిపోతున్నారు. ఇక మగపిల్లలు ఏడవకూడదనే సామాజిక షరతును ప్రశ్నిస్తున్న మనస్తత్వ నిపుణులు ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వండి’ అంటున్నారు. కాలం మారుతున్న క్రమంలో వస్తున్న మార్పులివన్నీ. ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వాలి, వారిలోని సున్నితత్వాన్ని పరిరక్షించాలి’ అని చెబుతున్న న్యూజెనరేషన్ పేరెంటింగ్ దానిని అమలు చేయడంలో మాత్రం తార్కికతను కోల్పోతోందన్నారు ట్రాన్స్పర్సనల్ హోలిస్టిక్ కోచ్ అర్పితాగుప్త. సంతోష క్షణాలు!ఈ తరంలో దాదాపుగా అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పేరెంట్స్ కూడా తమ బిడ్డ ఆడుకోవడానికి అక్క,చెల్లి, అన్న, తమ్ముడు లేని బాల్యాన్ని మిగిల్చామని అర్థం చేసుకుంటున్నారు. తోబుట్టువులు లేని లోటు తీర్చడం కోసం పిల్లలతో తల్లులే కాదు తండ్రులు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. వారిని ఆటల్లో ఎంగేజ్ చేయడానికి తగినంత సమయం కేటాయిస్తున్నారు. వాళ్లు పెద్దయిన తర్వాత బాల్యాన్ని గుర్తు చేసుకుంటే తల్లిదండ్రులతో ఆడుకున్న తీపి జ్ఞాపకాలు గుర్తు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పిల్లల మెదళ్లలో విరిసిన ఆలోచనను చక్కగా వ్యక్తం చేయగలిగేటట్లు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల ఆలోచనలను, ఆకాంక్షలను కొట్టిపారేయకుండా తగిన ప్రాధాన్యతనిస్తున్నారు. పిల్లల కెరీర్ విషయంలోనూ వారి అభిరుచులను సమాజం గిరిగీతలను పట్టించుకోకుండా స్వాగతిస్తున్నారు. మొత్తంగా చూస్తే తమ బాల్యంలో తమకు కలలుగానే ఉండిపోయిన అన్నింటినీ తమ పిల్లలకు అందిస్తున్నారు. ఒక్క మాటలో చె΄్పాలంటే పిల్లల బాల్యంలో తామను తాము ప్రతిక్షేపించుకుంటున్నారు. తమకు దక్కని సంతోషాలను చాలా ఎక్కువగా అందించాలని తపన పడుతున్నారు. ఆదర్శవంతమైన పేరెంటింగ్‌కి ప్రతిరూపాలుగా ఉండాలని అభిలషిస్తున్నారు. ఆచరణలో ఒకింత సమతుల్యత, సమన్వయం అలవరుచుకుంటే జెన్ జెడ్ పేరెంటింగ్ రోల్ మోడల్ పేరెంటింగ్ అవుతుంది.ఓ ఆశ్చర్యకరమైన సంఘటనఅది మహారాష్ట్రలో ఓ పర్యాటక ప్రదేశం. నడిరోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించి΄ోయింది. ఏం జరిగిందో చూద్దామని కొందరు తమ వాహనాలు దిగి ముందుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు, 30 ఏళ్లుంటాయి, తన కారును చూసుకుంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు. ‘ఏమైంది’ అని అడిగారెవరో. కారు మీద పడిన గీతలు చూపిస్తూ మళ్లీ భోరుమన్నాడతడు. అది అతడికిష్టమైన కారు, ముచ్చటపడి కొనుక్కున్న కారని చెప్పి వెక్కిళ్లు పెడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు కారు లోపల ఉన్నారు. ‘మా అబ్బాయి చాలా సున్నితమనస్కుడండీ. తనకిష్టమైన కారుకి గీతలు పడితే భరించలేక΄ోతున్నాడు’ అన్నారు వాళ్లు సమర్థింపుగా. మగవాళ్లు ఏడవకూడదని బాల్యంలోనే మైండ్‌ని కండిషన్ చేసే పెంపకం ఒకప్పటిది. ఎమోషన్స్సకి లింగభేదం ఉంటుందా అని ఏడుపు వచ్చినప్పుడు అన్ కండిషనల్‌గా ఆ ఎమోషన్ని వ్యక్తం చేయవచ్చనే వాదన నేటిది. అయితే పైన చెప్పుకున్న కండిషన్లో ఆ కుర్రాడి కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఎమోషన్స్‌ని ఆపుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి విషమిస్తుంది. పరిణతి చెందిన వాళ్లం కొంతమందిమి కలగచేసుకుని ‘కారు పక్కకు తీసుకుని, ఎమోషన్ కంట్రోల్ అయిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించండి’ అని సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని చెబుతున్నారు అర్పితాగుప్తా, హోలిస్టిక్ కోచ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: -
షేర్డ్ పేరెంటింగ్: విడాకులు తీసుకున్నా విద్యార్థికి తల్లిదండ్రులే
ఇటీవల కోల్‌కతాలోని ఒక స్కూల్ పిల్లల అడ్మిషన్ ఫామ్‌లో తల్లిదండ్రులకు ‘మీరు డైవర్సీనా?’ అనే కాలమ్ పెట్టింది. విడాకులు తీసుకుని ఉంటే ఆ ఎడబాటును ఇంటివరకే పరిమితం చేయాలని పిల్లల చదువు విషయంలో సమాన బాధ్యత తీసుకోవాలని విద్యారంగ నిపుణులు చెప్పడమే ఇందుకు కారణం. ‘ఆన్ లైన్ క్లాస్‌లో అతన్ని రానీయవద్దు’ అని తల్లిగాని ‘స్కూల్ రిపోర్ట్స్ ఆమెకు పంపొద్దు’ అని తండ్రి గాని అనడానికి వీల్లేదని వీరు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువులో ‘భాగస్వామ్య పెంపకం’ తీసుకోకపోతే పిల్లలు ఘోరంగా దెబ్బ తింటున్నారని తేల్చి చెబుతున్నారు. విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు ఈ విషయమైనా సీరియస్‌గా ఆలోచించాలి. కోల్‌కతాలోని ‘సౌత్ సిటి ఇంటర్నేషనల్ స్కూల్’ ఈ సంవత్సరం పిల్లల అడ్మిషన్ ఫామ్స్‌లో తల్లిదండ్రులకు ‘మీరు విడాకులు తీసుకున్నారా/విడిగా ఉంటున్నారా/ సింగిల్ పేరెంటా’ అనే కాలమ్ పెట్టింది. అది తప్పనిసరిగా నింపాల్సిందే. ‘ప్రతి ఏటా పెరుగుతున్న విడాకుల కేసుల దరిమిలా పేరెంట్స్ వచ్చి పిల్లల విషయంలో పెడుతున్న పేచీలే ఇందుకు కారణం’ అని స్కూల్ యాజమాన్యం తెలిపింది. వీరి పద్ధతి ప్రకారం స్కూల్లో పిల్లల్ని వేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ‘తాము విడిపోయినా, గొడవలతో దూరంగా ఉంటున్నా, భర్త/భార్య మరణించి సింగిల్‌గా ఉంటున్నా’ ఆ సంగతి తెలియ చేయాలి. ‘దీనివల్ల మేము మా దగ్గర చదువుతున్న విద్యార్థి గురించి ఎలాంటి శ్రద్ధ పెట్టాలో అవగాహన వస్తుంది’ అని తెలిపింది. అంతేకాదు, విడాకులు తీసుకుని ఉన్నా, మనఃస్పర్థలతో దూరంగా ఉంటున్నా తల్లిగాని తండ్రిగాని పిల్లల్ని స్కూల్లో చేర్పించాలనుకుంటే యాజమాన్యం ఆ విడిపోయిన భాగస్వామికి సమాచారం ఇస్తుంది. ‘మా దగ్గర మీ పిల్లలు చేరుతున్నారు. ఈ సంగతి మీకు తెలుసా? మా స్కూల్లో చేర్పించడం మీకు సమ్మతమేనా?’ అని అడుగుతుంది. సమ్మతి పత్రం తీసుకుంటుంది. అంతే కాదు ‘తండ్రిని పిల్లల్ని చూడనివ్వద్దు అని తల్లి... తల్లిని పిల్లల్ని కలవనివ్వదు అని తండ్రి’ చెప్పినా అందుకు అంగీకరించదు. పిల్లల చదువు, ప్రోగ్రెస్ రిపోర్ట్సు ఇద్దరికీ పంపాల్సిందేనని నిర్ణయించింది. పిల్లల చదువు గురించి వాకబు చేసే హక్కు ఇద్దరికీ ఉంటుందని, క్లాస్ టీచర్‌తో మాట్లాడవచ్చునని, పేరెంట్స్ మీటింగ్‌కు హాజరు కావచ్చునని ఈ స్కూలు తెలిపింది. ‘ఇందుకు కారణం మా దగ్గరకు చాలామంది డైవోర్సీలు వచ్చి విడిపోయిన పార్టనర్‌ని స్కూలు దగ్గరకు రానివ్వొద్దు అని చెప్పడమే. ఇలా చేయడం వల్ల పిల్లల చదువు సరిగ్గా సాగదు. చదువు విషయంలో పిల్లలు తల్లిదండ్రుల సపోర్ట్ కోరుకుంటారు. విద్యారంగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు. వారి హక్కును తల్లిదండ్రులు కాదనడానికి లేదు’ అని యాజమాన్యం తెలిపింది. షేర్డ్ పేరెంటింగ్ దీనినే తెలుగులో భాగస్వామ్య పెంపకం అనొచ్చు. భార్యాభర్తలకు తాము విడిపోయే హక్కు ఉంది. విడిపోక తప్పని పరిస్థితులు కొందరికి వస్తాయి కూడా. అంతమాత్రం చేత వారు తల్లిదండ్రులుగా ఉండే బాధ్యతను విస్మరించడానికి వీల్లేదని ఈ షేర్డ్ పేరెంటింగ్ భావన చెబుతోంది. పిల్లల పెంపకం విషయంలో పంచుకోవాల్సిన బాధ్యతలను అలాగే కొనసాగించాలని దీని అర్థం. కలిసి లేని తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్న పిల్లలను ఇటీవల అధ్యయనం చేసిన విద్యారంగ నిపుణులు బాల నేరస్తులుగా మారుతున్న వారిలో, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారిలో, స్కూళ్లలో చదువులో వెనుకబడి కుంగిపోతున్నవారిలో విడిపోయిన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి దగ్గరే పెరుగుతున్న పిల్లలు ఎక్కువమంది ఉండటం గమనించారు. విడాకుల తర్వాత పిల్లల కేర్టేకర్లు మారిన తల్లిగాని తండ్రిగాని తమతో లేని పార్టనర్ మీద పిల్లలకు చెడు మాటలు చెప్పడం, వారిని కలవడానికి పూర్తిగా నిరాకరించడం వ్యక్తిత్వం విషయంలోనే కాదు చదువు విషయంలో కూడా చాలా ప్రభావం చూపుతున్నట్టుగా తెలుసుకున్నారు. విడిపోయిన కోపంతో పిల్లల్ని దూరంగా ఉంచాలని స్కూళ్ల యాజమాన్యాల దగ్గరకు వచ్చి తమ అనుమతి లేకుండా తండ్రి/తల్లిని రానివ్వొద్దని డిమాండ్స్ పెట్టడమే ఇప్పుడు స్కూలు యాజమాన్యాల కొత్త విధానాలకు కారణం అవుతోంది. కలిసే సందర్భాలు ఉండాలి పిల్లల పుట్టిన రోజులు, స్కూల్ డే, పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమయాలు... ఇలాంటి సందర్భాల్లో పిల్లల కోసం కలవడం తప్పనిసరి అని ఫ్యామిలీ కౌన్సిలర్లు కూడా సూచిస్తున్నారు. ‘అమ్మా నాన్నా ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోవచ్చు. కాని నా కోసం అప్పుడప్పుడు కలుస్తారు’ అనే చిన్న ఆశ పిల్లల్ని చాలా ఉత్తేజ పరుస్తుంది. విడిపోయిన తల్లిదండ్రులు ఎప్పుడో ఒకసారి పిల్లలతో రెస్టరెంట్‌కు వెళ్లడం పిల్లలకు తక్కువ వరం కాదు. ఏ విడాకుల్లోనైనా భార్యాభర్తల కంటే ఎక్కువ బాధితులు పిల్లలే. చదువు వారికి అత్యంత ముఖ్యమైన భవిష్యత్ సాధనం. ఆ నిచ్చెనకు అటూ ఇటూ తల్లిదండ్రులు నిలవాల్సిందేనని నిపుణులు చెబుతున్న మాట దూరమైన భార్యాభర్తలు వినదగ్గది. ఆలోచించదగ్గది. చదువులో ఇద్దరూ అవసరమే కలిసి ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో చదువుకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పుకుని వొత్తిడి తగ్గించుకుంటారు. కొన్ని సలహాలు తల్లి ఇస్తే కొన్ని తండ్రి చెప్తేగాని ధైర్యం చిక్కదు. హఠాత్తుగా తల్లిదండ్రులు విడిపోతే ఈ విషయం లో పెద్ద అగాథం వస్తుంది. పిల్లలు పైకి నోరు తెరిచి చెప్పకపోయినా తల్లి దగ్గరో/తండ్రి దగ్గరో హుషారుగా పెరుగుతున్నట్టు కనిపించినా వారి లోలోపల ఎన్నో ఆలోచనల వొత్తిడి ఉంటుంది. అసలే చదువుకు సంబంధించిన వొత్తిడి ఉన్నప్పుడు ఈ వొత్తిడి కూడా పని చేయడం వారి ప్రవర్తనను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. ‘కొన్ని అమ్మకు చెప్పుకుందాం. కొన్ని నాన్నకు చెప్పుకుందాం’ అనే ఛాయిస్ వారికి తల్లిదండ్రులు కలిసి ఉన్నా విడిపోయినా తప్పక ఉండాలి. ఏ మాట ఎవరు వింటారో పిల్లలకు తెలుసు. తమ కంఫర్ట్ సాధించుకోవాలనుకుంటారు. ఒక ఆప్షన్ పూర్తిగా కూల్చివేస్తే వారు కుంగిపోతారు. -
సంతానం లేదని భార్యను చంపేశాడు
చెన్నై: సంతానలేమికి దంపతుల్లో ఎవరిలోకైనా లోపం ఉండవచ్చు. లోపాన్ని తెలుసుకుని తగిన చికిత్స ఇప్పించాల్సిన భర్తే విచక్షణ కోల్పోయాడు. సంతానం కల్గలేదని విషపు ఇంజక్షన్ ఇచ్చి భార్యను హతమార్చిన సంఘటన తమిళనాడులోని నామక్కల్‌లో చోటుచేసుకుంది. నామక్కల్‌కు చెందిన రాజేష్ (30) ఫార్మసీ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి ప్రియ (20) అనే యువతితో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంతవరకు సంతానం కల్గలేదు. శనివారం ఉదయం ప్రియ నోటి నుంచి నురగలు వచ్చిన స్థితిలో ఇంట్లో శవమైపడి ఉండగా ఇరుగూ పొరుగూ వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి భర్త రాజేష్‌పై అనుమానించిన బంధువులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పరారీలో ఉన్న భర్తను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా, సంతానం కలగకపోవడంతో ప్రియను చంపేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. విషం ఎక్కించిన ఇంజక్షన్‌ను శుక్రవారం రాత్రి ఇంటికి తెచ్చి సంతానం లేనందున ఇద్దరం చనిపోదామని ప్రియకు చెప్పానని అన్నారు. ప్రియ అందుకు అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చినట్లు రాజేష్ అంగీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.