మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్‌లో అవకాశాలు వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ అందుకే ఒక ఎన్‌ఆర్‌ఐ ఏం చేశాడో తెలుసా?
కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్‌ఆర్‌ఐ ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్‌గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ, కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.
చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా
కెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస పౌర జ్ఞానం లేకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.

నెటిజన్లు అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు నచ్చినట్టు జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్‌గా ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్.. అనే కమెంట్లు వెల్లువెత్తాయి.
ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య


