దారుణంగా పడిపోయిన ఇరాన్ కరెన్సీ
టెహ్రాన్: ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పతనమైంది. ఒక్క అమెరికన్ డాలర్‌తో మారకం విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందనటానికి ఇదే నిదర్శనం. దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి.
మాంసం, బియ్యం, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామా న్యుల రోజువారీ జీవనం సైతం గగనంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా జూన్‌లో ఇజ్రాయెల్ దాడులకు దిగడం, ఇరాన్ ప్రతిదాడుల అనంతరం అమెరికా రంగంలోకి దిగడం తెల్సిందే. మళ్లీ ఇజ్రాయెల్‌తో యుద్ధం రావచ్చన్న భయాందోళనలు ఇరాన్ వాసులను వెంటాడుతున్నాయి.


