nuclear program
-
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్‌కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్‌కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్‌ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్‌దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
ఇరాన్ కొత్త ప్రతిపాదన నచ్చలేదు
వాషింగ్టన్: యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని స్పష్టంచేశారు. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదని అన్నారు. అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఇంకా తెలియరాలేదు. ‘‘ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ ప్రతిపాదన నాకు సంతృప్తి కలిగించలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం’’అని శుక్రవారం వైట్ హౌస్‌లో ట్రంప్ విలేకరులతో అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన రావడం ఇదే మొదటిసారి కాదు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఇంతకుముందు అంగీకరించింది. కానీ తమ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని షరతు విధించింది. అందుకు అమెరికా ఒప్పుకోలేదు. ఇరాన్‌తో చర్చల ముసాయిదా పత్రంలో అణు కార్యక్రమ అంశాన్ని చేర్చాలంటూ తమ ప్రతినిధి బృందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. చర్చలు కొనసాగుతున్నంత కాలం.. బాంబు దాడికి గురైన ఇరాన్ అణు కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను తరలించడానికి ప్రయతి్నంచబోమని, లేదా ఆ కర్మాగారాల్లో ఎలాంటి కార్యకలాపాలను పునఃప్రారంభించబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనిపై ఇరాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి మళ్లీ కొత్త ప్రతిపాదన రావడం ఆసక్తి కలిగిస్తోంది. మాతో ఒప్పందానికి ఇరాన్ తహతహ పశ్చిమాసియాలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ తహతహలాడుతోందని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై వైమానిక దాడులను పునఃప్రారంభించే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టంచేశారు. ఇరాన్లో కాల్పుల విరమణను ఉల్లంఘించాలన్న ఆలోచన అమెరికాకు ఉందా? అని ప్రశ్నించగా.. ఆ అవసరం ఉందని తాను అనుకోవడం లేదని ట్రంప్ బదులిచ్చారు. అమెరికా చేపట్టిన సైనిక చర్య ఇరాన్ సైనిక సామర్థ్యాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నౌకాదళం, వాయుసేన చాలావరకు ధ్వంసమయ్యాయి. డ్రోన్ ఫ్యాక్టరీలు 82 శాతం నష్టపోయాయి. క్షిపణి ఉత్పత్తి కూడా దారుణంగా పడిపోయింది. క్షిపణి ఫ్యాక్టరీలు దాదాపు 90 శాతం పడిపోయాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేశాం. హార్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా కుప్పకూలుతోంది’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈయూ వాహనాలపై సుంకాల పెంపుయూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చేవారం 25 శాతం పెంచబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాము పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించడం లేదని ఆక్షేపించారు. అయితే, తమ అభ్యంతరాలు ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఇరాన్‌పై యుద్ధం ముగిసింది: అమెరికా వాషింగ్టన్: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
ఇకపై నేను మంచివాడిని కాదు
వాషింగ్టన్: ఇరాన్ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆశించిన పరిష్కారం లభించకపోతే అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదని ఇరాన్‌ను హెచ్చరించారు. ముప్పు తప్పించుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలని ఇరాన్‌కు సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ మేరకు చేతుల్లో తుపాకీ పట్టుకున్న ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో తాజాగా పోస్టుచేశారు. ఇందులో కొండలపై బాంబు పేలుళ్ల దృశ్యం కనిపిస్తోంది. తన మాట వినకపోతే ఇరాన్‌పై భీకర యుద్ధానికి సిద్ధమని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని(నో మోర్ మిస్టర్ నైస్ గై) అని ట్రంప్ పోస్టు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్ సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికాతో అణ్వస్త్ర రహిత ఒప్పందం ఎలా చేసుకోవాలని ఇరాన్‌కు ఏమాత్రం తెలియడం లేదని ఆక్షేపించారు. వారు కాస్త తెలివిగా ప్రవర్తిసే బాగుంటుందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా యుద్ధ వ్యయం రూ.2.37 లక్షల కోట్లుపశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా ఇప్పటిదాకా 25 బిలియన్ డాలర్లు(రూ.2.37 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటగాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జూల్స్ హస్ట్–3 వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చేరవేశారు. హౌస్ ఆరŠమ్డ్ సర్వీసెస్ కమిటీతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. 25 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం ఆయుధ సామగ్రిపై ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి, ఖాళీ అయిన పరికరాలను భర్తీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ము వ్యయం చేసినట్లు తెలియజేశారు. -
ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ మొండి పట్టుదలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ముగియనున్న డెడ్ లైన్ఇరు దేశాల మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ డెడ్ లైన్ సమీపిస్తున్నప్పటికీ జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందాన్ని తదుపరి చర్చల కోసం పాకిస్తాన్‌కు పంపాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే అమెరికా తన కఠిన వైఖరిని మార్చుకుంటే తప్ప తాము చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇదే సమయంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. ترامپ با اعمال محاصره و نقض آتشبس میخواهد تا به خیال خود این میز مذاکره را به میز تسلیم تبدیل کند یا جنگافروزی مجدد را موجّه سازد. مذاکره زیر سایهٔ تهدید را نمیپذیریم و در دو هفتهٔ اخیر برای رو کردن کارتهای جدید در میدان نبرد آماده شدهایم.— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 20, 2026ట్రంప్ సంచలన హెచ్చరికచర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, సైనికపరమైన చర్యలు కూడా ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తమ లక్ష్యం కేవలం తాత్కాలిక శాంతి కాదని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని ఆయన తెలిపారు. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.బెదిరింపులకు భయపడం: ఇరాన్ఒత్తిడి తెచ్చి ఒప్పందాలకు తమకు ఒప్పించాలని చూస్తే అంగీకరించబోమని ఇరాన్ అధికారులు తేల్చిచెప్పారు. ‘అమెరికా బెదిరింపుల నీడలో మేము చర్చలు జరపబోము’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైతే కొత్త వ్యూహాలతో బదులిస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఈ పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో సోమవారం చర్చించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.ఇది కూడా చదవండి: Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం -
అణు కార్యక్రమాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకారం
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే, దీనికి ప్రతిఫలంగా అమెరికాలో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను మాత్రం విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వారాంతంలో జరగనున్న శాంతి చర్చల అనంతరం తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.డబ్బు లేదు.. కేవలం శాంతి మాత్రమేట్రంప్ తన విలక్షణ శైలిలో ఈ ఒప్పందంపై స్పందిస్తూ, టెహ్రాన్‌తో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ప్రకటించారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ముఖ్యాంశాలు ఇవే..యురేనియంతో అణు కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా నిలిపివేయనుంది. ఇది కేవలం 10 లేదా 20 ఏళ్ల కాలపరిమితితో కూడుకున్నది కాదని, అపరిమిత కాలం పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ నొక్కి చెప్పారు.ఇరాన్‌కు చెందిన సుమారు 20 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు.చర్చలు తుది దశకు చేరినప్పటికీ ఇరాన్‌పై అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధనం కొనసాగుతుందని, ఒప్పందం ఖరారైన తర్వాతే దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.కీలక పాత్రలో ఈజిప్ట్, టర్కీగత కొన్ని వారాలుగా తెర వెనుక జరిగిన దౌత్య ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఈజిప్ట్, టర్కీ దేశాల మద్దతుతో జరిగిన పరోక్ష చర్చలు ఈ సానుకూల ఫలితానికి దారితీశాయి. ఒప్పందం ఖరారైతే శాంతి చర్చల ముగింపు కోసం తాను స్వయంగా పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ‘చాలా ప్రధాన అంశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగాలి. ఇరాన్ తన అణు నిల్వలను అప్పగించడానికి సిద్ధంగా ఉంది’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.ఇరాన్ స్పందనఅమెరికా అధ్యక్షుడి ప్రకటనలపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉంటుందని టెహ్రాన్ ధ్రువీకరించింది. ఇది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
డాలర్‌కు 12 లక్షల రియాల్స్
టెహ్రాన్: ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పతనమైంది. ఒక్క అమెరికన్ డాలర్‌తో మారకం విలువ ఏకంగా 12 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందనటానికి ఇదే నిదర్శనం. దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. మాంసం, బియ్యం, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామా న్యుల రోజువారీ జీవనం సైతం గగనంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా జూన్‌లో ఇజ్రాయెల్ దాడులకు దిగడం, ఇరాన్ ప్రతిదాడుల అనంతరం అమెరికా రంగంలోకి దిగడం తెల్సిందే. మళ్లీ ఇజ్రాయెల్‌తో యుద్ధం రావచ్చన్న భయాందోళనలు ఇరాన్ వాసులను వెంటాడుతున్నాయి. -
ఇరాన్‌పై ఐరాస మళ్లీ ఆంక్షలు
దుబాయ్: ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆ దేశంపై పూర్తి స్థాయి ఆంక్షలను విధించింది. ఇప్పటికే ఆ దేశ ప్రజలు సంపాదించిందంతా ఆహారం కోసమే ఖర్చు పెడుతూ, భవిష్యత్తుపై ఆందోళన చెందుతుండగా వారిపై ఆంక్షల వల మళ్లీ పడింది. అణు కార్యక్రమాన్ని వదిలేయాలంటూ చిట్టచివరి నిమిషంలో ఐరాసలో జరిగిన దౌత్య చర్చలు విఫలం కావడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీనిఫలితంగా, విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అవుతాయి. ఇరాన్ కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాలూ ఆగిపోతాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాలని చూస్తే మరిన్ని ఆంక్షలు మోపే ప్రమాదముంది. ఈ ఆంక్షలు ‘స్నాప్‌బ్యాక్’గా (స్వయంచాలికంగా–ఆటోమేటిక్)గా అమల్లోకి వస్తాయి. దీనివల్ల, ఇరాన్‌పై విధించిన ఇతర ఆంక్షల మాదిరిగా చైనా, రష్యాలు భద్రతామండలిలో వీటిని వీటో చేయడం కుదరదు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకేలతో ఇరాన్ 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో ఈ షర తులన్నీ ఉన్నాయి. జూన్‌లో ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా తమ అణు కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ ఆ దేశం వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయి. 90% శుద్ధి చేసిన యురేనియంతో బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇరాన్ సొంతమవుతుంది. తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాలకేనంటూ ఇరాన్ చెబుతున్నా అమెరికా, పశి్చమదేశాలు అనుమానిస్తున్నాయి. నెల రోజుల క్రితమే స్నాప్బ్యాక్ను ప్రయోగిస్తామంటూ ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు హెచ్చరించాయి. అయినప్పటి కీ ఇరాన్ ఐఏఈఏ పరిశీలకులను అణు కేంద్రాల్లో తనిఖీలకు అనుమతించేందుకు అంగీకరించలేదు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించిన సవివర నివేదికను ఐఏఈఏకు పంపలేదు. దీంతో ఆంక్షలు అనివార్యమయ్యాయని పశ్చిమ దేశాలంటున్నాయి. శాంతియుత ప్రయోజనాల కోసమైతే యురే నియంను 60 శాతం వరకు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు కదా అని ప్రశి్నస్తున్నాయి.ఎన్పీటీ నుంచి వైదొలిగే యోచన ఐరాస ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇరాన్ ప్రతీకార చర్యలపై తీవ్ర సమాలోచనలు చేస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) నుంచి వైదొలిగే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ పరిశీలించే అవకాశాలున్నాయని ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ మహ్మద్ బఘెర్ కలిబాఫ్ తెలిపారు. ఆంక్షలను ఆయన అన్యాయమన్నారు. ఎన్పీటీ నుంచి వైదొలగడం ద్వారా అణు బాంబును తయారు చేసే అవకాశాలున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా ట్రంప్ హయాంలో 2018లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగినందున యూరప్ దేశాలైన యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లకు స్నాప్‌బ్యాక్ అమలు చేసే అర్హత లేదని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్‌కు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందుకోసం ముందుగా ఇరాన్ తమతో నేరుగా చర్చలకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఐఏఈఏ నుంచి వైదొలగడం ఇరాన్ తీవ్రమైన తప్పిదమని, ఇదే సాకుతో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఆ దేశంపై మళ్లీ దాడులకు దిగే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు. -
వచ్చేవారం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు
బ్రసెల్స్: ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్, అమెరికా దేశాల మధ్య వచ్చేవారం పరోక్ష చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలతో ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితి విధించే దిశగా ఒప్పందం కుదిరే అవకాశముంది. మధ్యవర్తుల ద్వారా ఈ చర్చలు జరుగుతాయని శుక్రవారం ఇరాన్, అమెరికా ప్రకటించాయి. ఇప్పటికే ఈ అంశంపై ఇరుదేశాల మధ్య 2015లో కుదిరిన ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ హయాంలో మూడేళ్ల కిత్రం అమెరికా వైదొలగింది. 2015 నాటి ఒప్పందం మేరకు ఇరాన్ తన అణు కార్యక్రమంపై స్వీయ ఆంక్షలు విధించుకోవాలి. అలాగే, అమెరికా, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇరాన్‌కు ఆంక్షల సడలింపుతో పాటు ఆర్థిక సాయం అందించాలి. ఇరాన్‌తో ఒప్పందానికి ప్రాధాన్యత ఇస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. చర్చలు వియెన్నాలో మంగళవారం ప్రారంభమవుతాయని అమెరికా హోం శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. ఇది సరైన ముందడుగు అని, అయితే, వెంటనే సానుకూల ఫలితాలను ఆశించలేమని వ్యాఖ్యానించారు. అమెరికా–ఇరాన్ మధ్య ఈ పరోక్ష చర్చలు ప్రారంభం కావడానికి యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వం చేసింది. -
ఫ్లాపీలకు అమెరికా ఇంకా టాటా చెప్పలేదంట
ప్రపంచానికే పెద్ద అన్నగా ఉన్న అమెరికాలో టెక్నాలజీ దిగ్గజాలేమి తక్కువ కాదు. ఏ టెక్నాలజీ అయినా మొదట కనుగొన్నేదీ, వాడేది ఆ దేశమే. అయితే అమెరికాలో పాత టెక్నాలజీలకు ఇంకా స్థానం పోవడం లేదట. ఏ న్యూక్లియర్ ప్రొగ్రామ్ రన్ అవ్వాలన్నా ఇంకా ఫ్లాపీ డెస్కులునే వాడుతున్నారని అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ ఆఫీస్(జీఏఓ) రిపోర్టు నివేదించింది. 1970 దశాబ్దానికి చెందిన కంప్యూటర్లలో 8 అంగుళాల ఫ్లాపీ డెస్కులనే పెంటాగాన్((అమెరికా డిఫెన్స్ ప్రధాన కార్యాలయం) ఇంకా వాడుతుందని పేర్కొంది. ఆ డెస్కులు దాదాపు అదే దశాబ్దంలోనే కనుమరుగయ్యాయి. 3.5 నుంచి 5.25 అంగుళాల డెస్కులు రావడంతో ఫ్లాపీ డెస్కులకు డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కడో ఓ దగ్గర కనిపిస్తున్నాయి. కానీ అమెరికాలో ఇంకా ఈ డెస్కులనే వాడుతున్నారని రిపోర్టు తెలిపింది. వాషింగ్టన్ మినహా అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నీ, డేట్ అయిపోయిన, కనుమరుగవుతున్నా పాత టెక్నాలజీలపై 6000 కోట్ల డాలర్ల వరకూ ఖర్చు చేస్తున్నాయని జీఏఓ రిపోర్టు తెలిపింది. ఈ ఖర్చు కొత్త ఐటీ సిస్టమ్ లపై పెట్టే పెట్టుబడుల కంటే మూడురెట్లు అధికంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ అవుట్ డేటడ్ టెక్నాలజీ ఫ్లాపీ సిస్టమ్ లపై దృష్టిపెట్టిన పెంటాగాన్ ఈ టెక్నాలజీల స్థానంలో కొత్త టెక్నాలజీలను వాడాలని ప్రయత్నిస్తోందని తెలిపింది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, న్యూక్లియర్ బాంబర్లు, ట్యాంకర్ సపోర్టు ఎయిర్ క్రాప్ట్ లను ఈ సిస్టమ్సే ప్రస్తుతం సమన్వయ పరుస్తున్నాయి. 2017 చివరి వరకూ ఈ సిస్టమ్ లను పెంటాగాన్ మార్చనుంది. ఇతర కార్యాలయాలకు కూడా ఈ సిస్టమ్ లను మార్చాలని నోటీసులు అందాయి. అమెరికా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ పాత తరం నుంచి బయటపడేసి కొత్తగా 21వ శతాబ్దంలోకి తీసుకురావడం అతిపెద్ద సవాల్ అని బోర్డు తెలిపింది.


