రెండుసార్లు జేఈఈ ఫెయిల్‌..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు | Indore Man Now Makes Rs 2 Lakh A Month Ankur Warikoo Post Viral | Sakshi
Sakshi News home page

రెండుసార్లు జేఈఈ ఫెయిల్‌..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు

Aug 18 2026 2:56 PM | Updated on Aug 18 2026 3:28 PM

 Indore Man Now Makes Rs 2 Lakh A Month Ankur Warikoo Post Viral

సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కళశాల డ్రిగీలు అవసరం లేదు. అందుకు నిదర్శనం ఈ వ్యక్తి. అతడి గురించి సోషల్‌ మీడియా వేదిక అంకుర్‌ వారికూ పంచుకున్నారు. ఫ్రీలాన్సింగ్‌ చేస్తూ విజయవంతంగా కెరీర్‌ని నిర్మించుకున్న వ్యక్తి సక్సెస్‌ జర్నీని పంచుకుంటూ..ప్రతిభ ఉంటే సరిపోదు దాన్ని సరైన విధంగా ఉపయోగించుకునే తెలివితేటలు ఉండాలన్నారు. డిగ్రీలుంటే పెద్ద పెద్ద ఉగ్యోగాలు రావని, నైపుణ్యం, అవకాశాలను సృష్టించుకునే సామర్థ్యం ఉంటేనే విజయం దక్కుతుందంటూ ఈ వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు పోస్ట్‌లో ఇలా. 

అంకుర్‌ పోస్ట్‌లో ఇండోర్‌కి చెందిన వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. అతడు రెండుసార్లు జేఈఈ ఫెయిల్‌ అయ్యాడు. కానీ అతను రాత్రిపూట యూట్యూబ్‌లో స్వయంగా ప్రొడక్ట్‌ డిజైనింగ్‌ నేర్చుకున్నాడు. దాని సాయంతో ఫ్రీలాన్సింగ్‌ చేస్తూ నెలకు రెండు లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ గ్రాడ్యుయేట్లు సైతం సిగ్గుపడేలా తన కెరీర్‌ని నిర్మించుకున్నాడని అన్నారు. 

భారతదేశంలో ప్రతిభకు కొదువ లేదు దాన్ని ఉపయోగించుకుని టాలెంట్‌ని ప్రదర్శించడంలోనే ఇబ్బంది పడుతున్నారని అన్నారు చివరగా ఆ వ్యక్తి పేరు నమన్‌ అంటూ తన పోస్ట్‌ని ముగించారు. 

నెటిజన్లు కూడా అంకుర్‌ మాటలకు మద్దతిస్తూ..పట్టభద్రులైన ప్రతిఒక్కరూ అధిక జీతాలు సంపాదించలేరని అన్నారు. నిస్సందేహంగా స్వయంగా నేర్చుకుని డబ్బు సంపాదించేవారు కచ్చితంగా అత్యంత తెలివైన వారంటూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ఈ వంటకం బర్గర్‌కి మించి టేస్టీ..!: హర్ష్‌ గోయెంక)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement