గయ: పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు సాధారణంగా భారతీయులు పవిత్ర క్షేత్రాలకు వెళ్తుంటారు. అయితే.. పూర్వీకుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ సంప్రదాయానికి విదేశీయులు కూడా ఆకర్షితులవుతున్నారు. జర్మనీ, ఘనా, ఉక్రెయిన్, రష్యాకు చెందిన పలువురు విదేశీ భక్తులు గయకు చేరుకుని పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై తమకున్న ఆసక్తిని చాటుతూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బీహార్‌లో గయలోని పవిత్ర ప్రాంతాల్లో నిర్వహించిన పిండ ప్రదాన కార్యక్రమాల్లో విదేశీ భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. పూజారుల సూచనల మేరకు తర్పణం, పిండ ప్రదానం తదితర కార్యక్రమాలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పూర్వీకులకు నివాళులు అర్పించేందుకు గయకు వచ్చిన విదేశీయులు.. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
#WATCH | Gaya, Bihar: Foreign devotees from Germany, Ghana, Ukraine and Russia perform Pind Daan rituals for ancestors. pic.twitter.com/i4xcvzMCN6
— ANI (@ANI) October 2, 2026
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలపై విదేశాల్లోనూ ఆసక్తి పెరుగుతోందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చూపించింది. జర్మనీ, ఘనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల నుంచి వచ్చిన భక్తులు పిండ ప్రదానంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్వీకులను స్మరించుకుంటూ వారు నిర్వహించిన ఈ కార్యక్రమాలు గయలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
VIDEO | Gaya, Bihar: Foreign devotees perform 'pind daan', pray for 'moksha' for their ancestors during the ongoing Pitrupaksh Mela.#GayaNews #PitrupakshMela
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/jidCF4LbMi— Press Trust of India (@PTI_News) October 2, 2026
ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు చెందిన భక్తురాలు ఒలెక్సాండ్రా మాట్లాడుతూ..‘మాకు ఇక్కడ లభించిన ఆతిథ్యానికి భారతదేశానికి కృతజ్ఞతలు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎంతో చక్కగా చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని మా పూర్వీకుల కోసం ప్రార్థించే అవకాశం మాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
#WATCH | Gaya, Bihar: A devotee from Ukraine, Oleksandra, says, "We are grateful to India for how welcoming you are and how nicely all the circumstances are organised here, so we can also experience this here and pray for our ancestors and have this opportunity to be here..." https://t.co/inUlz2PjDh pic.twitter.com/JOM2PfdOeI
— ANI (@ANI) October 2, 2026


