40 కిలోల బరువు తగ్గడానికి హెల్ప్‌ అయిన ట్రిక్‌ ఇదే..! | Khushbu Sundar 40 Kg Weight Loss Journey, The Japanese Eating Method And Lifestyle Changes Behind Her Transformation | Sakshi
Sakshi News home page

Khushbu Sundar: 40 కిలోల బరువు తగ్గడానికి హెల్ప్‌ అయిన ట్రిక్‌ ఇదే..!

Oct 1 2026 6:11 PM | Updated on Oct 1 2026 6:28 PM

Weight loss Tips: Khushbu Sundar This Japanese Habit For 40 Kg Weight Loss

కోలివుడ్‌ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ (56) ఐదేళ్లలో 40 కిలోలకు పైగా బరువు తగ్గి వార్తల్లో నిలిచింది. అందుకోసం కఠినమైన డైట్‌లు లేదా జిమ్‌లో గంటల తరబడి నిలబడటం వల్ల ఇంత పెద్ద ఛేంజ్‌ని సాధించలేదు. ఆమె అనుసరించిన ఆరోగ్యకరమైన జీవనశైలినే కారణం. ఆ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించింది. డైటింట్‌ వల్లనే బరువు తగ్గరని, ఆచరణసాధ్యమైన ఆహార విధానమే కీలకమని పేర్కొంది. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.

ఇక్కడ వెయిట్‌ లాస్‌ ప్రారంభించి..అదే బరవుని మెయింటైన్‌ చేయడమే కాకుండా మరింత తగ్గడం విశేషం. అందుకోసం ఆమె జపనీస్‌ ఆహార విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. మనం పెద్దప్లేట్‌లలో తింటాం కానీ వాళ్లు చిన్న గిన్నెల్లోలనే ఎక్కువ మొత్తంలో తింటారని..దీనిల్ల కడుపు నిండినంత వరకే ఆటోమేటిగ్గా తింటామని అంటోంది. జపనీస్‌ ప్రజలు సాధారణంగా 80, 90 ఏళ్ల వయసులో కూడా ఈ విధానాన్ని పాటిస్తారని అన్నారు. అందుకే తాను కూడా ఈ చిన్న ప్లేట్‌ విధానాన్ని పాటిస్తానని అన్నారామె. 

తాను ఒకానొక సమయంలో దాదాపు 98 కిలోలు బరువు ఉండేదాన్ని అని పంచుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి నటించిన మూవీని చూస్తే..తనను తానే గుర్తుపట్టలేకపోయానని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటికే తనకు మోకాళ్ల నొప్పి కూడా మొదలైందని చెప్పారు. ఆ కారణంగానే ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. 

బరువు తగ్గే జర్నీ..
అయితే తాను తనకు నచ్చిన ఆహారాలను వదులుకోలేదని, కేవలం పరిమాణాన్నే తగ్గించుకున్నట్లు తెలిపారు. తనకు మటన్‌ బిర్యానీ అంటే మహా ఇష్టమని కానీ గిన్నెడం అన్నం ఒక ముక్కు తగ్గించుకున్నట్లు తెలిపారు. అలాగే స్వీట్లు, ఐస్‌క్రీం అన్నింటిని ఆస్వాదిస్తానని, కాకపోతే అతిగా తినని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు నచ్చిన డెజర్ట్‌ తినేటప్పుడూ..స్కిప్‌ చేయడంలో తప్పులేదని అంటోందామె. 

అయితే ఎంతమేరకు తినాలో ఎక్కడ ఆపాలో తెలుసుండాలని చెబుతోంది. చివరగా ఆమె బరువు తగ్గడం అనేది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందన్నారు. ఇన్నేళ్లు బరువు స్థిరంగా అదుపులో ఉండటానికి దోహదడింది మాత్రం అధిక ప్రోటీన్‌, ఫైబర్‌ ఉన్న ఆహారం, మైదా, ఇతర శుద్ధి చేసిన ఆహారాలకు దూరంగా ఉండటంమేనని చెప్పుకొచ్చింది ఈ అందాల నటి ఖుష్బూ

గమనిక: ఇది కేవలం అవగాహన కోస మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

ఇదీ చదవండి: నటడు రవి కిషన్ డబుల్ చిన్ తగ్గించే చిట్కా..! ఇది నిజంగానే హెల్ప్‌ అవుతుందా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement