కేసీఆర్‌పై ద్వేషంతోనే రేవంత్‌ ఇలాంటి వ్యాఖ్యలు: జీవన్‌ రెడ్డి సీరియస్‌ | Jeevan Reddy Slams CM Revanth Reddy Over Remarks On KCR And KTR, Accuses Him Of Political Vendetta | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై ద్వేషంతోనే రేవంత్‌ ఇలాంటి వ్యాఖ్యలు: జీవన్‌ రెడ్డి సీరియస్‌

Oct 1 2026 1:48 PM | Updated on Oct 1 2026 2:04 PM

Jagtial Jeevan Reddy Serious Comments On Revanth Reddy

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌పై ద్వేషంతో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ ఇలా మాట్లాడరు అంటూ మండిపడ్డారు.

మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్‌ ఆస్తులపై రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్‌ ఆదర్శంగా నిలిపారు. ఎక్కడా లేని విద్యాసంస్థలను కేటీఆర్‌ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలన మూడేళ్లలో సిరిసిల్ల కార్మికులకు రేవంత్‌ ఏం చేశాడు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై ద్వేషంతో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు’ అని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఆపండి: పీజేఆర్‌ కూతురు పిటిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement