గత వీకెండ్ వచ్చిన 'ప్యారడైజ్' మూవీలో ఏషనాగుల పాటతో ఆకట్టుకున్న కీర్తి సురేశ్.. తమిళంలో 'డోరోతి' సినిమాతో షాకిచ్చింది. ఇప్పుడు నెల తిరిగేలోపు ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోతోంది. ఈమె నటించిన గ్యాంగ్‌స్టర్ సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'అక్క'. దీని గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడీ సిరీస్‌ని అక్టోబరు 30 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. దక్షిణ భారతదేశంలోని పెర్నూరు అనే ఊరిలో లేడీ గ్యాంగస్టర్స్ మధ్య జరిగే ఆధిపత్య పోరు బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ సిరీస్ తెరకెక్కించారు.
'అక్క' విషయానికొస్తే.. 1980ల నాటి దక్షిణ భారతదేశంలో పెర్నూరు అనే కల్పిత నగరంలో మహిళలదే పూర్తి ఆధిపత్యం. మహిళా గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ తమ సొంత నియమాలతో అంతా శాసిస్తుంటారు. కానీ ఓ బయటి వ్యక్తి రాకతో వారి తిరుగులేని ఆధిపత్యానికి ఊహించని సవాలు ఎదురవుతుంది. అప్పటివరకు బలంగా కనిపించిన మహిళల సోదరీభావం క్రమంగా చీలిపోతుంది. అధికారం కోసం హింస, కుట్రలు పెరిగిపోయి 'అక్క' ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. చివరకు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఆ గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ ఎలాంటి పోరాటం సాగించారనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: యాంకర్‌తో ప్రేమలో ఉన్న తమిళ హీరో.. ఫొటోలు వైరల్)


