మెగాస్టార్‌ సరికొత్త అవతారం.. ప్రముఖ షోలో ఎంట్రీ..! | Megastar Chiranjeevi Ready To Host a Mega talk Show In OTT | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్‌ సరికొత్త అవతారం.. ప్రముఖ షోలో ఎంట్రీ..!

Sep 28 2026 6:13 PM | Updated on Sep 28 2026 6:35 PM

Megastar Chiranjeevi Ready To Host a Mega talk Show In OTT

మెగాస్టార్ చిరంజీవి సరికొత్త అవతార ఎత్తనున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు చేయని రోల్‌కు సిద్ధమయ్యారు. తన కెరీర్‌లో తొలిసారి అలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా? ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ షోలో ఆయన కనిపించనున్నారు. ఓ టాక్ షోకు చిరును  హోస్ట్‌గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టాలని కొంతకాలంగా ఆలోచిస్తున్న చిరంజీవి.. ఈ టాక్‌ షోకు హోస్ట్‌గా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌తో బిగ్‌ డీల్‌ కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనకు భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకోనున్నారని మరో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది.

​మరోవైపు మెగాస్టార్ కాకా మూవీతో బిజీగా ఉన్నారు. బాబీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా.. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన విశ్వంభర వాయిదా పడుతూనే ఉంది. వశిష్ఠ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement