ప్రెగ్నెన్సీతో సమంత.. ఆ విషయంలో ఎక్కువ ఫోకస్..! | Samantha Shares Her Pregnency Baby Bump Pics And Pickle Ball Game Video With Husband, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Samantha: ప్రెగ్నెన్సీతో సమంత.. ఆ విషయంలో ఎక్కువ ఫోకస్..!

Sep 28 2026 4:11 PM | Updated on Sep 28 2026 4:39 PM

Samantha Shares Her Pregnency pics and Video of Pickle ball game

ఈ ఏడాది మా ఇంటి బంగారంతో సూపర్ హిట్‌ కొట్టిన టాలీవుడ్ బ్యూటీ సమంత. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నందిని రెడ్డి దర్శకత్వం వచ్చిన ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా మహిళా అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కట్టారు. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి సైతం కీలక పాత్రలో మెప్పించింది.

ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత సమంత అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానని ప్రకటించి డబుల్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. ఫుల్ ఎనర్జిటిక్‌గా గేమ్‌ ఆడుతూ సందడి చేసింది. గర్భంతో ఉన్న హీరోయిన్‌ సామ్ ఫిట్‌నెస్‌ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. జిమ్‌లో కష్టపడుతూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటోంది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement