సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(మంగళవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, ఇటీవలి డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా శాప్ ఆఫీసు ఎదుట జరిగిన పోలీసుల తోపులాట కారణంగా రాజశేఖర్ అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే.


