రాప్తాడు ఘటన: విద్యార్థిని లక్ష్మికి వైఎస్‌ జగన్‌ ఆర్థికసాయం | Raptadu Incident: YS Jagan extends financial assistance to student Lakshmi | Sakshi
Sakshi News home page

రాప్తాడు ఘటన: విద్యార్థిని లక్ష్మికి వైఎస్‌ జగన్‌ ఆర్థికసాయం

Nov 12 2026 4:13 PM | Updated on Nov 12 2026 4:15 PM

Raptadu Incident: YS Jagan extends financial assistance to student Lakshmi

అనంతపురం:  రాప్తాడు ఘటనలో స్నేహితురాల్ని రక్షించడానికి సాహసం చూపిన విద్యార్థిని లక్ష్మికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థికసాయం అందించారు. విద్యార్థిని లక్ష్మి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు వైఎస్‌ జగన్‌. రాప్తాడు జడ్పీ హైస్కూల్ దాడి ఘటనలో గాయపడిన విద్యార్థిని లక్ష్మిని ఇటీవల వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసాలో భాగంగా ఈరోజు(గురువారం, నవంబర్‌ 12వ తేదీ) రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. లక్ష్మి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి  ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వైఎస్సార్‌సీపీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రధాన బాధితురాలు గోపికకు త్వరలోనే ఆర్థికసాయం అందిస్తామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలియజేశారు. గోపిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: జైల్లో కూడా అప్పిరెడ్డిని కూటమి సర్కార్‌ వేధిస్తోంది! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement