ట్విట్టర్‌ స్పేస్‌ పేరుతో జనసేన మూకల దాష్టీకం | Ysrcp Serious on Jana Sena Anarchy In Name Of Twitter Space | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌ స్పేస్‌ పేరుతో జనసేన మూకల దాష్టీకం

Nov 12 2026 2:59 PM | Updated on Nov 12 2026 3:21 PM

Ysrcp Serious on Jana Sena Anarchy In Name Of Twitter Space

సాక్షి, అమరావతి: రాజకీయ విలువలకు జనసేన తిలోదకాలిచ్చింది. ట్విట్టర్‌ స్పేస్‌ పేరుతో జనసేన మూకల దాష్టీకం ప్రదర్శించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబంపై దారుణమైన అసభ్య పదజాలంతో జనసేన మూకలు రెచ్చిపోయారు. మూడో భార్యతో పవన్‌ కల్యాణ్‌ విడాకుల నేపథ్యంలో సంఘీభావం తెలుపుతూ ట్విట్టర్‌ స్పేస్‌లో జనసేన బ్యాచ్‌ అరాచకం సృష్టించింది. ట్విట్టర్‌ స్పేస్‌లో పాల్గొన్న దాదాపు 350 మంది జనసేన బ్యాచ్‌.. తల్లులు, భార్యలను దూషిస్తూ.. దారుణంగా మాట్లాడారు. వినడానికి వీల్లేని రీతిలో జనసేన మూకలు రెచ్చిపోయారు. పవన్‌ కల్ట్‌ చూపిస్తామంటూ వైఎస్‌ జగన్‌ కుటుంబంపై దారుణమైన భాష ఉపయోగించారు.

జనసేన మూకల దాష్టీకంపై వైఎస్సార్‌సీపీ సీరియస్
జనసేన మూకల దాష్టీకంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ క్రైం పోలీసులకు పార్టీ లీగల్ సెల్‌ ఫిర్యాదు చేయనుంది. పవన్ కళ్యాణ్ మూడో భార్య విడాకుల నేపథ్యంలో ట్విట్టర్ స్పేస్ నిర్వహించిన జనసేన మూకలు.. ట్విట్టర్ స్పేస్‌లో వైఎస్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. త్రినాథ్‌ కుమార్, రాఘవేంద్ర, పృధ్వీ అనే జనసేన నేతలు ట్విట్టర్ స్పేస్ నిర్వహించినట్లు గుర్తించారు. వారితో సహా ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్న 350 మందిపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయనుంది.

ఇదీ చదవండి: కూటమి నుంచి బయట కొచ్చేస్తాం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement