అంతర్వేదికి కొట్టుకొచ్చిన భారీ నౌకను ఏం చేశారంటే..? | Cyclone Arnab: Ship Ran Aground On Antarvedi Coast Shifted To Kakinada | Sakshi
Sakshi News home page

అంతర్వేదికి కొట్టుకొచ్చిన భారీ నౌకను ఏం చేశారంటే..?

Nov 12 2026 12:23 PM | Updated on Nov 12 2026 12:29 PM

Cyclone Arnab: Ship Ran Aground On Antarvedi Coast Shifted To Kakinada

సాక్షి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: అర్నబ్‌ అతి తీవ్ర తుపాను కోస్తా తీరాన్ని కకావికలం చేసిన సంగతి తెలిసిందే. అయితే, తుపాను తీరం దాటే సమయంలో ఏర్పడిన తీవ్రమైన అలల తాకిడికి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మార్గం తప్పి అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చింది. ఇంజన్ ఫెయిల్ కావటంతో సిగ్మా పెర్ల్ షిప్ సముద్రంలోనే నిలిచిపోయింది.

పది రోజులకు పైగా అంతర్వేదికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్రంలోనే షిప్‌ నిలిచిపోయింది. ఎట్టకేలకు షిప్‌ను కాకినాడకు తరలించిన అధికారులు.. షిప్‌లో ఉన్న క్రూను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అర్నబ్‌ తుపాను కోనసీమలో కుండపోత వర్షాలు, ప్రచండ గాలులతో భీభత్సం సృష్టించింది. లక్ష ఎకరాలకు పైగా వరి పంట తుపాను బారిన పడింది.

అరటి, కోకో, పోక తదితర ఉద్యాన పంటలకూ నష్టం వాటిల్లింది. సుమారు 8 వేలకుపైగా స్తంభాలు దెబ్బతిన్నాయి. ఓడలరేవు, అంతర్వేది పరిసరాల్లో బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ ప్రాంతానికి చెందిన సుమారు 40 బోట్లు ఓడలరేవు తీరానికి కొట్టుకొచ్చాయి.

ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement