breaking news
kakinada
-
Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా
-
AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, అమరావతి: పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 19 నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇది బలపడి దక్షిణ ఒడిస్సా–ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే వారం కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.ఇదిలావుండగా బుధవారం కాకినాడ జిల్లా రౌతులపూడిలో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా మర్రిపాలెంలో 5.4, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 4.8, కాకినాడ జిల్ల కోనపాపపేట 4.6, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 4.5, అనకాపల్లిలో 4.4, పాయకరావుపేటలో 4.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగింది. పగటిపూటి వేసవిని తలపించేలా ఎండలు మండాయి. ఇదీ చదవండి: సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్ -
కొబ్బరి బోండంలో సైనైడ్ పోసి హత్య.. మళ్లీ పోలీసుల చేతికి సాధిక్
-
సౌజన్య కేసు.. పోలీసుల కస్టడీలో సాధిక్ డ్రామాలు!
సాక్షి,కాకినాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు, ఆయన అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సర్పవరం పోలీసులు నిందితుడు సాధిక్ ఖాన్‌ను సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. పోలీసుల కస్టడీలో సాధిక్ ఖాన్ డ్రామాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదని, పలు ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, పోలీసులు సాంకేతిక ఆధారాలు, సైనైడ్ విక్రయించిన వ్యక్తుల సాక్ష్యాలను చూపడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.విచారణలో పూర్తిస్థాయి వాస్తవాలు రాబట్టేందుకు, సాధిక్‌ను మరోసారి వారాల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు స్థానిక కోర్టులో మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏఈ నూకరాజు అల్లుడు కొవ్వురి జగదీశ్వర రెడ్డి మృతిపై ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్లో సాధిక్ ఖాన్‌పై కేసు నమోదైంది.సుమారు రూ.25 కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే సాధిక్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జగదీశ్వర రెడ్డికి కొబ్బరి నీళ్లలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతి తర్వాత నూకరాజు కూతురు సౌజన్యను వేధించడం, కుటుంబంపై బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.ఈ ఘటనపై సర్పవరం పీఎస్‌లోనూ కేసులు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇదీ చదవండి : సాధిక్ ఖాన్ మా మమ్మీనీ కొట్టేవాడు చాలా భయం వేసేది -
నూకరాజు కేసులో భారీ ట్విస్ట్‌లు.. సాధిక్ విచారణలో సంచలన విషయాలు
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రూ.25 కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసిన సాధిక్.. జగదీశ్‌ను హత్య చేసి, ఆయన భార్య సౌజన్యను పెళ్లి చేసుకోవాలని పథకం వేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు పలు ప్రణాళికలు వేసినట్టు తెలిసింది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందే జగదీశ్ రెడ్డికి కాకినాడలో సాధిక్ స్లో పాయిజన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యానికి గురైన జగదీశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం చివరిసారిగా కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాల ఆధారంగా స్లో పాయిజన్ కెమికల్, సైనైడ్ సరఫరా చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి విచారించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. జగదీశ్ రెడ్డితో పాటు ఏఈ నూకరాజుకు సంబంధించిన ఆస్తిని కూడా దక్కించుకోవాలని సాధిక్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నూకరాజు కుటుంబం ఇందుకు అంగీకరించకపోవడంతో వారిని కూడా చంపేస్తానని సాధిక్ బెదిరించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురైన నూకరాజు కుటుంబం రాజమండ్రిలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు సాధిక్ ఖాన్ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఇవాళ అతడిని అమలాపురం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు వైద్య పరీక్షల కోసం సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసులో సాధిక్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా..తాజా దర్యాప్తులో భాగంగా సాధిక్‌ను గుడారిగుంటలోని ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీతో పాటు నూకరాజు, సౌజన్య నివాసాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు సమాచారం. అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: దొంగ పెన్షన్ల కోసం టీడీపీ పన్నాగం -
సాధిక్ ఖాన్ కేసులో ట్విస్ట్.. కీలక ఆధారాలు లభ్యం
-
గోదావరిలో భారీ పండుగప్ప.. 16వేలకు వేలం!
సాక్షి, కాకినాడ: గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారి వలకు ఏకంగా 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. అనంతరం, భారీ చేపను వేలం వేయగా.. 16000లకు అమ్ముడైంది. ఈ చేప సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల మేరకు.. కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు 23 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. దీంతో, యానాం మార్కెట్‌కు తీసుకెళ్లిన ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. అనంతరం చేపను వేలం వేయగా కోలాటి దేవి అనే వ్యాపారి రూ.16 వేలకు దక్కించుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న పండుగప్ప చేప వలకు చిక్కడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్షసూచన -
జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు
-
తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?
-
కాకినాడ నిరుద్యోగులపై కేసులు.. వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
ఉద్యోగాలడిగారని ఉక్రోషం.. నిరుద్యోగ గుండెలపై దమనకాండ
కాకినాడ క్రైం: నిరుద్యోగ గుండెలపై ఖాకీలు దమనకాండ సాగించారు. ఉద్యోగాలివ్వమని అడిగిన పాపానికి ఉగ్రవాదుల్లా చూశారు. రాత్రంతా కాళరాత్రి కళ్లకుకట్టారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలో ఉండగా పోలీస్ శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల హాస్టళ్లలోకి ముష్కర మూకలు తెగబడినట్టు పోలీసులు గుంపులుగా దూసుకొచ్చారు. తలుపులు కొట్టి, బలవంతంగా నెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఎవడ్రా ఇక్కడ నిరసనలో పాల్గొన్నదని కళ్లెర్రజేశారు. నిరుద్యోగులపైనా, వారంతా చదువుతున్న విద్యాసంస్థ యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. భవిష్యత్‌ను నాశనం చేస్తాం.. ఖబడ్దార్.. అంటూ హెచ్చరించి మరీ వెళ్లారు. అసలేం జరిగింది... రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పోలీస్ నిరుద్యోగులంతా ఏకమయ్యారు. దశల వారీగా వివిధ జిల్లాల్లో చేపడుతున్నట్టుగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీచేయాలని, తక్షణం ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలనే డిమాండ్లతో సోమవారం కాకినాడలో భారీ నిరసన చేపట్టారు. శారదాదేవి జంక్షన్‌కు సోమవారం ఉదయం సుమారు 1,000 మంది నిరుద్యోగులు చేరుకుని అక్కడి నుంచి భానుగుడి కూడలి వరకు నిరుద్యోగ భృతి కాదు.. ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేస్తూ సీఎం బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల తీరును నిరసించారు. 12 వేలకుపైగా ఖాళీలు ఉంటే కేవలం 1500కు అటుఇటుగా పోస్టులు విడుదల చేస్తారన్న విషయం తెలియవచ్చిందని, అదే జరిగితే తమ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వెళ్లగక్కారు. నోటిఫికేషన్లు ఇవ్వడం ఆలస్యమవుతుండడం వల్ల వయోపరిమితి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. భానుగుడి వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి అక్కడి నుంచి కలెక్టరేట్ ఆవరణను చేరుకొని ధర్నా చేపట్టారు., పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అణగదొక్కాలని హుకుంసోమవారం కాకినాడలో జరిగిన నిరసన ప్రదర్శన జిల్లా పోలీస్ శాఖకు సవాల్ విసిరినట్టయింది. రాష్ట్రంలో మరెక్కడా జరగనంత ఉధృతంగా కాకినాడలో ఈ నిరసన జరగడంతో పోలీసులే కంగుతిన్నారు. ఇది పాలకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వం జిల్లా పోలీసుల తలంటింది. తక్షణం ఆందోళన చేసిన వారిని అణగదొక్కాలని, మళ్లీ నిరసన చేపట్టాలంటే భయపడేలా చేయాలని హుకుం జారీచేసింది. దీంతో పోలీసులు పేట్రేగిపోయారు. పైశాచికత్వానికి పదునుపెట్టారు. నిరుద్యోగులు, వారు శిక్షణ తీసుకుంటున్న సంస్థలపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు తమ ప్రతాపాన్ని చూపించారు. హాస్టళ్లలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. రాత్రంతా ప్రత్యక్ష నరకం.. సోమవారం రాత్రి నుంచే పోలీసులు హాస్టళ్లపై దాడులు చేపట్టారు. విద్యుత్ నగర్లో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లే దారులన్నింటిలోనూ పోలీసులు మోహరించి తమ జీపులను నిలిపారు. అటుగా వెళుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరినీ ఆపి ఆరా తీశారు. గుర్తింపు కార్డులను పరిశీలించి వ్యక్తిగత ఆరాలూ తీశారు. ఎందుకని ప్రశ్నిస్తే తాటతీస్తామని హెచ్చరించారు. రాత్రి అంతా ఇన్స్టిట్యూట్ చుట్టూ, అలాగే అక్కడి విద్యార్థులు ఉంటున్న హాస్టళ్ల చుట్టూ కలియదిరిగారు. మఫ్టీలో మాయ చేసి, సెల్‌ఫోన్ కెమెరాలతో అటుగా వెళుతున్న ప్రతి ఒక్కరి కదలికలను రికార్డు చేశారు. కర్ఫ్యూ వాతావరణాన్నే సృష్టించారు. కాళరాత్రిని కళ్లకు కట్టారు. తెల్లవారుజామున హాస్టళ్లలోకి చొరబడ్డారు. తలుపులు బాదుతూ, నెడుతూ నిరుద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆడా మగా తేడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. మహిళా అభ్యర్థులు నైట్ డ్రెస్‌లలో ఉండగానే పోలీసులు ఫొటోలు తీశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ సహా గుర్తింపు కార్డుల ఫొటోలు తీసుకున్నారని పేర్కొన్నారు, వ్యక్తిగత అంశాలనూ ప్రశ్నించి వెకిలిచేష్టలతో నరకం చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరసనల్లో పాల్గొంటే భవిష్యత్ నాశనం చేస్తామని హెచ్చరించి వెళ్లారని విమర్శించారు. ఈలోపు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ అక్కడికి వచ్చి తనిఖీలకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నిస్తే, అవసరం లేదని పోలీసులు మరింత చెలరేగిపోయారు. నలుగురిపై కేసులు నమోదు.. ఉద్యోగ ప్రకటన పేరుతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్డెక్కించారని, ఇందులో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలు భాగమయ్యారని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుంటూరి శ్యామ్‌తో పాటు డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు తొట్టిపూడి రాజా, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మదిన గంగా సూరిబాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజేష్ లపై కేసులు నమోదు చేసినట్టు కాకినాడ త్రీటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత కన్నీటి పర్యంతం తమ సంస్థ హాస్టల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు దాడులు చేయడంపై శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు తమ సంస్థకు సంబంధం లేదన్నా.. పోలీసులు వినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. చెబితే విని నిరసనలు చేయడానికి నిరుద్యోగులు చిన్నపిల్లలేం కాదని, డిగ్రీలు, పీజీలు చదివిన వారని, ఎంతోకాలంగా శిక్షణ పొందినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతోనే నిరసన బాట పట్టి ఉంటారని పేర్కొన్నారు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులూ ఒక్కప్పుడు ఉద్యోగాల కోసం వేదన పడ్డవారేనని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. జిల్లాలో ఏ నేరం జరిగినా తమ సంస్థలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల మీదకే నెట్టడం వారి భవితను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పు చేస్తున్న వారు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. పోలీసులు సోమవారం మధ్యాహ్నం తమ విద్యార్థులను పోలీసుస్టేషన్‌కు పిలిచి విచారణ పేరుతో రాత్రి వరకు ఉంచారని, మళ్లీ తెల్లవారుజామున దాడులకు తెగబడ్డారని ఆక్రోశించారు. తమ సంస్థలో శిక్షణ పూర్తిచేసుకున్న వారు ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు ఉంటూ తినీతినక కష్టాలు పడుతున్నారని వారి వేదన చూడలేక సీఎం చంద్రబాబును కలిసి పోలీసు శాఖలో ఉద్యోగాలు పెంచాలని కోరానని గుర్తుచేశారు. అనుమతిలేకుండా ర్యాలీ నిరుద్యోగులను రెచ్చగొట్టి దురుద్దేశంతో రోడ్డెక్కించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న సెంట్రల్ మైక్‌లో నిరసనల సమాచారం పంచుకున్నారు. ఈ విషయం అధినేత శ్యామ్‌కు తెలిసే జరిగింది. నిరుద్యోగులపై కేసులేవీ పెట్టలేదు. శ్యామ్ సహా మరో ముగ్గురు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై కేసులు నమోదు చేశాం. పోలీసుల అనుమతి తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడూ డిప్యూటీ సీఎం కారును శ్యామ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అడ్డుకోబోయారు, అలాగే, పలు నేరాల్లో కూడా కొందరు భాగమవుతున్నారు. వీటి వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకే హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాం. మేం ఎవరినీ ఉగ్రవాదుల్లా పరిగణించలేదు, నిబంధనలకు లోబడే తనిఖీలు చేశాం. – మహంతి కిషోర్‌కుమార్, ఇన్చార్జి ఎస్పీ, అదనపు ఎస్పీ, కాకినాడ జిల్లా -
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
తాడేపల్లి : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ’ఎక్స్’ వేదికగా కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు వైఎస్ జగన్. ‘కాకినాడలో మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్షపూరితంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోంది. శ్యామ్, టి.రాజా, ఎం.గంగా సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయడం దారుణం. ‘‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడం, ఉద్యోగాల భర్తీ కోరడమే వారు చేసిన నేరమా?, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా నేరంగా మారిందా?, అధికారంలోకి రావడానికి యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు. . మూడేళ్లకు రూ.21,600 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా..యువతను మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోంది. మెగా డీఎస్సీ స్కాంలో రోజుకో కొత్త ఆధారం బయటపడుతున్నా..సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ అణచివేత, సెన్సార్షిప్, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ ఇస్తూ నిజమైన నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ అడిగితే మాత్రం కేసులా?, ఇది కూటమి ప్రభుత్వ యువత వ్యతిరేక, ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరికి నిదర్శనం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రిక్రూట్మెంట్ స్కాంలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకులు, నియామకాల్లో అక్రమాలు పరిపాటిగా మారుతున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలను గౌరవించడం టీడీపీకి ఎప్పుడూ చేతకాలేదు. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించడం కంటే.. అవినీతి, రాజకీయ మాయాజాలానికే ప్రాధాన్యం ఇస్తోంది.నిరుద్యోగ యువతపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.Cases were…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2026 డీఎస్సీ అక్రమాలపై కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు -
‘స్థానిక’ ఎన్నికలకు మనమంతా సన్నద్ధంగా ఉండాలి: బొత్స
కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు మనమంతా సమాయత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ప్రతీ స్థానంలోనూ పోటీ చేయాలని, పోరాటం చేసి విజయం సాధించాలన్నారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. కూటమి పాలనలో జరుగుతున్న ఆకృత్యాలను ఎన్నడూ చూడలేదని, వారి ఆకృత్యాలన్నీ టీవీ, పేపర్లు చూస్తూ కనిపిస్తాయన్నారు. ‘ టెట్ ఎన్ని సార్లు అయిన రాసుకోవచ్చు అని చంద్రబాబు, లోకేష్ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. టెట్ రాయకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వొచ్చా లేదా అనే దాని పై చెప్పడం లేదు. డీఎస్సీ అక్రమాల పై ప్రశ్నించినందుకు మాపై కేసులు పెడితే తేల్చుకుంటాం. ఆంద్రాలో ప్రజలు తిండిలేకుండా ఉంటే...ఢిల్లీలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశారు. పురుషోత్తపట్నం నుండి నీళ్లు తోడి పోలవరం కాలువలో వదులుతారా?, గ్రావెటీతో కాకుండా ఎన్నాళ్ళు నీళ్ళు ఇస్తారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత కోసం విదేశి నిపుణులు ఏం చెప్పారో చంద్రబాబు చెప్పాలి. అపర భగీరధుడు అంటే వైఎస్ఆర్. సున్నా వడ్డీ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఎందుకు తీసేశాడు?, నిరుద్యోగ భృతి ఏది అని నిరుద్యోగులు అడిగితే వాళ్ళపై కేసుల పెడతారు.. అసలు సూపర్ సిక్స్ అమలు చేయకుండానే సూపర్‌హిట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు. ‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ -
బాబూ.. జాబ్ ఎక్కడ?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పోలీసు అభ్యర్థులు కాకినాడలో కదంతొక్కారు. బాబూ.. జాబ్ ఎక్కడ అంటూ సర్కారును నిలదీశారు. మెగా పోలీస్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఢిల్లీ జెన్‌జీ ఉద్యమ తరహాలో మహోద్యమం తప్పదని హెచ్చరించారు. పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు సోమవారం యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శారదా దేవి గుడి సర్కిల్‌కు చేరుకుని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కొడుకు లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబూ.. మాకు జాబ్ ఎక్కడ అంటూ నిలదీశారు. తక్షణం మెగా పోలీసు నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా సర్కారు తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. వయోపరిమితిపైనా అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారని, కానీ ఈ రెండేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. పీజీలు, డిగ్రీలు చదువుకున్న తాము నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే.. ఇంటర్ ఫెయిలైనవారూ ఈ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్కారు తక్షణం స్పందించకుంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలో జెన్‌జీ చేపట్టిన ఉద్యమ తరహా పోరాట స్ఫూర్తితో చలో విజయవాడ పేరుతో మహోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, రాజేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. గంగా సూరిబాబు, అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. -
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,కాకినాడ: తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్లపాలెం గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సమాచారం మేరకు.. కృష్ణ, మణికంఠ, తమ్మి అనే ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై కాకినాడ నుండి యానం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు తీవ్ర గాయాలపాలైన కృష్ణ, మణికంఠ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడు తంబిని స్థానికులు తక్షణమే కాకినాడ జిజిహెచ్ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను కన్నుమూశాడు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
Kakinada : నా భర్తను హత్య చేయించింది కటౌట్ శ్రీను
-
2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు
-
Kakinada: పోలీసుల అదుపులో జిమ్ ట్రైనర్ హత్య కేసు నిందితులు
కాకినాడ: నగరంలోని బానుగుడి సెంటర్లో మూడు రోజుల క్రితం జరిగిన జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్రెడ్డినిముగ్గురు స్నేహితులతో కలిసి సాయి కిరణ్ హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న కాకినాడ టూ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంచితే, సతీష్‌రెడ్డి హత్య వెనుక ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీను ఉన్నాడని మృతుని భార్య జయశ్రీ ఆరోపిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా తన భర్తపై కటౌట్ శ్రీను కక్ష పెంచుకున్నాడని, దాంతోనే ఈ హత్య జరిగిందని ఆమె అంటోంది. దీనిపై కటౌట్ శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ -
మా ఆయనను చంపింది కటౌట్ శ్రీను! సతీష్ రెడ్డి భార్య, వదిన సంచలన కామెంట్స్
-
జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్
-
సౌజన్యకి ఎన్నో సార్లు చెప్పం.. మా ఇంటికి వచ్చి ఏం చేసిందంటే.. సాదిక్ తల్లి, చెల్లి
-
జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, కాకినాడ జిల్లా: జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి హత్యలో ఎమ్మెల్యే అనుచరుడి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హత్యలో ఎమ్మెల్యే అనుచరుడు కటౌట్ శ్రీను హస్తం ఉందని సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు. కటౌట్ శ్రీను టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు. కేసు నుంచి శ్రీనును తప్పించాలని చూస్తున్నారని.. కటౌట్ శ్రీను నుంచి నాకు ప్రాణహాని ఉందని సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ అన్నారు. ఏడాది క్రిందట జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి తో జయశ్రీకి ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం జయశ్రీ ఐదు నెలల గర్భవతి.జయశ్రీ మాట్లాడుతూ.. ’’కొద్ది నెలల క్రితం కటౌట్ శ్రీను నుంచి అతని భార్య విడాకులు తీసుకుంది. అయితే భార్య విడాకులు ఇవ్వడానికి సతీష్ రెడ్డే కారణమని కటౌట్ శ్రీను భావించాడు. నేను నా పుట్టింట్లో ఉండగా సాయికిరణ్‌ను వెంట బెట్టుకుని కటౌట్ శ్రీను వచ్చి సతీష్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకుని సాయికిరణ్‌ను సతీష్ రెడ్డి కొట్టాడు. దీంతో ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్న సాయికిరణ్, సతీష్‌రెడ్డి కి మధ్య వివాదం నడుస్తుంది...మా ఇంట్లో అన్నం తిన్న సాయి కిరణే తన అనుచరులతో నా భర్తను కిరాతకంగా చంపాడు. అయితే ఈ హత్య చేయించింది మాత్రం కటౌట్ శ్రీనే. ఇదే విషయాన్ని పోలీసులకు చెబితే.. శ్రీను పేరు బయటకు చెప్పవద్దంటూ అతనిని తప్పిస్తున్నారు’’ అని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు.ఇదీ చదవండి: సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు? -
సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ
కాకినాడ: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్ కుమార్ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్‌సీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. అనంతరం, భార్యాపిల్లలను సంతోష్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్‌కు మోటార్ సైకిల్‌పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్ కుమార్ రెడ్డి బైక్ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్‌ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్ కుమార్ రెడ్డి బైక్‌ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్ కుమార్ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్ కుమార్ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.చదవండి: ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం? -
ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?
కాకినాడ క్రైం: ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంపై వచ్చిన వ్యక్తితో నలుగురు చుట్టుముట్టారు. వారిలో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. వారు ప్రతిదాడి చేశారు. వీరికి మిగిలిన ఇద్దరూ తోడయ్యారు. మొత్తం నలుగురూ కలసి మూకదాడికి దిగారు. అక్కడే ఉన్న చెక్కతో ఆ వ్యక్తిపై విచక్షణారహితంగా చావబాదారు. విరిగిన చెక్కలో పదునైన భాగాన్ని.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గొంతులో పరమ కిరాతకంగా దించేశారు. అయినా బతికేస్తాడేమోననే అనుమానంతో ఆ కర్రను బయటకు తీసి మరింత లోతుగా దించారు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మూడుసార్లు తీసి గుచ్చి, చివరిగా ఆ కర్రను బలంగా గొంతులోకి దిగ్గొట్టి క్రూరాతిక్రూరంగా హతమార్చారు. ఇదంతా మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఏదో క్రైం థ్రిల్లర్ కథలా.. సినిమాలోని క్రూర సన్నివేశంలా జరిగిన ఈ దారుణం.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకొనే కాకినాడ నగరం నడిబొడ్డున.. భానుగుడి సెంటర్లో.. జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరాన.. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్‌రెడ్డి (30) క్రూరహత్యోదంతం జిల్లాను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పోలీసు భద్రతను ప్రశ్నార్థకం చేసింది. హతమార్చింది అందుకేనా? ఈ హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్న వ్యక్తికి రాజకీయ అండదండలున్నాయని చెబుతున్నారు. అతడి భార్య బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఆమెతో హతుడు సతీష్ చనువుగా ఉండేవాడని తెలుస్తోంది. అతడి స్నేహితుడు సాయికిరణ్ కూడా ఆమెపై కన్ను వేశాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ సతీష్‌కు చెప్పడంతో అతడికి, సాయికిరణ్‌కు మధ్య తరచుగా గొడవలు జరుగుతూండేవి. ఈ నేపథ్యంలో సాయికిరణ్ ఆ మహిళ భర్తకు సతీష్ పై లేనిపోని చాడీలు చెప్పి, ఇద్దరి మధ్య కక్షలు పెంచాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త ఆదేశాలు, అండదండలతో సాయికిరణ్, మరో ముగ్గురు కలసి సతీష్‌ను ప్రణాళిక ప్రకారం అర్థరాత్రి భానుగుడి సెంటర్‌కు రప్పించి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కర్రను సాయికిరణ్ అప్పటికే సమకూర్చుకున్నాడని తెలుస్తోంది. ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది! గత నెల 8 నుంచి 12వ తేదీ మధ్య జరిగిన సంఘటనలే ఈ హత్యకు దారి తీశాయని తెలియవచ్చింది. ఆ మహిళ విషయంలో సతీష్ భార్య జయశ్రీని సాయికిరణ్ కలిశాడు. ఆ మహిళతో సతీష్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె ఫలానా వ్యక్తి భార్య అని వెల్లడించాడు. టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడిగా చెబుతున్న ఆ వ్యక్తి అప్పటికే తన భర్త సతీష్ ద్వారా జయశ్రీకి తెలుసు. గర్భిణిగా ఉన్న ఆమె పుట్టింట్లో ఉండగా సాయికిరణ్, ఆ వ్యక్తితో జయశ్రీని కలిశాడు. ఆమె భర్తను చంపేస్తానని చెప్పాడు. తనను, కడుపులో ఉన్న బిడ్డను చూసి తన భర్తను విడిచిపెట్టాలని, సతీష్ ఆ మహిళ జోలికి వెళ్లకుండా చూసుకుంటానని ఆమె చెప్పింది. వారు వెళ్లిన తర్వాత రోజు ఆ మహిళ విషయమై సతీష్‌ను జయశ్రీ నిలదీసింది. ఆమెతో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న అతడు.. నిండుగర్భిణిగా ఉన్న తన భార్యకు ఈ విషయం చెప్పిన సాయికిరణ్‌పై ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సాయికిరణ్, సతీష్‌లు ఫోనులో గొడవ పడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన సతీష్ తన ద్విచక్ర వాహనంపై కిరణ్ ఉన్న భానుగుడి జంక్షన్‌కు రాత్రి 1.45 సమయంలో వెళ్లాడు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం అతడిని సాయికిరణ్, అనుచరుల హతమార్చారు. సతీష్‌కు జయశ్రీతో ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరో నెల గర్భిణి. పొంతన లేకుండా.. ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తునికి చెందిన ఓ యువతిని ఇద్దరూ ప్రేమించి గొడవ పడగా అది హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, అది పోలీసుల కల్పిస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిద్రలో నైట్ డ్యూటీ కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఈ హత్య నేపథ్యంలో పోలీసుల రాత్రి నిఘా పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. హత్య జరిగిన భానుగుడి సెంటర్ జిల్లా పోలీసు కార్యాలయానికి 200 మీటర్ల లోపే ఉంది. హత్య సమయంలో అరగంట పైగా అక్కడ అలజడి చోటు చేసుకుంది. అయినప్పటికీ నైట్ బీట్లు అటువైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాయి. పోనీ కూతవేటు దూరంలోనే ఉన్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది కూడా సీసీ కెమెరాల ద్వారా ఏమీ గమనించలేదు. రాత్రి వేళ డ్యూటీల్లో ఉన్న వారు గుర్రు పెట్టి నిద్రపోవడం వల్లనే దీనిని గమనించలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారే కనుక మేల్కొని ఉండి, ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించి ఉంటే కనీసం సైరన్ మోగించే అవకాశం ఉండేది. అప్పుడైనా ఈ నేరం ఆగి ఉండేదని పలువురు అంటున్నారు. పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు! రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. సతష్ హత్యను నగరంలోని ఓ ముఖ్య టీడీపీ నేత అనుచరుడే చేయించాడని ప్రచారం జరుగుతోంది. అతడు సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోతూ నగరంలో గూండాగిరి చేస్తూంటాడని, అతడే ఈ హత్య చేయించాడని సతీష్ కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే, తమ నోటి వెంట అతడి పేరు రానివ్వకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సతీష్ హత్య రాత్రి 2 గంటల సమయంలో జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీడీపీ నాయకుడి అనుచరుడు తనకు ఒంట్లో బాగోలేదంటూ సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 3 గంటల ప్రాంతంలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి తన అనుచరుడిని తప్పించాలంటూ ఆ టీడీపీ నేత ఉన్నతాధికారుల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నలుగురు దుర్మార్గులూ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.చదవండి: సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్‌ను ఈడ్చుకెళ్లిన లారీ -
సినిమాను మించిన ట్విస్టులు ఆ 5పేజీల లేఖలో నిజమెంత..?
-
సాదిక్ పై నూకరాజు మనవడు సంచలన వ్యాఖ్యలు
-
‘సాధిఖ్ ఖాన్ మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది’
సాక్షి,కాకినాడ: తన కుటుంబాన్ని నాశనం చేసి.. తనను అనాథను చేసిన సాధిక్ ఖాన్‌కు కఠిన శిక్ష విధించాలని ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి డిమాండ్ చేశాడు. ‘రైఫిల్ షూటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాను. మూడో తరగతి నుంచి సాధిక్తో పరిచయం ఉంది. గతంలో మా స్కూల్లో పనిచేసేవాడు. స్కూల్ నుంచి తీసేసారని తన అకాడమీకి రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అక్కడే అమ్మకి పరిచయం అయ్యాడు. మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది. ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ నాకు భయంగా ఉంది. సాధిక్కి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి’అని ఆవేదన వ్యక్తం చేశాడు. 👉ఇదీ చదవండి: బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు: లేఖలో సౌజన్య -
సాదిక్ ఖాన్ గురించి కీలక విషయాలు బయటపెట్టిన పోలీస్
-
ఏఈ నూకరాజు కేసులో నిజానిజాలు తేలాల్సి ఉంది.. సాధిక్ ఖాన్ అరెస్టుపై ఎస్పీ
కాకినాడ: ఏపీలో సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు.ఈ నెల 16న ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన అనంతరం నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తనను కనిపెట్టకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్ వాడటం పూర్తిగా పక్కనబెట్టాడు.ఈ క్రమంలోనే అతను ఐదు రాష్ట్రాల వ్యాప్తంగా పరారీలో ఉన్నాడని, చివరకు నిఘా వర్గాల సాయంతో మీరట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వివరించారు. మృతుడు నూకరాజు రాసిన సూసైడ్ నోట్‌తో పాటు ఆయన భార్య సౌజన్య రాసిన లేఖ ఆధారంగా సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సౌజన్య తన లేఖలో సాధిక్ ఖాన్ గురించి స్పష్టంగా ప్రస్తావించిందని పేర్కొన్నారు. సౌజన్య, సాధిక్ ఖాన్ కొంతకాలంగా కలిసే ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే నూకరాజు మృతిపై కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం సాధిక్ ఖాన్‌ను కాకినాడ తరలిస్తున్నామని, ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉన్నందున నిందితుడిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. -
చిచ్చర పిడుగా.. బిత్తర చూపేలరా!
కాకినాడ: ఒక్క బిడ్డ బిడ్డా కాదు.. ఓ కన్ను కన్నూ కాదు అంటారు పెద్దలు. సరి ఈడు.. సరిజోడు.. సహాధ్యాయుల సావాసం ఓ వ్యక్తి ఉన్నతికి జిజ్ఞాసకు తోడ్పడుతుంది. పాఠశాల వ్యవస్థ ఏర్పాటుకు ఈ లక్ష్యమే ప్రాణం. ఆ లక్ష్యానికి భిన్నంగా మాట్లాడడానికి, భావ వ్యక్తీకరణకు మరొక జోడు లేకుండా రోజుల తరబడి సాగుతున్న ఆ చిన్నారి ప్రయాణం ఇంకెన్నాళ్లు సాగాలో.. గోగన్నమఠం ప్రాథమిక పాఠశాల నేటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆటపాటలతో సందడిగా ఉండే పాఠశాలో నేడు ఒకే ఒక్క విద్యార్థి జి.సుదీర్ మిగిలాడు. ఆ చిన్నారికి చదువు చెప్పడానికి ఓ హెచ్ఎం.. వండి పెట్టడానికి ఓ ఆయా. ఇదీ ఆ పాఠశాల సంక్షిప్త స్వరూపం. ఇటీవలి వరకూ మరో విద్యార్థి కూడా ఉండేవాడు. అతడు కొన్నాళ్ల కిందట మరో పాఠశాలకు వెళ్లిపోవడంతో సుధీర్ ఒక్కడే మిగిలిపోయాడు. పాఠశాల బెంచ్‌పై ఒక్కడే కూర్చుండగా హెచ్ఎం తనకు తోచిన నాలుగు ముక్కలు వల్లె వేస్తూ రోజును గడిపేస్తున్నారు. -
మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) -
జుట్లు పట్టుకుని కొట్టుకున్న నర్సింగ్ అమ్మాయిలు
కాకినాడ రూరల్: తమ నర్సింగ్ విద్యార్థులు కాకినాడలో దాడులకు గురవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న మణిపూర్, అసోం, నాగాలాండ్ ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కాకినాడలో నర్సింగ్ విద్యార్థునుల వివాదం, కొట్లాటల వ్యవహారంలో పరువు పోతోందని భావించి, ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరిస్థితి సద్దుమణిగిందని కాకినాడ జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే, పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పులానే ఉండటంతో నర్సింగ్ కళాశాల ప్రాంగణాన్ని పోలీసుల సాయంతో అధికారులు తమ ఆ«దీనంలోనే ఉంచుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) విష్ణువర్ధన్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాగా, ఈ వివాదం, కొట్లాట తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థునుల మధ్య దూరాన్ని పెంచింది. కాకినాడ వైద్యనగర్‌లోని ఎస్కే నర్సింగ్ ఆఫ్ కాలేజ్, ఆర్కే స్కూల్ ఆఫ్ నర్సింగ్ పేరిట పక్క పక్క భవనాలతో పాటు మరో రెండు సంస్థల పేరిట ఎదురుగా ఉన్న భవనాల్లో నర్సింగ్ విద్య బోధిస్తున్నారు. వీటిల్లో నాలుగేళ్ల జీఎన్ఎం, మూడేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులు బోధిస్తున్నారు. మణిపూర్, అసోం, నాగాలాండ్‌కు చెందిన 31 మందితో పాటు తెలుగు విద్యార్థునులు కలిపి సుమారు 400 మంది ఇక్కడ చదువుతున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మణిపూర్‌కు చెందిన విద్యార్థుని సెల్‌ఫోన్ చార్జింగ్‌లో ఉంచగా, అది కనిపించలేదు. దీనిపై ఆ విద్యార్థిని, మరికొందరు విద్యార్థునులు తోటి తెలుగు విద్యార్థునులను అడిగారు. దీనికి సరైన సమాధానం రాకపోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తెలుగు, ఉత్తరాదిగా విద్యార్థునులు భాష, ప్రాంతాల ప్రాతిపాదికన విడిపోయి పిడిగుద్దులతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఆరుగురు పోలీసులు వచ్చినా వారిని నివారించలేక చేతులెత్తేశారు. కొందరు తెలుగు విద్యార్థునుల చేతిలో కర్రలు పట్టుకుని ఉన్న దృశ్యాలను మణిపూర్ విద్యార్థునులు తమ ఫోన్లలో చిత్రీకరించి, వాటిని తమ కుటుంబ సభ్యులకు, ఆయా రాష్ట్రాల్లోని సోషల్ మీడియాకు పోస్టు చేశారు. దీంతో, అక్కడి వారిలో ఆందోళన మొదలైంది. తమ విద్యార్థులకు భద్రత కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడంతో మన రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అధికారుల పరిశీలన కాకినాడ కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బింధుమాధవ్లు ఆదివారం ఉదయమే నర్సింగ్ కళాశాల, స్కూల్‌ను సందర్శించారు. మణిపూర్ విద్యార్థునుల భద్రతపై నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. రక్షణ నిమిత్తం వారిని వేరే భవనానికి తరలించారు. సర్పవరం సీఐ ప్రకాష్ నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ విషయమై విద్యార్థినుల మధ్య వివాదం తలెత్తిందని, మరే ఇతర కారణాలూ లేవని, ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగిందని కలెక్టర్, ఎస్పీ మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని వెల్లడించారు. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన మరోవైపు ఏపీ నర్స్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ (ఏపీఎన్‌ఎంసీ) రిజి్రస్టార్ కె.సుశీల కాకినాడలోని నర్సింగ్ స్కూల్, కళాశాల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నర్సింగ్ కళాశాలల నిర్వహణపై తమకు పది రోజుల క్రితమే ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపి, ఈ నెల 25లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేశామని చెప్పారు. నర్సింగ్ స్కూల్, కళాశాలలు నాలుగు పేర్లతో ఒకేచోట వేర్వేరు భవనాల్లో నిర్వహిస్తున్నారని, నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు.రెండు స్కూళ్లు, నాలుగు కళాశాలల పేరిట ఒకే భవనంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థుల బాధలు తెలుసుకున్నానని, ఇక్కడ దుర్భర పరిస్థితులున్నాయని చెప్పారు. ఒకవేళ ఆయా సంస్థల గుర్తింపు రద్దయితే ఇక్కడి విద్యార్థులకు వేరేచోటకు పంపుతామని తెలిపారు. ఈ నర్సింగ్ కళాశాలకు ఐఎన్‌సీ సరి్టఫికెట్ లేదన్నారు. సర్పవరం, కొవ్వూరు, ఎస్.అచ్యుతాపురం, విద్యుత్ నగర్ చిరునామాలతో వేర్వేరు సొసైటీలతో అనుమతులున్నప్పటికీ అన్నింటినీ వైద్యనగర్లోనే కొనసాగిస్తున్నారని వివరించారు. నర్సింగ్కు ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అవసరమని, కానీ విద్యార్థులకు ఎక్కడకూ పంపించడం లేదని చెప్పారు. ఈ విద్యా సంస్థల డైరెక్టర్లు విజయలక్ష్మి, సుశీల మీడియాతో మాట్లాడుతూ, తమ సోదరుడు ఎంతో సేవాభావంతో ఈ సంస్థలను స్థాపించారని, ఆ దంపతుల మరణాంతరం తాము పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇక్కడ చదువుకునేందుకు మణిపూర్ విద్యారి్థనులు 30 ఏళ్లుగా వస్తున్నారని, ఇదే చివరి బ్యాచ్ అని తెలిపారు. -
కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు
-
కాకినాడ SK నర్సింగ్ కాలేజీలో ఉద్రిక్తత
-
దేశం దాటేయాలని ప్లాన్.. చిన్న క్లూతో దొరికిపోయిన సాదిక్ ఖాన్
-
ఒక్కరోజు గడిస్తే దేశం దాటేవాడు.. ఫోన్, కార్డులు లేకుండా నాలుగు రాష్ట్రాల్లో..
సాక్షి, కాకినాడ: నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన అనంతరం పరారీలో ఉన్న సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సాధిక్ పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. తన ఆచూకీ బయటపడకుండా సెల్‌ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు వెంట తీసుకెళ్లకుండా.. రైలు ప్రయాణంలో ఇతరుల ఫోన్లు ఉపయోగిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.ఆత్మహత్య తర్వాత పరారీనూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తర్వాత సాధిక్ ఖాన్ సామర్లకోట నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. వాడి నుంచి తదుపరి తన ప్రయాణాన్ని కొనసాగించిన సాధిక్.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడిని కలిసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అనంతరం, సోలాపూర్‌లో కొంతసేపు మకాం వేసిన అనంతరం సాధిక్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడి నుంచి ఢిల్లీకి, ఆపై ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాధిక్ వరుసగా ప్రాంతాలు మార్చుకుంటూ ప్రయాణించడంతో అతడి ఆచూకీ గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్..మీరట్ చేరుకున్న తర్వాత కూడా సాధిక్ అక్కడే ఉండిపోవాలని భావించలేదని పోలీసులు గుర్తించారు. కేరళలోని మలబార్ తీరానికి చేరుకుని, అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఒక్కరోజు ఆలస్యమైనా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించేలా తన ప్రయాణాన్ని సాధిక్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేరళ తీరానికి చేరుకుని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు వెళ్లిపోతే పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే థామన్ ఆసుపత్రితో యువతి ఆత్మహత్యఇక, పోలీసులకు తన కదలికలపై ఎలాంటి ఆధారం దొరకకుండా ఉండేందుకు సాధిక్ మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన వెంట సెల్‌ఫోన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను తీసుకెళ్లలేదు. సాధారణంగా సెల్‌ఫోన్ ద్వారా వ్యక్తి ప్రయాణించే ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకు కార్డుల వినియోగం ద్వారా కూడా అతడి కదలికలను పోలీసులు గుర్తించే అవకాశం ఉంది. దీంతో ఈ రెండింటినీ తన వెంట తీసుకెళ్లకుండా సాధిక్ ప్రయాణించినట్లు తెలిసింది. అయితే, ఇదే జాగ్రత్త చివరకు అతడికి చిక్కేలా చేసిన కీలక క్లూగా మారింది. రైలు ప్రయాణ సమయంలో సాధిక్ తోటి ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ తీసుకుని తన సోదరి, ఓ లాయర్‌తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత ఫోన్ ఉపయోగించకపోయినా.. ఇతరుల ఫోన్ల నుంచి చేసిన కాల్స్ అతడి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులకు కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. ఆ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు సాధిక్ కదలికలపై నిఘా పెట్టారు. చివరకు అతడు మీరట్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.మీరట్ కోర్టులో హాజరు..మీరట్‌లో సాధిక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన పోలీసులు అతడిని కాకినాడకు తీసుకువస్తున్నారు. కాకినాడకు తీసుకువచ్చిన తర్వాత సాధిక్‌ను విచారించడంతో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాధిక్‌ను కాకినాడకు తీసుకువచ్చిన అనంతరం అతడి ప్రయాణ మార్గం, ఎవరెవరిని కలిశాడు, కేరళలో ఎవరిని సంప్రదించాలనుకున్నాడు, సముద్ర మార్గంలో విదేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. -
పోలీసుల అదుపులో సాధిక్ ఖాన్
-
ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు.. ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్
సాక్షి, కాకినాడ: రాజమండ్రిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్‌ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, సాధిక్ ఖాన్ కోసం గత ఐదు రోజులుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మొత్తం ఎనిమిది పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో అతడి కోసం గాలించినట్లు తెలుస్తోంది. చివరకు ఢిల్లీలో సాధిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అతడిని రేపు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు లేదా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన జరిగిన అనంతరం సాధిక్ కాకినాడ నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే సాధిక్ ఓ లాయర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ కారణమయ్యాడనే ఆరోపణలపై రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఇదిలా ఉండగా నూకరాజు అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతికి సాధిక్ కారణమని ఆయన భార్య సౌజన్య లేఖ రాయడం తెలిసిందే. జగదీశ్వర రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో సాధిక్‌పై హత్య కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం సాధిక్ ఖాన్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాధిక్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నూకరాజు ఆత్మహత్యలో సౌజన్య లేఖ ఇదే.. -
నా భర్తను చంపేశాడు!
పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్ ఖాన్.. తన కుటుంబానికి సహాయం చేస్తున్నట్టుగా నటించి, తమను హింసించాడని, తన భర్తను హత్య చేశాడని, తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడంటూ నూకరాజు కుమార్తె రాసినట్లు చెబుతున్న లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో, ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేక నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డి కలసి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద నుంచి ఆదివారం రాత్రి గోదావరి నదిలో దూకిన విషయం తెలిసిందే. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం సోమవారం రాత్రి లభ్యం కాగా.. మీనా, సౌజన్యల ఆచూకీ మంగళవారం సాయంత్రానికి కూడా లభించలేదు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో కార్తికేయరెడ్డి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. సాధిక్ ఖాన్‌పై మరో ఫిర్యాదు తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేందుకు సాధిక్ ఖాన్ కారణమంటూ నూకరాజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాధిక్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అతడిపై తాజాగా హత్య కేసు కూడా నమోదైంది. తన కుమారుడు జగదీశ్వరరెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి, హత్య చేశాడంటూ నూకరాజు వియ్యంకుడు, సౌజన్య మామ భాస్కరరెడ్డి మంగళవారం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సాధిక్ ఖాన్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరరెడ్డి హత్యలో ఉన్న మరో వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపట్టారు. ‘నన్ను బెదిరించాడు’ నూకరాజు మనవడు కార్తికేయరెడ్డితో పాటు తన కోడలు సౌజన్య స్కూటీలో ఆధారాలున్నాయంటూ భాస్కరరెడ్డి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఆమె స్కూటీని తనిఖీ చేసి మూడు కవర్లను గుర్తించారు. వాటిలో తన భర్త జగదీశ్వరరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. సాధిక్ ఖాన్ తనను బెదిరించి, తన ఆస్తిని, ఫోన్, ఏటీఎం కార్డులు, బ్యాంకు లాకరు వివరాలన్నీ తీసుకున్నాడని, చివరకు తన భర్తను పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని, మాట వినకపోతే తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడని సౌజన్య ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అతడి బెదిరింపులు, వేధింపులు భరించలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.చనిపోవాలని ముందే నిర్ణయం!కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన కారు డ్రైవర్ రాజును రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, పలు ఆధారాలు సేకరించారు. సాధిక్ ఖాన్ వేధింపులు అధికం కావడంతో తాళలేక చనిపోవాలని నూకరాజు కుటుంబం ముందే నిర్ణయించుకుందని, దీనికి ఆదివారం ఉదయం ప్లాన్ వేసుకుందని సమాచారం. ఈ క్రమంలో కారు డ్రైవర్ రాజును ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి రావాలని నూకరాజు చెప్పారు. ఆలోగా ఆస్తిపత్రాలన్నీ తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. ఇంటికి వచ్చిన డ్రైవర్ రాజుకు ఆస్తి డాక్యుమెంట్లు ఇచ్చి, తమ సమీప బంధువు మహేష్‌కు ఇవ్వాలని పంపించారు.డ్రైవర్ ఆ పని పూర్తి చేసుకుని వచ్చిన తరువాత ఆదివారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్నారు. డ్రైవర్ రాజు ద్వారా రాజమండ్రి రైల్వే స్టేషన్లో టిఫిన్లు తెప్పించుకున్నారు. అనంతరం, కారులో కొవ్వూరు చేరుకుని, డ్రైవర్ రాజుకు కొంత డబ్బులు ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పారు. ఆ తర్వాత నూకరాజు కుమార్తె సౌజన్య కారు నడుపుతూండగా.. గంటకు పైగా కొవ్వూరు, రోడ్డు కం రైల్వే బ్రిడ్జి సమీపంలో తిరిగారు. సరిగ్గా 88వ నంబర్ పిల్లర్ వద్దకు వచ్చి, కారు దిగి, గోదావరిలో దూకేశారు. నూకరాజు మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఏమీ తెలియదా.. గుడ్.. వెరీగుడ్!
సాక్షి, అమరావతి: కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్ని, కోర్టునే తప్పుదోవ పట్టించిన వ్యవహా రంలో సోమవారం హైకోర్టులో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. తనతో పాటు తన భర్త, ఇతరులపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌పై సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.ఈ సందర్భంగా సింగిల్ జడ్జి హరినాథ్ వద్ద ఉన్న వ్యాజ్యం గురించి ప్రశ్నించింది. ప్రణతి తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు తెలియదని, అందులో తాము పార్టీ కాదని చెప్పారు. ‘తెలియదు అని చెప్పేస్తే సరిపోదు. తమ ముందున్న ప్రణతి అప్పీల్‌తో ముడిపడి ఉన్న వ్యాజ్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని ధర్మాసనం ఈ సందర్భంగా గట్టిగా చెప్పింది. దీంతో ఆ వ్యాజ్యం విచారణ గురించి తెలుసుకుంటామని ఆదినారాయణరావు చెప్పారు.అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ఆగస్టు 3న సింగిల్ జడ్జి హరినాథ్ ఇచ్చిన ఉత్తర్వులు (మీపై నమ్మకంలేదంటూ ప్రణతి భర్త రాహుల్ చౌదరి దాఖలు చేసిన మెమోపై ఇచ్చిన ఉత్తర్వులు) గురించి తెలుసా? అని ప్రణతి తరఫు ఆన్ రికార్డ్ న్యాయవాది నిరంజన్బాబును ప్రశ్నించింది. తమకు తెలీదని చెప్పగానే, ధర్మాసనం ‘గుడ్.. వెరీ గుడ్’ అంటూ అసహనం వ్యక్తం చేసి విచారణను వాయిదా వేసింది.ప్రణతి అఫిడవిట్‌ను ఆమోదించొద్దుఅంతక్రితం ప్రణతి తరఫున సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు సింగిల్ జడ్జిపై తాము చేసిన ఆరోపణలను తొలగిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ సమయంలో జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం న్యాయవాది చల్లా వెంకట్ స్పందిస్తూ, ఈ అఫిడవిట్‌ను ఆమోదించకూడదన్నారు. ఇదే రీతిలో తెలంగాణ హైకోర్టు జడ్జిపై పెద్దిరాజు అనే వ్యక్తి పలు ఆరోపణలు చేశారని, తరువాత ఆ ఆరోపణలను ఉపసంహరించుకుంటూ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రణతి దాఖలు చేసిన అఫిడవిట్‌పై అభ్యంతరం ఉంటే కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేస్తానని వెంకట్ చెప్పారు.జస్టిస్ హరినాథ్‌పై ప్రణతి భర్త ఆరోపణలుఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన సింగిల్ జడ్జి జస్టిస్ హరినాథ్‌పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి పలు ఆరోపణలు చేయగా, ఆమె భర్త, న్యాయవాది రాహుల్ చౌదరి సైతం పిటిషనర్ల తరఫున ఆరోపణలు చేశారు. కాకినాడ భూ వివాదంపై ఏసీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మీపై మాకు నమ్మకం లేదని జస్టిస్ హరినాథ్‌పై రాహుల్ చౌదరి ఆరోపణ చేశారు. సీజే ధర్మాసనం ముందు అప్పీల్ (ఎస్‌జీపీ ప్రణతి దాఖలు చేసింది) తేలేంత వరకు తమ వ్యాజ్యంపై విచారణ జరపవద్దని కూడా ఆయన కోరారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాలతో మెమో దాఖలు చేయాలని రాహుల్ చౌదరిని ఆదేశించారు.దీంతో రాహుల్ ఇటీవల ఓ మెమో దాఖలు చేశారు. దానిని పరిశీలించిన జస్టిస్ హరినాథ్ విచారణ నుంచి తప్పుకోవడానికి, విచారణను వాయిదా వేయడానికి నిరాకరించారు. విచారణను వాయిదా వేయడానికి గానీ, కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి పిటిషనర్లు చేసిన అభ్యర్థనలు ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోదగ్గవి కావన్నారు. మీపై నమ్మకం లేదంటూ రాహుల్ బహిరంగంగా ఆరోపణ చేసిన నేపథ్యంలో, ఆ రోజున జరిగిన విచారణ తాలుకు రికార్డింగ్‌లను డౌన్లోడ్ చేసి జాగ్రత్త చేయాలని రిజిస్ట్రార్ (ఐటీ)ని న్యాయమూర్తి ఆదేశించారు. తనపై నమ్మకం లేదని రాహుల్ చౌదరి మెమో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా తగిన సూచనల నిమిత్తం ఈ కేసును ప్రధానన్యాయమూర్తి ముందు ఉంచాలని ఆదేశించారు. -
పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారు.. ఇక్కడ ఎందుకు ఇవ్వరు?
కాకినాడ: స్టైఫండ్ పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (GGH)లో జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూడాలు నిరసన కొనసాగిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అధిక స్టైఫండ్ చెల్లిస్తున్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా ఇతర రాష్ట్రాలతో సమానంగా స్టైఫండ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కాకినాడ GGHలో జూనియర్ డాక్టర్లు నాన్ ఎమర్జెన్సీ విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అయితే ఆస్పత్రి ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో జూడాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. దీంతో ఆస్పత్రిలో నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
తమ చిన్నారి తిరిగి వస్తుందేమోననే ఆశతో..
కాకినాడ: 65 రోజుల కిందట కాకినాడ జిల్లాలోని సీహెచ్ అగ్రహారంలో ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లి దండ్రులు నేటికి ఎదురుచూస్తూనే ఉన్నారు. తమ కూతురు ఎలా తప్పిపోయిందో అలానే ఇంటికి తిరిగి వచ్చేస్తే బాగుండు అనుకుంటూ కోటి ఆశలతో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు తమ కుమార్తెను ఎవరో వెంట తీసుకు వెళ్లిపోయారనే అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి భవాని.. కూతురి ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటోంది. చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటికి కొత్తగా వచ్చిన అతిధిఅయితే వారి ఇంటికి ఓ అతిథి కొత్తగా వచ్చింది. జ్ఞానేశ్వరి తో పాటుగా వెంట వెళ్ళి మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చి కుక్క చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తమ కూతురు జ్ఞాపకాల నుంచి ఉపశమనం పొందడానికి మరో కుక్కను తెచ్చుకున్నారు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు. *జ్ఞానేశ్వరి ముద్దు పేరైనా "జాను" పేరును కుక్క కు పెట్టారు చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు భవానీ, గణేష్‌లు.కాగా, కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో ఈ ఏడాది జూన్ 6వ తేదీన అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదా బలమైన క్లూ లభించలేదు. -
YSRCP శిబిరాన్ని తొలగించిన కూటమి
-
50కి చేరిన కోవిడ్ కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50కు చేరుకుంది. మంగళవారం కాకినాడ జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ప్రస్తుతం 32 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 25 మంది బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఏడుగురు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు వైరస్ బారినపడ్డ నలుగురు బాధితులు మృత్యువాతపడ్డారు. మరో 14 మంది కోలుకున్నారు. -
కీచకుడిపై చట్టపరమైన చర్యలు
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు. మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్‌కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు! -
తాత వారసత్వం.. అమెరికాలో మెరిసిన మనవడు కార్తీక్!
తల్లిదండ్రులు పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన తాతయ్య పద్మనాభానికి క్రీడలంటే ఎంతో మక్కువ. జిల్లాలో సీనియర్ క్రీడాకారుడిగా, ఒలింపిక్ సంఘ కార్యదర్శిగా క్రీడారంగానికి ఎనలేని సేవలు అందించారు. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనుమడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో క్రీడలపరంగా గుర్తింపు తెచ్చుకుని తండ్రి పురిటి గడ్డ కీర్తిని ప్రవాసాంధ్రుడిగా రెపరెపలాడిస్తున్నారు. అమెరికా నుంచి కాకినాడకు ఇటీవల వచ్చిన కార్తీక్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా.. కాకినాడకు చెందిన కె.పద్మనాభం, యమునలకు జన్మించిన సంతానం రామకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పద్మజతో వివాహం జరిగింది. రామకృష్ణ, పద్మజలకు 2005లో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం జన్మించాడు. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ పెంచుకోవడంతో అమెరికాలో తల్లిదండ్రులు స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇప్పించారు. అనతి కాలంలోనే స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్‌లో ప్రావీణ్యం సంపాదించి శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రానికి కార్తీక్ ప్రాతినిధ్యం వహించి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. పదేళ్ల వయసులో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అమెరికాలో స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న కృష్ణస్వామి కార్తీక్ బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్‌తో పాటు టెన్నిస్‌లో కూడా క్రీడా ఓనమాలు కాకినాడలోనే కార్తీక్ నేర్చుకున్నాడు. అమెరికాలో 9 నుంచి 12వ తరగతి వరకు మేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెయింట్ లూయిస్ కంట్రీ డే స్కూల్లో చదవి అక్కడే బాస్కెట్‌బాల్ మెరుగైన శిక్షణను కోచ్ ట్రవీస్ వ్యాలీస్ వద్ద తీసుకున్నాడు. తొలిసారి కార్తీక్ సారథ్యంలో ఇంటర్ స్కూల్ స్టేట్ పోటీల్లో చాంపియన్ షిప్‌ను సాధించారు. తాతయ్య జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కావడం, మనవడు క్రీడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రీడల్లో రాణిస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎంఎస్సీ కర్రి పద్మశ్రీ, రెడ్‌క్రాస్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు వైడీ రామారావులు ఇటీవల కార్తీక్‌ను అభినందించారు. నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ) -
కాటేసిన తాచుపాముపై శునకం ప్రతీకారం..!
కాకినాడ: ఓ ఇంటి ఆవరణలోకి చొరబడిన తాచుపామును ఓ శునకం వెంటాడి చంపింది. కొత్తపల్లిలో ఉల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నారు. తన ఇంటి ఆవరణలోకి శనివారం గోధుమ రంగు తాచుపాము ప్రవేశించింది. దీనిని వారి పెంపుడు శునకం పసిగట్టింది. ఇంటి ఆవరణ నుంచి లోపలకు వెళుతున్న ఆ పామును శునకం బెదిరించేందుకు ప్రయత్నించగా, పాము తిరగబడి శునకం మూతిపై కాటు వేసింది. కాటువేసిన కోపంలో శునకం పామును వెంటాడి హతమార్చింది. శునకం నీరసంగా ఉండటంతో శ్రీనివాస్, అతని సోదరుడు సురేష్‌లు కాకినాడకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. -
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
-
చేసిన అవమానం చాలు.. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు.. ముద్రగడ ఫ్యామిలీ
-
ముద్రగడ ఇంటి వద్ద భారీగా తరలివచ్చిన అభిమానులు..
-
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
సాక్షి, కాకినాడ: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ (జులై 14) హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మరణవార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన ప్రాథమిక పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మున్సుబ్‌గా పని చేయగా, తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలంగా ఉండేవారు. వీర రాఘవరావు 1962, 1967 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని నిరుపేదలు, దళితులకు ఆయన అత్యంత అభిమాన నాయకుడిగా నిలిచారు.మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ముద్రగడ వీర రాఘవరావు అత్యంత ఆప్తుడు. 1977లో వీర రాఘవరావు మరణించిన తర్వాత, నీలం సంజీవరెడ్డి సూచన మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిరుపేదలు, గిరిజనులు, బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రి రూపాన్ని చూసుకుని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1978, 1983, 1985, 1989 శాసనసభ ఎన్నికలలో వరుసగా నాలుగు సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా కూడా దేశ రాజధానిలో అడుగుపెట్టారు. రాజకీయ పదవుల కంటే కూడా కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన జీవిత కాలంలో ఏకంగా ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు.2016లో తుని వేదికగా ఆయన నేతృత్వంలో నిర్వహించిన 'కాపు ఐక్య గర్జన' సభ అక్కడ జరిగిన రైల్వే ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఊపేసింది. ఈ ఘటనతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. తద్వారా కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారు. -
జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం ఒడిశా వైపు అనుమానాలు !
-
ప్రశ్న రావణీని కోర్టుకు తీసుకెళ్తుండగా జనసైనికుల ఓవర్ యాక్షన్
-
పోలీస్ వాహనంలో రావణ్ తరలింపు.. కోడిగుడ్లతో జనసేన శ్రేణుల దాడి!
సాక్షి,కాకినాడ: స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని జనసేన శ్రేణులు ఒక్కసారిగా అడ్డుకున్నారు.పోలీసుల వాహనం ముందుకు కదలకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆగ్రహంతో ఆ వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
‘రావణ్‌కు ఏం జరిగినా పవన్‌దే బాధ్యత’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రశ్న రావణ్‌కు పిఠాపురం మెజిస్ట్రేట్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఆయనను పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకుని పిఠాపురం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ..‘రావణ్ కేసులో న్యాయం గెలిచిన రోజు ఇది. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదని భావించిన మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్‌పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదు. ఇది వ్యక్తిగత ప్రాథమిక హక్కులను హరించడమేనని అవుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజు నా బాడీ షేమింగ్ చేస్తూ అహేళనగా మాట్లాడారు.. దానికి చట్టం లేదు?. కాళ్లకు కాళ్ళు.. కీళ్లకు కీళ్లు విరగొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది రాజ్యాంగబద్దమా?.పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే న్యాయబద్దమా? వాటిమీద కేసులు ఉండవా?. రఘురామ కృష్ణంరాజుకు రాజకీయ సమాధి కడతానంటే తప్పా? నా మీద కేసు కడతారా?. మీ కేసులకు భయపడేది లేదు. టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తుంది. మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడటం ఖాయం. రావణ్ కోసం మళ్ళీ రేపు కోర్టులో వాదనలు వినిపిస్తా. రావణ్‌కు ఏం జరిగినా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి. సోషల్ మీడియా కేసుల్లో ముందుగా టీడీపీ, జనసేన నేతలను కంట్రోల్ చెయ్యమని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకంటే ముందు పిఠాపురం పోలీసులకు షాక్ తగిలింది. ప్రశ్న రావణ్ రిమాండ్‌ను మెజిస్ట్రేట్ రిజెక్ట్ చేశారు. దీంతో, వ్యక్తిగత పూచికతుపై రావణ్ విడుదలయ్యారు. ఈ క్రమంలో రావణ్ తరపున వాదనలు జడ శ్రవణ్ కుమార్ వినిపించారు. అనంతరం, విడుదలైన వెంటనే పోలీసులు.. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
రైలు పట్టాలపై పడుకుని.. క్షణాల్లో మారిన పరిస్థితి!
-
కుక్క పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది? బయటపడిన నిజాలు
-
జానూ కేసులో ట్విస్ట్‌కి తెర!
కాకినాడ: తుని చిన్నారి జానేశ్వరి మిస్సింగ్ కేసులో ఓ ఉత్కంఠకు తెర పడింది. కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మరణించగా.. ఇంతకాలం దాని పోస్టుమార్టం నివేదిక బయటకు రాకపోవడంపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ నివేదిక ఇప్పుడు వెలువడినట్లు తెలుస్తోంది. అందులో పెంపుడు కుక్క మృతికి స్పష్టమైన కారణం వెల్లడించారు నిపుణులు. ఆహారం తీసుకోకపోవడం.. అనారోగ్యం వల్లే అది చనిపోయినట్లు నిర్దారించారు.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో జూన్ 6న రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి.ఈ క్రమంలో చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క.. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత అది విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దానికి జీపీఎస్ ట్రాకర్ కట్టి చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి దగ్గర పోలీసుల హడావిడి చూసి అది బెదిరి పారిపోయింది. డ్యాగ్‌క్యాచర్ సాయంతో దానిని బంధించి.. ఇంటి ఆవరణలో ఓ బోనులో బంధించారు. ఆ సమయంలో.. బిడ్డ కోసం జానూ తల్లి ఆ కుక్కను బతిమాలడం స్థానికులను కలిచి వేసింది. వెటర్నరీ డాక్టర్ల సహాయంతో దానికి చికిత్స అందించగా.. కాస్త కోలుకున్నాక 13వ తేదీన మళ్లీ జీపీఎస్ ట్రాకర్‌తో దానిని వదిలారు. సుమారు 8 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చిన కుక్క.. కొన్ని గంటలకే మరణించింది. ఆ మరుసటిరోజు దానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ వెంటనే.. గ్రామంలోని ఓ ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆ పెంపుడు కుక్క అటు ఇటు తిరిగిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో.. కుక్క మృతికి బలమైన కారణం ఏదో ఉండొచ్చని భావించారు. కుక్కపై విషప్రయోగం జరిగిందా? జంతువులేమైనా దాడి చేశాయా? అనే అనుమానాల నడుమ.. దాని శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. విశాఖపట్నంలోని ల్యాబ్‌లో టెస్టులు ఆలస్యం అయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిపుణుల ప్రకారం, కుక్క శరీరంలో ఎలాంటి బాహ్య గాయాలు, దాడి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు లేవని స్పష్టమైంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏర్పడిన అనారోగ్యం కారణంగానే కుక్క మృతి చెందినట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా చిన్నారిపై బెంగతోనే అది మరణించి ఉంటుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నిర్ధారణతో కుక్క మృతిపై ఉన్న అనుమానాలు తగ్గినప్పటికీ.. చిన్నారి జానూ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలకమైన ఒక కోణానికి స్పష్టత లభించింది. అయితే కేసులో ప్రధాన ప్రశ్న అయిన చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. 20 రోజులు గడిచినా ఆచూకీ లేకపోవడంతో.. పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ఆపేశారు. అయితే కిడ్నాప్ కోణంలో మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తుని పోలీసులు వెల్లడించారు. -
చిన్నారి జాను కేసులో మరో ట్విస్ట్..! తలలు పట్టుకున్న పోలిసులు
-
అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం!
సాక్షి, కాకినాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు ఫలితం ఇవ్వలేదని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు.ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువలు, అటవీ ప్రాంతాలు, గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించినప్పటికీ చిన్నారి జాడ దొరకలేదు. దీంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గాలింపు ఆగిపోవడంతో జానూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి ఆచూకీపై ఇంకా ఆశలు పెట్టుకున్న కుటుంబం ఈ నిర్ణయంతో కన్నీరుమున్నీరవుతోంది. అయితే..అయితే కేసు సాధారణ మిస్సింగ్‌గా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా కొనసాగుతోంది. తుని రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారిస్తూ కాల్‌డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఆధారాల ఆధారంగా కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.ఇదే సమయంలో చిన్నారి ఇంట్లో పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా అందకపోవడం కూడా విచారణలో కీలకంగా మారింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి ఉందా? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు! ఎప్పుడు ఏం జరిగిందంటే..జూన్ 6, 2026కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారి తండ్రి పనిచేస్తున్న పామాయిల్ తోట ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది.జూన్ 7–9తుని రూరల్ పోలీసులు, స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు ప్రారంభించారు. కాలువలు, తోటలు, సమీప కొండ ప్రాంతాలు, పొదల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.జూన్ 10కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.జూన్ 11–12చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుటుంబ పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కుక్క ప్రవర్తన అసాధారణంగా ఉండటంతో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.జూన్ 12హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కుక్కకు GPS ట్రాకర్ కాలర్ అమర్చింది. కుక్క వెళ్లే మార్గాల ఆధారంగా చిన్నారి జాడ దొరకవచ్చని భావించారు. జూన్ 13కుక్కను ట్రాక్ చేస్తుండగా అది సుమారు 8 కిలోమీటర్లు పరిగెత్తినట్లు గుర్తించారు. అదే సమయంలో కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. కుక్క మృతితో కేసులో కొత్త మిస్టరీ ఏర్పడింది.జూన్ 14ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. థర్మల్ డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, ప్రత్యేక సెర్చ్ టీమ్స్‌తో గాలించాయి. హనుమాన్ టీమ్ సహా ప్రత్యేక నిపుణుల బృందాలు కూడా సహకరించాయి.జూన్ 15–19జానూ కనిపించకుండాపోయి.. పదిరోజులైనా ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. పోలీసులు CCTV ఫుటేజ్‌లు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ డంప్ డేటా విశ్లేషించడం ప్రారంభించారు. అపహరణ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పోలీసులు కోరారు. జూన్ 20–23గాలింపు మరింత విస్తరించినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. కేసు పురోగతిపై ప్రజా ఆందోళన పెరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు మరింత దర్యాప్తు కోరారు.జూన్ 24 కేసుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అనే అంశంపై కూడా వివరణ కోరింది. జూన్ 25.. దాదాపు 20 రోజుల గాలింపు తర్వాత ప్రత్యక్ష సెర్చ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే కిడ్నాప్ యాంగిల్లో మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, కుక్క పోస్టుమార్టం నివేదిక(ఇంకా రాలేదు) తదితర అంశాలపై పోలీసులు ఇంకా పరిశీలన చేస్తున్నారు.జ్ఞానేశ్వరి చివరిసారిగా ఎక్కడ కనిపించింది?పెంపుడు కుక్క నాలుగు రోజుల తర్వాత ఎలా తిరిగి వచ్చింది?కుక్క మరణానికి అసలు కారణం ఏమిటి?ఇది ప్రమాదమా? అపహరణా? లేక మరో కోణం ఉందా?ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ తర్వాత కూడా చిన్నారి జాడ ఎందుకు దొరకలేదు?ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే జానూ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది.ఈ కేసుపై హైకోర్టు కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కూడా కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నా, చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం జానూ సురక్షితంగా తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. -
నోటి దూల తగ్గించుకుంటే మంచిది.. నానాజీపై పవన్ సీరియస్
-
చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పింది. అదృశ్యమైన చిన్నారి ఆచూకీ తెలియజేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఎస్ఓపీ విధానాన్ని అనుసరించారో లేదో కూడా తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.గంగమ్మ లాకప్ డెత్ కేసులో ఆదేశాలుకర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. స్వయంగా జైలుకు వెళ్లి దుర్గప్ప ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చెప్పింది. చికిత్స అవసరమైతే అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. -
దమ్ముంటే నాపై పోటీచేయి నానాజీ.. MLC త్రిమూర్తులు సవాల్
సాక్షి, కాకినాడ: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. తను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానన్నారు. పంతం నానాజీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీచేయాలన్నారు. ఒకవేళ నానాజీపై తాను గనుక ఓడిపోతే రాజకీయల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తాను కూడా నానాజీ కంటే ఎక్కువగా మాట్లాడగలనని కానీ తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచించేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్‌లోనే చెరిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేం. ఫాల్స్ డీఎన్ఏ పెట్టేశారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలు కీలకం. నిర్థారించడానికి కోర్టులు అడిగేవి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని కూడా మన కళ్ల ముందు తెలిసినా సరే మనం ఏమీ చేయలేం’’ అంటూ సుగాలి ప్రీతి కేసు విచారణపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. -
కొత్త మలుపు తిరిగిన చిన్నారి జానూ కేసు!
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎస్.అగ్రహారంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసు కొత్త మలుపు తిరిగింది. అధికారిక బృందాలు దాదాపు రెండు వారాలు సెర్చ్ ఆపరేషన్ పేరిట అణువణువు జల్లెడ పట్టినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో.. పోలీసులు మరో కోణంలో ఈ కేసును దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ.. పెంపుడు కుక్కతో పాటే కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, పోలీసులు, స్థానికులు, ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఇప్పటికీ జానూ ఆచూకీ లభించలేదు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ప్రధానంగా సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ డేటా ఆధారంగా సాగుతున్న విచారణలో తాజాగా ‘కిడ్నాప్ కోణం’పై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా.. ఓ కొత్త సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు చిన్న క్లూగా భావిస్తున్నారు. చిన్నారితో పాటు కనిపించకుండాపోయిన పెంపుడు శునకం అదే రోజు గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద తిరుగుతూ కనిపించింది. మధ్యాహ్నం 1.02 గంటల సమయంలో అది ఆందోళనగా అటు ఇటు సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు.మూడు రోజుల తర్వాత అదే శునకం ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి అది కనిపించన వాళ్ల మీద దాడి చేస్తూ.. విచిత్రంగా ప్రవర్తించసాగింది. వైద్యం తర్వాత అది కోలుకున్నాక జీపీఎస్ ట్రాకర్ కట్టి వదిలినా.. ఫలితం దక్కలేదు. చివరకు.. అది చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. కిడ్నాప్ కోణంలోనూ కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 6 వేలకుపైగా ఫోన్ కాల్స్‌ను విశ్లేషించినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులపై కూడా దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కొండ మీద ఉండే ముఠాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్లు పెట్టిన కరెంట్ ఉచ్చుకి చిన్నారి చిక్కుకుందా? మరేమైనా జరిగి ఉంటుందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరంగా జరుపుతున్నారు. అలాగే.. జిల్లాలో ఇలాంటి కేసుల గత రికార్డులు, అనుమానితుల కదలికలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సంచార జాతులు, వ్యక్తులపై కూడా బృందాలు విచారణ జరుపుతున్నాయి. పిఠాపురం, కోటవురట్ల, దివి పోలవరం ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో క్లూ దక్కుతుందేమోనన్న ఆశతో.. ఏ సీసీటీవీ కెమెరాను వదిలిపెట్టడం లేదు.మరోవైపు శునకం అనారోగ్యంతో మరణించిందని చెబుతున్నా.. శవపంచనామా, పోస్టుమార్టం నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఇన్నిరోజులు గడుస్తున్నా.. ఆ రిపోర్ట్ రాకపోవడంపై స్థానికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అది నిజంగా చనిపోయిందా? ఎవరైనా చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పోలీసులే తేల్చాలంటూ జానూ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ నివేదిక వస్తే కేసులో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ చిన్నారి జానూ కాదు!ఇదిలా ఉంటే.. తుని మార్కెట్ యార్డ్ దగ్గర గుర్తుతెలియని ఓ చిన్నారి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఏడ్చుకుంటూ ఆమె ఓ మహిళ దగ్గరకు వెళ్లగా.. అనుమానంతో ఆమె పోలీసులకు అప్పగించింది. అయితే ఆ చిన్నారి జానూ కాదని పోలీసులు నిర్ధారించారు. ఈ చిన్నారి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక.. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో కొందరు వ్యక్తులు మంత్రాలు, తంత్రాల పేరుతో ఇంటికి వచ్చి తమను అయోమయానికి గురిచేస్తున్నారని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెంపుడు శునకం కదలికల నుంచి మొదలైన అనుమానాలు.. ఇప్పుడు కిడ్నాప్ కోణం వరకు చేరుకున్నాయి. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇంకా చిక్కని మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: పోలీసులే హంతకులైతే..? -
పాప ఎక్కడ ఉందో నాకు తెలుసు జ్యోతిష్యుడు హల్ చల్
-
అమ్మా నీ బిడ్డ.. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడి హల్చల్
సాక్షి, కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఓ జ్యోతిష్కుడు హల్ చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హడావిడి చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, ‘‘పాప భూదేవతలో ఉంది.. త్వరలో తిరిగి వస్తుంది’’ అంటూ చెప్పాడట. అదే సమయంలో.. కుటుంబ సభ్యులను భయపెట్టేలా, అలాగే ఆశ కలిగించేలా మాటలు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గత రెండు రోజులుగా అతను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి. “అమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉంది చెప్పు” అంటూ జ్యోతిష్యుడు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకోకుండా ఇలా భయపెట్టే మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.మరోవైపు, యువతి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతిష్యుడి హావభావాలు, అతని నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక్కసారిగా జ్యోతిష్యుడి హడావిడితో కొత్త మలుపు తిరిగి, స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. -
ఇన్ స్టాలో పరిచయం అయిన యువకుడి కోసం భర్తను హతమార్చిన భార్య
-
12 రోజులు అయింది చిన్నారి ఎక్కడ..? కంచెకు బొమ్మలు కట్టి..!
-
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా కుక్క పోస్టుమార్టం రిపోర్ట్
-
కుక్క పోస్టుమార్టంలో షాకింగ్ నిజాలు.?
-
జాను ఎక్కడ? పిన్ టు పిన్ డీటైల్స్
-
జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం
-
మెడకు GPS ట్రాకర్ వల్లే! కుక్క మరణంపై.. జాహ్నవి తల్లి భావోద్వేగం
-
కుక్కకు పోస్టుమార్టం పూర్తి.. ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ
కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం, జూన్ 14వ తేదీ) పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్.సూరవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కకు పోస్టుమార్టం నిర్ర్వహించిన అనంతరం నమూనాలను సేకరించి విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దాంతో ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా..? విష ప్రయోగమా? అనేది ల్యాబ్ రిపోర్ట్ అనంతరం తేలనుంది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో క్లూ అనుకున్న కుక్క మృతిచెందడంతో ఇప్పుడు టాపిక్ అంతా కుక్కపైకి డైవర్ట్ అయ్యింది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది. అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు -
చిన్నారి జాను కేసులో బిగ్ ట్విస్ట్!
-
పాపను ఎవరో కిడ్నాప్ చేశారు.. జ్ఞానేశ్వరి తండ్రి సంచలన వ్యాఖ్యలు
-
అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. బాలిక అదృశ్యమై తొమ్మిది రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగింది. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న పామాయిల్ తోట, నల్లకొండ మీద గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ మాట్లాడుతూ.. తమ కుమార్తె ఇంటికి చాలా దగ్గరలోనే ఆడుకునేదని, ఇంటి నుంచి 20 మీటర్ల దూరం కూడా ఒంటరిగా వెళ్లే అలవాటు లేదని తెలిపారు. మా పాప అంత దూరం వెళ్లే పిల్ల కాదు. ఆమెను ఎవరో అపహరించి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్లినా ఆమె పెంపుడు కుక్క ఎప్పుడూ వెంటే ఉంటుంది. ఇంటి సమీపంలోని తోటలో, పరిసర ప్రాంతాల్లో ఆ కుక్కతో కలిసి ఆడుకోవడం ఆమెకు అలవాటని తెలిపారు. అందుకే బాలిక అదృశ్యమైన తర్వాత ఆ కుక్క కదలికలు కేసులో కీలక ఆధారంగా మారుతాయని భావించారు.ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్వరి ఇంటి నుండి పోస్టుమార్టం కోసం పెంపుడు కుక్క మృతదేహాన్ని తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఎన్.సూరవరం పశువుల ఆసుపత్రిలో కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే, కుక్క మృతదేహన్ని తరలిస్తుండగా పాప తల్లి భవాని కన్నీరుపెట్టుకుంది. గత ఆరు నెలలుగా కుక్కను పెంచుకుంటున్నామని.. జ్ఞానేశ్వరి ఆ కుక్కతోనే ఆడుకునేదని రోదించింది. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉన్న ఒక్క ఆధారం పోయిందని కంటతడి పెట్టుకుంది. అయితే ఇటీవల ఆ పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. కుక్క మృతిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన సహజమా? లేక బాలిక అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. కుక్క మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్క ఎలా చనిపోయిందనే విషయంపై స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు.అదంతా అబద్దం..ఇదిలా ఉండగా.. "పాపను తోట బయట చూశాను" అని పాపారావు అనే వ్యక్తి చెప్పిన వాదనను జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. తమ కుమార్తె ఒంటరిగా తోట దాటి బయటకు వెళ్లే అవకాశం లేదని, ఆ వాదనను తాము నమ్మడం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బాలిక అదృశ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అపహరణ కోణంతో పాటు ఇతర అన్ని అవకాశాలపైనా దర్యాప్తు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడం, కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క కూడా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మా ఆశలు.. ఆవిరి కుక్క మృతిపై మూడు అనుమానాలు అసలేం జరుగుతోంది
-
రెండేళ్లు చేతకాలేదు.. ఇంకో మూడేళ్లు పరిపాలిస్తావా..?
-
నిజం బయటపడుతుందనే కుక్కను చంపేశారా ?
-
చిన్నారి మిస్సింగ్ మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి,. చిన్నారి అన్వేషణలో కీలకంగా మారిన కుక్క ఎపిసోడ్ విషాదాంతమైంది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది.గాలింపు ఇలా..!సుమారు వారం రోజుల నుంచి పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్‌ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగించారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతున్న సమయంలో కుక్క చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.కుక్కలో వింత ప్రవర్తన..!ఈనెల 6 వ తేదిన జ్ఞానేశ్వరి వెంట వెళ్ళి అదృశ్యమైన పెంపుడు కుక్క... *మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ కుక్కలో వింత ప్రవర్తన మొదలైంది. జ్ఞానేశ్వరి తల్లితో పాటుగా పలువురిని మొరుగుతూ కరిచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రెండోసారి కూడా అదృశ్యమై, మళ్లీ ఇంటికి వచ్చింది. ఈసారి కుక్కకు జీపీఎస్ అమర్చి.. చిన్నారి ఆచూకీ కోసం కుక్కను కీలకంగా చేసుకున్నారు అధికారులు. అయితే ఇది కూడా ఉపయోగం లేకుండానే పోయింది. తిరిగి, తిరిగి ఇంటికి చేరిన కుక్క.. అనూహ్యంగా మృత్యువాత పడింది. చిన్నారి ఆచూకీ మాత్రం కుక్కకు తెలిసే ఉండవచ్చని, కుక్క వింతగా ప్రవర్తించడం వెనుకు ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు గ్రామస్థులు, బంధువులు కూడా కుక్క వింత ప్రవర్తన వెనుక ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభించకపోగా, ఇప్పుడు కీలకం అనుకున్న కుక్క మృతి చెందడంతో చిన్నారి మిస్సింగ్ కేసులో ఏం జరుగుతుంది? అనే చర్చ మొదలైంది. -
వాళ్లే పాపను ఎత్తుకెళ్లారు.. జ్ఞానేశ్వరి పేరెంట్స్ తో Exclusive
-
జ్ఞానేశ్వరి కేసులో సంచలన నిజాలు.. కుక్క చూపులో ఎదో తెలియని భయం
-
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
-
పాప తల్లి షాకింగ్ నిజాలు! జ్ఞానేశ్వరి తండ్రిపై పెరుగుతున్న అనుమానాలు..?
-
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్‌ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. -
ఏమైపోయావ్ చిట్టితల్లీ!
తుని రూరల్: మండలంలోని చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఐదు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. రోజులు గడుస్తున్నా.. డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న తమ ముద్దులపట్టి జాడ చిక్కకపోవడంతో తల్లిదండ్రులు భవాని, గణేష్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి కోసం అతడు కాపలా ఉన్న మామిడి తోటకు గత శనివారం బయల్దేరిన జాహ్నవి మధ్యలో దారి తప్పిపోయి అదృశ్యమైపోయింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో వెళుతున్న జ్ఞానేశ్వరిని, వారి పెంపుడు కుక్కను అదే గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని ఓ వ్యక్తి చూశాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు అతడు ప్రయత్నించగా.. పెంపుడు కుక్క దాడికి యత్నించింది. దీంతో, అతడు ఆ బాలికను, కుక్కను వదిలేసి గ్రామానికి చేరుకుని, తల్లి భవానీకి విషయం చెప్పాడు. కుమార్తెను తీసుకువచ్చేందుకు తల్లి వెళ్లగా అక్కడ జ్ఞానేశ్వరి కనిపించలేదు. ఈ విషయాన్ని భర్త గణేష్‌కు ఆమె చెప్పింది. వారి ద్వారా విషయం తెలియడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారి వెళ్లిన దారి వెంబడి, కొండ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకపోవడంతో తుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ సిబ్బంది, గ్రామస్తులు కలసి బృందాలుగా కొండ ప్రాంతంలో ఆ రోజు అర్ధరాత్రి వరకూ.. ఆది, సోమ, మంగళ, బుధవారాలు గాలించినా బాలిక, పెంపుడు కుక్క ఆచూకీ తెలియరాలేదు. డ్రోన్, డాగ్ స్క్వాడ్ సాయంతో కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. సమీప గ్రామాల్లోను తుని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలించినా ఎటువంటి ఫలితం లేదు. దీంతో, జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. బాలిక ఆచూకీ లేదా సమాచారం తెలిసిన వారు తుని రూరల్ ఎస్సై 94407 96573, రూరల్ సీఐ 94407 96531, పెద్దాపురం డీఎస్పీ 94407 96508 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. ఇది కూడా ఇప్పటి వరకూ ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం ఇంటికి చేరింది. జ్ఞానేశ్వరి తల్లి భవానీ వ్రస్తాన్ని నోటితో పట్టుకుంది. దీంతో, బాలిక ఆచూకీ తెలుస్తుందేమోననే ఆశ చిగురించింది. కానీ, అక్కడే ఉన్న స్థానికులు, పోలీసులు సమీపించడంతో భయంతో ఆ కుక్క స్థానికులపై దాడి చేస్తూ మళ్లీ ఆయిల్‌పామ్ తోటలోకి పరుగు తీసి, తప్పించుకుని కొండ పైకి పారిపోయింది. అణువణువూ జల్లెడ పట్టినా.. ఐదో రోజైన బుధవారం పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆధ్వర్యాన తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐల పర్యవేక్షణలో డివిజన్లో పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇతర బృందాలు గ్రామ సమీపంలోని వివిధ తోటలను, గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాన్ని ముమ్మరంగా జల్లెడ పట్టారు. సీసీ ఫుటేజ్‌లు మరోసారి పరిశీలించారు. డ్రోన్, డాగ్ స్క్వాడ్‌తో గాలింపును, గ్రామంలో ఎన్యూమరేషన్ సెర్చింగ్ కొనసాగించారు. పంట పొలాల్లోని బావులు, కుంటలు, బోరు బావుల వద్ద జల్లెడ పట్టారు. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా చేతికి జ్ఞానేశ్వరి చిక్కిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ చిన్నారి కొండ పైకి వెళ్తే ఇప్పటి వరకూ నీరు, ఆహారం లేకుండా బతకడం దాదాపు అసాధ్యమని స్థానికులు భావిస్తున్నారు. ఎంత విస్తృతంగా వెతికినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడం గాలింపు బృందాలకు అంతు చిక్కడం లేదు. బాలిక అదృశ్యం మిస్టరీ వీడకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్, తిరిగి వచ్చిన కుక్క కుక్క ప్రవర్తనలో మార్పు
-
ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను
పెళ్లికాని అబ్బాయిలకు అలర్ట్. మీ బండిపై ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా? అయితే మీకు పెళ్లి కాకపోవచ్చు. వెడ్డింగ్‌కు, ట్రాఫిక్ చలానా సంబంధంమేంటని బుర్ర గోక్కుంటున్నారా? పెళ్లి సంబంధాల్లో సహజంగా అమ్మాయి తల్లిదండ్రులు చూసేది అబ్బాయి గుణగణాలు, ఉద్యోగం, కుటుంబం, ఆస్తులు. కానీ ఇప్పుడు అబ్బాయి బండికి సంబంధించిన ట్రాఫిక్ చలానాలు కూడా చూస్తున్నారు. నమ్మకం కలగట్లేదా? అయితే ఇది చదవండి.ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయనది కాకినాడలోని రాయుడుపాలెం.. ఈయనకు ఒక్కగానొక్క కూతురు. భార్య చనిపోవడంతో కూతురిని కంటికి రెప్పలా పెంచి పెద్దచేశాడు. ఎంబీఏ వరకు చదివించాడు. ఇప్పుడు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అయితే అబ్బాయి గుణగణాలతోపాటు భవిష్యత్తులో తన కూతురి భద్రత, భవిష్యత్తు దృష్ట్యా అతడి ట్రాఫిక్ క్రమశిక్షణపైనా ఆరా తీయాలని సంకల్పించాడు.కాకినాడ ట్రాఫిక్–2 సీఐ దానేటి రామారావు వద్దకు వచ్చి తనకు కాబోయే అల్లుడి కారు, ద్విచక్రవాహనాల నంబర్లు చీటిపై రాసిచ్చి వాటిపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులేమైనా ఉన్నాయేమోనని చెప్పాలని కోరాడు. చలానాలు ఉంటే పిల్లనివ్వనని స్పష్టం చేశాడు. కూతురి భవిష్యత్తుపై పెద్దాయన చూపిస్తున్న తాపత్రయానికి ముగ్దుడైన సీఐ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. – కాకినాడ క్రైంచదవండి: కొత్త అల్లుడికి పసందైన విందు -
విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే ఇలాంటి దారుణాలు
సాక్షి, తాడేపల్లి: మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో టిప్పర్ ఢీ కొట్టటంపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజమెత్తారు. ‘‘టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపారన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మద్యం నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్రమ మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లోపంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. .. ‘‘ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీళ్లను చీడిగ గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. -
కాకినాడలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి దగ్గర ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, మృతులను సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరంగా గుర్తించారు. వీరంతా చీడగ గ్రామానికి చెందినట్టు సమాచారం. -
కాకినాడలో మృణాల్ ఠాకూర్ సందడి
-
దళారుల జేబులు నింపడానికి మా పొట్టకొడుతున్నారు..
-
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు. మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్ మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది.. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ చింతా మోహన్ ధ్వజమెత్తారు. -
కాకినాడలో ఉద్రిక్తతకు దారితీసిన ప్రేమ జంట వ్యవహారం
-
అరకోటి భూమి కొట్టేసేందుకు జనసేన నేత స్కెచ్
సాక్షి, కాకినాడ సిటీ: వరుసకు సోదరి అయిన మహిళ భూమి కొట్టేసేందుకు డీసీసీబీ చైర్మన్, కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు స్కెచ్ వేశారు. కాకినాడ జిల్లా యర్రవరంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 94 సెంట్ల భూమిని తన ఆధీనంలో పెట్టుకుని వరుసకు సోదరి అయిన అమలకంటి తులసీ కిరణ్మయిని తుమ్మల బాబు వేధిస్తున్నారు. కిరణ్మయి భర్త కిడ్నీ పేషెంట్ కావడంతో ఆ భూమి వ్యవహారం తాను చూసుకుంటానని నమ్మించి.. ఆ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఆమె పేరిట ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.అధికార పార్టీ నేత కాదనడంతో స్థానిక తహసీల్దార్ ఆమెకు పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తనకు పాస్‌బుక్ ఇవ్వకపోవడంతో బాధితురాలు తల్లితో కలసి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ హరేందిరప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. తుమ్మల బాబు తన పెదనాన్న కొడుకు అని, తన భూమి తనకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు తనకు పసుపు కుంకుమ మాన్యం కింద ఇచ్చిన ఈ భూమిని కొన్నేళ్లుగా తుమ్మల బాబు ఆధీనంలో ఉంచుకొని తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపింది.తన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. తుమ్మల బాబు అధికారం బలంతో ఆ భూమికి పట్టాదార్ పాస్‌బుక్ కూడా సంపాదించినట్టు తెలిసిందన్నారు. ఆ భూమికి సంబంధించి పంట డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు ఆమె తెలిపింది. భూమి గొడవల నేపథ్యంలో తన భర్త గత ఏడాది సెప్టెంబర్‌లో ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు. పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో తన తండ్రికి చెందిన 5 సెంట్ల స్థలం కూడా కాజేసేందుకు తుమ్మల బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ విషయం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోయారు. -
మంచంపై నిద్రిస్తున్న బాలికకు పాముకాటు..
ఏలూరు జిల్లా: కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజును వేడుకగా చేసుకున్న ఆనందం మరువక ముందే ఆ చిన్నారిని పాము రూపంలో మృత్యువు కబళించింది. మంచంపై తల్లితో నిద్రిస్తున్న ఆ బాలిక పాముకాటుకు గురై మృతి చెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోనపాపపేట మత్స్యకార కుటుంబానికి చెందిన చప్పా దీపిక (13) తల్లి మల్లీశ్వరితో గురువారం జన్మదిన వేడుక జరిగింది. ఆ రాత్రి తన ఇంటిలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2.30 సమయంలో ఏదో కుట్టినట్టు అనిపించి తల్లికి చెప్పింది. ఏ ఎలకో కరచి ఉంటుందని భావించి ఉదయం ఇంజెక్షన్ చేయిస్తామని నచ్చచెప్పి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇబ్బందిగా ఉందని మరోసారి తల్లిని లేపింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి సమీపంలోని బంధువులకు విషయం చెప్పి చికిత్స కోసం 108కి సమాచారం ఇచ్చారు. ఆ వాహనం వచ్చేలోపే బాలిక నోటి వెంట నురగ రావడంతో చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా చికిత్స నిమిత్తం ఆధార్ కార్డు కావలసివచ్చి దీపిక పడుకున్న మంచం పరుపుకింద వెతకగా ఆ పక్కనే తాచుపాము బుసకొడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అంతలోనే తేరుకుని దానిని హతమార్చారు. దీపిక స్థానిక జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్సై వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రాణంలా మీదకు వచ్చిన ఏసీ వాటర్ వివాదం.. జస్ట్ మిస్ పీక తెగిపోయేది..
-
‘మీరు రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్‌మెన్ అని..’
కాకినాడ: ఎల్లో మీడియా అసత్య వార్తలను పదే పదే డ్రైవ్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తన వద్ద గన్‌మెన్‌గా పని చేసి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గొడవలను తనపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన వ్యక్తి.. గత 20 నెలలుగా పవన్ కళ్యాణ్ వద్ద గన్‌మెన్‌గా చేస్తున్నారని, కానీ ఇంకా తన మాజీ గన్‌మెన్ అని ఎల్లోమీడియా వార్తలు రాయడంపై దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈనాడు పత్రిక రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్‌మెన్ అని రాయాలని సవాల్ చేశారు. తనపై వార్తలు రాసిన వాళ్లు నోటికి అన్నం తింటే తన కౌంటర్‌ను కూడా ప్రచురించాలని చాలెంజ్ చేశారు. ఏదో రకంగా తప్పుడు వార్తలను రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. -
‘మరి వైజాగ్‌లో ఐటీ కంపెనీలకు ఎలా అనుమతిస్తున్నారు?’
కాకినాడ: పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌ను వదిలేసి వచ్చి అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పుకొచ్చారని, ఇప్పుడు మళ్ళీ ఎవరిని మభ్య పెట్టడానికి అసెంబ్లీ లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్మానం చేయడం వెనుక కారణాలు ఏంటని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇంత వరకు ఇవ్వలేదని, ఇప్పుడు అమరావతి పేరుతో కట్టు కధలు చెప్పి రానున్న మూడేళ్ళు గడిపేయడానికి ఈ డ్రామా అని ధ్వజమెత్తారు కురసాల. మీరు మళ్ళీ అధికారంలో ఉంటామన్న నమ్మకం మీకు లేదా?, రైతులకు ఒక్క రిటన్ బుల్ ఫ్లాట్ ఇచ్చారా?, రాజధాని రైతు చనిపోతే కనీసం మీరు పరామర్శించారా?, చారిత్రాత్మక రాజధాని అని మీరు చెప్పినప్పుడు సమిధలు అవుతున్న రైతులను పరామర్శించరా?, ఇప్పటికీ రాజధానికి సరైన కనెక్టింగ్ రోడ్డులు ఉన్నాయా?, కనీసం ఆస్తులు ఉండీ అమ్ముకునే దుస్ధితి అమరావతి రైతులకు లేదు. రాజధానికి అప్పులు ఎక్కడ నుండి తెస్తున్నారో తెలియదు. రాజధాని భవనాలకు అడుగు నిర్మాణానికి రూ. 11 వేలు అవినీతి కాదా?, డిజైన్లకు కొత్తగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇడ్లీ పాత్ర..ఉప్మా గిన్నెల్లా భవనాలను డిజైన్ చేయించారు.రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎలాంటి అభివృద్ధి లేదు. అమరావతిని సెల్ప్ ఫైనాన్స్ నగరం అని చెప్పి ఇప్పటి వరకు నిధులు ఏమైనా సమీకరించారా?, రాజధాని లో ఇవాళ్టీకి భూములు తుప్పలుగా ..పరలు పరలుగా కనిపిస్తున్నాయి.హైపర్ లూప్, ఒలింపిక్స్ అంటూ అమరావతిని బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. అమరావతి ని ఒక మహ నగరంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఎవరికీ లేదు.అప్పుడు సునామీలన్నారు.. ఇప్పుడు ఐటీ కంపెనీలకు అనుమతి ఎలా?రాష్ట్రంలో అతి పెద్ద సిటీ వైజాగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వైజాగ్‌ను పరిపాలన రాజధాని చేస్తానంటే.. సునామీలు వస్తాయని టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయించింది. మరీ వైజాగ్‌లో ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఏలా అనుమతి ఇస్తున్నారు. అమరావతి మీరు క్రియేట్ చేసిన ఇల్యూజన్లా కనిపిస్తుంది.అమరావతిని ఎవరికి స్వర్గంలా చేసేందుకు నిర్మిస్తున్నారు. అమరావతి లో పేదలకు చోటు లేదా? ఎవరి కోసం నిర్మాణం’ అని ప్రశ్నించారు. -
ముద్రగడను కలిసిన అంబటి.. నా బలం జగన్.. నా ధైర్యం నా పార్టీ
-
కులాన్ని భట్టి రోడ్లు ఉన్నాయా రాష్ట్రంలో? AC రూంలో విస్కీలు తాగుతున్నావ కలెక్టర్..?
-
కాకినాడ కలెక్టర్ గుడుంబా శంకర్, ఖుషి సినిమా చూసి.. కలెక్టర్ అయ్యాడు
-
కాకినాడలో పెద్దపులి.. బయటకు రావొద్దని హెచ్చరిక
-
కాకినాడ జిల్లాలో పెద్దపులి టెన్షన్
-
రోకలి బండ ఎలా నిలబడిందో చూశారా..?
-
వేట్లపాలెం దోషులెవరు?
అంటించి వదిలేస్తే చాలు నింగిలోకి దూసుకెళ్తూ, ఆ వెంటనే ఆకాశాన్ని దేదీప్యమానం చేస్తూ, నక్షత్రాలు రాలుస్తూ, రంగురంగుల పొగలు కక్కుతూ, చిత్రమైన ధ్వనులు చేస్తూ అబ్బురపరిచే బాణాసంచా తయారీ ప్రాణాంతకమైన పరిశ్రమ. అక్కడ పనిచేయటం నిప్పుతో చెలగాటం. చిన్న ఏమరుపాటు సైతం పెను నష్టానికి కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో శనివారం మిట్టమధ్యాహ్నం ఒక బాణాసంచా గోడౌన్లో రెండు గంటల పాటు నిరంతరాయంగా జరిగిన పేలుళ్ల పర్యవ సానంగా ఇంతవరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం భద్రత, పర్యవేక్షణల్లో మరోసారి మన డొల్లతనాన్ని చాటింది. పేలుడు ధాటి ఏ స్థాయిలో ఉందంటే... శరీర భాగాలు ఛిద్రమై విసిరేసినట్టు పడ్డాయి. కేవలం నలుగురు మాత్రమే ఉండాల్సిన ఘటనాస్థలిలో పేలుడు సమయంలో 45 మంది ఉన్నారని అంటున్నారు. ఈ ఉదంతంలో మరో 11 మందికి గాయాలయ్యాయి. ఇంత జరిగాక అక్కడకు పోయిన మంత్రులు నమోదైన సంఖ్యకు మించి పనివారిని అక్కడుంచారనీ, పరిమితి కన్నా ఎక్కువగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనీ, అధికారుల పర్యవేక్షణ లేనేలేదనీ చెబుతున్నారు. ఇవన్నీ తమ పాలన నిర్వాకమేనని... జరిగిన విషాదంలో తమకూ నైతిక బాధ్యత ఉంటుందనీ వారికెవరు చెప్పాలి? కార్మిక శాఖ పట్టించుకోదు. పోలీసు నిఘా ఉండదు. అగ్నిమాపక విభాగానికి అసలే పట్టదు. ఆ రోడ్డు పక్కనుంచి తరచూ మంత్రులు, వారి అనుచరగణం రాకపోకలు సాగిస్తున్నా, పొలాల మధ్యలో అక్కడ సాగుతున్న కార్యకలా పాలేమిటన్న ఆరా ఉండదు. కనీసం అధికారుల్ని అడిగి తెలుసుకుందామన్న స్పృహ కూడా ఉండదు. ఇక ఇటువంటి ఘోరాలు చోటుచేసుకోవటంలో ఆశ్చర్యమేముంది? ఇలాంటి ఘటనల్ని ప్రమాదాలంటాం గానీ... నిజానికి అవి ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కారణంగా దాపురించే ఘోరాలు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటి అమలును పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందుకే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం, పర్యవేక్షించటంలో విఫలమైన ఉన్నతాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవటం వంటివి తప్పనిసరి చేయాలి. కానీ అలాంటివేమీ జరగటం లేదు. నిబంధనలకేం... చాలా ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలనీ, ఆ కేంద్రంలో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ ఉండాలనీ, షెడ్ల నిర్మాణానికి వినియోగించే సామగ్రి కనీసం రెండు గంటలపాటు అగ్నిని నిరోధించగలగాలనీ, బాణసంచా పనిలో ఉండేవారు ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలనీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిందేమిటో అవగాహన కలిగి ఉండాలనీ నిబంధనలు చెబుతున్నాయి. ఇంకా ప్రాథమిక వైద్య సదుపాయం, అగ్నిమాపక సిలెండర్లు, అయిదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు నింపిన బకెట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ఇవన్నీ అమలవుతున్నాయో లేదో చూసేదెవరు? దేశంలోని బాణసంచా పరిశ్రమల్లో చిన్నవో, పెద్దవో తరచు ప్రమాదాలు జరుగు తూనే ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో, కార్మికుల భద్రత గురించి శ్రద్ధ చూపటంలో నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రదర్శించే హడా విడి మరికొన్ని రోజులకే కనుమరుగవుతుంది. మళ్లీ మరొకటి జరిగేవరకూ అంతా సవ్యంగానే ఉందన్న భ్రమ ఆవరిస్తుంది. సాధారణ సమయాల మాటెలా ఉన్నా కనీసం పండు గలు, శుభకార్యాల సమయాల్లోనైనా బాణసంచా పరిశ్రమలపై దృష్టిపెట్టాలన్న ఇంగిత జ్ఞానం అధికార యంత్రాంగంలో లోపిస్తోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రోజుకు దాదాపు 12 గంటలసేపు పనిచేయిస్తారు. కార్మికులు ఊపిరి తీసుకోవటానికి కూడా వ్యవధి చిక్కనంతగా పనిలో ఉంటారు. సరిగ్గా అప్పుడే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.వేట్లపాలెం ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపించాలి. అధికారులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా బాణసంచా తయారీ కేంద్రాలను సందర్శించేలా, లోటుపాట్లు గుర్తించినప్పుడు కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఏర్పరచాలి. కార్మిక శాఖ, పోలీసు, అగ్నిమాపక, విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. వాటిమధ్య సమన్వయం ఉండాలి. ఇవేమీ లేకుండా మీడియా కోసం ఆగ్రహావేశాలు నటించటం వల్ల ప్రయోజనం ఉండదు. -
వేట్లపాలెం ఘటనకు కారణాలేమిటో!
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో 22 మంది ప్రాణాలను బలిగొన్న భారీ విస్ఫోటనం ఘటన జరిగి మూడు రోజులైంది. ఇంతటి భారీ పేలుడు సంభవించడానికి కారణాలేమిటి? ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు? మృతులు, క్షతగాత్రులు కాకుండా మిగిలిన వారు ఏమయ్యారనే ప్రశ్నలకు ఇప్పటివరకూ జవాబులు లభించడం లేదు. దర్యాప్తు సరైన దిశగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరా దృశ్యాలపై దృష్టి పెట్టలేదేం? నిబంధనల ప్రకారం ప్రతీ బాణసంచా తయారీ కేంద్రం, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన ప్రకారం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్ఫోన్లో రికార్డవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయినా.. సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియో దృశ్యాలు లభించే అవకాశం ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే తొలుత విస్ఫోటనం ఎక్కడ జరిగింది.. ఎక్కడి నుంచి, ఏవిధంగా మంటలు చెలరేగాయి.. ఆ సమయంలో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారనే అంశాలపై స్పష్టత వస్తుంది. అంతా గోప్యమే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లైసెన్స్ అడబాల అర్జున్ పేరిట ఉంది. దీని నిర్వహణలో అర్జున్‌తో పాటు ఆయన సోదరుడు నాని, తండ్రి శ్రీనివాసరావు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు మరణించగా.. అర్జున్, నానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించిన నేపథ్యంలో వారికి నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతుండగా.. అది అవాస్తవమని, తండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా వారిని అనుమతించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఏ సమాచారం రాబట్టారనే విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగానే ఉంచారు. విషమంగా నలుగురి పరిస్థితి పేలుడు ఘటనలో కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో ఇంకా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది.మహిళ తల గుర్తింపు ఇలావుండగా.. ఘటనా స్థలానికి సమీపంలోని పొలంలో మొండెం లేని మహిళ తలను సోమవారం గుర్తించారు. ఘటన జరిగిన రోజున తలలు లేకుండా దొరికిన రెండు మొండేలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో వారికి అప్పగించారు. వారి మతాచారం ప్రకారం ఆ మొండేలను ఖననం చేసేశారు. ఇప్పుడు దొరికిన ఈ తల.. ఆ రెండు మొండేల్లో ఒకటైన సక్కుమళ్ల రాఘవ(50)దిగా గుర్తించినట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. అయినప్పటికీ, ఈ తలకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని చెబుతున్నారు. ఆ 10 మందీ ఏమయ్యారో! స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు జరిగిన సమయంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో 40 మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం ఘటనా స్థలంలో 20 మంది సజీవ దహనం కాగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మరణించారు. మరో ఏడుగురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ 30 మంది కాకుండా మిగిలిన 10 మంది ఏమయ్యారనే ప్రశ్నకు ఇప్పటివరకూ జవాబు దొరకడం లేదు. వీరు ఆ రోజు ఘటనా స్థలంలోనే ఉన్నారా లేక ప్రమాదం నుంచి తప్పించుకుని ఇళ్లకు వెళ్లిపోయారా అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీనిని నిర్ధారించాలంటే సీసీ కెమెరాల ఫుటేజే ఆధారం. ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తారో లేదో వేచిచూడాలి. -
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్‌కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్‌లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్‌పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
వద్దురా అంటే వినలేదు.. వద్దురా అంటే వినలేదు.. కాకినాడ ప్రమాదం బాధితుల కన్నీటి పర్యంతం
-
Vetlapalem : 18 మంది సజీవ దహనం
-
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. మంటల్లో 50 మంది..!
-
వేట్లపాలెం అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్య క్తం చేశారు వైఎస్ జగన్.‘వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2026 కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం -
కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..23 మంది సజీవ దహనం
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడుధాటికి మృత దేహాలు స్థానిక పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.అందిన సమాచారం మేరకు మృతుల వివరాలు : అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గోడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్, రమణ, నానిలు ఉన్నారు.డీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతదేహాల అప్పగింతడీఎన్ఏ టెస్టుల ఆధారంగా మృతదేహాలను అప్పగించే పనిలో పడ్డారు అధికారులు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన తర్వాత మృతదేహాలను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రమాదం సమయంలో 70 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. ఘటనా స్థలంలో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. గతంలో భారీ పేలుళ్లు, విషాదాలు బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. బాణా సంచా తయారీకి ప్రసిద్ధి చెందిన వేట్లపాలెం, పరిసర గ్రామాల్లో ఇలాంటి భారీ ప్రమాదాలు జరగడం, పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామం, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అలాగే గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడిక్కడే మరణించారు. -
‘చంద్రబాబు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’
కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు.. కల్తీ ప్రభుత్వాన్ని మాత్రం నడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో మాట్లాడలేదంటేనే సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాలు, శ్రీకాకుళంలో కల్తీ నీళ్లు అన్నట్లుగా చంద్రబాబు సర్కార్ పనితీరు ఉందని విమర్శించారు. కల్తీ పాలతో ప్రాణాలు పోతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పంచారామ క్షేత్రంలో అపచారం
-
కాకినాడ YSRCP నేతల గొడవ.. కన్నబాబు క్లారిటీ
-
బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్.. కన్నబాబు ధ్వజం
కాకినాడ: వైఎస్సార్సీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్‌ను కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఖండించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బెజవాడ సత్యనారాయణతో పాటు మరో పది మందిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని కురసాల తప్పుబట్టారు. తిమ్మాపురం శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, పోలీసులు మాత్రం వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేయడాన్ని కురసాల తీవ్రంగా ఖండించారు. ‘కొందరు పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. వైఎస్సార్సీపీకి కేసులంటే ఎలాంటి భయంలేదు. గత 18 నెలలుగా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త సాంప్రదాయం మంచిది కాదు’ అని హెచ్చరించారు. -
కాకినాడ ప్రత్తిపాడులో నడిరోడ్డుపై ఘోరం
సాక్షి, కాకినాడ: ప్రత్తిపాడులోని కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోరం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరూ డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్‌తో వెళ్తున్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది మరో కంటైనర్ లారీ. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు వాహనాల క్యాబిన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇరువురు డ్రైవర్లు బయటకు దూకేయగా.. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అన్నవరం పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఇద్దరు పిల్లలున్న మహిళ.. పెళ్లి చేయమని టవరెక్కిన యువకుడు
కాకినాడ రూరల్ / సామర్లకోట: ఓ మహిళతో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన, యువకుడు, జేసీబీ డ్రైవర్ వానపల్లి వెంకట సురేష్ ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం అవంతినగర్‌లో టవర్ ఎక్కి బెదిరింపులకు దిగాడు. హైటెన్షన్ విద్యుత్ లైన్ స్తంభం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తీగలను తాకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో పాటు దాదాపు రెండు గంటల పాటు టవర్‌పైనే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న తిమ్మాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పనసపాడ గ్రామస్తులు టవర్ వద్దకు చేరుకుని వెంకట సురేష్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేశ్వరరావు, తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్ సెల్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. టవర్ ఎక్కి బెదిరింపులకు పాల్పడిన వెంకట సురేష్ తాను ప్రేమించిన మహిళ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడడంతో, వారు అల్లరి చేయవద్దని మాట్లాడుకుందామని నచ్చజెప్పడంతో కొద్దిసేపటికి స్తంభం నుంచి తాను కిందకు రావడంతో పోలీసులు, పనసపాడు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం యువకుడిని తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం టవర్ ఎక్కి ఆందోళన చేస్తానని హెచ్చరించినట్టుగా వెంకట సురేష్ గురించి గ్రామస్తులు పేర్కొన్నారు. మాధవపట్నంకు చెందిన ఓ మహిళ భర్తను విడిచి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. పెళ్లి కోసం ఒత్తిడి తీసుకు రావడంతో ఆమె వెంకట సురేష్ సెల్ నంబరు, వాట్సాప్ బ్లాక్‌లో పెట్టినట్టు పోలీసులు తెలిపారు. దీంతో సెల్ టవర్ ఆ యువకుడు బెదిరింపులకు దిగాడు. -
అన్నవరం ప్రసాదంలో ఎలుకలు
-
Kakinada : ఈ ప్రభుత్వానికి ఓటు వేసి నరకం చూస్తున్నాం..
-
Kakinada : రోడ్లు వేయకపోతే.. గిరిజనుల వార్నింగ్
-
కూటమి పాలనలో డ్రగ్స్ డెన్‌గా ఏపీ: కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఏపీలో బెల్టు షాపులకు సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ నాయకులు కురుసాల కన్నబాబు. డోర్ డెలివరీ స్థాయికి మద్యాన్ని తీసుకొచ్చారని అన్నారు. కూటమి సర్కార్ ఏపీని డ్రగ్స్ డెన్‌గా మార్చేసిందని మండిపడ్డారు. లులు కంపెనీపై చంద్రబాబుకు ఎందకంత ప్రేమ? అని కన్నబాబు ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కురసాల కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. వేదిక ఏదైనా చంద్రబాబు.. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌ను తిట్టడానికే వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఎవరికి క్రెడిబులిటి ఉందో ప్రజలకు తెలుసు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. కరోనా వంటి కష్ట కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసింది వైఎస్ జగన్. ఒక నాయకుడిని ఓడించడం కోసం మూడు పార్టీలు కలిసి కూటమి కట్టడం ఒక చరిత్రే. రూ.500 కోట్లతో ఒక్కో మెడికల్ కళాశాలల్ని కట్టాలని వైఎస్ జగన్ అనుకున్నారు. అవన్నీ వద్దని మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారుఎన్టీఆర్ వర్ధంతిలో చంద్రబాబు తనకు తనకే కీర్తించుకున్నారు. రాష్ట్రంలో పప్పు బెల్లల్లా ఎకరాలకు ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలను దారదత్తం చేస్తున్నారు. లులు కంపెనీ మీద ఎందుకు మీకు అంత ప్రేమ. విశాఖ హార్బర్ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన భూములను నామమాత్రపు లీజుకు లులుకు ఇస్తున్నారు. విజయవాడలో ఆర్టీసి స్థలాన్ని కూడా లులుకు ఇస్తున్నారు. ఉర్సా అనే కంపెనీకి ఎకరా రూ.99 పైసలకే కేటాయించారు. మొత్తం భూమి రూ.99పైసలకే ఇచ్చేస్తానని మంత్రి లోకేష్ అంటున్నారు. భూములు పంచుకునేది మీరు. వైఎస్ జగన్ హయంలో జరిగింది అని ఎలా చెబుతున్నారు. నాయుడుపేట నుండి సత్యసాయి జిల్లా వరకు భూముల పందేరం జరుగుతోంది.కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.18వేల నుండి రూ.19వేలకు అమ్ముతున్నారు. అడ్డగోలుగా ఇసుకను తినేసిన చరిత్ర టీడీపీది. మీకు ఉన్న మీడియా బలం దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా?. ఒక మీడియా వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి, మరో మీడియాకు విశాఖలో భూములు ఇస్తారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఎన్టీఆర్ అమలు చేస్తే.. దానిని ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుది కాదా?. బెల్టు షాపులకు సృష్టికర్త చంద్రబాబు. రాష్ట్రంలో నకిలీ మద్యం పరిశ్రమగా నడిపిన చరిత్ర మీది కాదా?. ఈనెల ఒకటో తేదీ నుండి 17 వరకు రూ.17 కోట్ల మద్యాన్ని అమ్మారు. ఈ సంక్రాంతి లిక్కర్ సిండికేట్లకు సంక్రాంతి అయ్యింది. డోర్ డెలివరీ స్థాయికి మద్యాన్ని తీసుకువచ్చారు. గంజాయితో పాటుగా ప్రమాదకర మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్న పరిస్ధితి రాష్ట్రంలో ఉంది.ఏపీలోనే కాదు.. ఈ దేశంలోనే వైఎస్ జగన్ శక్తివంతమైన నాయకుడు. చరిత్ర వక్రీకరించి.. ఒక కులమే ఆరాధనీయ కులం అని చెప్పుకుంటుంది. సంక్రాంతే కమ్మేవారి పండుగ అని చెప్పుకునే పరిస్ధితి వచ్చింది. సూర్య సిద్దాంతం, ఆర్యభట్ట సిద్దాంతం నుండి సంక్రాంతి ప్రస్తావన ఉంది. సంక్రాంతి ఒక కులానికి, ప్రాంతానికి సంబంధించినది కాదు. జానపదాల్లోను, శ్రీనాధుడు, అన్నమయ్య రచనలలోను సంక్రాంతి ప్రస్తావన ఉంది అని అన్నారు. -
మహిళ పోలీస్‌కు హ్యాట్సాఫ్..
కాకినాడ జిల్లా: స్థానిక కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఓ మహిళా కానిస్టేబుల్ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సును వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది. రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తరువాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలు దేరారు. కాకినాడ – సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే తన విధులు గుర్తుకు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు. తనకు సంబంధం లేదని వెళ్లిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడం గమనార్హం. ఒకవైపు బిడ్డ, మరోవైపు విధులకు సంబంధించిన బ్యాగ్‌తో విధులు నిర్వహించిన ఆమెను అంతా కొనియాడారు. -
చంటి పిల్లాడితో.. అర్ధరాత్రి.. సెల్యూట్ కొట్టాల్సిందే!
-
కీర్తి చోర నారా.. మరో చోరీ!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇప్పటికే విశాఖలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ చోరీకి పాల్పడిన చంద్రబాబు.. తాజాగా కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును కూడా తన ఘనతగా చెప్పుకొంటూ భారీ ప్రకటనలను జారీ చేయించారు. కాకినాడలో భారీ గ్రీన్ అమ్మోనియా యూనిట్ నెలకొల్పే విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రీన్కో 2023లోనే ఒప్పందం కుదుర్చుకుని దానికి అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తే.. చంద్రబాబు సర్కారు ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.2023లో బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో అప్పటి కేంద్రమంత్రి హరదీప్‌సింగ్ పూరి సమక్షంలో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును నెలకొల్పడానికి గ్రీన్కో సంస్థ యూనిపెర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 2023 మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)లో కాకినాడలోగ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో చర్చ జరగడంతో పాటు అవార్డులు దక్కించుకుంది. పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్–బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్ఎఫ్ఎన్బీఓ) ప్రీ–సరి్టఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్ నిలిచింది. కేంద్రం కంటే ముందుగానే సొంత పాలసీ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లోనే ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. గ్రీన్ ఎనర్జీపై కేంద్రం పాలసీ తీసుకురావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్ టన్నులు (ఎంటీ) ఉంటే రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 2 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం పాలసీని రూపొందించింది. ఒక మిలియన్ టన్ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది.ఈ పాలసీ అమలుకు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్డీసీ ఏపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ పాలసీతో ఎనీ్టపీసీ, ఏఎం గ్రీన్కో, రెన్యూ ఎనర్జీ, ఇండోసోల్, ఏబీసీ, అదానీ గ్రీన్ఎనర్జీ వంటి అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వచ్చాయి. 2023లో జరిగిన జీఐఎస్ సదస్సులో మొత్తం రూ.13.11 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు వస్తే, అందులో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.9,07,127 కోట్ల విలువైన 40కి పైగా ఒప్పందాలు కుదిరాయంటే ఈ రంగంలో పెట్టుబడులకు వైఎస్ జగన్ ఏ స్థాయిలో కృషి చేశారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు సర్కారు గ్రీన్ ఎనర్జీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటోంది. -
Kakinada : మంచి ప్రభుత్వం అంటే మర్డర్లు చేయటమా?
-
బాబు, నీ గుండా ప్రభుత్వానికి ఎవడూ భయపడడు YSRCP నేతల మాస్ వార్నింగ్
-
Thousand Note: రూ.వెయ్యి నోటు రద్దుకు 48 ఏళ్లు!
రూ.వెయ్యి నోటు ఎప్పుడు రద్దయ్యిందంటే టక్కున 2016లో మోదీ ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పేస్తారు. కానీ అంతకు ముందే కొన్నేళ్ల క్రితం చలామణిలో ఉన్న ఈ రూ.వెయ్యి నోటు రద్దయ్యి నేటి సరిగ్గా 48 ఏళ్లయ్యింది. 1978 జనవరి 15వ తేదీన అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిల హయాంలో కొన్ని ఆర్థిక కారణాల రీత్యా పెద్ద నోట్లను రద్దు చేశారు. 72 ఏళ్ల కిందట 1954లో భారత రిజర్వు బ్యాంక్ ఈ వెయ్యి నోట్లను విడుదల చేసింది. రిజర్వు బ్యాంక్ గవర్నర్ బి.రామారావు సంతకంతో మొదటిసారిగా ఈ నోటును ముద్రించారు. ఈ నోటును కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించి భద్రపరిచారు. ఈ నోటు 20.3 సెంటీ మీటర్ల వెడల్పు, 12.7 సెంటీమీటర్ల ఎత్తుతో సుమారు పావుఠావు పరిమాణంతో చలామణీలో ఉండేది. జానకిరామ చౌదరి మాట్లాడుతూ నోటుకు ముందువైపు మూడు సింహాల చిత్రం, వెనుకవైపు తంజావూరు (తమిళనాడు) లో వెయ్యేళ్ల కిందట నిర్మించిన బృహదీశ్వరాలయం చిత్రాన్ని ముద్రించారని, దీనితో పాటు చలామణిలో ఉండే ఐదు వేలు, పది వేల రూపాయల నోట్లను కూడా నాటి ప్రభుత్వం 1978 జనవరి 15 తేదీన రద్దు చేసిందని తెలిపారు. -
కాకినాడలో 150 కోట్ల బెట్టింగ్
-
కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు
కాకినాడ: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో కోళ్ల పందాల జోరు ఊపందుకుంది. కాకినాడ జిల్లాలో కోడి పందాలు ప్రారంభమయయాయి. ఏడు నియోజకవర్గాలక గాను 60కి పైగా పందెం బరులు ఏర్పాటు చేశారు. బరిలో కాలుదువ్వుతున్న కోళ్లపై భారీగా పందాలు కాస్తున్నారు పందెం రాయుళ్లు. పందాలను తిలకించేందుకు బరుల వద్దకు తరలివస్తున్నార పందెం రాయుళ్లు. ఆ ప్రాంగంణాల్లోనే విచ్చలవిడిగా గూండాట జూదాలు కొనసాగుతున్నాయి. -
కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా అగ్ని ప్రమాదం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని, తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 38 పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా భస్మీపటలం అవడం తీవ్ర విచారకరం. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. వారికి తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష అందజేయాలి. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలి. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా, సార్లంకపల్లె.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో బూడిదైపోయింది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా, 38 పూరిళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అడవిని నమ్ముకొని జీవించే సార్లంక గిరిజనులు సంక్రాంతి సందర్భంగా సరకుల కొనుగోళ్లకు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ఊరంతా శ్మశానంగా మారింది. ఊరికి 50 కి.మీ. దూరంలోని తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఊరంతా మంటల్లో ఆహుతైపోయింది. -
Kakinada: ఒక్కసారి ఎగసిపడ్డ మంటలు 40 ఇళ్లు దగ్ధం..
-
కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం
కాకినాడ: జిల్లాలోని రౌతులపూడి మండలం సార్లంక గిరిజన గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్ర వేళ సార్లంక గిరిజన గ్రామంలోని పూరిళ్లు దగ్ధమయ్యాయి,. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 40 పూరిళ్లు బూడిదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కాలి బూదిదం కావడంతో ఆ గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము సర్వస్వం కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. -
‘దేవాలయ పూజారిపై దాడి అమానుషం’
కాకినాడ:: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పూజారి సుందర సీతారామయ్యశర్మపై దాడి అమానుషమని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ ఆక్షేపించారు. పదునైన ఆయుధంతో పూజారిపై దాడి, నాగరిక సమాజాన్ని తలదించుకు ఘటన అని ఆయన అభివర్ణించారు. పూజారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.దాడిలో తీవ్రంగా గాయపడి, కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పురోహితుడు సుందర సీతారామయ్య శర్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..:క్షమించరాని నేరంభగవంతుడి సేవలో ఉన్న పూజారిపై కిరాతక దాడి జరగడం దురదృష్టకరం. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌరహిత్యం చేస్తున్న పేద బ్రాహ్మణుడిపై ఇలా దాడి చేయడం క్షమించరాని నేరం. వేట కొడవలితో దాడి చేయడం, ఆ పని చేసిన వ్యక్తి నైజాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీకి చెందిన గ్రామ నాయకుడి కుమారుడు కొండమూరి శివయ్య, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలకు మానసిక పరిస్థితి పేరిట ముసుగులు వేయడం చాలా పెద్ద తప్పు. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే.కూటమి పాలనలో ఏ ఒక్కరికీ భద్రత లేదుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయి. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు. మహిళలు, చిన్నపిల్లలు, దేవాలయ సేవకులకూ భద్రత లేకుండా పోయింది. పేద బ్రహ్మణ కుటుంబానికి చెందిన సుందర సీతారామయ్య శర్మ అప్పుల్లో కూరుకుపోయి పురోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం దుర్మార్గం. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలురాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి. తిరుపతి తొక్కిసలాట, సింహాచలంలో అమాయక భక్తుల మరణాలు, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనలు.. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే. కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. పూజారిపై జరిగిన దాడి ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ హెచ్చరించారు. -
పూరీ- తిరుపతి రైలుకు తప్పిన ప్రమాదం
సాక్షి, అన్నవరం: పూరీ నుండి తిరుపతి వెళ్తున్న 17479 ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈరోజు (గురువారం) ఉదయం పెను ప్రమాదం తప్పింది. రైలు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పరిధిలోని తుని - అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో, ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైలులోని బీ5 ఏసీ బోగీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలోని ప్యానెల్ బోర్డు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న దుప్పట్లకు అంటుకోవడంతో బోగీ అంతటా పొగలు కమ్ముకున్నాయి. దీనిని గమనించిన ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేయడంతో రైలులో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రైలులోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి, మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అదుపు చేశారు. సిబ్బంది అప్రమత్తత వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్పాయి. ఈ ప్రమాదం దరిమిలా ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు.మంటలను అదుపు చేసిన తర్వాత రైలును రాజమహేంద్రవరం స్టేషన్‌కు తరలించారు. అక్కడ రైల్వే సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులు ప్రమాదానికి గురైన బీ5 బోగీని నిశితంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేపట్టారు. తనిఖీల అనంతరం రైలు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించింది. -
మంత్రి కందుల దుర్గేష్ పైరవీలు.. జనసేన నేతల అసంతృప్తి
సాక్షి,కాకినాడ: జనసేన పార్టీలో కాకినాడ జిల్లా రాజకీయాలు రోజు రోజుకు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ పాత్రపై పార్టీ లోపలే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.మంత్రి దుర్గేష్ పైరవీలపై అసంతృప్తికుడా చైర్మన్ పదవిని ముత్తా శశిధర్ ముఖ్య అనుచరుడైన తలాటం సత్యకు కేటాయించాలంటూ మంత్రి కందుల దుర్గేష్ పైరవీలు చేయడం జనసేన వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దుర్గేష్‌కు సంబంధించిన లేఅవుట్లు, వ్యాపార ప్రయోజనాలే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గేష్‌కు అనుకూలమైన వ్యక్తిని ముందుంచి నిర్ణయాలపై ప్రభావం చూపాలన్న ప్రయత్నం జరుగుతోందని కొందరు నేతలు బహిరంగంగానే వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇప్పుడు కీలక పదవులు ఎలా ఇస్తారు? అని ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు దుర్గేష్‌ను ప్రశ్నిస్తున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు వంటి ప్రాంతాల్లో పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కన పెట్టి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని వారు హెచ్చరిస్తున్నారు.ఒకే పార్టీ నుంచి ఒకే సామాజిక వర్గానికి, ఒకే నియోజకవర్గానికి రెండు కీలక పదవులు ఇవ్వకూడదన్న పార్టీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాకినాడ సిటీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట సుధీర్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో కుడా చైర్మన్ పదవి విషయంలో ఏర్పడిన వివాదాన్ని నివారించేందుకు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం గుర్తు చేస్తున్నారు.తలాటం సత్య కాకినాడ సిటీకి చెందినవారే కావడంతో మరోసారి సిటీ నుంచే పదవి ఇస్తే సమస్యలు తలెత్తవచ్చని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారు. కుడా చైర్మన్ పదవిని కాపు సామాజిక వర్గానికే కేటాయించాల్సి వస్తే ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ప్రత్తిపాడు జనసేన నేత కత్తిపూడి బాబీ, లేదా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు పేర్లు చర్చలో ఉన్నాయి. -
కాకినాడ జిల్లాలో లబ్ధిదారుల పెన్షన్లలో డబ్బులు కోత
-
AP: ‘మా సీట్లో నువ్వు కూర్చుంటావా’..?
కాకినాడ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ చోటు చేసుకున్న ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ప్రయాణికుడ్ని జట్టుపట్టుకుని చితకబాదారు మహిళా ప్రయాణికులు. తాము కర్చీఫ్ వేసుకున్న సీట్లో పురుష ప్రయాణికుడు కూర్చోవడంతో గొడవ ఆరంభమైంది. మాటామాటా పెరగడంతో ఆ పురుష ప్రయాణికుడ్ని జట్టు పట్టుకుని చితకబాదారు. ఆ దాడితో బస్సులోని మిగతా ప్రయాణికులు నివ్వెరపోయారు. ఏం చేయాలో తెలియక, ఈ గొడవ ఎటు తిరిగి ఎటు పోతుందోననే భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఇది తుని-నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసి బస్సులో జరిగింది. ఇదిలా ఉంచితే, ఇటీవల విజయవాడ మార్గంలో మహిళల మధ్య సీటు కోసం వాగ్వాదం చోటు చేసుకుని శారీరకంగా దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పెనుగంచిప్రోలు నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం వాగ్వాదం ప్రారంభించారు అది ఆ తర్వాత సోడా బాటిల్‌తో దాడి చేయడం వరకు వెళ్లింది. మహిళల మధ్య తీవ్ర తగాదామరో సంఘటనలో మహిళలు ఒకరినొకరు జుట్టు లాగడం, చెంపదెబ్బలు కొట్టుకోవడం వంటి హింసాత్మక చర్యలకు దిగారు. ప్రయాణికులు వీడియో తీసి ఆన్లైన్లో షేర్ చేయడంతో ఈ ఘటన కూడా పెద్ద చర్చకు దారితీసింది..* -
కాకినాడ జీజీహెచ్‌లో ఘోరం
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో తాజాగా మరో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఒక గర్భిణి బలైపోయింది. తాళ్లరేవు మండలం గాడిమొగ సమీపంలోని చినవలసలకు చెందిన మల్లేష్, మల్లీశ్వరి దంపతులు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. మళ్లీ ఎనిమిదోనెల గర్భవతి అయిన మల్లీశ్వరి సాధారణ పరీక్షల కోసం ఈ నెల 14న కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. ఆ సమయంలో తనకు పడని మందుల జాబితాను వైద్యులకు ఇచ్చింది. ఈ వివరాలు కేస్ షీటులో రాసుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె తనకు పడదని రాసిచి్చన పాంటాప్రొజోల్ ఇంజక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో బాధితురాలి వదిన, ఏఎన్ఎం అయిన ధనలక్ష్మి ఆ ఇంజక్షన్ మల్లీశ్వరికి పడదని, చేయవద్దని అడ్డుపడ్డారు. అయినా వినకుండా డాక్టరు ఆ ఇంజక్షన్ చేశారు. కొద్దిసేపటికే కుప్పకూలిన మల్లీశ్వరిని జీఐసీయూకు తరలించారు. అప్పటికే ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. వైద్యులు ఆమెకు అరగంటకు ఒకసారి సీపీఆర్ చేశారు. దీంతో ధనలక్ష్మి.. మల్లీశ్వరికి ఏమైందో చెప్పాలని, తమవారిని పిలుస్తానని చెప్పారు. ఎవ్వరినీ పిలవొద్దని, బీపీ కాస్త అసాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. చివరకు రాత్రి 11గంటల సమయంలో మల్లీశ్వరి చనిపోయిందని చెప్పారు. మల్లీశ్వరి మధ్యాహ్నం చనిపోతే కావాలనే వైద్యులు దాచిపెట్టారని మల్లీశ్వరి భర్త మల్లేష్, వదిన ధనలక్ష్మి విలపించారు. వైద్యులు చేసిన ఇంజక్షన్ సీసాను తీసుకుంటుంటే సిబ్బంది అడ్డగించారని తెలిపారు. గొడవేమీ చేయవద్దని, అలా చేస్తే కేసు నమోదవుతుందని, పోస్టుమార్టం చేసి గర్భిణి దేహాన్ని కోయాల్సి ఉంటుందని భయపెట్టారని చెప్పారు. నిస్సహాయస్థితిలో మల్లీశ్వరి మృతదేహాన్ని అర్ధరాత్రి వేళ కాకినాడ నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు. -
కాకినాడలో ‘పెళ్లి’ కారు బీభత్సం.. ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు షెల్టర్‌లో వేచి ఉన్న ప్రయాణికుల పైకి అతి వేగంతో వచ్చిన పెళ్లి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కిర్లంపూడి మండలం సోమవారం జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన బస్సు షెల్టర్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. అనంతరం, బైక్, రిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కృష్ణపట్నం పోర్టులో ‘ఎస్’ ట్యాక్స్.. ఇష్టారాజ్యంగా దోపిడీ.. -
భారీ గాలులతో అర్ధరాత్రి అల్లకల్లోలం
-
ఈరోజు రాత్రికే.. కాకినాడకు 270KMల దూరంలో తుఫాన్
-
మోంథా తుఫాన్‌తో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Cyclone Montha : ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం.. వామ్మో.. రాకాసి అలలు
-
Montha Cyclone: ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
-
Montha Cyclone: 500 కి.మీ దూరంలో తుఫాన్ డేంజర్ లో కాకినాడ


