‘మరి వైజాగ్‌లో ఐటీ కంపెనీలకు ఎలా అనుమతిస్తున్నారు?’ | YSRCP Leader Kurasala Kannababu Takes On Chandrababu Comments | Sakshi
Sakshi News home page

‘మరి వైజాగ్‌లో ఐటీ కంపెనీలకు ఎలా అనుమతిస్తున్నారు?’

Mar 28 2026 6:39 PM | Updated on Mar 28 2026 7:32 PM

YSRCP Leader Kurasala Kannababu Takes On Chandrababu Comments

కాకినాడ:  పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌ను వదిలేసి వచ్చి అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పుకొచ్చారని, ఇప్పుడు మళ్ళీ ఎవరిని మభ్య పెట్టడానికి అసెంబ్లీ లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్మానం చేయడం వెనుక కారణాలు ఏంటని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇంత వరకు ఇవ్వలేదని, ఇప్పుడు అమరావతి పేరుతో కట్టు కధలు చెప్పి రానున్న మూడేళ్ళు గడిపేయడానికి ఈ డ్రామా అని ధ్వజమెత్తారు కురసాల. 

మీరు మళ్ళీ అధికారంలో ఉంటామన్న నమ్మకం మీకు లేదా?, రైతులకు ఒక్క రిటన్ బుల్ ఫ్లాట్ ఇచ్చారా?, రాజధాని రైతు చనిపోతే కనీసం మీరు పరామర్శించారా?, చారిత్రాత్మక రాజధాని అని మీరు చెప్పినప్పుడు సమిధలు అవుతున్న రైతులను పరామర్శించరా?, ఇప్పటికీ రాజధానికి సరైన కనెక్టింగ్ రోడ్డులు ఉన్నాయా?, కనీసం ఆస్తులు ఉండీ అమ్ముకునే దుస్ధితి అమరావతి రైతులకు లేదు. 

రాజధానికి అప్పులు ఎక్కడ నుండి తెస్తున్నారో తెలియదు. రాజధాని భవనాలకు అడుగు నిర్మాణానికి రూ. 11 వేలు అవినీతి కాదా?, డిజైన్లకు కొత్తగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇడ్లీ పాత్ర..ఉప్మా గిన్నెల్లా భవనాలను డిజైన్ చేయించారు.రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎలాంటి అభివృద్ధి లేదు. అమరావతిని సెల్ప్ ఫైనాన్స్ నగరం అని చెప్పి ఇప్పటి వరకు నిధులు ఏమైనా సమీకరించారా?, రాజధాని లో ఇవాళ్టీకి భూములు తుప్పలుగా ..పరలు పరలుగా కనిపిస్తున్నాయి.హైపర్ లూప్, ఒలింపిక్స్ అంటూ అమరావతిని బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. అమరావతి ని ఒక మహ నగరంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఎవరికీ లేదు.

అప్పుడు సునామీలన్నారు.. ఇప్పుడు ఐటీ కంపెనీలకు అనుమతి ఎలా?
రాష్ట్రంలో అతి పెద్ద సిటీ వైజాగ్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వైజాగ్‌ను పరిపాలన రాజధాని చేస్తానంటే.. సునామీలు వస్తాయని టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయించింది. మరీ వైజాగ్‌లో ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఏలా అనుమతి ఇస్తున్నారు. అమరావతి మీరు క్రియేట్ చేసిన ఇల్యూజన్‌లా కనిపిస్తుంది.అమరావతిని ఎవరికి స్వర్గంలా చేసేందుకు నిర్మిస్తున్నారు. అమరావతి లో పేదలకు చోటు లేదా? ఎవరి కోసం నిర్మాణం’ అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement