ట్రాఫిక్‌ చలానా ఉంటే పిల్లనివ్వను | Traffic Challans Become A Marriage Check, Groom’s Driving Record Now Under Scrutiny In Wedding Arrangements | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ చలానా ఉంటే పిల్లనివ్వను

May 27 2026 5:25 PM | Updated on May 27 2026 5:35 PM

Kakinada: Why Bride Father Check Groom Vehicle Traffic Challan

పెళ్లికాని అబ్బాయిల‌కు అల‌ర్ట్‌. మీ బండిపై ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా? అయితే మీకు పెళ్లి కాక‌పోవ‌చ్చు. వెడ్డింగ్‌కు, ట్రాఫిక్ చలానా సంబంధంమేంట‌ని బుర్ర గోక్కుంటున్నారా? పెళ్లి సంబంధాల్లో స‌హ‌జంగా అమ్మాయి త‌ల్లిదండ్రులు చూసేది అబ్బాయి గుణ‌గ‌ణాలు, ఉద్యోగం, కుటుంబం, ఆస్తులు. కానీ ఇప్పుడు అబ్బాయి బండికి సంబంధించిన ట్రాఫిక్ చ‌లానాలు కూడా చూస్తున్నారు. న‌మ్మ‌కం క‌ల‌గట్లేదా? అయితే ఇది చ‌ద‌వండి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయనది కాకినాడలోని రాయుడుపాలెం.. ఈయనకు ఒక్కగానొక్క కూతురు. భార్య చనిపోవడంతో కూతురిని కంటికి రెప్పలా పెంచి పెద్దచేశాడు. ఎంబీఏ వరకు చదివించాడు. ఇప్పుడు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అయితే అబ్బాయి గుణగణాలతోపాటు భవిష్యత్తులో తన కూతురి భద్రత, భవిష్యత్తు దృష్ట్యా అతడి ట్రాఫిక్‌ క్రమశిక్షణపైనా ఆరా తీయాలని సంకల్పించాడు.

కాకినాడ ట్రాఫిక్‌–2 సీఐ దానేటి రామారావు వద్దకు వచ్చి తనకు కాబోయే అల్లుడి కారు, ద్విచక్రవాహనాల నంబర్లు చీటిపై రాసిచ్చి వాటిపై ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులేమైనా ఉన్నాయేమోనని చెప్పాలని కోరాడు. చలానాలు ఉంటే పిల్లనివ్వనని స్పష్టం చేశాడు. కూతురి భవిష్యత్తుపై పెద్దాయన చూపిస్తున్న తాపత్రయానికి ముగ్దుడైన సీఐ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.              
– కాకినాడ క్రైం

చ‌ద‌వండి: కొత్త అల్లుడికి ప‌సందైన విందు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement