తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ( మే 27, బుధవారం) పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై వైఎస్ జగన్.. కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలో చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్ జగన్ బుక్ విడుదల చేశారు.
జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.


