పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినతే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ(జూన్ 24, బుధవారం) రెండో రోజు పర్యటన కొనసాగింది.
భూమయ్యగారిపల్లెలో గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.
. అనంతరం భూమయ్యగారిపల్లెలో ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్ ఓబులరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం బాకరాపేటలో ఓ చిన్నారికి ఓనమాలు దిద్దించిన వైఎస్ జగన్ అక్షరాభ్యాసం చేయించారు.
పులివెందుల మున్సిపాలిటీలోని ఎర్రగుడిపల్లిలో సీసీ రోడ్లను వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం పులివెందులలోని నివాసంలో ఓ చిన్నారికి దైవిక అని వైఎస్ జగన్ నామకరణం చేశారు.


