breaking news
tour
-
ఇదీ అమిత్‌షా షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 26న (ఆదివారం) ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వస్తున్న విషయం తెలిసిందే. కాగా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.45 నిమిషాలకు కరీంనగర్‌కు వెళతారు. అక్కడికి దగ్గరలోని నగునూరు రోడ్డులో ఉన్నప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చేరుకుని లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.45 గంటల వరకు ప్రతిమ వైద్య కళాశాల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హె లికాప్టర్‌లో సాయంత్రం 4.55 నిమిషాలకు బేగంపేటకు చేరుకుని ఆ వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. -
పీక్ సీజన్లో హోటళ్లు చవకగా బుక్ చేసుకోవాలంటే...
సెలవులు, పండుగలు, లాంగ్ వీకెండ్లు... ఇలా పీక్ సీజన్ లో ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చే సమస్య హోటల్ ధరలే. అదే గది సాధారణ రోజుల్లో ఒక ధర ఉంటే, పీక్ సీజన్ లో మరో ధర ఉంటుంది. అయితే కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే 20 నుంచి 40 శాతం వరకు డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ 12 సులభమైన చిట్కాలు ఉపయోగపడతాయి.1. సరైన సమయంలో బుకింగ్ చేయండి..వారం మధ్యలో, ముఖ్యంగా డిమాండ్ తక్కువగా ఉండే సమయంలో ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ధరలు పరిశీలించి బుక్ చేయండి.2. వ్యక్తిగత బ్రౌజింగ్ లేకుండా వెతకండి..ఒకే హోటల్‌ను పదేపదే వెతికితే ధరల్లో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగత బ్రౌజింగ్ సమాచారం లేకుండా లేదా మరో పరికరం ద్వారా కూడా ఒకసారి ధరలు పరిశీలించండి.3. ప్రధాన ప్రాంతం కాకుండా..పర్యాటక ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న హోటళ్లు ఖరీదుగా ఉండే అవకాశం ఎక్కువ. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరకొచ్చు.4. వారాంతపు రోజులను వీలైతే ఎవాయిడ్ చేయండి..శని, ఆదివారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు సోమవారం నుంచి గురువారం మధ్య బుకింగ్ చేసుకునేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించండి.5. హోటల్‌తో నేరుగా మాట్లాడండి..ఆన్ లైన్ లో కనిపించిన ధరను ప్రస్తావిస్తూ హోటల్‌కు నేరుగా ఫోన్ చేస్తే కొన్నిసార్లు అదే ధరకు లేదా ఇంకా తక్కువకు గది ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎర్లీ చెకిన్ లేదా లేట్ చెకిన్ చేసే సౌకర్యం కూడా లభించవచ్చు.6. ఫుడ్ ఉన్న ప్యాకేజీలను ఎంచుకోండి..గదితో పాటు అల్పాహారం లేదా రాత్రి భోజనం కలిపి ఇచ్చే ప్యాకేజీలు ఎంచుకుంటే విడిగా ఖర్చు చేయడంకంటే చవకగా ఉండొచ్చు.7. ఫిల్టర్ కరెక్టుగా చేయండి..మంచి రేటింగ్, సరైన ప్రదేశం, తక్కువ ధర వంటి ప్రమాణాలతో హోటళ్లను ఫిల్టర్ చేసుకుంటే చూసుకుంటే మంచి వసతి సులభంగా దొరుకుతుంది.8. ముందుగానే బుక్ చేసుకోండి..ప్రయాణ తేదీ ముందే ఖరారైతే కనీసం రెండు నెలల ముందే బుక్ చేసుకోవడం మంచిది. ఫ్రీ కేన్సిలేషన్ సౌకర్యం ఉన్న రూమ్‌ని ఎంచుకుంటే తరువాత ధర తగ్గినప్పుడు మళ్లీ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.9. హోటల్‌కు వెళ్లిన తర్వాతే చెల్లించండి..ఇలా చెకిన్ చేసిన తరువాత పే చేసే అవకాశం ఉంటే ధరలు, రూల్స్ చెక్ చేయండి. అయితే ముందుగా పక్కాగా చెల్లించాలా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.10. ఆఫర్లను యూజ్ చేసుకోండి..వివిధ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, బ్యాంకులు, యూపీఐ సేవలు అందించే ఆఫర్లు, కూపన్లు, రివార్డ్ పాయింట్లను ఉపయోగించుకుంటే మరింత ఆదా చేయవచ్చు.11. రద్దీ సమయంలో వద్దు..సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కువ మంది బుకింగ్ చేయడం వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు. వీలైతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ముందుగానే బుకింగ్ ప్రయత్నించండి.12. నియర్ బై టౌన్స్ చెక్ చేయండిప్రధాన ప్రాంతంలోని హోటళ్లు పూర్తిగా నిండిపోయినప్పుడు సమీప పట్టణాలు లేదా శివారు ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరికే అవకాశం ఉంటుంది.చివరగా...ఒకే వెబ్‌సైట్‌పై ఆధారపడకుండా కనీసం రెండు లేదా మూడు బుకింగ్ వేదికల్లో ధరలను పోల్చండి. హోటల్ రివ్యూలు, కేన్సిలేషన్, అదనపు ఛార్జీలను పరిశీలించిన తర్వాతే బుకింగ్ చేయండి. -
'తెలంగాణ కాశ్మీర్' చూడదగ్గ అందమైన స్థలం..
చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు.. ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం. ఎటు చూసినా పచ్చని చెట్లతో దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు కనువిందు చేసే ఈ జిల్లాను తెలంగాణ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఈ జిల్లా ప్రకృతి అందాలు ఊటీ, కొడైకెనాల్‌లను గుర్తుచేస్తాయని పర్యాటకులు అంటుంటారు.ముఖ్యంగా తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన కుంటాల జలపాతాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తారు. మరి ఇంత అందమైన కుంటాల జలపాతం హైదరాబాద్ నుంచి ఎంత దూరంలో ఉందో, ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలేంటో తెలుసుకుందాం.జలపాతం ప్రత్యేకతకుంటాల జలపాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) నేరడిగొండ మండలం కుంటాల(బి) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉంది. ఇది 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతూ, పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని దగ్గరగా చూడాలంటే సుమారు 430 మెట్లు కిందికి దిగాల్సి ఉంటుంది. సహ్యాద్రి పర్వతాల నడుమ వంపులు తిరిగే మహబూబ్ ఘాట్ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. హైదరాబాద్ సిటీ నుంచి ఈ కుంటాల వాటర్‌ఫాల్ సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.విజయవాడ నుంచి ఎలా వెళ్లాలి?విజయవాడ నుంచి కుంటాల జలపాతానికి సుమారు 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో 8–9 గంటల్లో చేరుకోవచ్చు.విజయవాడ–హైదరాబాద్–కామారెడ్డి–నిర్మల్–నేరడిగొండ మీదుగా కుంటాలకు వెళ్లొచ్చు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ లేదా నిర్మల్ వరకు రైలు, బస్సులో చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ లేదా ఆర్టీసీ బస్సులో జలపాతానికి వెళ్లవచ్చు.ఆదిలాబాద్ జిల్లాలోని ఇతర టూరిజం స్పాట్స్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం కుంటాల జలపాతం మాత్రమే కాదు, ఎన్నో సుందరమైన దృశ్యాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచిన బాసర సరస్వతి ఆలయం ఇక్కడే ఉంది.గోదావరి, ప్రాణహిత నదులు ఇక్కడ పరవళ్లు తొక్కుతుంటే, కడెం ప్రాజెక్టు ప్రకతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న కవ్వాల్ అభయారణ్యం పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ అభయారణ్యం పచ్చని చెట్లతో ప్రకతికి పచ్చని చీరకట్టినట్లు కనిపిస్తుంది. ఈ అభయారణ్యం ఎన్నో రకాల పక్షులు, వన్య్రపాణులకు ఆలవాలంగా మారింది. జైపూర్ మండలం శివారం మొసళ్ల సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది.ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దట్టమైన అడవులు, కొండలు, సెలయేర్లు, నల్లటి రహదారులు ప్రకతి రమణీయతను పెంచుతాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడి అందాలు పీక్కు చేరుకుంటాయి. ఆ సీజన్ లో పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి, ఇక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని, అందాలను ఆస్వాదించి వెళతారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే, ఈ తెలంగాణ కాశ్మీర్ అందాలను ఒక్కసారి తప్పక దర్శించండి. -
చరిత్రతో చేతులు కలిపిన ప్రకృతి..
కంబోడియాలోని సీయెమ్ రీప్ వద్ద ఉన్న అంగ్కోర్ వాట్ని మొదటిసారి చూస్తే గ్రాఫిక్స్ చేసిన కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ప్రతి గోపురం, ప్రతి మెట్టు, ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది.సరస్సులో ఆలయ ప్రతిబింబం ఆంగ్కోర్ వాట్ ఆలయ ప్రాంగణంలో ఉదయం సూర్యోదయం సమయంలో ఆకాశం రంగులు మారిపోతాయి. ఆ ప్రతిబింబం ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో పడటం చూస్తే కాలం కాసేపు ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది. క్రీ.శ.12వ శతాబ్దంలో నిర్మించిన ఈ మహా కట్టడం నేటికీ వివిధ దేశాల నుండి వచ్చే సందర్శకులను తన వైపు ఆకర్షిస్తూ ఉంది. అయితే అంగ్కోర్ వాట్ నిజమైన అందం దాని పరిమాణంలో కాదు. దాని మధ్య నడిచే సమయంలో ఫీలయ్యే సైలెన్స్, అడవి చెట్ల వాసనలో, రాళ్ల మీద పడే వెలుగులో ఉంటుంది.ఎంత గొప్ప కట్టడాలైన కాల గమనంలో కనుమరుగవుతుంటాయి. కానీ, కాలాన్ని కూడా అధిగమించి అలనాటి కథలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది ఆంగ్కోర్ వాట్ ఆలయం. ఇక్కడ చిన్న ఆకు సవ్వడి చేసినా వినిపించేంతటి నిశ్శబ్దం.. ఉదయం వెలుగులో మెరిసే గోపురాలు... రాళ్ల మీద సప్తవర్ణాలు లిఖించే సూర్యకిరణాలు.. ఎటు చూసినా పచ్చందనంతో అడవి మధ్యలో కాలం నిలిచి పోయిందా అనడానికి సజీవ సాక్ష్యంలా ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఆలయ సముదాయంగా విరాజిల్లుతోంది అంగ్‌కోర్‌వాట్.సందర్శనీయ ప్రదేశాలు..అంగ్కోర్ వాట్ ఆర్కియాలజీ ΄ార్క్ మొత్తం ఒక ఓపెన్ మ్యూజియంలా ఉంటుంది. స్థానికంగా బయోన్ టెంపుల్లో నవ్వుతున్న ముఖాలను చూస్తే ఆ శిల్పకారుల కలలో మనం కూడా చేరిపోతాం.తాప్రోమ్ దగ్గర రాళ్ల మధ్యలో పెరిగిన చెట్లను చూస్తే ప్రకృతి, చరిత్ర మధ్య ఉన్న స్నేహం అర్థం అవుతుంది.బాంటీ స్రే అనే చిన్న ఆలయంలో ఉన్న చిన్న పింక్ శాండ్‌స్టోన్ శిల్పకళ మనసును హత్తుకునేలా ఉంటుంది. నాటి కళాకారుల ఓపిక, వారి ప్రతిభను గుర్తు చేస్తుంది.ప్రే ఖాన్, అంగ్కోర్ థామ్ మధ్య నడుస్తూ వెళ్తే ప్రతి మూలలో ఒక కొత్త దృశ్యం ఎదురవుతుంది. ఎక్కడ చూసినా శిల్పం, చెరువు, గోపురం.. అన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.ఏం చూడాలి?అంగ్కోర్ వాట్ వద్ద సూర్యోదయాన్ని చూడటం ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. బయోన్ ఆలయంలో ఉన్న చిరునవ్వులు, తాప్రోమ్ను ఆక్రమించిన వృక్షాలు, అంగ్కోర్ థామ్ ద్వారాలు, ఎలిఫెంట్ టెర్రస్, బాంటీ స్రే శిల్పకళ ఇవన్నీ ప్రతీసారి కొత్తగా అనిపిస్తాయి.సాయంత్రం ఫ్నోమ్ బాఖెంగ్ దగ్గర సూర్యాస్తమయంలో ఆకాశంలో రంగులు మెల్లగా మారడాన్ని చూసి ఆస్వాదించవచ్చు. చెరువుల్లో పడిన ఆ వెలుగు ప్రతిబింబం ప్రయాణాన్ని ఒక అందమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది.రాళ్ల మధ్య సాగే ప్రయాణం..అంగ్కోర్ వాట్లో గడిపే ప్రతి నిమిషం ఒక సినిమా సీన్ లా ఉంటుంది. ఉదయం వెలుగులో గోపురాలను ముద్దాడుతుంటే కెమెరా పక్కన పెట్టాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో కేవలం అక్కడే నిలబడి ఆ మౌనాన్ని వింటేనే చాలు అనిపిస్తుంది.సాయంత్రం చెరువుల పక్కన వీచే గాలిని ఫీలవ్వడం అనేది మాటలకు అందని అనుభవంగా మిగిలిపోతుంది. దూరంగా వినిపించే పక్షుల స్వరాలు, అడవి ఆకుల కదలికలుం ఈ ప్రదేశాన్ని ఇంకా లైవ్లీగా మార్చేస్తాయి. ఇక్కడ ప్రతి అడుగు చరిత్రతో కలిసి నడుస్తున్న అనుభూతిని ఇస్తుంది.ఇక్కడ సైకిల్ రైడ్ చేయడం, సన్ రైజ్‌ను నిశ్శబ్దంగా ఆస్వాదించడం, తాప్రోమ్ అడవిలో నడవడం, బయోన్ శిల్పాలను దగ్గరగా గమనించడం, సాయంత్రం సాస్కృతిక నృత్య ప్రదర్శనలను చూడటం ఇవన్నీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.అడవి ఒడిలో.. మహా కట్టడం12వ శతాబ్దంలో ఖ్మేర్ చక్రవర్తి 2వ సూర్యవర్మన్ నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయం మొదటిగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు. తరువాత బుద్ధ సంప్రదాయంలో ప్రముఖ ఆరాధన కేంద్రంగా మారింది.సమయం మారినా, కాలం గడిచినా, శతాబ్దాల ΄ాటు అడవి ఈ మహా కట్టడాన్ని తన ఒడిలో దాచుకున్నా.. దాని వైభవం మాత్రం నేటికీ తగ్గలేదు.ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న అంగ్కోర్ వాట్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు.. మానవ సృజనాత్మకత శక్తికి, కళ, ఆధ్యాత్మిక భావన, చరిత్ర కలిసిన ఒక సజీవ మహాకావ్యం.ఆసక్తికరమైన విషయాలుఅంగ్కోర్ వాట్ అనేది 1992 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక ఆలయ సముదాయంగా గుర్తింపు పొందింది.అంగ్కోర్ వాట్ ఆలయం కంబోడియాలోని సియేమ్ రీప్ ప్రావిన్స్ దగ్గర అంగ్కోర్ ఆర్కియాలజికల్ ΄ార్క్లో ఉంది.ఖ్మేర్ సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళ, నిర్మాణానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి సియేమ్ రీప్ వెళ్లడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కానీ బ్యాంకాక్, కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్తో చేరుకోవచ్చు.ప్రయాణం మధ్యలో ఆకాశం నుంచి కనిపించే పచ్చని పొలాలు, మెకాంగ్ప్రాంతం దృశ్యాలు జర్నీలో ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి.విజయవాడ నుంచి వెళ్లాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై మీదుగా అంతర్జాతీయ విమానాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టు నుండి సియేమ్ రీప్ నగరం వరకు ప్రయాణం తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.నగరం నుంచి అంగ్కోర్ ఆర్కియాలజీ ΄ార్క్ చేరేటప్పుడు రోడ్ పక్కనే కనిపించే చెట్లు, చెరువులు, గ్రామ జీవితం ప్రయాణాన్ని ఇంకా అందంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?సియేమ్ రీప్‌లో బోటిక్ హోటల్స్, హెరిటేజ్ రిసార్ట్స్, గార్డెన్ స్టేస్ చాలా అందంగా ఉంటాయి. పూల్ పక్కనే నెలకొన్న నిశ్శబ్దం, పచ్చని చెట్లు, ట్రెడిషనల్ ఖ్మేర్ ఆర్కిటెక్చర్ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.ఉదయం కాఫీతో నుంచి సాయంత్రం దీ΄ాల వెలుగులో గార్డెన్స్‌లో కూర్చుని సమయం గడిపే వరకు ఈ గ్రామంలో మీకు ఎక్కడా బోర్ కొట్టదు.లగ్జరీ రిసార్ట్స్ నుండి సింపుల్ గెస్ట్ హౌస్ వరకు ప్రతి స్టేలో కంబోడియా ప్రజల మంచి మనసు, వారి సింప్లిసిటీ స్పష్టంగా కనిపిస్తుంది.ఏం తినాలి?కంబోడియా భోజనంలో ఫ్రెష్‌నెస్ ప్రతి బైట్‌లో మీరు ఫీల్ అవ్వవచ్చు. ఫిష్ అమోక్ అనే స్థానిక ట్రెడిషనల్ కర్రీ కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా మధురంగా ఉంటుంది. ఖ్మేర్ కర్రీ, ఫ్రై డ్ రైస్, ట్రాపికల్ ఫ్రూట్స్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, స్టికీ రైస్ డెజర్ట్స్ ప్రతి భోజనాన్ని మరింత రుచికరంగా మార్చుతాయి.స్ట్రీట్ కేఫ్స్‌లో దొరికే లోకల్ కాఫీ, ఫ్రెష్ ఫ్రూట్స్, ఈవినింగ్ ఫుడ్ మార్కెట్లో ఉన్న వాతావరణం ఇవన్నీ కంప్లీట్ ఫుడ్ ఫ్లేవర్‌ను అందిస్తాయి.యాత్రా, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుండి 5 రోజుల అంగ్కోర్ వాట్ ప్రయాణం బడ్జెట్ కేటగిరీలో ΄్లాన్ చేసుకుంటే ప్రతి వ్యక్తికి సుమారు రూ.55,000 నుండి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ ట్రిప్ కోసం రూ.80 వేల నుంచి రూ.1 లక్షా 10 వేల మధ్య ఖర్చు అవుతుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.1 లక్షా 40 వేల నుండి రూ.2 లక్షల వరకు ΄్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను బట్టి కొంచెం అదనపు ఖర్చు అవుతుంది.స్టే చార్జెస్ బడ్జెట్ హోటల్స్‌లో ఒక రాత్రికి రూ.2,500 నుంచి రూ.5,000 మధ్య ఉంటాయి. స్టాండర్డ్ హోటల్స్ రూ.6,000 నుండి రూ.10,000 వరకు, ప్రీమియం రిసార్టులు రూ.15,000 పైన ఉంటాయి. భోజనానికి ప్రతీ రోజు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య ఖర్చు చేస్తే సరిపోతుంది.లోకల్ గైడెడ్ హెరిటేజ్ వాక్స్, టుక్ టుక్ రైడ్స్, సన్ రైజ్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియెన్స్, కల్చరల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయే అనుభవంగా మార్చేస్తాయి.వీసా ఎలా?:భారతీయ ప్రయాణికులకు కంబోడియా వీసా అనేది ఆన్ అరైవల్తో ΄ాటు ఈ–వీసా రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారాన్ని స్వయంగా వెరిఫై చేసుకుని ΄్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
భీమవరం బయలుదేరిన జగన్
-
Watch Live: భీమవరానికి వైఎస్ జగన్
-
Travel: 15,000 అడుగుల ఎత్తులో 'హోటల్ కాదు.. అడ్వెంచర్!'
రోడ్లు లేవు, వాహనాలు లేవు, ట్రెక్ చేస్తేనే చేరగలిగే హోటల్ 15,000 అడుగుల ఎత్తులో ఉంటే... ఆ హోటల్‌కి వెళ్లాలంటే 5 గంటలు ట్రెక్కింగ్ చేయాల్సిందే!లగ్జరీ హోటల్స్ గురించి వినుంటారు. కానీ స్విట్జర్లాండ్–ఇటలీ సరిహద్దులో ఆల్ఫ్స్ పర్వతాల మధ్య సుమారు 15,000 అడుగుల (4,554 మీటర్లు) ఎత్తులో ఉన్న మార్గెరిటా హట్ మాత్రం పూర్తిగా భిన్నం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మౌంటైన్ హోటల్స్‌లలో ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేదు, ఏ వాహనం కూడా వెళ్లలేదు. ట్రెక్కింగ్ చేస్తేనే ఇక్కడికి చేరుకోగలం. అది కూడా అందరూ కాదు.5 గంటల ట్రెక్.. జీవితంలో మర్చిపోలేని అనుభూతిమార్గెరిటా హట్ చేరడానికి ముందుగా గ్లేషియర్‌పై నడవాలి. సాధారణంగా పర్వతారోహకులు పుంటా గ్నిఫెట్టి అనేప్రాంతం నుండి గైడ్‌తో కలిసి సుమారు 5 గంటల ట్రెక్ చేస్తారు. మంచుతో నిండిన ఐస్ ఫీల్డులు, స్నో రిడ్జులు, హై ఆల్టిట్యూడ్ టెర్రెయిన్ లో సాగే ఈ జర్నీ అడ్వెంచర్ లవర్స్‌కి మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. దారి మధ్యలో ఆల్ఫ్స్ శిఖరాలు, ఎండ్లెస్ స్నో వ్యూస్ ప్రతి అడుగులో థ్రిల్‌ను పెంచుతాయి.హోటల్ కాదు.. అడ్వెంచర్ బేస్ క్యాంప్ ఇదిఇది రెగ్యులర్ లగ్జరీ హోటల్ కాదు. మౌంటైన్ క్లైంబర్స్, ట్రెక్కర్స్, పరిశోధకుల కోసం నిర్మించిన హై ఆల్టిట్యూడ్ రెఫ్యూజ్ ఇది. సాధారణమైన రూమ్‌లు, షేర్డ్ ఫెసిలిటీస్, వేడి వేడి భోజనం ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆల్పస్ మౌంటైన్ రేంజెస్ మీద పడే బంగారు వెలుగు చూడవచ్చు. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల అక్లైమటైజేషన్ చాలా ముఖ్యం.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా మిలాన్ లేదా జూరిచ్‌కు అంతర్జాతీయ విమానం ఎక్కాలి. అక్కడి నుండి రైలు లేదా కార్ ద్వారా అలాగ్నా వాల్సేసియా లేదా స్టాఫల్ చేరుకోవాలి. తరువాత కేబుల్ కార్ ద్వారా పుంటా ఇండ్రెన్ వరకు వెళ్లవచ్చు. అక్కడి నుండి సర్టిఫైడ్ మౌంటైన్ గైడ్‌తో ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్ అనుభవం లేనివారు గైడ్ లేకుండా ప్రయాణించకూడదు.ట్రావెల్ టిప్స్జూన్ నుండి సెప్టెంబర్ మధ్య సీజన్ ట్రెక్కింగ్‌కు అనుకూలం. థర్మల్ వేర్, వాటర్‌ప్రూఫ్ జాకెట్, ట్రెక్కింగ్ బూట్స్, గ్లవ్స్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ తప్పనిసరి. వాతావరణం నిమిషాల్లో మారిపోతుంది. కాబట్టి సరైన ప్లానింగ్ అవసరం. మార్గెరిటా హట్ అనేది ఒక హోటల్ మాత్రమే కాదు. ప్రకృతి, సాహసం, మానవ సంకల్పం కలిసిన ఒక జీవితానుభవం. రోడ్డు లేకుండా, వాహనం లేకుండా మంచి డిటర్మినేషన్ తో చేరగలిగే ఈ మౌంటైన్ హట్ సాహసయాత్రికుల బకెట్ లిస్టులో తప్పకుండా ఉండాల్సిన డెస్టినేషన్. -
ఈలలతో మాట్లాడే ద్వీపం గురించి విన్నారా ఎప్పుడైనా?
స్పెయిన్ లోని కేనరీ దీవుల్లో ఉన్న చిన్న ద్వీపం లా గోమెరాలో ఒక వింత సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కొన్ని సందర్భాల్లో మాటలతో కాకుండా ఈలల ద్వారానే మాట్లాడుకుంటారు.ఈ ప్రత్యేక భాషను సిల్బో గొమెరో అని పిలుస్తారు. పర్వతాల మధ్య ఉన్న లోయలు, ఘాట్ రోడ్ల వల్ల దూరంగా ఉన్న వారికి సందేశం పంపడానికి ఈ పద్ధతి అనేక శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈల శబ్దంతోనే సందేశాన్ని చేరవేస్తారట ఇక్కడ.ఒకానొక సమయంలో రోడ్లు, ఫోన్లు ఎక్కువ అవడంతో ఈ సంప్రదాయం అంతరిస్తుందేమో అని చాలా మంది భయపడ్డారట. కానీ లా గోమెరా అధికారులు తమ ఈల భాషను రక్షింకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ద్వీపంలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో సిల్బో గొమెరో అనే ఈల భాషను తప్పనిసరిగా బోధిస్తున్నారు. 2009లో యునెస్కో కూడా ఈ భాషను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది.కొన్ని పరిశోధనల ప్రకారం ఈ ఈల శబ్దాలు విన్నప్పుడు వాటిని వినే వారి మెదడులో సాధారణ భాషను అర్థం చేసుకునే లాంగ్వేజ్ సెంటర్లు అలాగే పని చేస్తాయట. అంటే మన మెదడు శబ్దం ఎలా ఉన్నా కూడా దానిలో ఉన్న అర్థాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సాంకేతిక యుగంలో కూడా ఈ ఈల భాష ఇంకా వాడుకలో ఉండడం అనేది నిజంగా అద్భుతం. సిల్బో గొమెరో అనేది మానవ సజనాత్మకత, సంస్కతి, ప్రకతికి అనుగుణంగా మనిషి ఎలా మారగలడో చూపించే అరుదైన ఉదాహరణగా నిలిచింది. -
Travel: మంచు పర్వతాలలో మహానుభూతి..
మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్దంగా పరుగులు తీసే వాగులు.. దూరం నుంచి వినిపించే ‘హర హర మహాదేవ్’ అనే నామ స్మరణం.. ఇవన్నీ కలిసి అమర్నాథ్ యాత్రని ఒక సాధారణ ట్రిప్‌లా కాకుండా మనసుని స్పృశించే ఆధ్మాత్మిక ప్రయాణంగా మార్చేస్తాయి. అమర్నాథ్ గుహాలయానికి చేరిన తరువాత గమ్యం కన్నా ప్రయాణమే బాగా గుర్తుంటుంది. ప్రతీ అడుగు ప్రకృతికి దగ్గరగా, ప్రతీ క్షణం దేవదేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. హిమాలయాల మధ్య నడుస్తూ వెళ్తుంటే సమయం కూడా కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.జమ్మూ అండ్ కశ్మీర్లో ఉన్న అమర్నాథ్ గుహాలయం ప్రతీ సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది. ఈ గుహలో ప్రకృతి స్వయంగా మంచుతో రూపొందించిన శివలింగాన్ని చూసి భక్తులు పరవశించిపోతారు. గుహలో అడుగుపెట్టిన వెంటనే చల్లని గాలి, మంచు వాసన, మౌనం.. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. గుహలో మంచు లింగం ముందు నిలబడిన క్షణంలో మనసంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది మాటల్లో కాదు... అనుభవంలో ఉంటుంది.సందర్శనీయ ప్రదేశాలుఅమర్నాథ్ యాత్రలో పహల్గామ్ రూట్ చాలా అందంగా ఉంటుంది. పచ్చని పచ్చిక బయలు, గంభీరంగా నిలబడిన హిమ శిఖరాలు, వాగుల మధ్య సాగే ఈ మార్గం ప్రతీ మలుపులో కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. చందన్ వారి దగ్గర చల్లని గాలి మనసుని రిఫ్రెష్ చేస్తుంది.శేష్నాగ్ లేక్ దగ్గర నీళ్లు ఆకాశాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. పంచతరణి చేరిన తరువాత హిమాలయాల వైభవం మరింత గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు చూస్తూ వెళ్తుంటే గమ్యం ఎంత మధురమో ప్రయాణం అంతే మధురంగా అనిపిస్తుంది.యాత్ర పూర్తి చేసుకున్న తరువాత శ్రీనగర్‌లో డాల్ లేక్ పై హౌజ్‌బోట్‌లో గడిపిన సాయంత్రం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మొఘల్ గార్డెన్స్‌లో నడవడం, లోకల్ బజార్లో కశ్మీర్ సంస్కృతిని చూడడం కూడా ఈ ప్రయాణానికి ఇంకో అందాన్ని జోడిస్తాయి.కశ్మీర్ క్యూజిన్ లో దమ్ ఆలూ, రాజ్మా చావల్, కావా టీ, కశ్మీరీ రోటీ లాంటి సింపుల్ డిషెస్ చల్లని వాతావరణంలో ఇంకా రుచిగా అనిపిస్తాయి. లోకల్ టీ స్టాల్స్ దగ్గర దొరికే గరం గరం చాయ్ అనేది జర్నీ మధ్య ఒక చిన్న బ్రేక్‌ని మెమొరబుల్ చేస్తుంది.ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఏప్రికాట్స్ టేస్ట్ చేస్తూ లోకల్ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీ భోజనం అక్కడి వాతావరణం లాగే సింపుల్‌గా, ఆథెంటిక్‌గా ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరుకుతాయి. ఫ్లైట్‌లో హిమాలయాలపై ప్రయాణిస్తున్న సమయం నుంచే ఈ యాత్ర ఫీలింగ్ మొదలవుతుంది.శ్రీనగర్ చేరుకున్న తరువాత రోడ్డు మార్గంలో పహల్గామ్ లేదా బాల్టాల్ వరకు వెళ్లవచ్చు. ఈ రోడ్ ట్రిప్‌లో కశ్మీర్ వ్యాలీ అందాలు ప్రతీ విండో ఫ్రేమ్‌ని ఒక పోస్టుకార్డ్లా మార్చేస్తాయి.విజయవాడ నుంచి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ లేదా ఢిల్లీ మీదుగా శ్రీనగర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్రయాణం అనేది ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా సాగుతుంది.ఏం చూడాలి?ఉదయం మంచు శిఖరాలపై పడిన వెలుగు చూడటం ఒక అందమైన దృశ్య కావ్యంలా అనిపిస్తుంది. పర్వతాల మధ్య సాగే భక్తులు, గుర్రాల సవారి, చల్లని గాలిలో ఎగురుతున్న ప్రార్థనా ధ్వజాలుం ఇవన్నీ కలిసి ఒక సినిమా సీన్ లా అనిపిస్తాయి.డాల్ లేక్‌లో శిఖారా రైడ్, లోకల్ మార్కెట్స్‌లో హ్యాండీక్రాఫ్ట్స్ కశ్మీర్లో కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ షాపులు.. ఇవన్నీ చూస్తూ గడిపిన సమయం కూడా మెమొరబుల్‌గా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలుఅమర్నాథ్ గుహాలయం హిమాలయాల మధ్య సుమారు 3,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ప్రతీ సంవత్సరం కొన్ని వారాలు ΄ాటు మాత్రమే అమర్నాథ్ యాత్రను నిర్వహిస్తారు.మంచుతో ఏర్పడే స్వయంభు శివలింగాన్ని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు.పహల్గామ్, బాల్టాల్ అనే రెండు ప్రధాన యాత్రా మార్గాల ద్వారా గుహాలయానికి చేరుకోవచ్చు.జూలై, ఆగస్టు నెలల్లో హిమాలయాల అందాలు మరింత ఆకట్టుకుంటాయి.ఎక్కడ ఉండాలి?శ్రీనగర్‌లో హౌజ్‌బోట్స్, లేక్ వ్యూ హోటల్స్, బోటిక్ స్టేస్ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి. ఉదయం డాల్ లేక్‌పై పడవల శబ్దంతో మేల్కొనడం ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది.పహల్గామ్లో కాటేజీలు, హోటల్స్, నేచర్ రిసార్ట్స్‌లో చల్లని గాలి, పచ్చని చెట్లు, పర్వతాల అందాలు రోజంతా మనసుని రిఫ్రెష్ చేస్తాయి. యాత్ర మార్గంలో ఉండే క్యాంపులు కూడా హిమాలయాల మధ్య ఒక యూనిక్ స్టే ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల అమర్నాథ్ యాత్రను బడ్జెట్లో ప్లాన్ చేస్తే సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య పూర్తి చేయవచ్చు. కొంచెం కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు అవుతుందిప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం మంచి హోటల్స్, ఫ్లైట్స్, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణంతో కలిపి రూ.70,000 నుంచి రూ.1 లక్షా 10 వేల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ట్రావెల్ చేస్తే టోటల్ బడ్జెట్ కాస్త పెరగవచ్చు.శ్రీనగర్ హోటల్స్‌లో పర్ నైట్ రూ.2,000 నుంచి రూ.8,000 వరకు ఆప్షన్స్ ఉంటాయి. ప్రీమియం లేక్ వ్యూ స్టేస్ కోసం రూ.10,000 వరకు కూడా ఖర్చు చేస్తారు.ఫుడ్ కోసం ప్రతీ రోజు సగటున రూ.700 నుంచి రూ.1,500 వరకు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా వివరాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులను స్వయంగా చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
రైతుల కోసం అవసరమైతే రైలులోనైనా వస్తారు జగన్: పేర్ని నాని
సాక్షి, ఏలూరు: ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న భీమవరం పర్యటనను.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌కు అనుమతులు నిరాకరించినా.. అవసరమైతే జగన్ రైలులో అయినా వచ్చి రైతులను కలుస్తారని పేర్కొన్నారు.శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని బువ్వనపల్లిలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఆక్వా మేత ధరలు భారీగా పెరిగినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మేత కంపెనీలు, పాలకులు కుమ్మక్కై రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు.రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జూలై 15న వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటన ఖాయమైందని ఆయన వెల్లడించారు. పర్యటనను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని స్పష్టం చేశారు. హెలిప్యాడ్‌కు అనుమతులు ఇవ్వకపోయినా, ఇతర ఆంక్షలు విధించినా జగన్ వెనక్కి తగ్గరని, అవసరమైతే రైలులో ప్రయాణించి అయినా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్ని నాని పేర్కొన్నారు.జగన్ పర్యటనతో ఆక్వా రైతుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారనున్నాయని, ప్రభుత్వం రైతుల డిమాండ్లపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైఎస్సార్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
స్విట్జర్లాండ్ టూర్ అన్న దంపతులు.. ఎక్కడ?
హైదరాబాద్, కుషాయిగూడ: విదేశాలకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన దంపతులు అదృశ్యమయ్యారు. చర్లపల్లి ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన మేరకు.. చక్రిపురం, భగవాన్కాలనీలో నివసించే ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ప్రదాన కార్యదర్శి, సిమెంట్ వ్యాపారి పబ్బ చంద్రశేఖర్, స్వప్న దంపతులు జూన్ 22న స్విట్జార్లాండ్ టూర్ వెళ్లి వస్తామని చెప్పి తమ కూతుళ్లను సోదరుడి ఇంట్లో ఉంచి వెళ్లారు. మరుసటి రోజు నుంచి ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కూతుళ్లు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో కూతురు శ్రేయ చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా ఇప్పటికే పబ్బ చంద్రశేఖర్ 50 కోట్లు అప్పులు చేసి ఉడాయించాడంటూ ఆలిండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌తో కలిసి బాధితులు జూన్ 31 సీపీ సుమతిని కలిసి వినతిపత్రం అందజేశారు. -
వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా?
వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ప్లానింగ్ కూడా అవసరం. చిన్న ప్రిపరేషన్ ఉంటే జర్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి టెన్షన్ పడకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ట్రిప్ స్మూత్‌గా ఎంజాయ్ చేయవచ్చు.వాతావరణం చెక్ చేయండి: ట్రావెల్ స్టార్ట్ చేసే ముందు వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయడం మంచిది. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల గురించి ముందుగా తెలిస్తే తగిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. లోకల్ అప్డేట్స్ కూడా తెలుసుకుంటే అనవసరమైన అత్యవసర ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.ప్యాకింగ్ ఇలా!లైట్‌వెయిట్ రెయిన్ కోట్ లేదా కాంపాక్ట్ అంబ్రెల్లాను బ్యాగులో తప్పనిసరిగా ఉంచుకోవాలి. వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్ కవర్ వినియోగిస్తే గ్యాడ్జెట్స్, బట్టలు సేఫ్‌గా ఉంటాయి. మొబైల్, డాక్యుమెంట్స్, వాలెట్ లాంటివి వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లో క్యారీ చేస్తే బెస్ట్.ఫుట్‌వేర్: ఫుట్‌వేర్ సెలెక్ట్ చేసేటప్పుడు వాటర్‌ప్రూఫ్ శాండిల్స్ లేదా క్విక్ డ్రైయింగ్ షూస్ చాలా బెటర్ ఆప్షన్. స్లిప్పరీ రోడ్స్‌లో కంఫర్టబుల్ గ్రిప్ ఉన్న ఫుట్‌వేర్ జర్నీని సులభతరం చేస్తుంది. ఎక్స్ట్రా సాక్స్ క్యారీ చేస్తే తడిసిన వెంటనే మార్చుకోవచ్చు.స్నాక్స్.. హెల్తీ స్నాక్స్, వాటర్ బాటిల్, చిన్న టవల్, పవర్ బ్యాంక్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి ట్రావెల్ ఎసెన్షియల్స్గా బ్యాగులో రెడీగా ఉంటే చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా చార్జింగ్ చేసే అవకాశం దొరక్కపోయినా పవర్ బ్యాంక్‌తో చార్జింగ్ పెట్టుకుంటే సేఫ్‌గా ఉంటుంది. మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడితే వాటిని సెపరేట్ పౌచ్‌లో ఉంచడం బెటర్.రోడ్ ట్రిప్స్‌లో డ్రైవింగ్ స్లోగా చేయడం, సరైన దూరం పాటించడం చాలా అవసరం. నీటితో నిండిపోయిన రోడ్డుపై అనవసరమైన రిస్క్ తీసుకోకపోవడం బెటర్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే కొంచెం ఎక్స్ట్రా ట్రావెల్ టైమ్ ప్లాన్ చేసుకుంటే రష్ అవాయిడ్ చేయవచ్చు.మాన్ సూన్ ట్రావెల్లో డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా మెమొరబుల్‌గా ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ ల్యాండ్‌స్కేప్స్, చల్లని వెదర్ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చేస్తాయి. కొంచెం సిద్ధం అయి వెళ్తే ఆ ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా పూర్తి చేసుకుని ఇంటికి మెమొరీస్‌తో తిరిగి వచ్చేయవచ్చు. వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం ప్లానింగ్ కూడా అవసరం. చిన్న ప్రిపరేషన్ ఉంటే జర్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కాబట్టి టెన్షన్ పడకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయితే ట్రిప్ స్మూత్‌గా ఎంజాయ్ చేయవచ్చు. -
వర్షాకాలంలో.. వావ్ అనిపించే వనాకా!
వర్షాకాలంలో ప్రశాంతమైన డెస్టినేషన్ కోసం సెర్చ్ చేస్తున్నారా? వనాకా చూస్తే ఫస్ట్ గ్లాన్స్లోనే కామ్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ టైమ్ న్యూజీలాండ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్లకి ఇది రిలాక్స్డ్ ఛాయిస్ అవుతుంది.లేక్, మౌంటెన్స్, ఫ్రెష్ ఎయిర్ కలిసి స్లో ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌ని బ్యూటిఫుల్‌గా మార్చేస్తాయి. తేలికగా వర్షం పడుతుంటే లేక్ పైన మిస్ట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. గ్రీన్ హిల్స్ మరింత ఫ్రెష్‌గా కనిపిస్తాయి. స్మాల్ కేఫేస్, ప్రశాంతమైన వీధులు, లేక్‌సైడ్ వాకింగ్ ΄ాథ్స్ అన్ని కంఫర్టబుల్ అట్మాస్పియర్‌ను క్రియేట్ చేస్తాయి. క్రౌడ్ తక్కువగా ఉండటం వల్ల నేచర్‌ని సులభంగా ఎంజాయ్ చేయవచ్చు.సందర్శనీయ స్థలాలులేక్ వనాకా దగ్గర మార్నింగ్ వాక్ ప్రశాంతంగా అనిపిస్తుంది. రాయ్స్ పీక్ పరిసరాలు మిస్ట్‌తో ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రశాంతమైన వనాకా ట్రీ రెయినీ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ తీయవచ్చు. అలాగే మౌంట్ అస్పైరింగ్ నేషనల్ ΄ార్క్ పరిసరాల్లోని గ్రీన్ ల్యాండ్‌స్కేప్స్ నేచర్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తాయి.వెరైటీ ఫుడ్ చాయిస్ఫ్రెష్ సాల్మన్ డిషెస్ ఇక్కడ చాలా ΄ాపులర్. వార్మ్ పంప్కిన్ సూప్‌ను వర్షాలు పడుతున్న సమయంలో తీసుకుంటే ఆ మజానే వేరు. స్థానికంగా లభించే చీజ్ ΄్లాటర్స్, హాట్ కాఫీతో ఎంజాయ్ చేస్తే వాతావరణం ఇంకా మెమొరబుల్‌గా అనిపిస్తుంది.ఎప్పుడు వెళ్లాలి?జూన్ నుంచి ఆగస్ట్ వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు కురిసే వర్షానికి వనాకా బ్యూటీ మరింత పెరుగుతుంది. లేక్ వ్యూస్ ప్రతి మూమెంట్‌ని రిఫ్రెషింగ్ మెమొరీగా మారుస్తాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఆక్లాండ్ లేదా క్వీన్స్ టౌన్ కి కనెక్టింగ్ ఫ్లైట్స్ లభిస్తాయి. క్వీన్స్ టౌన్ నుంచి రోడ్ జర్నీ ద్వారా వనాకాకు సుమారు 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫ్లైట్ కనెక్టివిటీ ఆధారంగా మొత్తం ప్రయాణానికి సుమారు 18 నుంచి 22 గంటల సమయం పడుతుంది.వనాకా జర్నీ కంప్లీట్ అయ్యాక అక్కడి మెమొరీస్ సైలెంట్‌గా మనసులో రివైండ్ అవుతూ ఉంటాయి. వర్షం, పర్వతాలు, సరస్సులోని ప్రతిబింబాలు మనసును ప్రశాంతంగా మార్చేస్తాయి. ప్రకతిని స్లోగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్లకి ఈ డెస్టినేషన్ ఒక మరపురాని ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలి΄ోతుంది. -
మనసుని తడిపేసే అనుభూతి
కొన్ని ప్రదేశాలు చూడటానికి కాదు, అనుభూతి చెందడానికి పిలుస్తాయి. ఆలాంటి ఒక ప్రదేశమే మేఘాలయ. మేఘాలు భూమిని తాకుతుంటే, జలపాతాలు పాటలు పాడుతుంటే, గమ్యం కన్నా ప్రయాణమే మధురంగా అనిపిస్తే అదే మేఘాలయ.భారత దేశంలోని నార్త్ ఈస్ట్‌లో ఉన్న మేఘాలయా రాష్ట్రాన్ని ‘అబోడ్ ఆఫ్ క్లౌడ్స్‘ అని పిలుస్తారు. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి భూమి మొత్తం పచ్చని రంగుల్లో మునిగిపోతుంది. మేఘాలు చెరువులుగా భూమిని ఆలింగనం చేసుకున్నట్టు కనిపిస్తాయి. ప్రతీ అడుగు ప్రకృతితో మాట్లాడుతుంది. ప్రతీ మార్గం ఒక కొత్త కథను చెబుతుంది. ఇక్కడ ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడం కాదు. ఆ మార్గంలో కలిగే ప్రతీ అనుభూతిని ఆస్వాదించడం.ఆసక్తికరమైన విషయాలు..రాష్ట్రం: మేఘాలయ, నార్త్ ఈస్ట్ ఇండియాబెస్ట్ ఎక్స్‌పీరియెన్స్: మాన్ సూన్ లో మేఘాలు, జలపాతాల మధ్య ప్రయాణందగ్గరిలోని విమానాశ్రయం: గువహతి విమానాశ్రయం, అస్సాంట్రిప్ సమయం: 5 రోజులు సరిపోతుందిటాప్ 5 ప్రదేశాలు: చిరపుంజి, డాకి రివర్, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, షిల్లాంగ్, మావ్లిన్నాంగ్మేఘాల మధ్య జీవనంమేఘాలయలో వర్షం ఒక సీజన్ కాదు. జీవన విధానం. షిల్లాంగ్ వైపు ప్రయాణం మొదలైన వెంటనే రోడ్డు పక్కన నిలిచిన పైన్ వృక్షాలు, మేఘాలతో కప్పబడిన కొండలు, మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న గ్రామాలు మనసుని ప్రశాంతంగా మార్చేస్తాయి. ఇక్కడ గాలి కూడా చల్లని సుగంధంతో ఉంటుంది. జలపాతాల ధ్వని దూరం నుండి వినిపిస్తుంటే, మేఘాలు కొన్ని సార్లు రోడ్డుమీద దిగివచ్చి మీ పక్కనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతి తన అందాన్ని ఇక్కడ కూడా ఆతిశయోక్తి లేకుండా చూపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలుషిల్లాంగ్ సిటీకి చేరగానే బ్రిటిష్ హిల్ స్టేషన్ లాంటి ఒక సౌకర్యం, నార్త్ ఈస్ట్ సంస్కృతి కలిసిన ప్రత్యేక వాతావరణం కనిపిస్తుంది. వార్డ్స్ లేక్ దగ్గర సాయంత్రం గాలి ఆస్వాదిస్తుంటే, సమయం నెమ్మదిగా నడుస్తున్నట్టు ఉంటుంది. చిరపుంజి వైపు వెళ్లిన తరువాత మేఘాలు ఇంకా దగ్గరగా అనిపిస్తాయి. నోహ్కలికై ఫాల్స్ నుండి పడుతున్న నీటి ధార వర్షాకాలంలో మరింత గంభీరంగా కనిపిస్తుంది. సెవన్ సిస్టర్స్ ఫాల్స్ మధ్య మేఘాలు ఆడుకుంటుంటే ఆ దృశ్యం చాలా సేపు మనసులో నిలిచిపోతుంది.మాస్మై కేవ్‌లో నడుస్తుంటే ప్రకృతి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ అద్భుతమైన కళాకృతిని సిద్ధం చేసిందో అని అనిపిస్తుంది. డాకిలో ఉంగాట్ రివర్ నీరు ఎంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటుందంటే అందులో పడవ వెళ్తుంటే దూరం నుండి గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. మావ్లిన్నాంగ్ గ్రామంలో పరిశుభ్రత, ప్రకతి కలిసి ఒక మంచి జీవన విధానాన్ని చూపిస్తాయి. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ దగ్గర ప్రకృతి, మానవ సహకారం కలిసి సృష్టించిన అద్భుతం ప్రతీ అడుగులో కనిపిస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి షిల్లాంగ్‌కి ప్రయాణం ప్రారంభం అయ్యే ముందు, ఆకాశం వైపు చూస్తూ నార్త్ ఈస్ట్ పిలుపు వినిపిస్తుంది. హైదరాబాద్ నుంచి అస్సాంలోని గువహతికి డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ సులభంగా దొరుకుతాయి. అక్కడి నుండి రోడ్డు జర్నీ మొదలవుతుంది.గువహతి నుండి షిల్లాంగ్ వరకు ప్రయాణం చాలా అందమైన ఘాట్ రోడ్ల మధ్య జరుగుతుంది. ప్రతీ మలుపు కొత్త దృశ్యం చూపిస్తుంది. మేఘాలు రోడ్డుపై దిగివస్తుంటే ప్రయాణం డెస్టినేషన్ కన్నా గొప్పగా అనిపిస్తుంది. విజయవాడ నుండి ప్రయాణం చేసే వారు హైదరాబాద్ లేదా బెంగళూరు ద్వారా గువహాతి చేరుకుని అదే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఈ మార్గంలో ప్రయాణం ఒక సినిమాలా, ఒక స్లో మోషన్ సీక్వెన్స్‌లా ఉంటుంది.ఏం చూడాలి?మేఘాలయాలో ప్రతీ నిమిషం ఒక ఫ్రేమ్‌లా ఉంటుంది. జలపాతాలు, మేఘాలు, పచ్చని కొండలు, అడవి మధ్య నడిచే మార్గాలు కలిసి ఒక లైవ్ పెయింటింగ్‌లా కనిపిస్తాయి.లివింగ్ రూట్ బ్రిడ్జిపై నడిచే క్షణం ప్రకతితో కలిసి నడుస్తున్నట్టు ఉంటుంది. డాకి నదిపై పడవ ప్రయాణం చేస్తూ నీటిలో ఆకాశం ప్రతిబింబాన్ని చూస్తూ సమయం మరిచిపోవచ్చు. షిల్లాంగ్ మార్కెట్లో స్థానిక జీవన విధానం, కళ, సంస్కృతి కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు మౌనంగా గడపడం, మేఘాల మధ్య రోడ్డు జర్నీ ఆస్వాదించడం, ఉంగాట్ రివర్‌పై బోట్ రైడ్ ఆస్వాదించడం, లివింగ్ రూట్ బ్రిడ్జి దగ్గర నడవడం, మావ్లిన్నాంగ్ గ్రామంలో ప్రతీ వీధిని నెమ్మదిగా నడుస్తూ ఫీల్ అవ్వడం అనే ఈ ఐదు అనుభవాలు ఈ యాత్రని మరింతగా గుర్తిండిపోయేలా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?షిల్లాంగ్‌లో హెరిటేజ్ కాటేజీలు, బోటీక్ స్టేస్, నేచర్ రిసార్టులు, వుడెన్ హోమ్ స్టేలు ప్రతీ ఒక్కటి ప్రకృతి దగ్గరగా తీసుకెళ్తాయి. ప్రతీ ఉదయం బాల్కనీ తలుపు తెరవగానే మేఘాలు ఎదురుగా నిలబడి స్వాగతం చెబుతాయి. చిరపుంజిలో కొండల మధ్య ఉన్న రిసార్టులో వర్షం శబ్దం మధ్య కాఫీ తాగుతుంటే నగర జీవితం ఎంతో దూరం వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. రాత్రి సమయంలో చల్లని గాలి, పక్షుల స్వరాలు, మేఘాల మధ్య వెలుగులు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి.ఏం తినాలి?మేఘాలయ రుచులు కూడా ఇక్కడి భూమిలాగే సహజంగా ఉంటాయి. జడో అనే రైస్ ప్రిపరేషన్, తంగ్రింబై, దోనియాంగ్ లాంటి స్థానిక వంటకాలు ప్రతీ భోజనంలో కొత్త రుచిని పరిచయం చేస్తాయి. నాన్ వెజ్ ప్రియులకు వెరైటీలకు కొదువేలేదు అనేలా ఆప్షన్స్ ఉంటాయి.ఫ్రెష్ ఫ్రూట్స్, బాంబూ షూట్ రెసిపీస్, లోకల్ టీ, వేడి వేడి సూప్ చల్లని వాతావరణంలో మరింత రుచిగా అనిపిస్తాయి. చిన్న కేఫేల్లో కాఫీ సిప్ చేస్తూ మేఘాలను చూస్తూ గడిపిన సమయం భోజనం కన్నా ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. యాత్రా అండ్ బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి ఐదు రోజుల మేఘాలయ ప్రయాణం అనేది బడ్జెట్ ప్లాన్న్ చేసుకుంటే... ప్రతీ వ్యక్తికి సుమారు రూ.28,000 నుండి రూ.35,000 మధ్య పూర్తి అవుతుంది. స్టాండర్డ్ కంఫర్ట్ ప్లాన్న్ రూ.40,000 నుండి రూ.55,000 మధ్య ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.70,000 నుండి రూ.95,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుండి వెళ్లిన వారికి ప్రయాణం దారిని బట్టి కొంచెం అదనపు ఎయిర్‌ఫేర్ ఉంటుంది. గువహతి నుంచి షిల్లాంగ్ రోడ్డు ప్రయాణం ఎవర్గ్రీన్ మెమోరీగా మిగిలిపోతుంది.స్టే చార్జెస్ ప్రతీ రాత్రికి రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య బడ్జెట్ కేటగిరిలో ఉంటాయి. ప్రీమియం రిసార్టులు రూ.7 వేల నుండి రూ.15 వేల వరకు ఉంటాయి. భోజనం కోసం రోజుకు సుమారు రూ.700 నుంచి రూ.1500 వరకు బడ్జెట్ పెడితే సరిపోతుంది. లోకల్ సైట్‌సీయింగ్ ΄్యాకేజీలు, ప్రైవేట్ క్యాబ్ ఎక్స్‌పీరియెన్స్ అనేవి అందుబాటు ధరలో చూసుకుంటే సరిపోతుంది. భారత దేశంలో భాగమే కాబట్టి వీసా అవసరం లేదు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
-
మార్కో రూబియో పర్యటన.. కీలక ఒప్పందాలు
ఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఇటీవలే భారత పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక రంగాలు, ఇంధనం, సాంకేతికత, ఖనిజాల సరఫరాకు సంబంధించి ఇరుదేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ పేర్కొంది.కీలక ఒప్పందాలుప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ (అరుదైన ఖనిజాల) సరఫరాపై చైనా తన పట్టును బిగిస్తున్న వేళ, భారత్-అమెరికాలు "యుఎస్-ఇండియా ఫ్రేమ్‌వర్క్ ఆన్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్స్" ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా మైనింగ్, ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీ, ఉమ్మడి పెట్టుబడులు మరియు రీసైక్లింగ్ వంటి రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నాయి. సింగిల్-సోర్స్ మోనోపోలీల (ఏకఛత్రాధిపత్యం) నుంచి సరఫరా వ్యవస్థను కాపాడుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.అరుదైన ఖనిజాల సరఫరాఈ పర్యటనలో అన్నింటి కంటే ముఖ్యమైనది 'క్లిష్టమైన ఖనిజాలు, అరుదైన భూ ఖనిజాల పై యూఎస్-ఇండియా ఫ్రేమ్‌వర్క్' ఒప్పందం. మైనింగ్, ప్రాసెసింగ్ నుండి అరుదైన అయస్కాంతాల తయారీ వరకు పూర్తి సరఫరా వ్యవస్థలో ఉమ్మడి పెట్టుబడులు, భాగస్వామ్యాలను పెంపొందించేలా దీనిని రూపొందించారు. గ్లోబల్ రేర్ ఎర్త్ మార్కెట్‌పై చైనా తన పట్టును బిగిస్తున్న తరుణంలో, దానికి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్య భాగస్వామ్యంతో కూడిన నెట్‌వర్క్‌ను నిర్మించడమే లక్ష్యంగా వాషింగ్టన్, న్యూఢిల్లీలు ఈ అడుగు వేశాయి.ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నెలకొన్న అ స్థిరత కారణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇంధనం, ఎరువుల ధరలు తీవ్రంగా మారుతున్నాయి. దీనిని అధిగమించడానికి ఈ పర్యటనలో రెండు ప్రధాన ఇంధన కార్యక్రమాలను ప్రకటించారు. క్వాడ్ ఫ్యూయల్ సెక్యూరిటీ ఫోరమ్ ఇండో-పసిఫిక్ ఎనర్జీ సెక్యూరిటీపై క్వాడ్ ఇనిషియేటివ్ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లీన్ ఎనర్జీ మార్కెట్‌గా ఉన్న భారతదేశం... ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ప్రాంతీయ ఇంధన భద్రతకు ఒక ప్రధాన స్తంభంగా మారడమే కాకుండా, అమెరికన్ ఇంధన పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా నిలవనుంది. యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రశంసలుఈ పర్యటన ఫలితాలపై యూఎస్ఐబీసీ ప్రశంసలు కురిపించింది. ఆ సంస్థ ప్రెసిడెంట్ అంబాసిడర్ (రిటైర్డ్) అతుల్ కేశప్ మాట్లాడుతూ, "ఈ వారం ఇంధన భద్రత, క్లిష్టమైన ఖనిజాలు, సముద్ర ఓడరేవులపై వచ్చిన ప్రకటనలు క్వాడ్ కూటమి యొక్క ప్రాధాన్యతను నిరూపిస్తున్నాయి. న్యూఢిల్లీలో క్వాడ్ సమావేశాన్ని నిర్వహించడం అంతర్జాతీయ భాగస్వామిగా భారతదేశం యొక్క కీలక పాత్రను మరింత బలపరుస్తుంది" అని పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవుతున్న తరుణంలో, ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దౌత్యపరమైన సత్సంబంధాలను వాణిజ్య పరమైన ఒప్పందాలుగా మార్చడంలో రూబియో దిల్లీ పర్యటన విజయవంతమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు
ఢిల్లీ: భారతీయులపై అమెరికా జాత్యాహంకార వ్యాఖ్యల పట్ల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ప్రతి దేశంలోనూ కొంతమంది మూర్ఖులు ఉంటారని వారిని పరిగణలోకి తీసుకోకూడదన్నారు. వారు అమెరికాకు ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు.ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఒక జర్నలిస్టు అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనల గురించి రూబియోను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలోనూ ఆన్లైన్లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి, దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో అన్నారు.అమెరికాలో భారతీయులపై కొంతమంది చూపే జాత్యహంకారాన్ని మొత్తం అమెరికన్ సమాజపు గుర్తింపుగా అభివర్ణించడం తప్పు అవుతుందని రూబియో స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి భారతీయ సంతతి ప్రజలు గణనీయమైన తోడ్పాటు అందించారని కొనియాడారు. ప్రత్యేకంగా భారతీయ సమాజాన్ని ప్రశంసించారు. వ్యాపారం, సాంకేతికత, వైద్యం, ప్రజా సేవలతో సహా అనేక కీలక రంగాలలో భారతీయ-అమెరికన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు 20 బిలియన్ డాలర్లకు పైగా సహకారం అందిస్తున్నారని ఈ సంఖ్య మరింత పెరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.భారత్, అమెరికా మధ్య సంబంధం కేవలం సహకారానికే పరిమితం కాదని, అది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యమని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇరు దేశాలు కలిసి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. భారత్, అమెరికా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని మార్కోరూబియో ప్రశంసించారు. -
మెలోనీతో కలిసి మోదీ పలు ప్రాంతాల సందర్శన (ఫోటోలు)
-
పుతిన్ పర్యటనతో చమురు సంక్షోభం తీరుతుందా..?
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి ఆయన భారత్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో పలు కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో కీలకం కానుంది.ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో యుద్ధపరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 నుంచి 110 డాలర్ల పైమాటకు చేరి తీవ్రంగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హర్ముజ్‌ను మూసివేయడంతో చమరు రవాణా దెబ్బతిని తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లో సైతం పెట్రో డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరగవచ్చనే ఆందోళన ప్రజలలో నెలకొంది.ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చమురు సంక్షోభం తీరేలా ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఇటీవలే ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ "భారతదేశానికి ఇంధన సరఫరా ఒప్పందాల విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా రష్యా అన్ని బాధ్యతలను నెరవేరుస్తుంది. బాహ్య శక్తుల నుండి వచ్చే ఎలాంటి అనైతిక పోటీల వల్ల భారత్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం." అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలతో భారత్‌కు ఎంతో ఊరట లభించింది.ఇతర ఇంధన రంగాలు కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, భారత్‌కు అవసరమైన ఎల్.ఎన్.జి బొగ్గు సరఫరాలను పెంచడం, తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.రూపాయి-రూబుల్ చెల్లింపులుఅంతే కాకుంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి డాలర్ల కొరత లేదా అంతర్జాతీయ ఆంక్షల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, స్వదేశీ కరెన్సీలలో (రూపాయి - రూబుల్) సురక్షితమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక ఛానళ్లను ఏర్పాటు చేయడంపై ఈ పర్యటనలో మోదీ, పుతిన్ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. రష్యా నుంచి చమరుదిగుమతులతో భారత్ తన స్వంత కరెన్సీలో చెల్లింపులు చేస్తే ఆ డబ్బులు వారి వద్ద అధికంగా నిల్వ ఉంటున్నాయి. ఎందుకంటే రష్యా భారత్‌కు ఎగుమతులు చేస్తున్నంతగా ఆ దేశానికి భారత ఎగుమతులు లేవు అందుకే వారి వద్ద కరెన్సీ నిల్వలు అధికంగా ఉంటున్నాయి. దీంతో రష్యా ఆ డబ్బను తిరిగి భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.భారత్‌కు రష్యా పూర్తి స్థాయిలో చమురు సరఫరా చేయగలదా?రష్యా రోజుకు సుమారు 10.3 మిలియన్ బ్యారెళ్ల (1 కోటి 3 లక్షల బ్యారెళ్లు) ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 4.5 నుండి 4.9 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్‌కు సగటున రోజుకు సుమారు 5.3 మిలియన్ బ్యారెళ్ల వరకూ చమురు అవసరం కనుక రష్యా భారత్ అవసరాలను దాదాపు తీర్చగలదు.ప్రధాన సమస్యలులాజిస్టిక్స్, రవాణా సవాళ్లు గల్ఫ్ దేశాలు (సౌదీ, ఇరాక్, యూఏఈ) భారత్‌కు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడి నుండి చమురు నౌకలు కేవలం 4 నుండి 7 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. కానీ రష్యా నుండి చమురు రావాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రష్యా పశ్చిమ నౌకాశ్రయాల నుండి వచ్చే నౌకలు భారత్ చేరడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది.పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా చమురును రవాణా చేయడానికి అంతర్జాతీయ నౌకలు, భీమా సంస్థలు ముందుకు రావడం లేదు. రష్యా తన స్వంత 'షాడో ఫ్లీట్' (పాత నౌకలు) ద్వారానే సరఫరా చేస్తోంది. భారత్‌కు కావాల్సినంతగా ఇందులో చమురు రవాణా చేయడం కొద్దిగా కష్టమైన పని.రిఫైనరీల సాంకేతికత భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే 'సౌర్ క్రూడ్' (సల్ఫర్ ఎక్కువగా ఉండే చమురు) ను శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. రష్యా నుంచి వచ్చే 'ఉరల్స్ క్రూడ్' రకం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.భారతీయ రిఫైనరీలు రష్యా చమురును 100% వాడలేవు; సాంకేతిక బ్యాలెన్స్ కోసం మిడిల్ ఈస్ట్ చమురును కూడా కలిపి వాడాల్సి ఉంటుంది.భారత్‌కు ఇష్టం లేదు వ్యూహాత్మకంగా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైనా పూర్తి స్థాయిలో ఆధారపడదు. రేపు రష్యాతో ఏదైనా సమస్య వస్తే భారత్ ఇరుక్కుపోతుంది. అందుకే భారత్ తన రిస్క్‌ను తగ్గించుకోవడానికి రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుండి చమురును విడివిడిగా కొనుగోలు చేస్తుంది. అయితే ఈ పర్యటనతో భారత చమురు సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పడం అతిశయోక్తే అయినప్పటికీ ప్రస్తుత చమురు సంక్షోభ పరిస్థితులను అరికట్టడానికి ఎంతో కొంత సహకరిస్తుందనేది మాత్రం చెప్పవచ్చు. -
యూఏఈకి బయిలుదేరిన మోదీ
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనకు బయిలుదేరారు. ఈ రోజు ( శుక్రవారం) నుంచి ఈ నెల 20 వరకూ ఆయన పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో మోదీ పర్యటించనున్నారు. ఆయా దేశాధినేతలతో కీలక చర్చలు ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత యూఏఈకి వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. అనంతరం అబుదాబిలో యూఏఈ అధినేతతో భోజనం చేస్తారు. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇంధనంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ నుంచి భారత్‌కు అధికంగా చమురు సరఫరా జరిగేలా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. యూఏఈ పర్యటన తర్వాత యూరప్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. -
దుబారాలో మనమే టాప్.. బాబు.. లోకేష్ జల్సాలు
-
ట్రంప్ ఈ విషయాల జోలికి రాకండి..!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కొద్ది సేపటి క్రితమే బీజింగ్‌కు బయిలుదేరారు. అయితే ఈ పర్యటనలో ఏ విషయాలపై ఒప్పంద జరగనుందా అని ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో తమ దేశానికి సంబంధించిన నాలుగు అంశాల జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇస్తూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.చైనా- అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే టాఫ్ ఎకానమీ కలిగిన దేశాలు కావడంతో అధిపత్యం కోసం పరస్పరం పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మిడిల్ ఈస్ట్ యుద్ధంలో సైతం చైనా పరోక్షంగా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వీటిని చైనా కొట్టిపడేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనకు బయిలుదేరారు. ఆ నేపథ్యంలో ట్రంప్ అస్సలు.. ఈ రెడ్‌లైన్ అంశాలు చర్చించకూడదని చైనా పేర్కొంది. నాలుగు ప్రధానమైన అంశాలుతైవాన్ అంశం ఇది చైనాకు అత్యంత కీలకం.ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు వీటి పేరుతో చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.దేశ రాజకీయ వ్యవస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని సోషలిస్ట్ వ్యవస్థను గౌరవించాలి.చైనా అభివృద్ధి హక్కు చైనా ఆర్థిక, సాంకేతిక వృద్ధిని అడ్డుకోకూడదు.తైవాన్ వివాదం అనేది ప్రస్తుతం చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది, ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందం. దీనిపై చైనా మండిపడుతుంది.తైవాన్ తమ భూభాగంలో భాగమని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని ఈ విషయంతో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. కాగా 2017 తర్వాత ట్రంప్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి. ట్రంప్ గతంలో ప్రకటించిన అధిక పన్నుల యుద్దం తర్వాత ఆయన చైనాకు వెళుతున్నారు. దీంతో ఏం జరగనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్: మోదీ
ప్రధాని మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నందున మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. -
తెలంగాణ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(మే 10, ఆదివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు.‘‘రేపు మే 10వ తేదీన కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటాను. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటాను. సమాజ సేవకు అంకితమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వివిధ రంగాల్లో అద్భుత కార్యక్రమాలు చేస్తోంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన.. రోడ్లు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ప్రధాన ప్రాజెక్టులు....సింధు హాస్పిటల్‌ను దేశానికి అంకితం చేస్తాను. సాయంత్రం హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు పాలనలతో విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీకి తెలంగాణ ప్రజల ఆదరణ పెరుగుతోంది’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ನಾಳೆ, ಮೇ 10 ರಂದು ನಾನು ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲಿದ್ದೇನೆ.ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ 11 ಗಂಟೆಗೆ, ‘ಆರ್ಟ್ ಆಫ್ ಲಿವಿಂಗ್’ ಸಂಸ್ಥೆಯ 45ನೇ ಸಂಸ್ಥಾಪನಾ ವರ್ಷದ ಸ್ಮರಣಾರ್ಥ ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇನೆ. ಸಮಾಜ ಸೇವೆಯ ಸಂಸ್ಕೃತಿಗೆ ಅನುಗುಣವಾಗಿ, ಈ ಸಂಸ್ಥೆಯು ವಿವಿಧ…— Narendra Modi (@narendramodi) May 9, 2026 -
తెలంగాణకు ప్రధాని మోదీ.. ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 9న తెలంగాణ పర్యటనకు రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. 4న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రానికి ఆయన వస్తారని వెల్లడించాయి. 9న వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫేజ్–2ను జాతికి అంకితం చేయడంతోపాటు బీబీనగర్ ఎయిమ్స్‌ను కూడా జాతికి అంకితం చేసే అవకాశాలున్నాయి.కాగా, మల్లారెడ్డి ఏఐ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారా? లేదా? అన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు తూళ్ల వీరేందర్‌గౌడ్, అశోక్ వేములతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు, అంశాలపై చర్చించినట్టు తెలిపారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
మత్స్యకారులతో వైఎస్ జగన్ మమేకం (ఫొటోలు)
-
ఉద్రిక్తతల నడుమ యూఏఈకి జై శంకర్
యూఏఈ భారత్‌కు ఎల్లప్పుడూ ప్రధాన భాగస్వామి అని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. యూఏఈ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు జరిపిన నేపథ్యంలో ఆ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ మట్లాడుతూ భారత్‌కు యూఏఈ ఒక అత్యంత ముఖ్యమైన మరియు నమ్మకమైన భాగస్వామన్నారు. రక్షణ, వాణిజ్యం మరియు ఇంధన రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత దృఢంగా ఉన్నాయని తెలిపారు. యూఏఈ అభివృద్ధిలో మరియు ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేయడంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ మరియు పెట్టుబడుల రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. అనంతరం యూఏఈ ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం మరియు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. కాగా ఇటీవల ఇరాన్ గల్ఫ్ దేశాలలలోని అెమెరికా స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నడుమ జైశంకర్ యూఏఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
పర్వతాల మధ్య ప్రకృతి గీతం..
పచ్చగా పరుచుకున్న పచ్చిక, మంచుతో కప్పబడిన భారీ పర్వతాలు, వాటి మధ్యలో బొమ్మల్లా కనిపించే చిన్న చిన్న గ్రామాలు ... అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాలు. ఎండాకాలం రాగానే చల్లదనంతో రారమ్మని ఆహ్వానిస్తాయి. ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అనే ఈ విశాలమైన పర్వత ప్రాంతం ఫ్రాన్స్‌లోని ప్రకృతి రమణీయతను అత్యంత అందంగా చూపుతుంది. ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో ప్రతి దృశ్యం ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. సూర్యోదయం వేల బాల భానుని కిరణాలు మంచుపర్వతాల మీదుగా, పచ్చని గడ్డిపై పడి ఒక వింతైన బంగారు కాంతిని మనకు చూపుతుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి మదిని తాకి వెళ్తుంటే, స్వర్గంలో ఉన్నామా ... అనే అనుభూతి కలుగుతోంది.సరస్సుల అందాలుఇక్కడి సరస్సులు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ సంధ్యాకాలం కొత్త రంగుల్లో మెరిసి΄ోతాయి. ఈ సమయంలో కెమెరా కన్నా మనసుతో క్లిక్‌మనిపించే దృశ్యాలు ఎన్నో కనువిందుచేస్తాయి. మేఘాలు పర్వతాల మధ్య నెమ్మదిగా తిరుగుతూ, ఒక నిధానమైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయి.సందర్శనీయ స్థలాలుఇక్కడి చామోనిక్స్లో పర్వత జీవితం సహజంగా కనిపిస్తుంది. మోంట్ బ్లాంక్ పర్వత శిఖరాలు ఎండాకాలంలో కూడా మంచుతో మెరుస్తుంటాయి. ఆన్నెస్సీలో సరస్సు పక్కన నడక ఒక ప్రశాంత అనుభవాన్ని ఇస్తుంది. లేక్ ఆన్నెస్సీ నీరు క్రిస్టల్ క్లియర్‌గా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. గ్రెనోబెల్లో నగర జీవితం, పర్వత జీవితం రెండింటి మేళవింపు కనిపిస్తుంది.నిశ్శబ్ధ సంగీతం..ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో జీవితం నెమ్మదిగా సాగుతుంది. చిన్న కేఫ్‌లలో కాఫీ తాగుతూ, గ్రామాల్లో నడుస్తూ సమయం గడపవచ్చు. ఇక్కడ ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు.పర్వతాల మీదుగా ప్రయాణంహైదరాబాద్ నుంచి ముందుగా ప్యారిస్ లేదా జెనీవా వరకు విమానంలో చేరుకోవాలి. జెనీవా నుంచి ట్రైన్ లేదా రోడ్డు మార్గంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ కు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో పర్వతాల అందమైన దృశ్యాలు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతాయి.వుడెన్ హౌజ్‌లో బసచిన్న చాలెట్స్, వుడెన్ హౌసెస్ లేదా సరస్సు పక్కన ఉన్న స్టేల్లో ఉండటం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే అనుభూతి పొందవచ్చు. కిటికీ నుంచి పర్వతాలు, మేఘాలు కనిపించే దృశ్యం ఎంతో ఆహ్లాదకరం.ఏం చూడాలి?మంచు పర్వతాలుపచ్చని పచ్చిక మైదానాలస్వచ్ఛమైన నీటితో తొణికసలాడే సరస్సులు.ఆహ్లాదభరితమైన గ్రామ జీవితం ఇవి అన్నీ కలిసి సహజ సౌందర్యాన్ని కళ్లకు కడతాయి. మరికొన్ని ఆసక్తికరమైనవి: మాంట్ బ్లాంక్ అనే పర్వత శిఖరం ఇక్కడ అత్యంత ఎత్తైనది.ఇక్కడి చాలా సరస్సులు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి.వేసవిలోనూ మంచు శిఖరాలు కనిపిస్తాయి. ఆల్పైన్ గ్రామాలు ఎన్నో శతాబ్దాలుగా తమ స్వరూపాన్ని అలాగే కాపాడుకున్నాయి.వాకింగ్, సైక్లింగ్‌కు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధిఛీజ్తో తయారైన వేడి వేడి వంటకాలుఫ్రెంచ్ కంట్రీసైడ్‌లో బ్రెడ్, చీజ్‌తో తయారైన వేడి వేడి వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఫాండ్యూ అనేది ఇక్కడి గ్రామీణుల సంప్రదాయ వంటకం. వైట్‌వైన్, వెల్లుల్లి, ఇతర పదార్థాలను కలిపి తయారుచేసిన ఛీజ్‌లో గట్టిగా కాల్చిన రొట్టెముక్కలను ముంచుకొని, తింటారు. బంగాళదుంప, ఉల్లిపాయలు, వైట్‌వైన్.. మొదలైన వాటితో తయారుచేసిన టార్టిఫ్లెట్ అనేది అక్కడి బలవర్ధకమైన ఒక వంటకం. ఇక్కడి వంటకాలలో సాస్‌లు ముఖ్యమైనవి. బ్లూబెర్రీ టార్టె అనేది ఇక్కడి పర్వత ప్రాతాలలోనివారికి ఇష్టమైన డిజెర్ట్. సంప్రదాయ మూలికలతో చేసే స్థానిక పానీయాలను తప్పక సేవించాల్సిందే. ఎండకాలమే సరైనది...ఎండాకాలంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి, ప్రకృతి ఫ్రెష్ ఫీలింగ్‌ను అందిస్తుంది. ప్రతి దృశ్యం కొత్తగా అనిపిస్తుంది.ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అంటే ఒక ప్రయాణం మాత్రమే కాదు ఒక ప్రశాంతమైన జీవన విధానం. ఇక్కడ ప్రతి క్షణం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. ఎండాకాలంలో కూడా ఒక చల్లని జ్ఞాపకంగా ఈ ప్రదేశం మనసులో నిలిచిపోతుంది.– ఎం.జి.కిశోర్,ప్రయాణికుడు.కామ్(చదవండి: నేచర్ లవర్స్‌కు డ్రీమ్ డెస్టినేషన్) -
గల్ఫ్‌కు అండగా ఉన్నాం.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఉక్రెయిన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ సాయం కోరే దేశం మాత్రమే కాదని ఇతరులకు సాయం శక్తి తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దుబాయిలో పర్యటనకు వెళ్లారు. ఖతార్‌తో 10 ఏళ్ల పాటు రక్షణ సహాకార ఒప్పందంపై ఆయన సంతకం చేశారు. ఇటీవలే గల్ఫ్ దేశాలకు సహాయంగా వెళ్లిన ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో యుఏఈ, ఉక్రెయిన్ ఉమ్మడి సహకారంతో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.కాగా ఈ పర్యటనలో జెలెన్స్కీతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు రక్షణ అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఇరాన్ తమ దేశంలోని ప్రజలు, సంపదనే లక్షంగా చేసుకొని దాడులు జరుపుతుందని యుఏఈ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే ఇటీవల ఇరాన్ దాడులను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై టెహ్రాన్ జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌పై నేరుగా దాడి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన సాయం అందిస్తోంది. -
'జిన్‌పింగ్ కోసం ఎదురుచూస్తున్నా'.. త్వరలో చైనాకు ట్రంప్
అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటనకు కొత్త తేదీలు ఫిక్స్ చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. వాస్తవానికి ట్రంప్ ఈ నెలలోనే ( మార్చి) చైనాలో పర్యటించాల్సి ఉండగా యుద్ధం నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మేలో చైనా వెళ్లనున్నట్లు తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన నూతన తేదీలను వైట్‌హౌస్ ప్రకటించింది. మే 14, 15 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్నట్లు తెలిపింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.."యుద్ధం మరో నాలుగు నుండి ఆరు వారాల్లో ముగియవచ్చు. ట్రంప్ చైనా వెళ్లే సమయానికి పరిస్థితులు చక్కబడతాయి". అని అన్నారు.కాగా చైనా పర్యటనపై గతవారం ట్రంప్ స్పందించారు. "మేము చైనాతో కలిసి పనిచేస్తున్నాము. నేను చైనా అధ్యక్షున్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. ఆయన కూడా నన్ను కలవాలని ఎదురుచూస్తాడు అనుకుంటా "అని అన్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో మూతపడింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కాగా ఈ మార్గాన్ని రక్షించడానికి సైనిక సహాయం అందించాలని ట్రంప్ చైనాను సహాయం కోరతున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు. అధిక పన్నుల ప్రకటన తర్వాత తొలిసారిగా ఇరు దేశాల అధినేతలు భేటీ అవతుండడంతో ఇరు దేశాల వాణిజ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
చక్క'టీ' లైఫ్ స్టైల్
శ్రీలంక లోని హపుటాలే అనే చిన్న కొండ పట్టణంలో టీ తోటల మధ్య సాగే జీవన విధానం ఒక నిశ్శబ్ద ప్రయాణ కథలా అనిపిస్తుంది. పొగమంచులో కమ్ముకున్న వెలుగు–నీడలు, టీ ఆకులు సేకరించే చేతులుం ఇవన్నీ ప్రతీ రోజు ప్రశాంతతకు చిహ్నాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతీ ఉదయం హడావిడి లేకుండా మెల్లగా ప్రారంభమవుతుంది. లోయలో మేఘాలు సాఫీగా కదులుతూ ఉంటే, మనుషుల జీవితం కూడా అదే లయలో ముందుకు సాగుతుంది. సమయం ఇక్కడ పరుగెత్తదుం నడుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఇక్కడ సమయం గడుస్తుంది.సందర్శనీయ స్థలాలుహపుటాలేలో పర్యాటకులు తప్పక వెళ్లే ప్రదేశాల్లో లిప్టన్ సీట్, డియాలుమా జలపాతం ముఖ్యమైనవి. ఇక్కడ కనిపించేది కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదుం సాధారణంగా కొనసాగుతున్న జీవితం యొక్క ఒక నిశ్శబ్ద రాగంలా ఉంటుంది. దగ్గర్లోని తంగమాలే బర్డ్ శాంక్చువరి వద్ద పక్షుల సందడి ఒక స్వచ్ఛమైన సంగీతంలా అనిపిస్తుంది. ప్రతీ ఉదయం ఇక్కడ వినిపించే స్వరాలు హృదయాన్ని తాకుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి కొలంబోకి నేరుగా విమాన ప్రయాణం చేసి, అక్కడి నుంచి రైలు లేదా క్యాబ్ ద్వారా హపుటాలే చేరవచ్చు. కొలంబో నుంచి ఈ కొండ ప్రాంతానికి వెళ్లే రైలు ప్రయాణం అత్యంత అందమైన అనుభవంగా ఉంటుంది.(చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!) -
వెలుగులతో రంగులు మార్చే భూమి..!
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న స్పితి వ్యాలీ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్బబ్ద నాటకం. మధ్యాహ్నం వెలుగుల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది. సాయంత్రం వెలుగుల్లో మరో రంగు అక్కడ సందడి చేస్తుంది. ఎడారిలా కనిపించే ఈ భూమిలో ప్రకృతి భాషను అర్థం చేసుకుంటే ఇక్కడి అందాల వెనక భావాలు కూడా అర్థం అవుతాయి. ఇక్కడి ప్రయాణం అనేది నెమ్మదిగా మనసును కబ్జా చేసే ఒక చక్కని పాటలోని సాహిత్యంలా ఉంటుంది. లోయల మధ్యలో వెలుగు నీడల ఈ ఆటను గమనిస్తే ప్రతీ గంట ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. సందర్శనీయ స్థలాలుహిమాచల్ ప్రదేశ్‌లోని లాహోల్ స్పితి జిల్లాలో ఉండే స్పితి వ్యాలీలో ఎన్నో అందమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో కీ మోనాస్టరీ, చంద్రతాల్ లేక్, కిబ్బర్ గ్రామం ఇవన్నీ చూస్తే మనం చూస్తున్నది సీనరీకాదుంకాలమే నిశ్బబ్దంగా సాగుతోంది అనిపిస్తుంది. రోడ్డుపై వచ్చే ప్రతీ మలుపు ఒక సోస్ట్కార్డులా ఉంటుంది.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలిహైదరాబాద్ నుండి ఢిల్లీకి ఫ్లైట్ లేదా రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మనాలీకి రోడ్డు జర్నీ ప్రారంభించవచ్చు. ఇక మనాలిలో మీకు నచ్చినంత టైమ్ స్సెండ్ చేసి స్పితీ వ్యాలీకి క్యాబ్ లేదా లోకల్ ట్రాన్స్‌పోర్టుతో అందమైన పర్వతాలను చూస్తూ చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో గమ్యస్థానం కన్నా ప్రయాణ అనుభవమే జీవితాంతం గుర్తుండి΄ోతుంది. (చదవండి: హోళీ..కలర్‌ఫుల్ టూర్ కోసం..ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందే..!) -
హోళీ..కలర్‌ఫుల్ టూర్ కోసం..!
యమునా తీరంలో రంగుల ఆటవెలది... బ్రజ్ భూమిలో రంగుల కథలు...మాధవుడి నగరంలో రంగుల హరివిల్లు... కృష్ణ నగరంలో వసంత స్వాగతం...గోపాలుడి జన్మభూమిలో రంగుల ఋతువు...ఇంద్ర ధనస్సు రంగుల మధ్య ఓ మధురమైన దైవిక స్పర్శ...ఇవన్నీ కనులవిందుగా దర్శించాలంటే ఆ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిందే!! కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికే అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మధుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మధుర, యమునా నదీ తీరం నిదానంగా, ఆగిపోయిన కాలంలా ఉంటుంది. ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మధుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.కృష్ణ జన్మభూమి వైభవంమధురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అక్కడి ప్రాచీన శిల్పం, మందిర గోపురాలను చూస్తుంటే మది నిండా ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖ నాదం వినిపిస్తుంది. అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది. ద్వారకాదీశ్ మందిరం వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్ డివోషనల్ ఆరాను క్రియేట్ చేస్తాయి.యమునా తీరంలో నిశ్శబ్ద వేదంవిశ్రామ్ ఘాట్ దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కనులకు ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం. ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం. ఇక్కడ నడుస్తుంటే మధుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది. బ్రజ్ భూమిలో రంగుల ఋతువుమధురలో హోలి అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది. బర్సానా, వృందావన్ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తాయి. రాధాకృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.‘రాధే రాధే’ అనే పలుకే మధురం...మధుర అనగానే ముందుగా అక్కడి ‘పెడా’గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చి΄ోవద్దు. పెడా, లస్సీ, చాట్ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నా అక్కడి స్థానికుల్లా జీవిస్తేనే పర్యటనలోని అందమైన అనుభూతులను సొంతం చేసుకోగలరు. అందుకే అంటారు రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అని. అలాగే మధురలో ఉన్నప్పుడు మధురవాసిలా మారిపోవాలి. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ ‘‘రాధే రాధే’’ అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా ‘రాధే రాధే’ అని పలకరించండి.చేయాల్సిన పనులుమధురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్ వాక్ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్ హ్యాక్.వీటితోపాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, బృందావన్‌లో సంధ్యా సమయాన భక్తి గీతాలను వినడం ఇవన్నీ మధుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.సందర్శనీయ స్థలాలుమధుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ బృందావన్‌లో బాంకే బిహారీ ఆలయం, గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది. గోవర్ధన పరిక్రమ సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్ చేయలేరు. బృందావన్ వీధుల్లో ప్రతి సంధ్యా సమయంలో భజనలు వినిపిస్తాయి.ఎలా వెళ్లాలి ?ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మధురకు సులభంగా చేరుకోవచ్చు.రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం .. బ్రజ్ భూమిలో అడుగుపెడుతూనే ఆనందానుభూతిని కలిగిస్తుంది.ఎక్కడ ఉండాలి ?మధురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్ వరకు అనేక వసతి సదు΄ాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్‌లో తక్కువ ధరకే రూమ్స్ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ వంటివి బుక్ చేసుకునే సమయంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం. ఏం చూడాలి ? మధుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్ మందిరం, విశ్రామ్ ఘాట్, బృందావన్, గోవర్ధన్ వంటి అనేక ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్ లిస్ట్ పెట్టుకుని వివిధ ్ర΄ాంతాలను అన్వేషించడం కన్నా ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మధుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: Munnar Tourist Place: "పచ్చందనమే పచ్చదనమే"..!) -
ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వందల కిలోమీటర్లు..
రోజు కాదు రెండురోజులు కాదు ఒక దేశం మరో దేశం కాదు...ఆ ఇద్దరు మిత్రులు ఫ్రాన్స్ నుంచి బయలుదేరి ఏడాదిన్నర పాటు నడుస్తూ 12000 కిలోమీటర్లు నడిచి చైనాకు చేరి తమ యాత్ర ముగించారు. లోయిక్ వాయిసాట్, బెంజిమిన్ హంబోల్ట్ ఈ ప్రయాణంలో గ్రహించింది ఏమిటంటే మనుషులు అట్టే చెడ్డవారు కాదని!‘ప్రపంచాన్ని చూడాలని ఉంది. ప్రకృతితో మమేకమై బతకాలని ఉంది’ అని చాలామంది అంటూ ఉంటారు. కాని ఆ ఇద్దరు యువకులు మాత్రం దాన్ని చేసి చూపించారు. కష్టాలను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకోవడం ఎందుకు సాధ్యం కాదో నిరూపించడానికి ఈ ప్రయాణం చేశారు. దేవుడిచ్చిన రెండు కాళ్లు ఎంత దూరం తీసుకెళ్లగలవో చూద్దామని కూడా వాళ్లు ఈ సుదీర్ఘ ప్రయాణానికి నడుము కట్టారు. కదలాలనే తలంపు ఉండాలేగాని రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లడానికి కాళ్లున్నాయని వీరు నిరూపించారు. అందుకే ఆ పాదాలకు నమస్కారం.ఆ ఇద్దరు..27 ఏళ్ల బెంజమిన్ హంబోల్ట్, 26 ఏళ్ల లోయిక్ వాయిసాట్ పారిస్‌లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా ఏదో వెలితి. జీవితం మరీ రొటీన్ అయిపోతోందన్న తలంపు. అటు ప్రపంచాన్ని, ఇటు తమ అంతరంగాన్ని ఒకేసారి చూడాలన్న కోరిక. అందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. సెప్టెంబర్ 2024లో ఉద్యోగాలు వదిలేశారు. వారి స్వస్థలం అన్నేసీ నుండి ప్రయాణం మొదలుపెట్టారు. చైనాలోని షాంఘై చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందుకోసం వారు ఏ వాహనాన్నీ ఆశ్రయించలేదు. కేవలం కాలినడకనే ఐకానిక్ సిల్క్ రూట్ ద్వారా 16 దేశాలు దాటాలని నిశ్చయించుకున్నారు. 17 నెలలపాటు 8 వేల మైళ్లు (12వేల కిలోమీటర్లు) ప్రయాణం చేసిన వారు ఇటీవల వారు తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు.ఏయే దేశాలు దాటి వచ్చారు? ఫ్రాన్నష్ నుంచి నడక మొదలుపెట్టిన లోయిక్, బెంజిమిన్ తమ ప్రయాణంలో భాగంగా స్విట్జర్లాండ్, ఇటలీ, క్రొయేషియా, బోస్నియా, టర్కీ, రష్యా, ఉబ్జెకిస్థాన్, కిర్జిస్థాన్, కజికిస్థాన్ తదితర దేశాలు దాటారు.చివరి మజిలిగా చైనానే ఎందుకు?చైనానే తమ అంతిమ గమ్యస్థానంగా ఎందుకు చేసుకోవాలనుకున్నారని వారిని అడిగినప్పుడు వారి సమాధానం చాలా బలమైన చరిత్రకు సూచనగా నిలిచింది. ‘ఇది వైరుధ్యాల భూమి. ఇక్కడ పురాతన నాగరికత వేగవంతమైన ఆధునికీకరణను కలుస్తుంది. ఫ్రాన్స్‌లో ఉన్న మాకు ఈ నేలకు చేరుకోవాలని అనిపించింది. మా నిత్యజీవితాల్లో ఒత్తిడి నుంచి దూరం కావాలంటే ఇంత దూరం రాక తప్పదని మాకు అనిపించింది’ అని వారు వివరించారు.మనుషులు మంచివాళ్లేఈ ప్రయాణం లోయిక్, బెంజిమిన్‌కు ఎన్నో గొప్ప అనుభవాలు ఇచ్చింది. ‘మేము దారిలో మనుషులను కేవలం మంచినీళ్లు అడిగేవాళ్లం. వాళ్లు మా యాత్ర గురించి తెలుసుకుని నీళ్లతో΄ాటు ఎన్నెన్నో ఇచ్చేవారు. మనుషులు మంచివాళ్లు’ అన్నారు వాళ్లిద్దరు. జిన్జియాంగ్ రాజధాని ఉరుంకిలోని ఒక హోటల్లో దిగినప్పుడు అక్కడి సిబ్బంది వారిని హృదయపూర్వకంగా స్వాగతించారు. అంతేకాకుండా స్థానిక పోలీసు అధికారులు మూన్ కేక్‌లు, అక్కడి సాంప్రదాయ పెరుగును బహుమతిగా ఇచ్చారు. ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది మంచి మనుషులు తమకు సాయం చేశారని, అందువల్లే తాము సురక్షితంగా గమ్యం చేరామని అంటున్నారు. బోస్నియాలో ల్యాండ్‌మైన్స్ ఉంటాయన్న విషయం తమను భయపెట్టిందని, అయితే ప్రమాదమేమీ జరగకుండా సురక్షితంగా వచ్చామని తెలిపారు. తమ నడకలో తాము గొప్పగా ఆస్వాదించింది సూర్యోదయాలను అని వారన్నారు. బాగా నడిచి నిద్రకు సిద్ధమైతే ఆ కమ్ముకొచ్చే నిద్ర గొప్పగా ఉంటుందని కూడా అన్నారు. నిద్ర పట్టక, ఉన్న చోటునే ఉండి వ్యాయామం ఎరగక ఉంటున్నవారు వీరిలా కాకపోయినా కొంతైనా నడిచినా అదే తమకు తాము ఇచ్చుకునే గొప్ప కానుక. (చదవండి: భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..) -
మోదీ నా సోదరుడు: నెతన్యాహు
టెలీఅవీవ్: ధాని మోదీకి ఇజ్రాయెల్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ పార్లమెంటు మోదీకి ఘన స్వాగతం పలికింది. కాగా ఈ రోజు ప్రధాని మోదీ రెండురోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుతో కలిసి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ భారత్‌కు నిజమైన స్నేహితుడు, కష్టకాలంలో భారత్‌కు అండగా నిలిచారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ మాకు భాగస్వామి. ఇక్కడ పర్యటించడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్- భారత్ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా కష్టాలు పడుతున్నాయి. ఇక్కడి పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా", అని అన్నారు. అనంతరం ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ "ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు. మోదీ ఇజ్రాయోల్ పర్యటన ఎంతో సంతోషదాయకం. మోదీ నాకు స్నేహితుడి కంటే ఎక్కువ నా సోదరుడి లాంటి వాడు." అని నెతన్యాహు అన్నారు. భారత్‌ని మోదీ వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కాలంలో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయన్నారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. అనంతరం రణక్షేత్రంగా మారిన గాజా అంశం సైతం ఇరు దేశాధినేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. మరోవైపు ఇరాన్- అమెరికా ఉద్రిక్తల వేళ పశ్చిమాసియాలో మోదీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి మోదీకి, నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌లో పర్యటించడం ఇది రెండోసారి. #WATCH | Tel Aviv: PM Narendra Modi arrives in Israel. Israeli Prime Minister Benjamin Netanyahu, along with his wife Sara Netanyahu, receive him at the airport (Source: Reuters) pic.twitter.com/BStw87lujA— ANI (@ANI) February 25, 2026 -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
-
ఆస్ట్రేలియాకు 27 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడి సంఘర్షణ ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య నెలకొన్న నాయకత్వ పోరు కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో టూర్ పాలిటిక్స్‌కు తెరలేచింది. సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు విదేశీ టూర్‌కు పయనమవుతుండడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మంగళవారం రాత్రి పాతిక మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి ఆ్రస్టేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా సీఎం సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారేనని సమాచారం. వీసా లభించని కారణంగా కొందరు ఎమ్మెల్యేలు పర్యటనను రద్దుచేసుకున్నారు. హైకమాండ్ ఆగ్రహానికి గురికాకూడదనే ఉద్దేశంతో పలువురు టూర్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరికొందరు డైలమాలో ఉన్నారు. ఇంకొందరు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ రాజకీయంగా అపోహలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గందరగోళం మధ్య మంగళవారం రాత్రి సుమారు 27 మంది పయనమవుతున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. మార్చి 1న బెంగళూరుకు తిరిగి రానున్నారు. కాగా కొందరు ఎమ్మెల్యేలు వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు బయల్దేరుతున్నట్లు చెబుతున్నారు. అయితే, పశుసంవర్ధక శాఖ నుంచి ఈ పర్యటన ఖరారైనట్లు వార్తలు రాగా.. ఆ శాఖ మంత్రి కె. వెంకటేశ్ వీటిని తోసిపుచ్చారు. కొంతమంది ఇదొక ప్రైవేటు టూర్ అని, వ్యక్తిగత ఖర్చులతో విదేశీ టూర్‌కు వెళ్తే తప్పేంటని ప్రశి్నస్తున్నారు. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం.. ఇదిలా ఉంటే.. సీఎం కుర్చీ పోరులో అభిప్రాయభేదాలు విడిచి కలసికట్టుగా సాగాలని ఆదివారం రాష్ట్ర నాయకులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. అయితే, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే అని ఆయన కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం నుంచి కౌంటర్లు వస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని ఎమ్మెల్యే గణిగ రవికుమార్ మద్దతు పలికారు. -
థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)
-
మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) తన రెండు రోజుల మలేషియా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ కానున్నారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రక్షణ, భద్రతా సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవడమే మా లక్ష్యం. ఆర్థిక, ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, నూతన రంగాలలో మా సహకారాన్ని విస్తరిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ఆధునిక అంశాల్లో కూడా మలేషియాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.#WATCH | PM Narendra Modi departs for Kuala Lumpur, Malaysia, for a two-day visit.Source: DD pic.twitter.com/qn2As5M9NK— ANI (@ANI) February 7, 2026మలేషియా అభివృద్ధిలో అక్కడి భారతీయ సంతతి పోషిస్తున్న పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. మలేషియాలోని భారతీయులను కలుసుకోనున్నానని తెలిపారు. మలేషియా పురోగతికి వారి అపారమైన కృషి ఉందన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఒక సజీవ వంతెనలా వారు పోషిస్తున్న పాత్ర, చారిత్రక స్నేహానికి బలమైన పునాదిని అందిస్తోందని మోదీ ప్రశంసించారు.ఇది కూడా చదవండి: ‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ -
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
సాక్షి,పశ్చిమగోదావరి: శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేన్‌రాజు కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పెదఅమిరం శ్రీరాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజు (ఐపీఎస్)లకు వైఎస్ జగన్.. వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. -
Guntur Tour: జగనన్న కోసం.. పోటెత్తిన జనం
-
పెట్రోల్ బాంబులతో దాడులు చేయిస్తారా? పవన్ పై పోతిన మహేశ్ ఫైర్
-
Devineni : ఇంకో మూడు సంవత్సరాల తరువాత మీ అందరి లెక్కలు తేలుస్తాం
-
చిల్లీ పెప్పర్స్ స్పా..! వెరైటీ థెరపీలు..
పర్యాటన అనగానే..చాలామంది స్కైడైవింగ్, జలపాతాలు, ప్రకృతి అందాల కోసం అన్వేషిస్తుంటారు. మరికొందరు మానసిక ప్రశాంతతను అందించే ధ్యానానికి సంబంధిన పర్యాట ప్రదేశాలను వెతుకుతారు. ఇంకొందరు ఆరోగ్యం కోసమే..సేద తీరే థెరపీలందించే స్పాల కోసం సర్చ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక స్పాలు. ఇంతవరకు చూడని, అనుభవం పొందని వెరైటీ స్పాలు. ఇవి బాడీకి విశ్రాంతినిచ్చే థెరపీల్లాంటి స్పాలు. ముఖ్యంగా చలికాలంలో సందర్శనకు బెస్ట్ స్పాలుగా పేర్కొనవచ్చు. ఎక్కడున్నాయంటే..అలాంటి ప్రత్యేక స్పాల కోసం చైనాలోని హార్బిన్ నగరంలోకి వాలిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ప్రతి స్పా ఓ అద్భుతం. ఇలాంటి విచిత్రమైనవి ఎక్కడ ఉండవేమో అన్నంతగా ఆకర్షణగా ఉంటాయి ఈ స్పాలు. ఘాటెక్కించే స్పా చిల్లీ పెప్పర్స్ స్పా. మొత్తం ఎర్రటి పచ్చిమిర్చితో ఉండే పూల్ చూసి నోటమాటరాదు. ఓర్నీ ఇందులో స్నానం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇది ఒకరకమైన బాడీ చికిత్స కోసమేనట. ముఖ్యంగా చలికాలంలో వేడి మిరపకాయలతో కూడిన నీటిలో స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలగడటమేగాక చురుగ్గా ఉండేలా చేస్తుందని నమ్ముతారట అక్కడి చైనా ప్రజలు. అక్కడ ఆ పూల్‌లోని ఎర్రటి మిరపకాయలు, ఇతర ఘాటైన పదార్థాలతో ఎర్రగా ఉంటుందట నీరు. దీంతోపాటు ప్రత్యేకమైన ఫిష్ స్పా కూడా ఉంది. ఇందులోని చిన్న చేపలు పాదాలకు పెడిక్యూర్ చేస్తాయి. దీంతోపాటు కొన్ని బహిరంగా హాట్ టబ్‌లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రదేశంలో మంచు మద్య సహజంగా ఏర్పడిన ఆర్కిటిక్ స్పా ఒకటి ఉంది. ఇది 103 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. అంతేగాదు ఈ ప్రదేశం ఐస్ పెస్టివెల్కి నిలయం కూడా. ఈ స్పాలన్నీ పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని, విశ్రాంతి తోపాటు బాడీకి ఒకవిధమైన చికిత్సను అందిస్తాయి. View this post on Instagram A post shared by Jordan Egbert (@counting.countries) (చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ..) -
YS జగన్ గుంటూరు టూర్ పై పోలీసుల ఓవరాక్షన్
-
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్ జగన్
చంద్రబాబు ఆటవిక పాలనలో వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కరువైంది. వరుసగా అక్రమ కేసులు.. అరెస్టులు.. విచారణల పేరుతో ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా హత్యలకు కూడా కుట్ర పన్నుతోంది.. అందుకే వైఎస్సార్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. -
దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)
-
యూఏఈ అధ్యక్షుడికి మోదీ స్వాగతం
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. యుఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలకడానకి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. యుఏఈ అధ్యక్షున్ని కౌగిలించుకొని సాదరంగా స్వాగతం పలికారు.ఈ వివరాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "నా సోదరుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్‌కు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. ఆయన పర్యటన భారత్‌కు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. యూఏఈ అధ్యక్షునితో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.ఇరువురు దేశాధినేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహర భద్రత, తదితర అంశాలలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
పుతిన్ ఎఫెక్ట్? భారత్‌కు మరో దేశాధినేత
ఢిల్లీ: ప్రస్తుతం రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. గతేడాది ఆదేశ అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం రానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ అధికారికంగా ప్రకటించారు. గుజరాత్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలిష్చుక్ ఈ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేయడానికే జెలెన్స్కీ భారత్‌లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటకం, మెడిసిన్, ఇండస్ట్రీయల్ వస్తువులు, పోర్టులు తదితర రంగాలలో పరస్పర సహాకారం ఉండనున్నట్లు తెలిపారు.2024లో మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ఇండియా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పోలిష్చుక్ తెలిపారు. జెలెన్స్కీ పర్యటన ఆ రోజే ఖరారైందన్నారు. ఉక్రెయిన్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆ దేశంలో పర్యటించిన అతి కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ ఒకరని భారత ప్రధానిని కొనియాడారు. తమ దేశంలో శాంతి నెలకొనాలని గుజరాత్‌లోని ద్వారకా మందిరంలో పూజలు చేసినట్లు పోలిష్చుక్ తెలిపారు.అయితే ఇంతకాలం భారత్‌ను పన్నులతో ఇబ్బందులు పెడదామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇటీవలే ఆ దేశ రాయబారి భారత్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు. ఒకరోజైనా గడవకముందు ఉక్రెయిన్ సైతం అదే విధంగా మాట్లాడింది. ఈ పర్యటనల వెనక ఏమైనా అంతర్యముందా అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. -
త్వరలో బెంగాల్‌కు ప్రధాని
పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కనుంది. ఈ ఏడాదిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల 17న బెంగాల్లో పర్యటించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. అక్కడ మోదీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోంది. గతేడాది జరిగిన ప్రతి ఎన్నికల్లో కాషాయపార్టీ నేరుగానో లేక కూటమి ద్వారానో అధికారం సాధించింది. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం అధికారం కాషాయానికి ఇప్పటికీ అందరి ద్రాక్షగానే ఉంది. గత ఎన్నికల్లో అధికారం సాధిస్తామని చెప్పుకున్నప్పటికీ ఆపార్టీ డబుల్ డిజిట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది జరిగే ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోండగా మరోసారి గెలిచి కాషాయ పార్టీకి ఝలక్ ఇవ్వాలని తృణముల్ కాంగ్రెస్ భావిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల పశ్చిమ బెంగాల్‌లోని మాల్గాలో బహిరంగ ర్యాలీలో మోదీ పాల్గొననుట్లు బీజేపీ ప్రకటించింది. జనవరి 17న మాల్దాలో 18న హౌరాలో ర్యాలీలలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. ఈ కార్యక్రమంలో మోదీ హౌరా- గుహవతి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు మరి కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశంలో పొలిటికల్ హీట్ పెరగనుంది. -
హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
రెండోరోజు ఒమన్ పర్యటనలో ప్రధాని మోదీ
రెండోరోజు ఒమన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పలు అంశాలపై అగ్రనేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, ప్రపంచం ముందు సవాళ్లపై చర్చించనున్నారు. ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ ఇథియోపియా నుంచి బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఉప ప్రధానమంత్రి సయీద్ షిహాబ్ బిన్ తారిఖ్ అలీ సైద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మోదీ ఇవాళ (గురువారం) ఒమన్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు.ఈ సందర్భంగా కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేసే అవకాశం ఉంది. భారత్, ఒమన్ మధ్య చరిత్రాత్మకమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన పర్యటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ఇక్కడికి రావడం ఇది రెండోసారి. -
హీరోయిన్ రష్మిక.. గర్ల్స్ గ్యాంగ్‌తో శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఆరు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయా రోజుల్లో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్– బొల్లారం చెక్‌పోస్టు, కౌకూరు రోడ్డు, రిసాల బజార్, లక్డావాలా – అల్వాల్ టీ జంక్షన్, లోతుకుంట లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు– కార్ఖానా తదితర మార్గాల్లో నిరీ్ణత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. -
Vijayawada: సుప్రీం స్టే ఆర్డర్ ఉన్నా కూల్చేశారు.. YS జగన్‌తో బాధితుల ఆవేదన
-
LIVE : విజయవాడ 42 ప్లాట్ల బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
Vijayawada: జగన్ విజయవాడ పర్యటన
-
ఆ యువ సైక్లిస్ట్ గట్స్‌కి మాటల్లేవ్..! ఏకంగా 30 దేశాలు..
ఓ యువ సైక్లిస్ట్ ఖండాల మీదుగా అసాధారణ పర్యాటనకు పూనుకున్నాడు. ఏదో రికార్డు సృష్టించాలనో..తానెంటో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనో కాదు. స్వలాభం ఆశించకుండా ఓ గొప్ప సందేశాన్ని అందించేలా సాహసోపేతమైన స్ఫూర్తిదాయక పర్యాటనను చేపట్టాడు ఆ యువకుడు. ఏకంగా 18 వేల కిలోమీటర్లు తొక్కి..తన టూర్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాడు. తాను వయసులో చిన్న గానీ ఔదార్యంలో అందరికంటే మిన్నా అని చాటిచెప్పాడు. ఎవరా యువకుడు..ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద సాహసానికి పూనుకున్నాడంటే..ఫ్రాన్స్‌కు చెందిన 24 ఏళ్ల యువ సైక్లిస్ట్ కిలియన్ లే గయాడర్ తన స్వస్థలం నుంచి చైనాకు 18,000 కిలోమీటర్లు తొక్కుకుంటూ సైకిల్‌పై వెళ్లడం విశేషం. అతడు ఖండాలు మీదుగా చేపట్టి అసాధారణ టూర్‌ని చేపట్టి..ఏకంగా 30కి పైగా దేశాలు చుట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టూర్‌ని వాయువ్య ఫ్రెంచ్ నగరం రెన్నెస్ నుంచి ప్రారంభించి..నెలల తరబడి నిరంతరం ప్రయాణిస్తూ..ఇటీవలే చైనాకు చేరుకున్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే..లే గయాడర్ తన జీవితంలో మర్చిపోలేని గొప్ప సాహసోపేతమైన పర్యాటనను విజయవంతంగా పూర్తిచేశాడు. ఇది తన లైఫ్‌లోనే అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటిని సమర్థవంతంగా పూర్తిచేయగలిగానంటున్నాడు. ఎందుకోసం ఈ పర్యాటన అంటే..అనారోగ్యంతో పోరాడుతూ కూడా మన డ్రీమ్స్‌ని, లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అని చెప్పేందుకే ఈ సాహసోపతమైన పర్యాటనకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక లె గయాడర్ 2023లో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. 14 ఏళ్ల ప్రాయంలో అడవిలో ఉండే బొరేలియా బాక్టీరియా కారణంగా లైమ్ వ్యాధి బారిన పడ్డాడు. దాన్నుంచి కోలుకునేందుకే నెలలు, సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత క్రమంగా శక్తిని పొంది, పూర్తిస్థాయిలో ఆరోగ్యంవంతుడయ్యేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై ప్రజలందిరికీ అవగాహన కలిగేలా చేయాలని.. ఇలా సైకిల్ యాత్రకు సంకల్పించాడు. తనలా మరెవ్వరూ ఇంతలాబాధ పడకుండా, ముందు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించేందుకే ఈ సాహస యాత్ర అని చెప్పుకొచ్చాడు. ఫ్రాన్స్ నుంచి యూరప్ ఆసియా అంతటా దాదాపు 10 వేల కిలోమీటర్లు పైనే ఒంటిరిగా సైకిల్ తొక్కాడు. టర్కీ, జానీయాల వరకు తన స్నేహితుడు తోడు రాగా, అక్కడ నుంచి లె గయాడర్నే ఒంటరిగా చైనాకు చేరుకున్నాడు. అయితే చైనాకు చేరుకునే మార్గం చాలా కఠినమైన భూభాగం, చాలా సవాళ్లుతో కూడిన వాతావరణమని అంటున్నాడు. ఏకంగా ఎనిమిది నెలలు..ఈ యాత్ర కోసం నిధులు సేకరించడానికి సుమారు ఎనిమిద నెలల పనిచేశాడు. అయితే ఈ మొత్తం పర్యాటకు అతడికి సుమారు రూ.15 లక్షలు పైనే ఖర్చయ్యింది. ఈ టూర్‌కి ఫ్రెంచ్ బ్యాంకు, స్థానిక కౌన్సిల్, సంస్థల నుంచి ఆర్థిక సహాయం సైతం అందింది లె గయాడర్కు. నిజానికి తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్గాలలో తాను ప్రయాణిచడం అత్యంత క్లిష్టమైన సవాలు, పైగా ప్రత్యేక అనుభవ కూడా అని అంటున్నాడు ఆ యువ సైక్లిస్ట్.లైమ్ వ్యాధి (Lyme disease) అంటే:ఇది బోర్రెలియా (Borrelia) అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. అడవుల్లో, గడ్డిపొదల గుండా వెళ్లినప్పుడూ ఈ వ్యాధి బారిన పడతారట. దీని కారనంగా ఎర్రటి వలయాకారపు దద్దుర్లు , జ్వరం, తలనొప్పి, అలసట, కీళ్ల నొప్పులు వస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గుండె, నాడీ వ్యవస్థ, కీళ్లపై ప్రభావం చూపి ప్రాణాంతకంగా మారుతుందట. (చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)
-
ఉచిత కరెంట్ పేటేంట్ మాదే: సీఎం రేవంత్
సాక్షి వరంగల్ : రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు రైతు రుణమాఫీ జరగలేదని ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ జరిపామన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా నర్సంపేటలో నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి హన్మకొండ-మహబూబాబాద్ నాలుగు లేన్ల రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా క్టర్ వైఎస్సార్ హయాంలో పేదలకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం 4 లక్షల50 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను పేదలకు మంజూరు చేసిందని తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచడానికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పేటేంట్ కాంగ్రెస్ కే దక్కుతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.వరంగల్ అభివృద్ధిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కానీ ప్రజా ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ మాదిరి వరంగల్ ను అభివృద్ది చేయాలని యోచిస్తుందని తెలిపారు. వరంగల్ లో ఎయిర్ పోర్టును మార్చి 31లోగా నిర్మిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. -
దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)
-
360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత అనేది భక్తుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు కూడా దోహదపడుతోంది. ప్రొఫెషనల్ 360° వర్చువల్ టూర్ల రూపకల్పన సంస్థ ‘P4Panorama’ ఇప్పుడు లక్షలాది అయ్యప్ప భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని 360 డిగ్రీల వర్చువల్ టూర్‌గా రూపొందించింది. దూరం, అనారోగ్యం లేదా ఇతరత్రా కారణాలతో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేని భక్తులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది.ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా దర్శనం!‘P4Panorama’ రూపొందించిన ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ శబరిమల ఆలయాన్ని ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా చూసేందుకు అవకాశం కల్పించింది. ఇమ్మర్సివ్ వర్చువల్ రియాలిటీ (వీఆర్)ద్వారా భక్తులు అత్యంత పవిత్రమైన పదునెట్టాంబడి (18 పవిత్ర మెట్లు)ని, దేవస్థానాన్ని , పరిసరాలను ప్రత్యక్ష అనుభూతితో చూడవచ్చు.వర్చువల్ టూర్‌లోని ప్రధానాంశాలుఈ 360° టూర్ శబరిమల ఆలయ సంప్రదాయం, అక్కడి వాస్తుశిల్పం, పర్యావరణాన్ని సంపూర్ణంగా దర్శింపజేస్తుంది.స్వర్ణమయ సన్నిధానం: బంగారు పూతతో మెరిసిపోతున్న అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయం (గర్భగుడి)ను దగ్గర నుంచి చూసిన అనుభూతిని పొందవచ్చు.పవిత్ర సోపానం: ఈ టూర్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదునెట్టాంబడి దృశ్యాలు భక్తి భావాన్ని మరింతగా పెంచుతాయి.ధ్వజస్తంభం (కొడిమరం): ఆలయ ప్రాంగణంలోని బంగారు తాపడం చేసిన ధ్వజస్తంభంను వీక్షించవచ్చు.ఉపదేవతల సన్నిధులు: మాలిక్పురతమ్మ వంటి ఉపదేవతల మందిరాలను కూడా దీనిలో జూమ్ చేసి చూడవచ్చు.యాత్రా మార్గాలు: సాంప్రదాయ ట్రెక్కింగ్ దారుల వెంబడి ఉన్న సుందరమైన దృశ్యాలు, ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌లు కూడా ఈ టూర్లో ప్రధానంగా కనిపిస్తాయి.సాంకేతికత - ఆధ్యాత్మికత - పర్యావరణంఈ వర్చువల్ టూర్ కేవలం ఒక సాంకేతిక అద్భుతం మాత్రమే కాదు. పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. వర్చువల్ దర్శనాన్ని ఎంచుకోవడం ద్వారా, భక్తులు శబరిమల అటవీ పర్యావరణ వ్యవస్థను ఒక విధంగా కాపాడినవారవుతారు.‘P4Panorama’ ప్రతినిధులు చెప్పినట్లు.. ఈ వర్చువల్ టూర్ అటు ఆధ్యాత్మికత, ఇటు ఆధునిక సాంకేతికతల సామరస్యపూర్వక కలయిక. వీరు అందించిన ఈ టూర్లో కేవలం ఒక క్లిక్‌తో భక్తులు తమ ఇంటి నుంచే అయ్యప్పను దర్శనం చేసుకోగలుగుతారు. ఈ సంస్థ శబరిమల ఆలయంతో పాటు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, గురునానక్ దర్బార్ తదితర ప్రాంతాలను కూడా 360 డిగ్రీలలో చూపిస్తోంది.👉: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: అయోధ్య: ప్రాణప్రతిష్ఠ నుంచి నేటి ధ్వజారోహణ వరకూ.. -
నెతన్యాహు భారత పర్యటన రద్దు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటన రద్దైంది. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా నెతన్యాహు తన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నెతన్యాహు భారత్ పర్యటన రద్దవడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.భారత్- ఇజ్రాయెల్ మధ్య మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ ఆపదలో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ ఇజ్రాయెల్ ఆపన్న హస్తం అందించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు ఈ ఏడాది చివర్లో భారత్ రావాల్సి ఉండగా కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో బెంజిమెన్ పర్యటన రద్దుకావడం ఇది మూడోసారి. గతంలో సెప్టెంబర్ 19న ఒకరోజు పర్యటన నిమిత్తం భారత్ రావాల్సి ఉండగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతకు ముందు ఏప్రిల్‌లో సైతం బెంజిమిన్ పర్యటన రద్దైంది.బెంజిమిన్ నెతన్యాహు చివరిసారిగా 2018లో భారత్ లో పర్యటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఆయన ఇండియా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది. 2026లో నెతన్యాహు భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశముంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు దాడిలో 13మంది మృతి చెందగా పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. -
నేడు రాప్తాడుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాప్తాడుకు చేరుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్నారు. -
తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)
-
ఇవాళ ఏపీలో ప్రధాని మోదీ పర్యటన
-
పవన్ తిరుపతి పర్యటనపై భూమన సెటైర్లే సెటైర్లు
-
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి
-
జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..
-
లోకేష్ నెల్లూరు పర్యటనలో అపశృతి
-
జగన్ సునామీని చూసి ఏడుస్తున్న ఎల్లో మీడియా
-
జగన్ అన్ స్టాపబుల్.. ఎవర్రా ఆపేది..?
-
జగన్ సైనికులుగా కొడాలి నాని, వల్లభనేని వంశీ
-
వైఎస్ జగన్ పర్యటన హైలైట్స్
-
ఎడారి దేశంలోని ఒయాసిస్ సిటీలో సారా అలీ ఖాన్ (ఫొటోలు)
-
మాల్దీవులు ట్రిప్ జ్ఞాపకాలతో సితార (ఫొటోలు)
-
ఒంటరిగా మాల్దీవులు టూర్లో నమ్రత (ఫొటోలు)
-
కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన..
-
Big Question: జగన్ పర్యటనలో జనం రెస్పాన్స్.. బాబు కళ్లు తెరుస్తారా?
-
ఎర్రటి సూరీడు సైతం చల్లబడేలా జగన్ జన ప్రభంజనం..
-
బాబు పాలనపై నర్సీపట్నం పబ్లిక్ టాక్
-
జై జగన్ నినాదాలతో సాగర తీరంలో జన సునామీ
-
Big Question: నర్సీపట్నం టూర్ సక్సెస్.. 70-MMలో మెడికల్ కాలేజీ చూపించిన జగన్
-
జగనన్న కోసం కదిలిన ఊరూ-వాడా (ఫొటోలు)
-
జగన్ రాకతో జనసంద్రమైన నర్సీపట్నం
-
KSR Live Show: వచ్చేది జగన్.. ఆపితే ఆగే సైన్యం కాదు
-
Watch Live: వైఎస్ జగన్ నర్సీపట్నం టూర్
-
జగన్ పర్యటనకు రావొద్దు..! ప్రజలకు, పార్టీ నేతలకు పోలీసుల బెదిరింపులు
-
జగన్ టూర్ పై కుట్ర.. అయినా తగ్గేదే లే..
-
YS జగన్ నర్సీపట్నం టూర్.. రూట్ మ్యాప్ ఇదే
-
జగన్ నర్సీపట్నం టూర్.. భయపడ్డ బాబు!
-
బాబు కొత్త డ్రామా.. విజయ్ తొక్కిసలాట ఘటన చూపి జగన్ కు కండీషన్స్!
-
జగన్ యాక్షన్ ప్లాన్.. ఇక కూటమికి చుక్కలే
-
మీరేంటి మాకు చెప్పేది.. జగన్ ని ఎలా అడ్డుకుంటారో చూస్తాం
-
జగన్ టూర్ పై ఇంటెలిజెన్స్ సంచలన రిపోర్ట్.. చేతులెత్తేసిన పోలీసులు
-
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్‌ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్‌ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
క్రూయిజ్ జర్నీ, అమేజింగ్ అండమాన్
అండమాన్ టూర్... అమేజింగ్ టూర్. (Amazing Andaman) ఎందుకంటే... ఇది రోడ్డు టూర్ కాదు. అలాగని రైలు బండి పర్యటనా కాదు.గాల్లో విమాన విహారమూ కాదు.నీటి మీద క్రూయిజ్‌లో విహారం. ఇంకా... నగరం మధ్య వీధుల్లో విహారం కాదు.ఇది... సముద్రం మధ్య దీవుల్లో విహారం.ఎటు చూసినా సముద్రమే...ఎటు వెళ్లినా ప్రకృతి ఆహ్లాదమే. ఒకవైపు ఇంద్రధనసు సూర్యోదయం.మరో వైపు ప్రకృతి చెక్కిన రాతి వంతెన.ఇన్ని ప్రకృతి అద్భుతాల సుమహారం ఈ టూర్. 17వ తేదీ తెల్లవారు జామున 4. 35 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టూర్ నిర్వహకులకు రిపోర్ట్ చేయాలి. మీట్ అండ్ గ్రీట్ తర్వాత పర్యాటకులందరూ విమానం ఎక్కాలి. విమానం దాదాపు తొమ్మిది గంటలకు పోర్ట్‌బ్లెయిర్‌కు చేరుతుంది. ఎయిర్΄ోర్ట్ నుంచి బయలుదేరి హోటల్‌కు చేరి చెక్ ఇన్ చేయాలి. లంచ్ తర్వాత అండమాన్‌లోని సెల్యూలార్ జైలు మ్యూజియం వీక్షణం, కోర్బిన్స్ కోవ్ బీచ్ విహారం. సాయంత్రానికి తిరిగి సెల్యూలార్ జైలుకు చేరుకుని లైట్ అండ్ సౌండ్ షో కి హాజరుకావడం.శ్రీ విజయపురం!పోర్ట్ బ్లెయిర్ పట్టణం ఇప్పుడు భారతీయతను సంతరించుకుంది. దీని కొత్త పేరు శ్రీ విజయపురం. అండమాన్ దీవులంటే ఇప్పుడు మనకు పర్యాటక ప్రదేశంగా మాత్రమే గుర్తు వస్తోంది. కానీ మనదేశానికి స్వాతంత్య్రాన్ని అధికారికంగా ప్రకటించకముందే మన జాతీయ పతాకం ఎగిరిన నేల ఇది. అందుకే శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేసింది భారత ప్రభుత్వం. ఇక్కడ వీర సావర్కర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన క్షణం నుంచి జాతీయోద్యమకాలంలోకి వెళ్తున్న భావన మొదలవుతుంది. సెల్యులార్ జైలు ్ర΄ాంగణంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అసంకల్పితంగా గుండె బరువెక్కుతుంది. ఇది పోరాట యోధుల జీవించే హక్కునే కాలరాయడం కోసమే నిర్మించిన చెరసాల. బ్రిటిష్ దమన నీతికి నిదర్శనం. ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లున్న దీవుల్లో పెద్ద జైలు కట్టి జాతీయోద్యమకారులను బంధించేవారు. ఖైదీల చేత చేయించే పనుల నమూనా చిత్రాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. నాటి ΄ాలన దురాగతాలకు కళ్లకు కడుతుంది సాయంత్రం జరిగే సౌండ్ అండ్ లైట్ షో. రెండో రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ (స్వరాజ్ ద్వీప్)కు ప్రయాణం. తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్ ప్యాక్ చేసి ఇస్తారు. క్రూయిజ్ జర్నీ మొదలవుతుంది. హావ్లాక్ ఐలాండ్‌కి చేరిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ చేయాలి. మధ్యాహ్న భోజనం తర్వాత రాధానగర్ బీచ్ విహారం. తిరిగి హోటల్‌కు వచ్చిన తర్వాత డిన్నర్. రాత్రి బస హావ్లాక్ దీవిలో.స్వరాజ్ ద్వీప్ విహారంఅండమాన్– నికోబార్ దీవుల్లో అనేక దీవులు, పట్టణాలు బ్రిటిష్ అధికారుల పేర్లతోనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత మెల్లమెల్లగా కొత్త పేర్లతో వ్యవహారంలోకి వస్తున్నాయి. హావ్లాక్ కూడా బ్రిటిష్ అధికారి పేరే. అయితే దీనిని స్వరాజ్ ద్వీప్గా పేరు అధికారికంగా మారింది. ఇందుకు కారణం జాతీయోద్యమంలో భాగంగా అండమాన్ దీవుల్లో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయపతాకాన్ని ఆవిష్కరించి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినట్లు ప్రకటన చేశాడు. ఆయన గౌరవార్థం పాత పేర్లను హావ్లాక్ ఐలాండ్– స్వరాజ్ ద్వీప్, రాస్ ఐలాండ్– నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, నీయెల్ ఐలాండ్ – షాహీద్ ద్వీప్గా మార్చింది భారతప్రభుత్వం. ఈ దీవులు అచ్చమైన ప్రకృతి వరాలనే చెప్పాలి. చిరు అలల సవ్వడి వింటూ, మెత్తటి ఇసుకలో నడుస్తూ నీలిరంగు నీటికి– నీలాకాశానికి మధ్యనున్న గీత ఎక్కడో వెతుక్కుంటూ ఉంటే టైమ్ తెలియదు. ఇది ఎకో టూరిజమ్ జోన్. నియమాలను పాటించాలి. టైమ్ మ్యాగజైన్ 2004లో ఇక్కడి రాధానగర్ బీచ్‌కి టైమ్ ‘బెస్ట్ బీచ్ ఇన్ ఏషియా’ గుర్తింపు నిచ్చింది. ఈ టూర్లో ఎదురు చూసిన క్రూయిజ్ జర్నీని క్షణక్షణం ఆస్వాదించాలి. మూడో రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత వాటర్ స్పోర్ట్స్ కోసం ఎలిఫెంట్ బీచ్‌కు వెళ్లాలి. వాటర్ స్పోర్ట్స్ టికెట్లు పర్యాటకులే కొనుక్కోవాలి. హోటల్ చేరేది రాత్రికే. హోటల్‌కు భోజనం, బస హావ్లాక్ ఐలాండ్‌లోనే.పగడపు దీవుల విహారం!ఎలిఫెంట్ బీచ్ సముద్రంలో స్విమ్మింగ్, సన్‌బాత్‌కి బాగుంటుంది. వాటర్ స్కూబా డైవింగ్ వంటి స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. మరకతాలు పరిచినట్లున్న సముద్రాన్ని ప్రశాంతం తీరాన కూర్చుని ఆస్వాదించడానికి వీలుగా రెల్లుగడ్డి గొడుగులతో పొడవాటి కుర్చీలుంటాయి. ఇక్కడ కూర్చుని సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతి. స్కూబా డైవింగ్‌లో సముద్రగర్భంలోకి దూరిపోయి అక్కడ విస్తరించిన పగడపు దీవులను చుట్టి రావచ్చు. నాలుగో రోజు: హావ్లాక్ నుంచి నీల్‌కు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాలాపత్తర్ బీచ్ విహారం తర్వాత క్రూయిజ్‌లో నీల్ ఐలాండ్‌కు చేరాలి. హోటల్ గదిలో చెక్ ఇన్. సాయంత్రం సీతాపూర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్‌లో సూర్యాస్తమయ వీక్షణం. రాత్రి బస నీయెల్ ఐలాండ్‌లో.సన్‌రైజ్ బీచ్షాహీద్ దీవి నుంచి సూర్యోదయ వీక్షణం ఓ మధురానుభూతి. చక్కటి వ్యూ పాయింట్ అని చెప్పవచ్చు. అందుకే దీనికి సన్‌రైజ్ బీచ్ అనే విశేషణం. ఫొటోగ్రఫీకి ది బెస్ట్ లొకేషన్. నవదంపతులు మంచి లొకేషన్లో ఫొటోలు తీసుకుంటే పర్యటన జ్ఞాపకాలు కూడా కలకాలం పదిలంగా ఉంటాయి.ప్రకృతి అద్భుతం– శిలావంతెనషాహీద్ (నీయెల్) దీవి ప్రకృతి చేసే చిత్రవిచిత్రాలకు, విన్యాసాల నిలయం. తిరుమల గిరుల్లో శిలాతోరణాన్ని చూస్తాం. కొండ రాళ్లు నీటి ప్రవాహ తాకిడికి అరిగి΄ోయి పై భాగంలో శిల అలాగే ఉండిపోవడంతో ఆ రూపం తోరణాన్ని తలపిస్తుంటుంది. ఈ దీవిలోని లక్ష్మణ్‌పూర్ బీచ్‌లో కూడా అలాంటి ప్రకృతి అద్భుతం ఉంది. దీనిని శిలా వంతెన, సహజ వంతెన అంటారు. ఈ బీచ్ సూర్యాస్తమయ వీక్షణానికి గొప్ప ప్రదేశం కావడంతో సన్‌సెట్ బీచ్ అంటారు. ఈ దీవిలో అరవై కిందటి వరకు ఇక్కడ మనుష సంచారం ఉండేది. ఇక్కడ ఉన్న స్థానికులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన హిందూ శరణార్థులే. (రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో)అయిదో రోజు : బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి భరత్పూర్ బీచ్ విహారానికి వెళ్లాలి. ఆ తర్వాత ΄ోర్ట్బ్లెయిర్కు ప్రయాణం. ఈ రోజు సాయంత్రం విశ్రాంతిగా గడపడమే. రాత్రి బస పోర్ట్ బ్లెయిర్‌లో. సప్తవర్ణమాలికసముద్రం మీద సూర్యోదయం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆరెంజ్కలర్లో బంతిలాగ నీటి నుంచి ఉద్భవిస్తున్న సూర్యుడి రూపమే. కానీ భరత్పూర్ బీచ్‌లో సూర్యోదయం సప్తవర్ణ సంగమం. సముద్రం ఈమద ఇంద్రధనసు విన్యాసాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సముద్రపు నీరు తక్కువ లోతులో ఈదడానికి అనువుగా జెట్టీ నిర్మాణం ఉంది. అందులో వాటర్ స్పోర్ట్స్, కోరల్ రీవ్స్ విజిట్‌తోపాటు ప్రశాంతంగా నీటిలో సేదదీరవచ్చు.హైదరాబాద్‌కు ప్రయాణం. పోర్ట్బ్లెయిర్లో తెల్లవారు జామునే హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎయిర్‌పోర్టుకు చేరాలి. టూర్ నిర్వహకులు పర్యాటకులను ఎనిమిది లోపు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి, వీడ్కోలు చెబుతారు. విమానం 9.55కి బయలుదేరి 12.10 గంటలకు హైదరాబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఇదీ చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!ప్యాకేజ్ ఇలా:కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ టికెట్ 74, 425 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 56,625 రూపాయలు. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 54, 925 రూపాయలు. పిల్లలకు (5–11 ఏళ్ల మధ్య) 48, 785 రూపాయలు. ఇందులో విడిగా బెడ్ ఉంటుంది. బెడ్ లేకుండా (2–11 ఏళ్ల మధ్య) 45, 485 రూపాయలు. రెండేళ్లలోపు పిల్లలకయితే టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విమానం ఎక్కే ముందు ఎయిర్΄ోర్ట్ కౌంటర్లో దాదాపుగా 1,750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.బుకింగ్ ఎలా:సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ, సౌత్‌సెంట్రల్ జోన్, ఐఆర్సీటీసీ 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ΄్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.ఫోన్ నంబరు: 040– 27702407విజయవాడ ఏరియా ఆఫీస్ : 92810 30714టూర్ కోడ్: SHA18 - AMAZING ANDAMAN OCT 17అమేజింగ్ అండమాన్ టూర్ అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. 6ఈ– 6305 నంబర్ విమానం 17వ తేదీ ఉదయం ఆరు గంటల 25 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఎనిమిది గంటల 55 నిమిషాలకు పోర్ట్‌బ్లెయిర్‌కు చేరుతుంది. – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రంగంలోకి YS జగన్
-
దేశమంతా కవర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
పయనమే జీవనం..
‘ఇల్లే తీర్థం–వాకిలే వారణాసి–కడుపే కైలాసం’ అనుకుంటారు కొందరు. కొందరు మాత్రం ‘ప్రపంచమే అతి పెద్ద ఇల్లు’ అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడతారు. ఒక వయసు దాటిన తరువాత ‘ఈ వయసులో ప్రయాణం ఏమిటి’ అనుకుంటారు ఇంకొంతమంది. అయితే ప్రయాణం వయసెరుగదు. ఎందుకంటే వయసు భారాన్ని అధిగమించే ఉత్సాహం ప్రయాణాలలో ఉంది. అలాంటి ఒక ఉత్సాహవంతురాలు ఇందిర. కేరళకు చెందిన ఇందిర ఎం. ఉపాధ్యాయురాలు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత 35 దేశాలు పర్యటించింది.కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చిన్నప్పుడు కలలు కనేది ఇందిర. అయితే అరవై ఏళ్ల వయసులోగానీ ఆ కల నెరవేరలేదు. సౌత్ ఆఫ్రికన్ సవానా తన తొలి ఇంటర్నేషనల్ ట్రిప్. తొలి ప్రయాణ విశేషాల గురించి అపురూపంగా చెబుతుంది. జీవవైవిధ్యంతో అలరించే ప్రకృతి, బిగ్ఫైవ్లాంటి వన్య ప్రాణులు, వైవిధ్యమైన వాతావరణం... స్థూలంగా తొలి పర్యటన ఇందిరకు ఎంతో సంతోషాన్నిచ్చింది.చదవండి : బాలీవుడ్‌ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తసఫారీలో తాను చూసిన ఏనుగులు, సింహాల గురించి చిన్నపిల్లలా ఉత్సాహపడుతూ... ‘ప్రయాణాల పుణ్యమా అని నాకు ఎంతోమంది స్నేహితులయ్యారు. జీవితంతో పాటు రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం. మాలో చాలామందికి ఒకేరకమైన జీవితానుభవాలు ఉన్నాయి. నా స్నేహబృందంలో వివిధ వయసుల వాళ్లు,ప్రాంతాల వాళ్లు ఉన్నారు. అయితే మా స్నేహానికి వయసు,ప్రాంతం ఎప్పుడూ అడ్డుగోడ కాలేదు’ అంటుంది ఇందిర.పెళ్లికావడానికి ముందు ప్రయాణాలు చేయాలనే ఉత్సాహం ఉన్నా ఆమె దగ్గర సరిపడా డబ్బు ఉండేది కాదు. ఉద్యోగం వచ్చి, పెళ్లయిన తరువాత కుటుంబ ఖర్చులు, బాధ్యతల వల్ల ప్రయాణాలు చేయలేక పోయింది. ‘సోలో ట్రావెలింగ్ గురించి ఆలస్యంగా తెలిసింది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నన్ను నేను లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది’ అంటుంది ఇందిర.ప్రతి ప్రయాణంలో ఆమె ఎన్నో అనుభవాలను మూటగట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఉన్నప్పుడు సూట్‌కేస్ కోడ్ మరిచి పోయింది. జపాన్‌లో ఒకరోజు గాయపడింది... ఇలాంటి ఎన్నో సందర్భాలలోనూ ఎవరో ఒకరు ఆమెకు సహాయంగా నిలిచేవారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, దయాగుణం అనుకోని అతిథిలా వచ్చేది.సోలో ట్రావెల్‌ను ఎంజాయ్ చేసినట్లే గ్రూప్ ట్రావెల్‌ను కూడా ఎంజాయ్ చేసింది ఇందిర. ‘గ్రూప్‌తో కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబసభ్యులతో ఉన్నట్లుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడతారు’ అంటున్న ఇందిర ఇప్పటివరకు 35 దేశాలకు వెళ్లింది. మరిన్ని దేశాలకు వెళ్లడానికి సన్నద్ధం అవుతోంది. తాజాగా స్కాండినేవియా దేశాల పర్యటనకు సిద్ధం అవుతోంది.తొలి ప్రయాణానికి సంబంధించి పిల్లలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మొదటి ప్రయాణ సమయంలో ఖర్చు గురించి ఆలోచించాను. అయితే విలువైన ప్రయాణ అనుభవాల ముందు ఆ ఖర్చు ఒక లెక్కే కాదని తెలుసుకున్నాను. ప్రయాణాన్ని ఇంత బాగా ఆస్వాదిస్తానని ఊహించలేదు. తొలి ప్రయాణం అనేది నేను ప్రయాణాలను ఇష్టపడేలా చేసిన ఒక ట్రిగ్గర్.చదవండి: ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి ఎప్పుడూ ఉండే ఇంటిని దాటి మనల్ని మనం కనుగొనడంలో ఒక నిర్దిష్ట నిశ్శబ్ద శక్తి ఉంది. నేను చాలా ఆలస్యంగా ప్రయాణాలు ప్రారంభించాను. చాలా ముందుగానే మొదలు పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తోంది. సోలో ట్రావెల్‌కు చాలామంది వెనకాడుతుంటారు. అయితే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి.– ఇందిర ఎం -
గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..
ప్రకృతికి పక్షపాతం కొంచెం ఎక్కువే. దక్షిణాదిన కేరళను అక్కున చేర్చుకుంది. ఉత్తరాన ఉత్తరాఖండ్‌ను ఒడిలో దాచుకుంది. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అనే భుజకీర్తి ఒకరిది. ‘దేవభూమి’ అనే అతిశయం మరొకరిది. ఆ రెండు రాష్ట్రాల్లో పుట్టని వాళ్లేం చేయాలి? వీలయినప్పుడు అక్కడికి వెళ్లి చూసి రావాలి? హైదరాబాద్‌లో రైలెక్కి ఢిల్లీలో రైలు దిగుదాం. ఢిల్లీలో బస్సెక్కి ఉత్తరాఖండ్ టూర్‌కి చెక్కేద్దాం. ఇది... మూడు వేల అడుగుల ఎత్తు మొదలు... ఏడు వేల అడుగుల ఎత్తుకు సాగే ప్రయాణం.1వ రోజుఉదయం ఆరు గంటలకు ట్రైన్ నంబర్ 12723 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 2వ రోజు ఉదయం 7.40 గంటలకు ఢిల్లీ స్టేషన్‌కు చేరుతుంది. హోటల్లో రిఫ్రెష్మెంట్, బ్రేక్‌ఫాస్ట్ తరవాత కార్బెట్కు ప్రయాణం. కార్బెట్కు చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్కడ హోటల్ గదిలో చెక్, రాత్రి భోజనం, బస.3వ రోజుతెల్లవారు జామున లేచి కార్బెట్ సఫారీకి వెళ్లడం, జలపాతాల వీక్షణం తర్వాత హోటల్‌కి వచ్చి బ్రేక్‌ఫాస్ట్, రిఫ్రెష్మెంట్ తర్వాత గది చెక్ అవుట్ చేయాలి. నైనితాల్‌కు ప్రయాణం. నైనితాల్‌లో హోటల్లో చెక్ ఇన్, రాత్రి భోజనం, బస అక్కడే.వేటగాడి జ్ఞాపకం!చందమామ కథల్లో చెప్పుకున్నట్లు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి కాదు కానీ ఇది దట్టమైన అటవీప్రదేశం అని చెప్పడంలో సందేహం లేదు. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పాటయిన నేషనల్ పార్క్ ఇది. తొలి తొలి నేషనల్ పార్క్ కూడా. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ పార్కుగా పేరు మార్చుకుంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం. నిజానికి పులులను సంరక్షించడంలో జిమ్ కార్బెట్ పాత్ర ఏమీ లేదు. ఇతడు గొప్ప వేటగాడు. కుమావ్ రీజియన్‌లో మనుషులకు హాని కలిగిస్తున్న పులులను, చిరుత పులులను హతమార్చిన ఘనత ఇతడిది. తన పులుల వేట కథనాలను రాశాడు కూడా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సఫారీలో మనకు పులులు, ఏనుగుల గుంపులు, జింకలు, రకరకాల పక్షులు కనువిందు చేస్తాయి. నగరవాసుల ఈ టూర్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగులుతుంది. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన శివాలిక్ రీజియన్ ఉంది. అటవీప్రదేశంలో పర్వతసానువులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అడవి మధ్యలో ప్రవహిస్తున్న రామ్ గంగ నది, దాహం తీర్చుకోవడానికి నది తీరానికి వచ్చిన జంతువులను చూస్తూ పిల్లలు కేరింతలు కొడతారు. వన్య్రప్రాణుల సంరక్షణ కోసం ఎకో టూరిజమ్ పాలసీ అమలులో ఉంది. కాబట్టి ప్రకృతికి, వన్య్రప్రాణులకు హాని కలిగించే వస్తువులను అనుమతించరు. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత నైనితాల్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనం. రాత్రి బస నైనితాల్‌లో.ప్రకృతి అద్భుతం ఈ నయనం!నైనితాట్ పట్టణానికి పౌరాణిక ప్రాశస్త్యంతోపాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ (వింటర్ క్యాపిటల్, వింటర్ సెషన్స్), నైనితాల్ సమ్మర్ క్యాపిటల్, అలాగే జ్యూడిషియల్ క్యాపిటల్ కూడా, గవర్నర్ బంగ్లా కూడా నైనితాల్లోనే. తాల్ అంటే సరస్సు, నయనం (కన్ను) ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ తటాకానికి నైనితాల్ అని పేరు. ప్రకృతి దేవత రూపంలో కొలిచే సంస్కృతిలో భాగంగా నెలకొన్న నయనాదేవి (నైనాదేవి) ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఒక పర్వత శిఖరానికి నైనా పీక్ అని పేరు. అది ఎనిమిది వేల అడుగులకు పైగా ఉంటుంది. చర్చ్, ప్రాచీన కాల నిర్మాణశైలి మసీదు నిర్మాణశైలి సునిశితంగా ఉంటుంది. హనుమాన్ ఘరి ఆలయం నైనితాల్‌లోని మాల్ రోడ్లో ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం మంచి వ్యూ ΄ాయింట్. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్ధుతంగా ఉంటాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలను కూడా చూడవచ్చు.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత అల్మోరా, ముక్తేశ్వర్ దిశగా ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి నైనితాల్‌కు చేరాలి. రాత్రి బస నైనితాల్‌లో.ఇక్కడ ఆది మానవుడు నివసించాడు!అల్మోరాలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చిన ప్రముఖుల పాదముద్రలే పర్యాటక ప్రదేశాలు. స్వామి వివేకానందుడు ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతల «మధ్య ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. మహాభారత కాలంలో కూడా ఈ ప్రదేశం ప్రస్తావన ఉంది. అది కేవలం పుక్కిటి పురాణం కాదనడానికి నిదర్శనంగా చంద్ రాజవంశం నివసించిన భవనాలున్నాయి.రాజభవనాలంటే మనకు రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లే గుర్తొస్తాయి. కానీ ఇక్కడి రాజభవనాన్ని చూస్తే రాజు అత్యంత నిరాడంబరంగా జీవించాడనిపిస్తుంది. పెద్ద రాతి గోడలు, ఆకు పచ్చ రంగు రేకులతో ఏటవాటు పైకప్పు భవనమే చంద్ రాజవంశపు కోట. కుమావ్ పర్వతశ్రేణుల్లో రాజ్యాన్ని స్థాపించి అల్మోరా రాజధానిగా పాలించారు. ప్రాచీనకాలంలో ఇక్కడ మనుషులు నివసించారని నిరూపించే లఖుదియార్ గుహలున్నాయి. క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ పూర్వికులు అల్మోరా వాసులే.అదిగో మంచుకొండ ముక్తేశ్వర్ శైవ క్షేత్రం. ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని చెబుతారు. ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాలయాలు పర్యాటకులతో దోబూచులాడుతూ ఉంటాయి. పర్వత సానువుల మధ్య ప్రయాణం సాగుతున్నప్పుడు కొంత మేర ఆకాశాన్నంటే శిఖరాలతో ప్రపంచంతో సంబంధాలు తెగి΄ోయినట్లయినిపిస్తాయి. ఒక మలుపు తిరగ్గానే సూర్యకిరణాలతో ధగధగలాడుతూ మంచుకొండలు దర్శనమిస్తాయి. కొండవాలులో ప్రయాణిస్తున్నప్పుడు లోయలు వెన్నులో భయాన్ని పుట్టిస్తాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్నామని చూపిస్తుంది. ఇక భయాన్ని అదిమిపెట్టి లోయవైపు చూడకుండా కొండంత అండగా కనిపిస్తున్న కొండనే చూస్తూ ముందుకు సాగిపోవాలి.6వ రోజుబ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం గది చెక్ అవుట్ చేసి ఢిల్లీకి ప్రయాణం. ఢిల్లీ చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్షరధామ్ టెంపుల్ సందర్శనం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస.లోహరహిత నిర్మాణంఅక్షరధామ్ ఆలయం విశాలమైన నిర్మాణం. ఇది స్వామి నారాయణ ఆలయం. ఈ ఆలయాన్ని ్ర΄ాచీన భారత శిల్పశాస్త్రాన్ని అనుసరించి నిర్మించారు. ఇంత భారీ నిర్మాణంలో ఎక్కడా లోహాలను ఉపయోగించలేదు. అందుకే పిల్లర్లు ఎక్కువగా కనిపిస్తాయి. 234 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం మీద సునిశితమైన శిల్పచాతుర్యమయం. ఉత్తరాది నిర్మాణాలకు పాలరాయి ఒక వరం అనే చె΄్పాలి. పాలరాతితో పూలరెక్కలను కూడా అంతే సున్నితంగా చెక్కగలిగిన నిపుణులు ఉండడం మనదేశ గొప్పదనం. అందుకే పాలరాతి ఆలయాలకు వెళ్లినప్పుడు చుట్టూ చూసి సరిపెట్టుకోకుండా తలెత్తి పైకప్పును కూడా చూడాలి. అక్షరధామ్ ఆలయ సందర్శనంలో వాటర్ ఫౌంటెయిన్లు, లేజర్ షోలను మిస్ కాకూడదు.7వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుతుబ్‌మినార్, లోటస్ టెంపుల్ సందర్శనం, మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. నాలుగు గంటలకు 12724 నంబర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఎనిమిదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుతుంది.ఏనాటిదో ఈ మినార్!కుతుబ్ మినార్ నిర్మాణం గురించి చరిత్ర తవ్వకాల్లో కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అప్పటికప్పుడు ఓ చిన్న వివాదం, ఆ తర్వాత సమసి΄ోవడం, కొత్త వాస్తవాలను స్వీకరించడం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని క్రీ.శ పన్నెండవ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడనే ఆధారాలను కొట్టి పారేస్తూ ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడనే ఆధారాలు వ్యక్తమయ్యాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలను కొనసాగిస్తోంది. ఈ వాస్తవాలెలా ఉన్నప్పటికీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఓ గొప్ప నిర్మాణ విశేషం. అందుకే యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.ధ్యాన కలువప్రతి ఆర్కిటెక్చర్ స్టూడెంట్ చూడాల్సిన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ లేదు. కలువ రెక్కల లోపల లోహపు కడ్డీల ఆధారంగా నిర్మించారు. గొప్ప ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా ధ్యానం కోసం నిర్మించిన బహాయీ ధ్యానమందిరం ఇది. లోటస్ టెంపుల్ గిన్నిస్ రికార్డు సాధించిన ఆలయం. ఈ ఆలయం, నిర్మాణ వైశిష్ట్యాలను వివరిస్తూ ఐదు వందల వ్యాసాలు, వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ శబ్దం వినిపించదు. నిర్వహకులు పిన్‌డ్రాప్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. చక్కటి గార్డెన్ల మధ్య మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లి కొద్ది సేపు ధ్యానం చేసి బయటకు రావడం గొప్ప అనుభూతినిస్తుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
ప్రత్యేక బస్సులో విజయ్ తమిళనాడు రాష్ట్ర పర్యటన
-
ప్రపంచయాత్రకు నారీశక్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల చరిత్రలో నారీశక్తి మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాలకు చెందిన పది మంది మహిళా అధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టేసేందుకు సాహస యాత్రకు బయల్దేరింది. ఈ యాత్రకు ‘సముద్ర ప్రదక్షిణ’ అని నామకరణం చేశారు. ఈ చరిత్రాత్మక పడవ యాత్రను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.సాగరంలో సాహస యాత్రఈ యాత్రలో భాగంగా బృందం సముద్రంలో ఏకధాటిగా 26,000 నాటికల్ మైళ్లు పయనించనుంది. రెండుసార్లు భూమధ్యరేఖను దాట డంతో పాటు, అత్యంత ప్రమాదకరమైనవిగా పేరొందిన మూడు గ్రేట్ కేప్‌లైన కేప్ లీవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్‌లను ఈ బృందం చుట్టి రానుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన దక్షిణ మహాసముద్రం, డ్రేక్ పాసేజ్ జలాల్లో వీరి ప్రయాణం సాగుతుంది. ఈ బృందం 2026 మే నెలలో తిరిగి ముంబై తీరానికి చేరుకుంటుందని అంచనా.మూడేళ్ల కఠోర శిక్షణలెఫ్టినెంట్ కల్నల్ అనూజ వరూద్కర్ నేతృత్వంలోని ఈ బృందంలో స్క్వాడ్రన్ లీడర్ శ్రద్ధా పి. రాజు, మేజర్ కరమ్‌జీత్ కౌర్, మేజర్ ఓమితా దాల్వి, కెప్టెన్ ప్రజక్తా పి నికమ్, కెప్టెన్ దౌలీ బుటోలా, లెఫ్టినెంట్ కమాండర్ ప్రియాంక గుసాయిన్, వింగ్ కమాండర్ విభా సింగ్, స్క్వాడ్రన్ లీడర్ అరువి జయదేవ్, స్క్వాడ్రన్ లీడర్ వైశాలి భండారీ ఉన్నారు. గత మూడేళ్లుగా ఈ బృందం కఠోర శిక్షణ పొందింది. శిక్షణ, సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ఏడాది ముంబై నుంచి సుదూర సీషెల్స్ వరకు సముద్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి తమ సన్నద్ధతను ఈ బృందం ఇప్పటికే చాటింది.ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక: రక్షణ మంత్రిఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పుదుచ్చేరిలో దేశీయంగా నిర్మించిన 50 అడుగుల ఐఏఎస్‌వీ త్రివేణి నౌక ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పానికి ప్రతీక అని కొనియాడారు. ఈ నౌక ప్రయాణించే ప్రతీ నాటికల్ మైలు.. దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా వేసే అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఐఎన్ఎస్ తారిణి నౌకపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపాలను ఆయన అభినందించారు. ఇప్పుడు ‘త్రివేణి’ బృందం కూడా నౌకాయానంలో మరో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. -
కశ్మీర్ యువతలో ప్రతిభకు కొదవలేదు
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని వారికి సరైన అవకాశాలు లభిస్తే దేశం తరపున ఆడే స్తతా ఉందని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. జమ్మూ, కశ్మీర్ పర్యటనలో ఉన్న మహ్మద్ అజారుద్దీన్ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలను మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజులుగా జమ్మూ కశ్మీర్లో యువ క్రికెటర్లను తాను కలిశానని ఆటలోని మెళకువలను నేర్పించానన్నారు. సుదీర్ఘ కాలంగా అవకాశాల కోసం వేచి చూస్తున్న యువతకు ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహం కల్పిస్తుండటం అభినందనీయమని అన్నారు. -
బిగ్‌బాస్ 9 తెలుగు హౌస్ టూర్ (ఫొటోలు)
-
యూఎస్ టూర్లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
మీనాక్షి చౌదరి జపాన్ టూర్.. ఫుల్ ఎంజాయ్ (ఫొటోలు)
-
అమెరికా సుంకాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా భారీ సుంకాలపై భారత్ గట్టి కౌంటర్‌కు సిద్ధమైంది. అగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అందుకు ట్రంప్ భారత్‌పై విధించిన భారీ సుంకాలే కారణం. భారత్ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని.. పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన.. తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.అమెరికాతో వాణిజ్యం జరిపే దేశాల్లో భారత్‌పై విధించిన సుంకమే హయ్యెస్ట్. దీంతో.. ట్రంప్ నిర్ణయాన్ని భారత్ అన్యాయంగా పేర్కొంది. అమెరికా, ఐరోపా దేశాలు తమ దేశాలకు అనుగుణంగా రష్యాతో వాణిజ్యం చేస్తుండడాన్ని ప్రముఖంగా లేవనెత్తింది కూడా. అయితే భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్ వార్‌పై తీవ్రంగా స్పందించేందుకు ఇప్పుడు సిద్ధమైంది.రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్‌కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే..ఈ నెల చివర్లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో ఐదురోజులపాటు పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలోనే అగ్రరాజ్యంతో భారత్ భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దు అయినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ-ట్రంప్ సమావేశంలో పలు ఒప్పందాలు ప్రకటించారు. బోయింగ్ P8I విమానాలు, Stryker యుద్ధ వాహనాలు, Javelin యాంటీ-ట్యాంక్ మిసైళ్లు కొనుగోలు అందులో ఉన్నాయి. సుమారు 3.6 బిలియన్ డాలర్ల(రూ.31 వేల కోట్లు) విలువైన ఆ రక్షణ ఒప్పందాలు రాజ్‌నాథ్ అమెరికా పర్యటనలో కుదరాల్సి ఉంది. అయితే. ట్రంప్ టారిఫ్ వడ్డన నేపథ్యంలో ఈ ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకున్నాయని రక్షణ శాఖకు చెందిన అధికారులిద్దరు వ్యాఖ్యానించారు. రాతపూర్వకంగా అమెరికా నుంచి కొత్త ఆయుధాల కొనుగోళ్ల నిలిపివేతపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని, అయినప్పటికీ ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఒప్పందం రద్దు కాలేదని.. తాత్కాలికంగా నిలిచిపోయిందని.. ఇప్పుడు కొనసాగుతున్న ఒప్పందాలు యధాతథంగా కొనసాగుతాయని.. టారిఫ్‌ల నిర్ణయం ఓ కొలిక్కి వచ్చాక ద్వైపాక్షిక సంబంధాల దిశపై స్పష్టత వచ్చిన కొత్త ఒప్పందాల అడుగులు ముందుకుపడే అవకాశం కనిపిస్తోందని ఆ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చింది. దీనిపై ఇటు భారత రక్షణ మంత్రిత్వ శాఖ.. అటు పెంటగాన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!
వైష్ణోదేవి దర్శనం భారతీయుల కల అని చెప్పవచ్చు. హిందువులు భక్తిశ్రద్ధలతో పూజించే దైవం వైష్ణోదేవి. కశ్మీర్ వాసులు శ్రీ మాతా వైష్ణోదేవి అని పిలుచుకుంటారు. ఈ ఆలయం జమ్ము నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదు వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ శక్తిపీఠాన్ని చేరడం కష్టం అని చెప్పకూడదు, బహు కష్టం అని చెప్పడమే కరెక్ట్. ఈ అమ్మవారు కొలువైన పర్వతం పేరు త్రికూట పర్వతం. ఏడాదికి దాదాపు కోటి మంది సందర్శించుకునే ఈ ఆలయానికి జీవితంలో ఒకసారైనా వెళ్లాలని ఉంటుంది. ఐఆర్సీటీసీ ఆ కోరికను తీరుస్తోంది. 1వ రోజున్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్లో రాత్రి 8.40కి ట్రైన్ నంబరు 12425 రాజధాని ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.2వ రోజుతెల్లవారు జామున ఐదు గంటలకు రైలు జమ్ము రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. టూర్ నిర్వహకులు రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి కాట్రాకు రోడ్డు మార్గాన వెళ్లాలి. నాన్ ఏసీ వెహికల్లో ప్రయాణం. మార్గమధ్యంలో సరస్వతి ధామ్ చూసుకుని కాట్రాకు చేరి అక్కడ హోటల్ గదిలో చెక్ ఇన్ కావాలి. వైష్ణోదేవి దర్శనం తర్వాత తిరిగి హోటల్‌కు వెళ్లి భోజనం, విశ్రాంతి. రాత్రి బస అక్కడే.వైష్ణోదేవి యాత్రలో తొలిమెట్టు కాట్రా వైష్ణోదేవి దర్శనం అనుభూతి కాట్రా పట్టణం నుంచే మొదలవుతుంది. జమ్ములో రైలు దిగిన తరవాత నలభై కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ఈ పట్టణం సముద్రమట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. బాణగంగానది ఈ పట్టణం నుంచే ప్రవహిస్తుంటుంది. ఇక్కడి ప్రజల భాష డోంగ్రీ. హిందీ, పంజాబీ, అస్సామీ, కశ్మీరీ భాషలు మాట్లాడే వాళ్లు కూడా ఉంటారు. హిందీ వచ్చిన పర్యాటకులు కూడా స్థానికులు మాట్లాడే హిందీ యాసను అందుకోవడం కష్టం. టూర్ నిర్వహకులు, గైడ్లు ఇంగ్లిష్ మాట్లాడతారు, వైష్ణోదేవి దర్శనానికి వచ్చిన పర్యాటకులు కాట్రాలోని గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస చేస్తారు. కాట్రా పట్టణం కేవలం వైష్ణోదేవి పర్యాటకుల ఆధారంగానే అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక వీథి మొత్తం సావనీర్ షాపులే. డ్రై ఫ్రూట్స్ దుకాణాలు, ఉన్ని దుస్తులు, లెదర్ జాకెట్ల షాప్‌లకు లెక్కే ఉండదు. ఇక్కడి నుంచి వైష్ణోదేవి ఆలయానికి ట్రెకింగ్ మొదలవుతుంది.ఇన్సూరెన్స్ తప్పనిసరి!వైష్ణోదేవి దర్శన యాత్ర ప్రమాదంతో కూడిన పర్యటన కావడంతో పర్యాటకులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. నడవ లేని వాళ్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంటుంది. కాట్రా నుంచి వైష్ణోదేవి మందిరానికి హెలికాప్టర్లో వచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో కాట్రా చుట్టుపక్కల ఎటు చూసినా హెలీపాడ్లు దర్శనమిస్తాయి. ఇటీవల రోప్‌వే సౌకర్యం కూడా మొదలైంది. ఇది కాట్రాకు వైష్ణోదేవి ఆలయానికి మధ్యలోనున్న భైరోనాథ్ ఆలయం నుంచి మొదలవుతుంది. వైష్ణోదేవిని దర్శించుకోవడానికి విమానంలో వచ్చే వాళ్లు జమ్ములో దిగాలి. కొన్ని రైల్ సర్వీసులు కాట్రా స్టేషన్‌కు వస్తాయి. కొన్ని రైళ్లు జమ్ము మీదుగా వెళ్తాయి. ఆ రైళ్లలో వచ్చిన వాళ్లు జమ్ము నుంచి రోడ్డు మార్గాన కాట్రాకు చేరాలి. ఈ పర్యటనలో పర్యాటకుల ప్రధాన ఉద్దేశం వైష్ణోదేవిని దర్శించుకోవడంగానే ఉంటుంది. కానీ కాట్రాలో ఉన్న ‘శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ’ని విజిట్ చేసి తీరాలి, కనీసం బయలు నుంచి అయినా చూడాలి. ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సులు, ఎకనమిక్స్ వంటి సబ్జెక్టులతో΄ాటు బయోటెక్నాలజీ కోర్సులు కూడా ఉన్నాయి. బాణగంగ కథనంకాట్రా నుంచి వైష్ణోదేవి మందిరానికి చేరే దారిలో బాణగంగానది ఉందని చెప్పుకున్నాం. ఈ హిమాలయాల్లోని శివాలిక్ శ్రేణుల్లో పుట్టింది. ఈ ప్రవాహం చీనాబ్ నదిలో కలుస్తుంది. వైష్ణోదేవి తలస్నానం చేయడానికి సృష్టించిన నీటి వనరు అని చెబుతారు. పురాణ కథల ప్రకారం వైష్ణోదేవి... శ్రీరాముని భక్తురాలు. శ్రీరాముని దర్శనం కోసం ఆమె హనుమంతునితోపాటు త్రికూట పర్వతం మీదకు వెళ్తోంది. ఆ సమయంలో హనుమంతుడికి దాహమైంది. అతడి దాహం తీర్చడం కోసం వైష్ణోదేవి ఈ ప్రదేశంలో బాణం వేసిందని, ఆ బాణం తాకిడితో నీటి చెలమ ఏర్పడిందని, హనుమంతుడు దాహం తీర్చుకున్న తర్వాత వైష్ణోదేవి ఇక్కడే తలస్నానమాచరించిందని, అందుకే బాణ్గంగ అనే పేరు వచ్చిందని చెబుతారు. స్థానికులు బాల్గంగ అని కూడా పిలుస్తారు. దీనికి అర్థం వైష్ణోదేవి తలస్నానం చేసిన నది అని.పర్యాటకులకు వైద్య సేవజమ్ము నుంచి కాట్రా వెళ్లే దారిలో సరస్వతి ధామ్ ఉంది. వైష్ణోదేవి దర్శనం కోసం వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పని చేస్తోంది. బస, ఆహార సౌకర్యాలు మాత్రమే కాదు, ఈ పర్యటనలో గాయపడిన వారి చికిత్స ప్రధాన ఉద్దేశంగా వైష్ణోదేవి ఆలయ బోర్డు దీనిని ఏర్పాటు చేసింది. 3వ రోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లంచ్ ప్యాక్ చేసి ఇస్తారు. హోటల్ గది చెక్ అవుట్ చేసి కాట్రా నుంచి నుంచి చినాబ్ వంతెనకు బయలుదేరాలి. చినాబ్ వంతెన, పరిసరాల వీక్షణం తర్వాత జమ్ముకు ప్రయాణం. దారిలో రఘునాథ్ టెంపుల్ దర్శనం. రాత్రి ఎనిమిది గంటలకు జమ్ము రైల్వేస్టేషన్లో దించుతారు. జమ్ములో 12426 జమ్ము రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఆ రైలు రాత్రి 9.25గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.వంతెన ప్రయాణం ఆకాశ విహారంచినాబ్ నది మీద వంతెన పూర్తయింది. నాలుగు దశాబ్దాల కిందట 1983లో శంకుస్థాపన చేసుకున్న ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని గత నెలలో ప్రయాణానికి సిద్ధమైంది. చినాబ్ వంతెనను ఇంజనీరింగ్ మిరకిల్ అని చెప్పాలి. సుడిగాలులు, భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో నిర్మించారు. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి. దీని ఎత్తు 1,178 అడుగులు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన నిర్మాణం. ఈఫిల్ టవర్ ఎత్తు 1,083 అడుగులు మాత్రమే. ఇక చినాబ్ వంతెన పొడవు 4,314 అడుగుల పొడవు, అంటే 1315 మీటర్లన్నమాట. చినాబ్ నది రెండు కొండల మధ్య ప్రవహిస్తోంది. ఆ కొండలను కలుపుతూ నిర్మించిన వంతెన ఇది. జమ్ము– బారాముల్లా లైన్లో కౌరి– బక్కాల్ రైల్వే స్టేషన్ల మధ్య వస్తుంది. ప్రస్తుతం ఇది గొప్ప పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందనుంది.ఇది ప్రయాణం కాదు విహారం!ఏటా చలికాలంలో రోడ్డు మార్గం మంచుతో కప్పబడి΄ోతుంది. దాంతో జమ్ము– కశ్మీర్‌కి మిగిలిన దేశంతో సంబంధాలు తెగి΄ోతాయి. ఈ రైల్ బ్రిడ్జితో ఏడాది పొడవునా సామాన్యులు కశ్మీర్‌కు ప్రయాణం చేయగలుగుతారు. చినాబ్ నది మీద నిర్మించిన ఈ వంతెనను కేవలం రవాణా సౌకర్యంగా భావించలేం. ఇది ప్రపంచంలో మనదేశానికి ఒక రికార్డును అందించింది. మన ఇంజనీరింగ్ టెక్నాలజీని ప్రపంచానికి చాటుకోవడానికి గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. అంతకంటే ఎక్కువగా పర్యాటకులు హిమాలయాలను కళ్ల నిండుగా చూసుకోవడానికి ఈ వంతెన గొప్ప అవకాశం. తల వంచి చూస్తే మౌనంగా ప్రవహిస్తున్న చినాబ్ నది, తల తిప్పి చూస్తే 360 డిగ్రీలలో ఎటు చూసినా హిమాలయ శ్రేణులతో ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది.ఫొటోలు తీసుకోవాలి!ఈ టూర్లో ఫొటోలు తీసుకోవడానికి చక్కటి ప్రదేశం చినాబ్ వంతెన, ఆ పరిసరాలు. పర్యాటకుల్లో చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే... క్లోజప్ ఫొటోలు తీసుకుంటారు. ఆ ఫొటోలో మనుషులు ప్రముఖంగా కనిపిస్తుంటారు, నేపథ్యం సరిగ్గా కవర్ కాదు. కొన్ని లాంగ్ షాట్లు తీసుకోవాలి. పనోరమిక్ షాట్లు తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటిని కంప్యూటర్లో చూసుకున్నప్పుడు మరోసారి ఆ ప్రదేశాల్లో మనో పర్యటన చేయవచ్చు. ఈ రైల్లో కొన్ని కోచ్‌లు పర్యాటకుల కోసం డిజైన్ చేసింది ఇండియన్ రైల్వే శాఖ. అందులో నుంచి హిమాలయాలను వీక్షిస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే చక్కటి వ్యూ పాయింట్లను గుర్తించి అక్కడ రైలు కొద్దిసేపు ఆగుతుంది. మామూలు స్టిల్ ఫొటోగ్రఫీ కెమెరాలు, వీడియో కెమెరాలు, స్మార్ట్ ఫోన్లతో ఫొటోలు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కానీ డ్రోన్ కెమెరాలో చిత్రీకరించాలంటే పర్యాటకులు సంబంధిత అధికారులకు తమ వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలి.సాహసాల ముఖద్వారంచినాబ్ రైలు వంతెన టూరిస్టులకు ఆటవిడుపు వంటిది. హిమాలయాల్లో పీర్‌పంజాల్ శ్రేణుల్లో ట్రెకింగ్, నదుల్లో రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్ వంటి అడ్వెంచరస్ స్పోర్ట్స్‌కి ఈ ప్రదేశం ఎంట్రీ పాయింట్. వైష్ణోదేవి దర్శనంతోపాటు భీమ్‌ఘర్ ఫోర్ట్, శివ్ ఖోరీ గుహాలయం, పాట్నీటాప్ హిల్ స్టేషన్, సనాసర్ సరస్సు, అడ్వెంచర్ పార్కులకు వెళ్లడానికి ఇది జంక్షన్ పాయింట్.ఎప్పుడు వెళ్లాలి?ఈ టూర్‌కి వెళ్లడానికి మార్చి నుంచి అక్టోబర్ మధ్య కాలం అనువుగా ఉంటుంది. ఈ సమయంలో ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉంటుంది. హిమాలయాలు చక్కగా కనిపిస్తాయి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. ఈ సమయంలో రైల్లో ప్రయాణిస్తూ అద్దాల్లోంచి చూడడానికి బాగుంటుంది. కానీ పర్యటన సజావుగా సాగదు.బంగారు మందిరంజమ్ము నగరంలో రఘునాథ్ టెంపుల్ది ప్రత్యేకస్థానం. ఉత్తరాది రాష్ట్రాల్లోని పెద్ద ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయం ఉన్న వీథి పేరు రఘునాథ్ బజార్. డోగ్రా పాలకులు కట్టించిన ఆలయం ఇది. మొదటి డోగ్రా ΄ాలకుడు గులాబ్ సింగ్ 1835లో నిర్మాణాన్ని ప్రారంభించాడు. మహారాజా రణ్‌బీర్ సింగ్ 1857లో విగ్రహప్రతిష్ఠ చేశాడు. మిగిలిన భారతదేశంలో బ్రిటిష్ పాలన పట్ల అసహనం పెట్టుబుకుతూ సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం అది. ప్రతిష్ఠాపన తర్వాత మరో మూడేళ్ల పాటు చిన్న చిన్న నిర్మాణపనులు కొనసాగాయి. అంతకంటే ముందు 18వ శతాబ్దంలోనే కులు రాజు రాజా జగత్సింగ్ ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాడని ఆ తర్వాత ఎదురైన రాజకీయ అనిశ్చితి కారణంగా నిర్మాణం ముందుకు సాగలేదని, కుల్లు రాజుకు సామంతులుగా ఉన్న డోగ్రా రాజులు స్వతంత్రత సాధించిన తర్వాత జమ్ము–కశ్మీర్ రాజ్య తొలి మహారాజు గులాబ్ సింగ్ నిర్మాణం మొదలు పెట్టాడని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో రఘునాథుని పేరుతో పూజలందుకుంటున్న దేవుడు శ్రీరాముడు. ఆలయం లోపలి గోడలకు బంగారు తాపడం చేశారు. ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడివి ప్రధాన విగ్రహాలు. వీటితోపాటు అనేకమంది దేవుళ్లు దేవతల సాలగ్రామ రూపాలుంటాయి. ఆలయంలో సంస్కృత గ్రంథాల లైబ్రరీ ఉంది. అందులో ప్రాచీన చేతిరాత ప్రతులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ చూడడం ఆహ్లాదకరం మాత్రమే కాదు, అవగాహనకరం కూడా. 4వ రోజురైలు తెల్లవారు జామున 5.55 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.‘మాత వైష్ణోదేవి విత్ చినాబ్ బ్రిడ్జి’ టూర్ ప్యాకేజ్‌లో ప్రయాణం నాలుగు రోజులుంటుంది. ఇది ఢిల్లీ నుంచి మొదలయ్యే టూర్. ఇందులో వైష్ణోదేవి దర్శనంతో΄టు చినాబ్ వంతెన వీక్షణం ఉంటుంది. టూర్ కోడ్: MATA VAISHNODEVI WITH CHENAB BRIDGE EX DELHI (WEEKDAY) (NDR01C)ప్యాకేజ్ ఇలా: థర్డ్ ఏసీలో ప్రయాణం. కాట్రాలో ఏసీ హోటల్ బస. సింగిల్ ఆక్యుపెన్సీ 14,200 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 11,555 రూపాయలు. ఢిల్లీకి వెళ్లే టికెట్లు, ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే టికెట్లు ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. -
‘శుద్ధ’ అబద్ధం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను కష్టపడి ప్రజలను సుఖపెడతాను’ అని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తిరుపతి జిల్లా రేణిగుంట, తిరుపతిలలో పర్యటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి నియోజక వర్గం రేణిగుంట మండలం తూకివాకం వద్ద పూర్తి చేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సందర్శించి ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం తిరుపతి నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర సభలో ప్రసంగించారు. తోతాపురి విషయంలో ఇబ్బందులున్నాయి తోతాపురి మామిడి కాయల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పట్టించుకోకపోయినా ఏపీలో గిట్టుబాటు ధర కలి్పంచామన్నారు. మామిడికి టన్నుకు రూ.12వేలు ఇచ్చేలా చేశామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.4వేలు, కోనుగోలు దారులు రూ.8వేలు చెల్లించే ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేసేశామని చెప్పుకొచ్చారు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు నేరస్తులను ఊడ్చేయాలని పేర్కొన్నారు. గతంలో శ్రీవారే దిగొచ్చి తనకు ప్రాణభిక్ష పెట్టారని చెప్పారు. హంద్రీ–నీవా నీటిని కళ్యాణీ డ్యాంకు అక్కడి నుంచి తిరుమలకు తీసుకొస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వచ్ఛాంధ్ర సాధనే లక్ష్యం స్వచ్ఛసర్వేక్షన్‌లో ఐదు అవార్డులు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబరు 2 నాటికి 17 కార్పోరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని నిషేధించనున్నట్లు వెళ్లడించారు. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సోలార్ కరెంట్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని సీఎం దర్శించుకున్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అలిపిరి వద్ద ఉన్న శ్రీ కంచిపీఠంను సందర్శించారు. సీఎంను కలిసేందుకు వీల్లేదంటూ పూజారికి నోటీసులు చంద్రగిరి: సీఎం చంద్రబాబు పర్యటనలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దర్పాన్ని ప్రదర్శించారని వారాహి ఆలయ ప్రధాన పూజారి శ్రీమహారుద్ర ఆది వారాహి స్వామి మండిపడ్డారు. శనివారం తిరుపతి వచి్చన సీఎంను కలిసి తిరుచానూరు సమీపంలో వారాహి ఆలయాన్ని టీడీపీ నేత అనుచరులు కూలి్చవేసిన ఘటనను వివరించేందుకు పూజారి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పూజారి ఇంటికి వెళ్లి సీఎంను కలవడానికి వీల్లేదంటూ నోటీసు జారీ చేసి హౌస్ అరెస్టు చేశారు. చెత్త రీసైక్లింగ్‌పై సంతృప్తి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్పత్తి అయ్యే చెత్తను రెడ్యూస్ రీయూస్ రీసైక్లింగ్ చేస్తున్న విధానం పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు కట్టారు? ఎంత ఖర్చు చేశారు? అని ఆయన ఆరా తీశారు. ఇదిలా ఉంటే ఇదంతా తన పాలనలోనే జరిగినట్టు చంద్రబాబు భావిస్తున్నారని, ఈ ప్రాజెక్టులు వైఎస్సార్సీపీ హయాంలో నిరి్మంచినవని అధికారులు చర్చించుకోవడం కనిపించింది. సీఎం క్లీనింగ్ అంతా సెట్టింగే..! సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో సీఎం పారిశుద్ధ్య కార్యక్రమం అంతా సెట్టింగేనని తేలిపోయింది. సీఎం ఆలయానికి రాకముందే అక్కడక్కడ పూలుచల్లినట్టు కనిపించడం, వాటికి సమీపంలో భక్తులు ప్రసాదం తినిపడేసిన కప్పులు దర్శనమివ్వడం వంటి దృశ్యాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. వీటన్నింటినీ టీడీపీ నేతలే సెట్ చేసినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. వాస్తవానికి భక్తులు ప్రసాదం తినేశాక కప్పులను ఆలయంలోని దారిలోనే పడేసే అవకాశమే లేదని, అక్కడ ఏర్పాటుచేసిన డస్టుబిన్లలో వేస్తాని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఆలయంలో పడేసిన కప్పులు కొత్తవిగా ఉన్నాయని, దీనిని బట్టి ఇదంతా సీఎం పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు చేసిన సెట్టింగేనని స్పష్టమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం పర్యటన ఆద్యంతం పారిశుద్ధ్య కారి్మకులను టీడీపీ కార్యకర్తలుగా మార్చేశారు. వారికి కండువాలు కప్పారు. ఇదిలా ఉంటే కొందరు పంచాయతీ కార్మికుల చేత రేణిగుంట వద్ద టీడీపీ జెండాలు కట్టించారు. దీంతో కారి్మకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జగన్ దెబ్బకు దిగొచ్చిన కూటమి.. పెరిగిన మామిడి మద్దతు ధర
-
2 వేలమంది పోలీసులతో జగన్ పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయిన చంద్రబాబు
-
జగన్ రోడ్డు మీదకు వచ్చాడంటే.. మీకు చుక్కలే
-
ఆంక్షల కంచెలు, వలయాలు.. తలలు పగలుగొట్టే లాఠీలు.. నిలిచాడు - గెలిచాడు
-
నా తల పగలగొట్టడానికి కారణం ఇదే.. జగనన్న అంటే వాళ్లకు వణుకు
-
KSR Live Show: జగన్ ను చూసి భయపడుతున్న తండ్రీకొడుకులు
-
Watch Live: బంగారుపాళ్యానికి వైఎస్ జగన్
-
జగన్ పర్యటనకు YSRCP కార్యకర్తలు రాకుండా పోలీసుల అడ్డంకులు
-
అంత భయమెందుకు లోకేశ్? జగన్ చిత్తూర్ పర్యటనపై సీక్రెట్ మీటింగ్
-
మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం?..
-
చిత్తూరు జిల్లాలో మామిడి రైతన్న చిత్తు చిత్తు... ఆశలు చిదిమేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. నేడు రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి
-
జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలిక వాయిదా
-
ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే..
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన ఢిల్లీ నుంచి ఘనాకు విమానంలో బయలుదేరారు. నేటి నుంచి జూలై 9 వరకు ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన సాగనుంది. తన పర్యటనలో భాగంగా ఆయన నేడు, రేపు ఘనాను సందర్శించనున్నారు.మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఘానా అధ్యక్షునితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఆర్ధిక, ఎనర్జీ, డిఫెన్స్ పరస్పర సహకారంపై చర్చ జరగనుంది. జూలై 3-4 తేదీల్లో ట్రినిడాడ్, టోబాగోలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన ట్రినిడాడ్ అధ్యక్షురాలు, ప్రధాని బిసెసర్‌తో భేటీ కానున్నారు. అలాగే ట్రినిడాడ్ పార్లమెంటులో సంయుక్త సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. #WATCH | Delhi: Prime Minister Modi emplanes for Ghana. PM Modi embarks on a five-nation tour including Ghana, Trinidad and Tobago, Argentina, Brazil, and Namibia. PM Modi will also participate in the BRICS Summit in Brazil.#PMModi #Trending pic.twitter.com/Zjzg9Hhp1O— TIMES NOW (@TimesNow) July 2, 2025జూలై 4-5 తేదీల్లో అర్జెంటీనాలో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలేయ్తో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా డిఫెన్స్, ఖనిజాలు, వ్యవసాయం, ఎనర్జీ, వాణిజ్యంపై చర్చ జరపనున్నారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతంపై చర్చించనున్నారు. జూలై 5-8 తేదీల్లో బ్రెజిల్లో 17వ ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, ఏఐ, వాతావరణ మార్పులపై బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది. అదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులాతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జూలై 9న జరిగే నమీబియా పర్యటనలో ప్రధాని మోదీ అక్కడి పార్లమెంటులో ప్రసంగించనున్నారు. -
ఎల్లో కుట్ర బయటపెట్టిన సింగయ్య కొత్త వీడియో..
-
జగన్ పర్యటనపై బాబు విష ప్రచారం.. తిప్పికొట్టిన గుంటూరు DSP
-
జగన్ పర్యటనపై రెడ్ బుక్.. YSRCP నేతలపై అక్రమ కేసులు
-
Watch Live: నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు
సాక్షి, నరసరావుపేట: గతంలో ఏ ప్రతిపక్ష నేతకూ లేని నిబంధనలు తెరపైకి.. ఏదో ఒకవిధంగా పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనను అడ్డుకునే కుట్రతో కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత, రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక నాగమల్లేశ్వరరావు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.ఫలితాలు వెలువడిన జూన్ 4, మరుసటి రోజు పోలీసులు ఆయనను స్టేషన్లో కూర్చోబెట్టారు. ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం కూటమి పార్టీల కార్యకర్తలు.. నాగమల్లేశ్వరరావు ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆ విషయం చెప్పడానికి కూతురుతో మాట్లాడుతుండగా సెల్‌ఫోన్ లాక్కున్నారు. రెంటపాళ్లలో అడుగుపెడితే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. ఓవైపు పోలీసులు, మరోవైపు కూటమి నేతల తీరుతో మనస్తాపం చెందిన నాగమల్లేశ్వరరావు జూన్ 6న ఆత్మహత్య చేసుకున్నారు.ఆ కుటుంబాన్ని పరామర్శించి, వారు ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ నెల 18న మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన ఖరారైంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా దీనికి అనుమతివ్వలేమని, తాము చెప్పిన ఆంక్షల మేరకైతేనే అనుమతిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భద్రతా కారణాలు చూపుతూ గతంలో ఏ ప్రతిపక్ష నేత పర్యటనకు లేని ఆంక్షలను పోలీసులు ప్రస్తుతం విధిస్తున్నారు. ప్రజాభిమానాన్ని కొలిచేది ఎలా..? ఈ నెల 18న రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతివ్వాలంటూ సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ గజ్జెల సు«దీర్ భార్గవ్‌రెడ్డి సత్తెనపల్లి డీఎస్పీకి దరఖాస్తు చేశారు. దీనిపై పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. భారీగా జనం తరలివస్తారని నివేదికలు ఉన్నాయని.. కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు? పాల్గొనే వాహనాల సంఖ్య ఎంత? స్పష్టం చేయాలని అడుగుతున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి తప్ప.. ఈ కార్యక్రమానికి పార్టీ తరఫున జన సమీకరణ లేదు. అయితే, వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానులు భారీగా తరలివస్తారు. ఆ అభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కకట్టి చెప్పగలరు. కానీ, ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఈ కారణాలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెనాలి, రాప్తాడు, పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి విశేషణ స్పందన వచి్చంది. ఏడాదిలోనే ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయికి చేరిందని వీటి ద్వారా తేలింది. అందుకనే కూటమి నేతలు కుట్రలకు తెరతీస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.పోలీసులు చెబుతున్నట్లుగా మూడు కార్లు, వందమందితో పర్యటన ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజధానిపై టీవీలో ప్రసారమైన వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దఎత్తున మహిళలు రోడ్ షోను అడ్డుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వారిని సాకుగా చూపుతూ పర్యటన అనుమతికి ముడిపెట్టారు. అనుమతుల విషయంలో గందరగోళం సృష్టించడం, పాల్గొంటే కేసులు పెడతారన్న భయం కలిగించి.. వచ్చే అభిమానుల సంఖ్యను తగ్గించే కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.18న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదు పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు వెల్లడి నరసరావుపేట రూరల్: మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి నిరాకరించినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం సత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ గజ్జల సు«దీర్‌భార్గవ్‌రెడ్డి దరఖాస్తు చేశారని, అందులో పూర్తి వివరాలు లేకపోవడంతో అదనపు సమాచారం ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. నిబంధనల వలన దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.సుదీర్‌భార్గవ్‌రెడ్డి కోరిన విధంగా కార్యక్రమ నిర్వహణకు అనుమతివ్వడం లేదని తెలిపారు. కాగా, ఇటీవల వైఎస్ జగన్ పర్యటనలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పర్యటనకు కూడా వేలాది మంది తరలివస్తారని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎలాగైన జగన్ పర్యటనను అడ్డుకోవాలనే కుట్రతోనే రకరకాల నిబంధనల పేరుతో ప్రభుత్వం అనుమతిని నిరాకరించిందని జనంలో చర్చ జరుగుతోంది. -
ఈనెల 18న పల్నాడు జిల్లాకు YS జగన్ మోహన్ రెడ్డి
-
దుబాయ్‌లో సమంత టూర్.. వైరల్ ఫోటోలకు లక్షల్లో లైకులు
-
జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
-
జోర్ హుషార్.. సిమ్లా సమ్మర్
‘సిమ్లా–ప్రకృతి అందాలకే కాదు, ప్రత్యేక వేడుకలకూ నిలయమే’ అంటోంది హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం. దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సిమ్లా సమ్మర్ ఫెస్టివల్’ నేటి (జూన్ 1) నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 1960 నుంచి ప్రతి ఏటా జరుగుతూ వస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, ప్రముఖ విద్వాంసుల సంగీత కచేరీలు, సంప్రదాయ జానపద కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. స్థానిక కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటయ్యే వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. జోరుగా హుషారుగా సాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. గతంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి లెజెండరీ కళాకారులు ఈ వేడుకల్లో తమ గాత్ర మాధుర్యంతో శ్రోతలను ఓలలాడించారు.హిమాచలీ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, స్థానిక చేతివృత్తులు, ఉన్ని దుస్తులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇక్కడ అనేక స్టాళ్లు ఏర్పాటవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జనం పోటెత్తుతారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ దుస్తులను ప్రదర్శించే ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక పర్యాటకులకు ఆటవిడుపుగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక మరపురాని అనుభూతి కలిగిస్తుందంటారు వీక్షకులు. ఈ సంబరాలు జూన్ 5న ముగియనున్నాయి. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్‌కాస్ట్..) -
ఈనెల 28న పొదిలికి వైఎస్ జగన్ వస్తున్నారు: అన్నా రాంబాబు
-
16న అమెరికాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లనున్నారు. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత దంపతులు హాజరుకానున్నారు. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరి.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ.. ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సీబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. -
న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)
-
పెద్దమ్మ తల్లి గుడిలో బుల్లితెర జంట దావత్.. ఎందుకంటే? (ఫోటోలు)
-
బ్యాంకాక్ ఫెస్టివల్లో జగ్గు భాయ్ సందడి.. మన సంక్రాంతిలాగే ఎంజాయ్ చేశా (ఫోటోలు)
-
'బెస్ట్ డెసీషన్': భారత్‌పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..
మన భారతదేశం ఖ్యాతీ ఖండాంతరాలకు కూడా చేరవవుతోంది. అందుకు నిదర్శనం ఇటీవల కాలంలో పలువురు విదేశీయలు పంచుకున్న తమ భారత పర్యటన అనుభవాలే. ప్రతి విదేశీయుడు ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తుంటే మనమే ఎంత గొప్పవాళ్లం అనిపిస్తోంది. అంతెందుకు మన భారతీయులే ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యి కూడా.. మళ్లీ ఇక్కడకు వచ్చేస్తున్నారు. మాతృభూమే గొప్పదని కితాబిస్తున్నారు. మనం పుట్టిన దేశం కాబట్టి మనకు నచ్చుతుంది. కానీ ప్రాంతాలు, భాష, సంస్కృతుల్లో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ విదేశీయలు ఈ వాతావరణాన్ని ఇష్టపడుతుండటమే అత్యంత విశేషం. తాజాగా ఆ కోవలోకి మరో డెన్మార్క్ మహిళ కూడా చేరింది. పైగా ఆమె ఎలాంటి ప్లాన్ చేయకుండానే భారత్‌కి వచ్చి మంచి పనిచేశానంటోంది. మరీ ఆమెకు అంతగా భారత్‌లో ఏం నచ్చాయో చూద్దామా..!.డెన్మార్క్ దేశ రాజధాని కోపెన్‌హాగన్‌లో నివశించే ఎస్మెరాల్డా అనే మహిళ భారత పర్యటను వెళ్లాలనే నిర్ణయం తీసుకుని మంచి పనిచేశానని అంటోంది. ఆ కోపెన్హాగన్ నగర వాతావరణంతో విసుగొచ్చేసిందని, మంచి మార్పుకావలని కోరుకున్నట్లు చెబుతోంది. అందుకోసమే తానెంతో ఇష్టపడ్డ స్నేహితులు, ఉద్యోగాన్ని, నాకిష్టమైన అపార్ట్మెంట్ తదితరాలన్నింటిని వదిలేసి మరీ భారత్ పర్యటనకు వచ్చేసిందట. ఇది తాను తీసుకున్న నిర్ణయాల్లో బెస్ట్ అని చెబుతోంది. వేసవిలో మాత్రమే కోపెన్హాగన్ సరదాగా ఉంటుందే తప్పా..మిగతా సమయాల్లో బోరుగానే ఉంటుందని వాపోతోంది. అంతేగాదు తన నగరాన్ని నిద్రాణమైన ప్రదేశంగా అభివర్ణిస్తోందామె. ఇక భారతదేశంలో రిషికేశ్ నుంచి గోవా, ముంబై అంతటా చేసిన పర్యటనల్లో పొందిన అనుభవాలను డాక్యమెంట్ చేసి మరీ..ఇన్‌స్టాగ్రాంలో వీడియో రూపంలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఎస్మెరాల్డా భారత్‌పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన సంస్కృతి, ప్రజల ఆదరణను ఎంతగానో కొనియాడింది. ఈ భారత పర్యటనలో తన గురించి తాను తెలుసుకోగలిగానంటోంది. ఇక్కడ ప్రకృతి, వైవిధ్య భరితమైన సంస్కతి తనను ఎంతగానో కట్టిపడేశాయంటోంది. అంతేగాదు భారతదేశం తనలోని కొత్తకోణాలను పరిచయం చేసిందట. ఇక్కడ జర్నీ ఓ అపూర్వ అనుభవాన్ని అందిచాయట. పైగా ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని కూడా అందించిందని అంటోంది. చివరగా ఈ భారత పర్యటన తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది. నిజానికి తాను యూరోపియన్ వేసవి సాహసయాత్రకు బయలుదేరే ముందు అనుకోకుండా భారతదేశ పర్యటనకు వచ్చానని, అనుకోకుండా ఇంకో నెల ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు వివరించింది. ఇలా ఆమె దాదాపు పది నెలలు భారత్‌లో గడిపిందట.అంతేగాదు వర్షాకాలంలో భారత్‌కి మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నట్లు కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు కూడా ఆల్‌ది బెస్ట్ చెబుతూ..భారతదేశానికి వస్తూ ఉండండి అని ఆమెను ఆహ్వానిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Astrid Esmeralda 🧚🏽♀️ Solo traveler (@astrid__esmeralda) (చదవండి: Train With ATM: దేశంలోనే తొలి ఏటీఎం రైలు..! ఎక్కడంటే..) -
రోమ్ వెళ్లారు.. మహేశ్ ని మాత్రం దాచేశారు (ఫొటోలు)
-
భయపడిన బాబు.. వైఎస్ జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు
-
గోల్డెన్ చారియట్ టూర్: ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా..జస్ట్ ఒకే రైలుబండిలో..!
రత్నాల రాశులతో విలసిల్లిన నేల హంపి. కాఫీ తోటలతో విలసిల్లుతున్న చిక్‌మగళూరు. హొయసల వాస్తుశైలికి తార్కాణం హలేబీడు. బహు విశేషణాల మల్లిగ మాల మైసూరు. మైసూర్ పాలకుల బెంగళూరు ప్యాలెస్.మధ్యలో మృగరాజు గాండ్రించే బందీపూర్.చివరాఖరుకు అరేబియా తీరాన గోవా...ఒకే రైలుబండిలో మొత్తం తిరిగి వద్దాం. రాజమహల్లాటి గోల్డెన్ చారియట్ ట్రైన్ ఉంది. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్ ఉంది. మెనీ మెనీ థాంక్స్ టూ ఐఆర్సీటీసీ.గోల్డెన్ చారియట్ అనేది మనదేశంలో విలాసవంతమైన పర్యటన కోసం ఇండియన్ రైల్వేస్ డిజైన్ చేసిన రైలు ప్రయాణం. ఇందులో ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా, జ్యువెల్స్ ఆఫ్ సౌత్, గ్లింప్సెస్ ఆఫ్ కర్నాటక ప్యాకేజ్‌లున్నాయి. ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా ప్యాకేజ్‌లో బెంగళూరు, నంజన్‌గుడ్, బందీపూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ, మైసూరు, హలేబీడు, చిక్మగుళూరు, హంపి, గోవాలు కవర్ అవుతాయి.1వ రోజుబెంగళూరు నుంచి నంజన్గుడ్కి ప్రయాణం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పర్యాటకులు యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్లో ఉదయం ఎనిమిదిన్నరకు ట్రైన్ ఎక్కి లో తమకు కేటాయించిన క్యాబిన్లో చెక్ ఇన్ అవుతారు. రైలు 9.45కి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. లంచ్ రైల్లోనే. మధ్యాహ్న ఒకటిన్నరకు నంజన్‌గుడ్ చేరుతుంది. రైలు దిగిన తర్వాత రోడ్డు మార్గాన బందిపూర్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీకి ఒకటిన్నర గంట ప్రయాణం. సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు అడవిలో విహారం తర్వాత తిరిగి నంజన్‌గుడ్ స్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ఎనిమిది తరవాత రాత్రి భోజనం. రైలు మైసూరు వైపు సాగుతుంది.బందీపూర్: ఇది దట్టమైన అడవి. పశ్చిమ కనుమలు అంటేనే పచ్చదనానికి పుట్టిల్లు. దట్టమైన అడవుల నెలవు. ఈ పర్వతశ్రేణుల్లో విస్తరించిన అడవి ఇది. ఈ పులుల సంరక్షణ కేంద్రంలో పులి ఠీవిగా రాజుగా సంచరిస్తుంటుంది. కానీ పగలు చూడలేం. సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్‌ని మాత్రమే చూడగలం. మైసూర్– ఊటీ హైవేలో ఉంది. ఈ అటవీ ప్రాంతం ఏనుగులు, రకరకాల జింకలు, వందలాది జాతుల పక్షుల నిలయం. ఇక్కడ మహావృక్షాలను చూడడానికి తలెత్తి ఆకాశాన్ని చూడాల్సిందే. ఆకాశాన్నంటే మహావృక్షాలనే అతిశయోక్తి అలంకారం ఈ వృక్షాలను చూసే పుట్టిందేమో! వెదురు, టేకు, రోజ్‌వుడ్ వృక్షాలుంటాయి. చందనవృక్షాలను తాకి చేతిని వాసన చూసుకుని మురిసిపోవచ్చు. అడవిలో సఫారీకి పర్యటించడానికి జీపులు, మినిబస్సులున్నాయి. ఇప్పుడు ఎలిఫెంట్ సఫారీ లేదు. ట్రెకింగ్ చేయవచ్చు. కానీ ఈ టూర్ ప్యాకేజ్‌లో అంత సమయం ఉండదు.2వ రోజుమైసూరు పర్యటన. ఉదయం రైల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత రైలు దిగి మైసూరు ΄్యాలెస్కు రోడ్డు ప్రయాణం. మధ్యాహ్న భోజనం సమయానికి రైలెక్కాలి లేదా ఆ సమయంలో శ్రీరంగపట్టణం వెళ్లి రావచ్చు. ట్రైన్ శుభ్రం చేసుకోవడం కోసం ఆగుతుంది. రాత్రి భోజనం రైల్లోనే, బనావర్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణం సాగుతుంది.మైసూరు: ఈ నగరానికి ఉన్నన్ని విశేషణాలు బహుశా మరే నగరానికీ ఉండక΄ోవచ్చు. హెరిటేజ్ సిటీ, సిటీ ఆఫ్ ΄్యాలెస్, ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కర్నాటక, సాండల్‌వుడ్ సిటీ, సిటీ ఆఫ్ జాస్మిన్...ఇన్ని పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా ముఖ్యంగా పర్యాటకులు గుర్తుంచుకోవాల్సింది మైసూరు ఉచ్చారణ గురించి. ఇంగ్లిష్ స్పెల్లింగ్ ఆధారంగా మైసూర్ లేదా మైసోర్ అని పలికితే కన్నడిగులకు నచ్చదు. సౌమ్యులు కాబట్టి కోప్పడరు కానీ నొచ్చుకుంటారు. మైసూరు అనాల్సిందే. వడయార్లు నివసించిన మైసూరు ప్యాలెస్, మైసూరుకి ఆ పేరు తెచ్చిన చాముండి హిల్స్‌లో చాముండేశ్వరి ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలను చూసిన తర్వాత ఇక్కడ దొరికే మైసూరు మల్లిగె (మల్లెపూలు)లు కొనుక్కుని జడకు చుట్టుకుని మురిసి΄ోవాల్సిందే. అలాగే మైసూరు సిల్క్ చీరలు, మైసూర్ శాండల్ సోప్‌లు కూడా.3వ రోజుహలేబీడు, చిక్‌మగళూరుకు ప్రయాణం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బణావర్లో రైలు దిగి హలేబీడుకు వెళ్లాలి. హలేబీడు సైట్‌సీయింగ్ తర్వాత రైలెక్కి మధ్యాహ్న భోజనం చేస్తూ చిక్మగుళూరుకు వెళ్లాలి. సాయంత్రం కాఫీ తోటల్లో విహారం, సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత అక్కడే రాత్రి భోజనం పూర్తి చేసుకుని రైలెక్కి హోస్పేటకు సాగి΄ోవాలి.హలేబీడు... ఇది 11వ శతాబ్దంలో విలసిల్లిన హొయసల సామ్రాజ్యానికి తార్కాణం. ఢిల్లీ సుల్తానుల విధ్వంసం తర్వాత మిగిలిన శిథిలాలు నాటి శిల్పుల గొప్పదనాన్ని తెలుసుకోవడానికి మిగిలిన ఆనవాళ్లు. ఏకరాతిలో చెక్కిన మహాశిల్పాలు చూపుతిప్పుకోనివ్వవు. బారులు తీరిన ఏనుగులు, సింహాలతో ఆలయం గోడలంతా శిల్పనైపుణ్యమే. ఈ శిల్పాలను ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తే ఇందులో ఒక మహా చారిత్రక గ్రంథం దాగి ఉందని చెబుతారు చరిత్రకారులు.చిక్‌మగళూరు: విస్తారమైన కాఫీ తోటల మధ్య కాఫీ సువాసనను ఆఘ్రాణిస్తూ విహరించడం గొప్ప అనుభూతి. కాఫీ తోటల్లో చెట్ల సన్నని కొమ్మలు కాఫీ గింజల బరువుకు నేలకు వంగి΄ోతుంటాయి. ఆకు పచ్చ రంగు నుంచి ఎరుపు రంగుకు మారిన గింజలను కోసి బుట్టలో వేస్తుంటారు మహిళలు.టీ తోటల్లో టీ ఆకు సేకరించేవాళ్లు బుట్టను వీపుకు కట్టుకుంటారు. కాఫీ గింజలను సేకరణలో బుట్టను ముందుకు తగిలించుకుంటారు. కాఫీ పొడి తయారు చేసే ఫ్యాక్టరీల నుంచి కాఫీ వాసన గాల్లో తేలుతూ పర్యాటకులను ఆహ్వానిస్తుంది. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోస్పేట జంక్షన్లో ట్రైన్ దిగి హంపిలోని పర్యాటకప్రదేశాల వీక్షణానికి తీసుకువెళ్తారు. లంచ్ సమయానికి తిరిగి రైలెక్కాలి. సాయంత్రం వరకు ఖాళీ సమయం. రాత్రి భోజనం తర్వాత గోవా వైపు ప్రయాణం సాగుతుంది. హంపి: తుంగభద్ర తీరాన 14వ శతాబ్దంలో విలసిల్లిన నగరం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తున్న ఆనవాలు. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. కృష్ణదేవరాయలు పాలించిన నేల. రాయల కాలంలో రత్నాలు రాశులు పోసిన నేలలో ఇప్పుడు మనకు కనిపించేవి రాళ్లు మాత్రమే. విరూపాక్ష ఆలయం, ముస్లిం పాలకుల చేతిలో ధ్వంసమైన నిర్మాణాల శిథిలాల ఆధారంగా వాటి పూర్తి స్వరూపాన్ని మనోనేత్రంతో వీక్షించుకోగలిగితే నాటి శిల్పకారుల చాతుర్యానికి చేతులెత్తి మొక్కకుండా ఉండలేం. హంపిని ఏటా సందర్శించే ఏడు లక్షల పర్యాటకుల్లో మనమూ ఉందాం. 5వ రోజుగోవాలో విహారం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నార్త్ గోవాలోని చర్చ్‌ల వీక్షణం. తిరిగి స్టేషన్‌కి వచ్చి ట్రైన్లో లంచ్. ట్రైన్ మాద్గోవ్ వైపు సాగుతుంది. సాయంత్రం సౌత్ గోవాలో ఉత్సాహం ఉరకలు వేసే కార్యక్రమాలు, గాలా డిన్నర్ తర్వాత ట్రైన్ బెంగళూరు వైపు సాగుతుంది.గోవా అంటే మనకు అరేబియా తీరమే గుర్తు వస్తుంది. కానీ ఇది ఒక మినీ వరల్డ్. ప్రాచ్య పాశ్చాత్యాల కలయిక. పోర్చుగీసు పాలకులు నిర్మించిన కట్టడాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. చర్చ్‌ల నిర్మాణంలో వైవిధ్యత ఆకట్టుకుంటుంది. ఇక్కడ కొన్ని హిందూ ఆలయాలు కూడా పాశ్చాత్యశైలిలో ఉంటాయి. హిందూ– క్రిస్టియన్ ఐకమత్యాన్ని చాటే శిల్పాన్ని తప్పకుండా చూడాలి. లీనింగ్ టవర్ ఆఫ్ పిసాను పోలిన నిర్మాణం ఉంది. అది మంగేషి ఆలయం. 6వ రోజుయశ్వంత్పూర్ స్టేషన్‌కు ట్రైన్ చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు పలుకుతారు.ప్యాకేజ్ ఇలా...ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా 5 రాత్రులు, 6 రోజుల ప్యాకేజ్‌లో డీలక్స్ క్యాబిన్ ట్విన్ షేరింగ్‌లో ఒకరికి 4,20,680 రూపాయలు. సింగిల్ సప్లిమెంట్ కేటగిరీ 3,15,950 రూపాయలు.రెండు పడకల క్యాబిన్‌కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. టూర్లో అన్ని భోజనాలు, టీ కాఫీ, నీటి బాటిల్, కూల్ డ్రింకులతోపాటు వైన్, బీర్ వంటి ఇతర డ్రింకులురైలులో పారా మెడికల్ సర్వీస్, బట్లర్ సర్వీస్, స్టేషన్లలో పోర్టర్ సర్వీస్ గైడ్ సర్వీస్‌తోపాటు పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రన్స్ ఫీజ్, స్టిల్ కెమెరా ఫీజ్.డీలక్స్ క్యాబిన్ బుక్ చేసుకున్న పర్యాటకులకు రైలు దిగి రోడ్డు మార్గాన ప్రయాణానికి వోల్వో బస్, వోక్స్వ్యాగన్ వంటి వాహనాలుంటాయి.లాండ్రీ ఖర్చులు, ప్యాకేజ్‌లో లేని ఇతర బేవరేజ్‌లు, పర్యాటక ప్రదేశాల్లో వీడియో కెమెరా ఫీజ్, ఇంటి నుంచి టూర్ మొదలయ్యే ప్రదేశానికి చేరడానికి, పర్యటన పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి అయ్యే వాహన ఖర్చులు ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. (చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?) -
3 నుంచి థాయ్‌లాండ్, శ్రీలంకల్లో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3 నుంచి 6వ తేదీ వరకు థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. ప్రాంతీయ సహకారానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ‘మహాసాగర్ విధానం’అమలే ఈ పర్యటన లక్ష్యమని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. మొదటగా ఆయన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ 3, 4 తేదీల్లో జరిగే బిమ్స్టెక్ ఆరో శిఖరాగ్రంలో పాల్గొంటారు. 3న థాయ్ ప్రధానితో భేటీ అవుతారు. అనంతరం శ్రీలంకకు వెళతారని తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకేతో చర్చలు జరుపుతారంది. మారిషస్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ‘మహాసాగర్’ను ప్రకటించినట్లు విదేశాంగ శాఖ గుర్తు చేసింది. భారత్‌తోపాటు బంగాళాఖాత తీరప్రాంత దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్లతో ఏర్పాటైనదే బిమ్స్టెక్ కూటమి. -
కంగారూ దేశంలో సమంత.. ఫుల్ చిల్ అవుతూ (ఫొటోలు)
-
వైఎస్ జగన్ రాకతో పులకించిన పులివెందుల (ఫోటోలు)
-
వైఎస్ జగన్ పులివెందుల టూర్ ..షెడ్యూల్ ఇదే
-
విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రస్తుతం మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్ చేరుకున్న ఆయన ఈరోజు(సోమవారం) భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు. అయితే ఆయన విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తన షెడ్యూల్లో మార్పులు చేసుకున్నారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(Global Investors Summit) జరిగే ప్రాంతానికి నిర్థారించిన విధంగా ప్రధాని ఉదయం 9.45కు హాజరు కావలసివుంది. అయితే ఈ కార్యక్రమానికి 10 గంటలకు వెళ్లే విధంగా ప్రధాని మోదీ తన షెడ్యూల్ మార్చుకున్నారు. నగరంలోని పలు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తన కాన్వాయ్ కారణంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకే ప్రధాని మోదీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.భోపాల్‌లోని నేషనల్ మ్యూజియంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పారిశ్రామిక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే దేశ, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్(Aditya Birla Group) చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ నాదిర్ గోద్రేజ్, రస్నా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ అధ్యక్షుడు పిరోజ్ ఖంబట్టా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ బాబా ఎన్ కళ్యాణి, సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రాహుల్ అవస్థి, ఏసీసీ లిమిటెడ్ సీఈఓ నీరజ్ అఖౌరి తదితరులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా.. -
ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి వ్యాపారంలో స్థిరపడినవాళ్లను చూశాం. దేశానికి సేవ చేయాలన్న కతృనిశ్చయంతో ఐఏఎస్,ఐపీఎస్ ర్యాంకులను సాధించిన వారినీని చూశాం. కానీ సముద్రంపై శాశ్వతంగా ప్రయాణించేందుకు, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించేం దుకు ఉద్యోగాలనూ, ఇంటినీ..అంతెందుకు సర్వస్వాన్ని వదిలేసిన ఫ్యామిలీ గురించి విన్నారా? రండి ముగ్గురు సభ్యులతో కూడిన ఇండియాకు చెందిన అరుదైన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం!రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహి చిట్నావిస్, కుమార్తె కైయా రివా గౌతమ్. సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టిరావడానికి, పర్యటనల పట్ల తమకున్న మక్కువను కొనసాగించడానికి ఈ జంట తమ పూర్తికాల ఉద్యోగాలను విడిచిపెట్టారు. దాదాపు ప్రతి ఆస్తిని అమ్మేసుకున్నారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్‌లో ఏదో ఒక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యేలా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ అయిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజనులను ఆశ్చర్యపరిచింది.ఈ ఆలోచన ఎలా వచ్చింది?భారత నావికాదళంలో సంవత్సరాలు గడిపిన గౌరవ్‌కి సముద్రంతో విడదీయలేని సంబంధం ఉంది. మరోవైపు, వైదేహి చాలా కాలంగా సరళమైన, అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలో 2015లో గౌతమ్ కొచ్చి నుండి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగిణికి కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితుడైనప్పుడు ప్రత్యామ్నాయ జీవనశైలి గురించి ఆలోచన వచ్చింది. భార్య ,కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో పడవల మీద నివసిస్తున్న , ప్రయాణించే అనేక కుటుంబాలు తారపడ్డాయి. దీంతో వారి ఆలోచనలకు మరింత ప్రేరణ వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత, ఈ జంట చూడాల్సినవి, ఆస్వాదించ వలసినవి ఇంకా చాలా ఉన్నాయని భావించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం వారి కలలకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు మరింత ఆకర్షించాయి. అంతే ఇక ఆలస్యం చేయదల్చుకోవలేదు వీరు. 2022లో గౌతమ్ నావీ వీఆర్ఎస్ తీసుకున్నాడు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరూ వదిలేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయ జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ప్రతిదీ అమ్మేశారు. ఇంటి సామానును 6వేల కిలోల నుండి 120 కిలోలకు తగ్గించేశారు. పడవలో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకెళ్లడం వృధా అనుకున్నారు. రెండు క్యాబిన్లు, వంటగది, తొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్ , ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయ జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుల పడవ వాంకోవర్ రీవాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మూలల్లో ప్రయాణించడం వల్ల జీవితంపై అద్భుతమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.పడవపై ఎలా బతుకుతున్నారు?సంవత్సరంలో దాదాపు 70 శాతం సమయం ఏకాంత దీవుల వెలుపల లంగరు వేసి గడుపుతారు. మిగతా అన్నిసమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది కాబట్టి, వంతులవారీగా బోటు నడపటం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటారు. అప్పుడప్పు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండల్ని వాడతారు.ఎక్కడికైనా వెళ్లి సముద్ర మీదే. అయితే వాతావరణం, నావిగేషన్ సమస్యలు వీరికి ఛాలెంజ్. మొదట్లో ఇబ్బంది పడినా కాలక్రమేణా, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యాప్‌లు, వాతావరణ హెచ్చరిక వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడంలో రాటు దేలారు. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల(1988లో దీన్ని తయారు చేశారు) పడవ నిర్వహణ ఖర్చులు, చాలా తొందరగా తుప్పు పట్టడం లాంటి సవాళ్లు కూడా ఎదురైనాయి. రీవా 760-వాట్ల సోలార్ ప్యానెల్స్‌తో ఛార్జ్ చేయబడిన 800-AH బ్యాటరీ బ్యాంక్ ద్వారా నడుస్తూనే ఉంటుంది . దీనికి విండ్ జనరేటర్ కూడా అమర్చుకున్నారు. మలేషియాలోని పెనాంగ్‌లో ప్రారంభమైన వీరి సముద్రయానం లంకావీ (మలేషియా), థాయిలాండ్‌కు చేరారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారల పాటు ఉన్నారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాల వెంబడి వారాల తరబడి గడిపారు. సముద్రంలో స్నార్కెలింగ్ , డైవింగ్ చేస్తూ,కొత్త ఇల్లు రీవా అనే సెయిల్ బోట్లో సరికొత్త అనుభవాలతో గత రెండేళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారిపోయింది. వీలైనన్ని ఎక్కువ దేశాలను చూడడమే దీర్ఘకాలిక ప్రణాళిక.తూర్పు మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్లను కవర్ చేస్తూ మరింత తూర్పుకు ప్రయాణించి, తరువాత 17,500 దీవులతో కూడిన ఇండోనేషియాని చుట్టేయాలని ప్లాన్. అలాగే యూట్యూబ్ ద్వారా నౌకాయాన సాహసాలను డాక్యుమెంట్ చేస్తున్నారుట .“పడవలో జీవించడం సాధ్యమేనా?” అన్న ప్రశ్నకు వీరి జీవనమే సజీవ సాక్ష్యం. వీరి ఇన్‌స్టా పేజ్‌లోని వీడియోలను చూస్తూ ఉంటే.. సమయమే తెలియదు. (వీలైతే ఒకసారి చూడండి) View this post on Instagram A post shared by Sailing Yacht Reeva | 🇮🇳 | Gogo, VC & Kay (@the_reeva_project)ప్రయాణం, ముఖ్యంగా సమయం, గమ్యం ఇలాంటి సంకెళ్లేవీ లేకుండా హాయిగా స్వేచ్ఛగా చేసే ప్రయాణాలు జీవితంపై దృక్పథాన్ని కచ్చితంగా మారుస్తాయి. ఒక విశాలమైన అవగాహనను కలిగిస్తాయి.


