తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్: మోదీ | Prime Minister Modi Hyderabad Tour May 10 Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్: మోదీ

పర్యటన ముగించుకున్న మోదీ

  • హైదరాబాద్ పర్యటన ముగించుకున్న మోదీ
  • బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి గుజరాత్‌కు బయలుదేరిన మోదీ.. 
  • మోదీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వీడ్కోలు
2026-05-10 20:38:08

ప్రజలు బంగారాన్ని కొనొద్దు: మోదీ

  • ఏడాది పాటు ప్రజలు బంగారాన్ని కొనొద్దు
  • విదేశీ ప్రయాణాలు, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి
  • పురుగుల మందులు, ఎరువులను బాగా తగ్గించాలి
  • ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్, యూరియా ధరలు పెరిగాయి
     
2026-05-10 19:41:58

అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నైజం: మోదీ

  • దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో మాత్రమే ఉంది 
  • అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నైజం
  • తెలంగాణలో అబద్ధాలతో ప్రభుత్వం నడుస్తుంది
  • కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కంటే లెఫ్ట్ అయింది
  • కాంగ్రెస్ ముస్లిం లీగ్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ ముస్లిం లీగ్ అయింది
  • మావోయిస్టులను కాంగ్రెస్ ఎన్నో ఏండ్ల నుంచి రక్షిస్తుంది
  • తెలంగాణ పోలీస్ కేంద్రంతో కలిసి పనిచేసి ఉంటే మావోయిస్టులు ఎప్పుడో ఖతం అయ్యేవారు
  • కొంత ఆలస్యం అయినా మావోయిస్టులు ఖతం అయ్యారు
  • కొత్త విజన్, ఆలోచన, వికసిత్ తెలంగాణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది
2026-05-10 19:24:19

పశ్చిమ బెంగాల్‌ను సంకెళ్ల బందీ నుంచి విడదీశాం

  • పచ్చిమ బెంగాల్లో బీజేపీ విజయంతో దేశం అంతా సంబరాలు
  • దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పెంచింది
  • పశ్చిమ బెంగాల్‌ను సంకెళ్ల బందీ నుంచి విడదీశాం
  • ఇక తెలంగాణలో అబ్ కీ బార్ బీజేపీ సర్కార్: మోదీ
2026-05-10 19:14:14

బీజేపీకి ప్రజల నుంచి ఆదరణ నిరంతరం పెరుగుతోంది: మోదీ

  • నిన్న నేను బెంగాల్‌లో ఉన్నాను
  • తొలిసారి అక్కడ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు
  • తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో నిండిపోయి ఉన్నారు
  • దేశం నలుమూలల నుంచి బీజేపీకి ప్రజల నుంచి ఆదరణ నిరంతరం పెరుగుతోంది
  • బీజేపీ అభివృద్ధి నమూనాకు ప్రజలు మళ్లీ మళ్లీ ఆమోద ముద్ర వేస్తున్నారు
2026-05-10 19:10:47

పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • బెంగాల్‌లో విజయ ఉత్సాహం తెలంగాణలోనూ కనపడుతోంది
  • తొలిసారి బెంగాల్‌లో అఖండ విజయం సాధించాం
  • పుదుచ్చేరిలోనూ మరోసారి ఎన్డీఏనే గెలిచింది: మోదీ
2026-05-10 19:01:45

  • పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
  • అభిమానుల కేరింతల నడుమ బహిరంగసభకు ప్రధాని 
2026-05-10 18:38:53

  • కాషాయమయమైన పరేడ్ గ్రౌండ్స్ 
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులు
2026-05-10 18:19:28

  • నేను పార్టీ తలవంచే పనులు చేయను: బండి సంజయ్ 
  • చేతకాని దద్దమ్మలు నన్ను ఇబ్బంది పెట్టలేరు 
  • నేను భయపడడానికి ఫాం హౌస్‌లో ఎలుకను కాను 
  • సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చా 
     
2026-05-10 18:15:54

  • కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తోడు దొంగలు: ఎంపీ లక్ష‍్మణ్
  • ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం బీజేపీదే 
2026-05-10 18:15:54

  • కాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్ చేరుకోనున్న మోదీ 
  • పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన బహిరంగ సభ 
  • సభకు వేలాదిగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు
2026-05-10 18:09:51

పరేడ్‌ గ్రౌండ్స్‌లో ‍ప్రారంభమైన బీజేపీ సభ

  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది: బండి సంజయ్ 
  • జై శ్రీరామ్‌ నినాదంతో అధికారంలోకి వస్తుంది
  • జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోస పడుతున్నారు.
  • ఫైసలు ఇచ్చేది మేమే.. అభివృద్ధి చేసేది మేమే 
  • రైతు భరోసా ఇవ్వడం లేదు: బండి సంజయ్ 
  • తెలంగాణకు కేంద్రం వేల కోట్ల రుపాయలు ఇస్తోంది
  • కాంగ్రెస్ మాత్రం ఇవ్వ లేదని అబద్ధాలు చెబుతోంది
2026-05-10 18:03:43

కాసేపట్లో ప్రధాని మోదీ బహిరంగ సభ

  • గచ్చిబౌలిలో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ 

  • కాసేపట్లో పరేడ్‌ గ్రౌండ్స్‌కు బయిలు దేరనున్న మోదీ

  • పరేడ్‌ గ్రౌండ్స్‌లోని బహిరంగ సభలో ప్రసంగించనున్న మోదీ
     

2026-05-10 17:10:53

రేవంత్ రెడ్డి నా మాట వినండి.. ప్రధాని మోదీ

  •  రేవంత్‌ని ఉద్దేశించి ప్రధాని కామెంట్స్ 
  • గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అన్ని నిధులు ఇస్తాం  
  • అలా అయితే  తెలంగాణకు వస్తున్న నిధుల్లో  సగం కోత పడుతుంది: మోదీ 
  • యూపీఏ హయాంలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చారో 
  • తెలంగాణకు అంతే నిధులు ఇస్తాం.. మోదీ 
  • దీంతో తెలంగాణకు అందుతున్న నిధుల్లో సగం కోత
  • అలా అయితే  మీరు చేరాలనుకుంటున్న లక్ష‍్యం నేరవేరదు: మోదీ  
  • రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారు. నేను కూడా మాట్లాడను
  • సీఎం రేవంత్‌ను ఉద్దేశించి మాట్లాడిన  ప్రధాని మోదీ  
2026-05-10 16:17:30

హైదరాబాద్‌పై మోదీ ప్రశంస

  • హైదరాబాద్‌ దేశంలోనే ప్రధాన తయారీ హబ్‌: మోదీ  
  • తెలంగాణకే కాదు దేశానికే హైదరాబాద్‌ అభివృద్ధి కేంద్రం 
  • దేశ అభివృద్ధిలో హైదరాబాద్ కీలకంగా మారింది
  • టెక్స్‌టైల్స్‌ పార్కుతో వేలమందికి ఉద్యోగాలు
  • గతంతో పోలిస్తే తెలంగాణలో రహదారులు రెట్టింపు 
  • విస్తరణలో రహదారుల సంఖ్య రెట్టింపయ్యింది: మోదీ
  • తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలు 
  • 2014లో ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్‌ రూ.1000 కోట్లు
  • కానీ ఇప్పుడు రైల్వే బడ్జెట్‌ ఎన్నో రెట్లు పెరిగింది 
  • తెలంగాణకు ఐదు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం
     

      
2026-05-10 15:59:19

పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన

  • పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మోదీ 
  • కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కును ‍ప్రారంభించిన మోదీ 
  • రూ. 9,400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • గుడెబల్లూరు- మహబూబ్‌నగర్‌ 4లేన్ల రహదారికి శంకుస్థాపన 
  • కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌ పనులు ప్రారంభం
  • వర్చువల్‌గా  శంకుస్థాపనలు చేసిన మోదీ
2026-05-10 15:56:17

తెలంగాణకు సహకారం కావాలి.. సీఎం రేవంత్

  • తెలంగాణ అభివృద్ధికి ప్రధాని సహకారం కావాలి 
  • ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. వికాస్‌ ఉత్సవ్
  • తెలంగాణ నెంబర్‌ వన్ కావడం కోసం ఎన్నో పాలసీలు తెచ్చాం 
  • రైజింగ్ పాలసీ తీసుకొచ్చాం.. రేవంత్ 
  • తెలంగాణను దేశంలో నెంబర్‌ వన్ చేయడమే లక్ష‍్యం
  • 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీగా మార్చడమే లక్ష‍్యం
  • వికసిత్ భారత్ నెరవేరాలంటే  
  • తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి 
  • దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారు కానీ  
  • తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు  
  • దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 
  • గుజరాత్‌ అభివృద్ధికి మన్మోహన్‌ సింగ్ సహకరించారు.
  • తెలంగాణకు కూడా మోదీ సహకారం కావాలి 
  • ప్రధాని కేంద్ర మంత్రులను ఎన్నో సార్లు కలిశా 
  • మీరు అభివృద్ధి పనులు ప్రారంభిస్తే మేం అడ్డుకోం: సీఎం రేవంత్ 
2026-05-10 15:45:51

రాష్ట్రానికి గిరిజన వర్సిటీ.. కిషన్‌ రెడ్డి

  • ప్రధాని మోదీ రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించారు.
  • తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు
2026-05-10 15:43:06

పలు అభివృద్ధి కార్యాక్రమాలకు మోదీ శంకుస్థాపన

  • రూ.9,400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన 
  • కాకతీయ టెక్స్‌టైల్స్‌ ప్రారంభించనున్న మోదీ 
  • గుడెబల్లూరు- మహబూబ్‌నగర్‌ 4లేన్ల రహదారికి శంకుస్థాపన 
  • కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌ పనులు ప్రారంభం  
2026-05-10 15:40:03

హెచ్‌ఐసీసీకి చేరుకున్న మోదీ

  • హెచ్‌ఐసీసీ చేరుకున్న ప్రధాని మోదీ
  • ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ 
  • ప్రధాని మోదీని శాలువాతో సత్కరించిన సీఎం రేవంత్
  • ‍అనంతరం నంది జ్ఞాపికను ‍అందించిన రేవంత్
2026-05-10 15:29:02

ఎయిర్‌పోర్టు వద్ద మోదీకి ఘనస్వాగతం

  • హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీ 
  • బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద మోదీకి ఘనస్వాగతం
  • మోదీకి ఘనస్వాగతం పలికిన నేతలు
  •  మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
  • కాసేపట్లో హెచ్‌ఐసీసీకి ప్రధాని మోదీ
  • బేగంపేట నుంచి హెచ్‌ఐసీసీకి మోదీ
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
  • రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
     
2026-05-10 14:52:07

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వద్ద హై అలర్ట్

  • మోదీ పర్యటన వేళ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వద్ద హై అలర్ట్ 
  • రోడ్డు మార్గం ద్వారా హెచ్ఐసీసీకి వెళ్లనున్న ప్రధాని 
  • మోదీ వెళ్లనున్న నేపథ్యంలో అడుగడుగునా భద్రత ఏర్పాటు
  • పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
2026-05-10 14:42:04

కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు మోదీ

  • మోదీ కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
  • మోదీకి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్వాగతం పలుకుతారు
  • మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు
  • పరేడ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు
2026-05-10 14:16:21

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

  • బేగంపేట నుంచి సంగీత్‌ వైపు వెళ్లే వాహనాలను ప్యారడైజ్‌-ప్యాట్నీ-క్లాక్‌ టవర్‌ మీదుగా సంగీత్‌ చౌరస్తాకు మళ్లిస్తారు.
  • సంగీత్‌ నుంచి బేగంపేట వెళ్లే వాహనాలకూ ఇదే మార్గంలో మళ్లింపు ఉంటుంది.
  • బేగంపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను..
  • ప్యారడైజ్, ప్యాట్నీ ఫ్లైఓవర్‌ల మీదుగా సెయింట్‌ జాన్స్, ఏఓసీ మార్గాల నుంచి మళ్లిస్తారు.
  • బాలానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వాహనాలను..
  • ఫతేనగర్, అమీర్‌పేట, పంజాగుట్ట నుంచి బేగంపేట మార్గంలోకి మళ్లిస్తారు.
  • బేగంపేట నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయంగా..
  • రసూల్‌పురా జంక్షన్, మినిస్టర్‌ రోడ్డు రాణిగంజ్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లాలి.
  • సికింద్రాబాద్‌ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలు..
  • క్లాక్‌టవర్,  ప్యాట్నీ, ప్యారడైజ్‌ – సీటీఓ మీదుగా బోయిన్‌పల్లి వైపు మళ్లిస్తారు.
  • ట్యాంక్‌ బండ్‌ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను..
  • ప్యారడైజ్‌ నుంచి సీటీఓ టాడ్‌బంద్‌– డైమండ్‌ పాయింట్‌ మార్గాల్లో మళ్లిస్తారు.  
2026-05-10 14:03:09

మోదీ పర్యటన షెడ్యూల్‌ ఇదీ..

  • మధ్యాహ్నం 2:20 గంటలకు కర్ణాటక నుంచి బేగంపేట విమానాశ్రయానికి రాక
  • 3 నుంచి 3:30 గంటల మధ్య గచ్చిబౌలిలోని హెచ్‌ఐసీసీలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. 
  • 3:45–4:15 గంటల మధ్య హైటెక్‌ సిటీ సమీపంలో సింధు హాస్పటల్‌ ప్రారంభోత్సవం. అనంతరం ఇటీవల శస్త్రచికిత్స
  • చేయించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు పరామర్శ
  • సాయంత్రం 4:45 నుంచి 6:15 గంటల మధ్య బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రిజర్వ్‌ టైమ్‌. 
  • 6:30 నుంచి 7:10 గంటల మధ్య సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభలో ప్రసంగం
  • రాత్రి 7:20 గంటలకు బేగంపేట నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు పయనం. 
2026-05-10 12:33:24

ప్రధాని ప్రారంభించే/శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..

హైదరాబాద్‌–పనాజీ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా గుడెబెల్లూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు రూ. 3,175 కోట్ల ఖర్చుతో ఎన్‌హెచ్‌–167 ఫోర్‌ లేనింగ్‌ పనులకు శంకుస్థాపన. దీనిద్వారా రవాణా సమయం గంటన్నర దాకా తగ్గనుంది.
సంగారెడ్డి జిల్లాలో రూ. 2,350 కోట్ల వ్యయంతో జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన. హైదరాబాద్‌–నాగపూర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో 3,245 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఎన్‌హెచ్‌–65 వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వరంగల్‌లో పీఎం మిత్ర పథకం కింద రూ. 1,700 కోట్లతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ప్రధాని ప్రారంభిస్తారు.
ఇది దేశంలోనే పూర్తిస్థాయిలో పనిచేస్తున్న తొలి పీఎం మిత్ర పార్క్‌గా నిలవనుంది.
కేంద్ర ప్రభుత్వ ఫైవ్‌–ఎఫ్‌ విజన్‌లో భాగంగా ఫామ్‌ టు ఫైబర్‌ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్‌ టు ఫారెన్‌గా పనిచేయనుంది
ప్రతిపాదిత నాగపూర్‌–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్‌్కప్రెస్‌ హైవే (ఎన్‌హేచ్‌–163 జీ)కి సమీపంలో మేజర్‌ రైల్వే నెట్‌వర్క్స్, సీ–పోర్టులకు కనెక్టివిటీ అందించనుంది.
జాతీయ స్థాయిలో ముఖ్యమైన రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు
కాజీపేట–విజయవాడ రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులో పలు సెక్షన్లను కవర్‌ (118 కి.మీ) చేయనున్నాయి.
రద్దీగా ఉండే గ్రాండ్‌ట్రంక్‌ కారిడార్‌లో లైన్‌ కెపాసిటీని పెంపొందించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది
దీని ద్వారా వేగవంతమైన రైళ్ల కార్యకటాపాలు, సమయపాలన మెరుగదల, సరుకు రవాణా వేగవంతానికి దోహదపడనుంది.
ఈ సందర్భంగా కాజీపేట రైల్‌ అండర్‌ రైల్‌ బైపాస్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు
కాజీపేట జంక్షన్‌లో సాఫీగా రవాణా సాగేలా దోహదపడటంతో పాటు హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు రైళ్ల రాకపోకలు వేగంగా సాగేలా సహాయపడనుంది. 
హైదరాబాద్‌ శివార్లలోని మల్కాపూర్‌లో రూ. 600 కోట్లతో అభివృద్ధి చేసిన ఇండియన్‌ అయిల్‌ టెర్మినల్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు.  
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 1,500 పడకల ‘సింధు కేన్సర్‌ హాస్పిటల్‌’ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
లాభాపేక్ష లేని సంస్థ ద్వారా కేన్సర్‌ చికిత్స కేంద్రీకృతంగా మల్టీ–సూపర్‌ స్పెషాలిటీ క్వార్టర్నరీ కేర్‌ను అందించనున్నారు.   


 

2026-05-10 12:31:49

నేడే మోదీ సభ

మూడోసారి ప్రధాని అయిన రెండేళ్ల తర్వాత తొలిసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ 
ప్రధాని పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది
తొలుత గచ్చిబౌలిలోని హెచ్‌ఐసీసీ నుంచి రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారభం
మరి కొన్ని ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు
సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ
 

2026-05-10 12:19:32
Advertisement
 
Advertisement
Advertisement