
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని వారికి సరైన అవకాశాలు లభిస్తే దేశం తరపున ఆడే స్తతా ఉందని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. జమ్మూ, కశ్మీర్ పర్యటనలో ఉన్న మహ్మద్ అజారుద్దీన్ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాలను మర్యాదపూర్వకంగా కలిశారు.
మూడు రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో యువ క్రికెటర్లను తాను కలిశానని ఆటలోని మెళకువలను నేర్పించానన్నారు. సుదీర్ఘ కాలంగా అవకాశాల కోసం వేచి చూస్తున్న యువతకు ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహం కల్పిస్తుండటం అభినందనీయమని అన్నారు.