360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే! | an interactive 360-degree virtual tour of Sabarimala Temple | Sakshi
Sakshi News home page

360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే!

Nov 25 2025 10:49 AM | Updated on Nov 25 2025 11:04 AM

an interactive 360-degree virtual tour of Sabarimala Temple

ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత అనేది భక్తుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు కూడా దోహదపడుతోంది. ప్రొఫెషనల్ 360° వర్చువల్ టూర్‌ల రూపకల్పన సంస్థ ‘P4Panorama’ ఇప్పుడు లక్షలాది అయ్యప్ప భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని 360 డిగ్రీల వర్చువల్ టూర్‌గా రూపొందించింది. దూరం, అనారోగ్యం లేదా ఇతరత్రా కారణాలతో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేని భక్తులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది.

ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా దర్శనం!
‘P4Panorama’  రూపొందించిన ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ శబరిమల ఆలయాన్ని ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా చూసేందుకు అవకాశం కల్పించింది. ఇమ్మర్సివ్ వర్చువల్ రియాలిటీ (వీఆర్‌)ద్వారా భక్తులు అత్యంత పవిత్రమైన పదునెట్టాంబడి (18 పవిత్ర మెట్లు)ని, దేవస్థానాన్ని , పరిసరాలను ప్రత్యక్ష అనుభూతితో చూడవచ్చు.

వర్చువల్ టూర్‌లోని ప్రధానాంశాలు
ఈ 360° టూర్ శబరిమల ఆలయ సంప్రదాయం, అక్కడి వాస్తుశిల్పం, పర్యావరణాన్ని సంపూర్ణంగా దర్శింపజేస్తుంది.

స్వర్ణమయ సన్నిధానం: బంగారు పూతతో మెరిసిపోతున్న అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయం (గర్భగుడి)ను దగ్గర నుంచి చూసిన అనుభూతిని పొందవచ్చు.

పవిత్ర సోపానం: ఈ టూర్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదునెట్టాంబడి దృశ్యాలు భక్తి భావాన్ని మరింతగా పెంచుతాయి.

ధ్వజస్తంభం (కొడిమరం): ఆలయ ప్రాంగణంలోని బంగారు తాపడం చేసిన ధ్వజస్తంభంను వీక్షించవచ్చు.

ఉపదేవతల సన్నిధులు: మాలిక్పురతమ్మ వంటి ఉపదేవతల మందిరాలను కూడా దీనిలో జూమ్ చేసి చూడవచ్చు.

యాత్రా మార్గాలు: సాంప్రదాయ ట్రెక్కింగ్ దారుల వెంబడి ఉన్న సుందరమైన దృశ్యాలు, ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌లు కూడా ఈ టూర్‌లో ప్రధానంగా కనిపిస్తాయి.

సాంకేతికత - ఆధ్యాత్మికత - పర్యావరణం
ఈ వర్చువల్ టూర్ కేవలం ఒక సాంకేతిక అద్భుతం మాత్రమే కాదు. పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. వర్చువల్ దర్శనాన్ని ఎంచుకోవడం ద్వారా, భక్తులు శబరిమల అటవీ పర్యావరణ వ్యవస్థను ఒక విధంగా కాపాడినవారవుతారు.

‘P4Panorama’ ప్రతినిధులు చెప్పినట్లు.. ఈ వర్చువల్‌ టూర్‌  అటు ఆధ్యాత్మికత, ఇటు ఆధునిక సాంకేతికతల సామరస్యపూర్వక కలయిక. వీరు అందించిన ఈ‌ టూర్‌లో కేవలం ఒక క్లిక్‌తో భక్తులు తమ ఇంటి నుంచే అయ్యప్పను దర్శనం చేసుకోగలుగుతారు. ఈ సంస్థ శబరిమల ఆలయంతో పాటు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, గురునానక్ దర్బార్ తదితర ప్రాంతాలను కూడా 360 డిగ్రీలలో చూపిస్తోంది.

👉: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇది  కూడా చదవండి: అయోధ్య: ప్రాణప్రతిష్ఠ నుంచి నేటి ధ్వజారోహణ వరకూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement