ప్రారంభించిన అమిత్ షా
గురుగ్రాం: ఉగ్రవాదులు, తీవ్రవాదులు విసురుతున్న అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన నేషనల్ డిజిటల్ ఐఈడీ డేటా ప్లాట్‌ఫాంను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఉగ్రవాదం బారినుంచి దేశాన్ని కాపాడే అత్యాధునిక రక్షణ ఛత్రంగా దీన్ని అభివరి్ణంచారు. ఈ నేషనల్ ఐఈడీ డేటా మేనేజ్‌మెంట్ సిస్టం (ఎన్‌ఐడీఎంఎస్)ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉగ్రవాద వ్యతిరేక కమెండో దళం ఎన్‌ఎస్‌జీ అభివృద్ధి చేసింది.
ఇందుకు గాం«దీనగర్‌లోని రాష్రీ్టయ రక్షా యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ సాయం అందించాయి.పలు రకాల బాంబులను క్షుణ్నంగా అధ్యయనం చేసే అత్యాధునిక కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ పరికరాలు ఎన్‌ఐడీఎంఎస్ సొంతం. దీన్ని 2000లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌జీ తాలూకు నేషనల్ బాంబ్ డేటా సెంటర్‌కు ఒకరకంగా అత్యాధునిక వెర్షన్‌గా చెబుతున్నారు. దేశ అంతర్గత భద్రతకు అత్యంత ముప్పుగా పరిణమించిన ఐఈడీల బారిన పడి ఏటా వేలాది మంది పౌరులు, భద్రతా సిబ్బంది మరణిస్తున్నారు.
వెలకట్టలేని ఆస్తి
ఎన్‌ఐడీఎంఎస్‌ను వెలకట్టలేని జాతీయ ఆస్తిగా అమిత్ షా అభివరి్ణంచారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదులు జరుపుతున్న బాంబుపేలుళ్లను ఇది సమర్థంగా అడ్డుకుంటుందని తెలిపారు. బాంబులు, బాంబు దాడులకు సంబంధించిన కీలకమైన, సమగ్రమైన డేటాను పోలీసు, భద్రతా సిబ్బంది, ఎన్‌ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాద వ్యతిరేక దళాలకు ఇది అందుబాటులోకి తెస్తుంది. అంతేగాక దర్యాప్తులను వేగవంతం చేయడంలో, నాణ్యతతో కూడిన ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణలో సాయపడుతుంది’’అని మంత్రి వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా ఏర్పాటవుతున్న ఎన్‌ఎస్‌జీ స్థావరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలో ఏ ప్రాంతానికైనా ఎన్‌ఎస్‌జీ కమెండోలు గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే చేరుకునే వీలుంటుందని తెలిపారు. ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని అప్పటికప్పుడు చేరవేసే వేదికగా ఎన్‌ఐడీఎంఎస్‌ను ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్ జనరల్ భృగు శ్రీనివాసన్ అభివర్ణించారు.


