బీజేపీ పాలనకు కౌంట్‌డౌన్‌  | Arvind Kejriwal Says BJP Countdown Begins After Relief in Liquor Policy Case | Sakshi
Sakshi News home page

బీజేపీ పాలనకు కౌంట్‌డౌన్‌ 

Mar 2 2026 4:26 AM | Updated on Mar 2 2026 4:26 AM

Arvind Kejriwal Says BJP Countdown Begins After Relief in Liquor Policy Case

జంతర్‌మంతర్‌ ర్యాలీలో కేజ్రీవాల్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు తీర్పుతో మద్యం పాలసీ కేసు నుంచి బయటపడిన 48 గంటలైనా గడవకమునుపే ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలపై విమర్శల దాడి మొదలుపెట్టారు. అధికార పీఠం నుంచి బీజేపీని కిందికి దించేందుకు కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆప్‌ ర్యాలీలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. 

మద్యం విధానం కేసులో తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా కుట్రపన్నారని ఆరోపించారు. అయితే, కోర్టు ఇచి్చన చారిత్రక తీర్పు తాను కరుడుగట్టిన నిజాయతీపరడన్నది రుజవైందంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీలో భయమొదలైందంటూ ఆయన..నిరంకుశుడు ఇలా భయపడుతున్నాడంటే దానర్థం..అతడి పాలనకు ముగింపు దగ్గరపడున్నట్లేనని పేర్కొన్నారు. చిన్నారుల విద్య కోసం పోరాడిన, శాస్త్రవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను మోదీయే జైలులో పెట్టించారు. మహిళా ఎంపీలు దాడి చేస్తారనే భయంతోనే ఆయన ఒక రోజు పార్లమెంట్‌కు వెళ్లలేదు. 

ట్రంప్‌ అన్నా మోదీకి భయమే’అని కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు. దేశంలో బీజేపీ 12 ఏళ్ల పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయన్నారు. రహదారులు, ఆరోగ్య రంగం, విద్య, పారిశుధ్యం..ఇలా అన్నీ దారుణంగా మారాయని విమర్శించారు. జీవించగలిగే భారత్‌ను ప్రజలు కోరుకుంటుండగా వికసిత్‌ భారత్‌ అంటూ ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. పరీక్షా పే చర్చ పేరుతో డ్రామాలు ఆపి, పరీక్ష పత్రాల లీకేజీని అరికట్టాలన్నారు. ఏడాది పాలనలోనే ఢిల్లీని బీజేపీ నాశనం చేసిందని మండిపడ్డారు. దేశానికి మోదీ చేసిందేమీ లేదంటూ కేజ్రీవాల్‌..కుట్రలు, ఓటర్ల జాబితా అవకతకల ద్వారానే ఆయన అధికారంలో కొనసాగుతున్నారంటూ ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement