నితీశ్‌కు ప్రధాని మోదీ... పుట్టినరోజు శుభాకాంక్షలు | PM Narendra Modi warm birthday wishes to three serving Chief Ministers | Sakshi
Sakshi News home page

నితీశ్‌కు ప్రధాని మోదీ... పుట్టినరోజు శుభాకాంక్షలు

Mar 2 2026 12:57 AM | Updated on Mar 2 2026 12:57 AM

PM Narendra Modi warm birthday wishes to three serving Chief Ministers

సీఎంలు స్టాలిన్, ఖేమ్‌చంద్‌కు కూడా

పట్నా/చెన్నై/న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆదివారం 76 ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, యూపీ గవర్నర్, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చిరాగ్‌ పాశ్వాన్, జితన్‌ రామ్‌ మాంఝీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం చౌనామెయిన్‌ తదితరులు నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 బిహార్‌ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దార్శనికత, అభివృద్థి పథకాలతో లక్షలాది మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్న నితీశ్‌కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రారి్థంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ కూడా ఆదివారం పుట్టిన రోజు జరుపుకున్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాం«దీ, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, సినీనటుడు రజనీకాంత్, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే ప్రముఖులు అన్నాదురై, ఎం.కరుణానిధి స్మారక చిహ్నాల వద్ద స్టాలిన్‌ పుష్పగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. తమిళ భాష, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తన జీవిత ధ్యేయమని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి యుమ్నామ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌కు కూడా ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్‌ ప్రజల సేవలో ఆయన దీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement