Khemchand
-
నితీశ్‌కు ప్రధాని మోదీ... పుట్టినరోజు శుభాకాంక్షలు
పట్నా/చెన్నై/న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం 76 ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ గవర్నర్, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనామెయిన్ తదితరులు నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దార్శనికత, అభివృద్థి పథకాలతో లక్షలాది మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్న నితీశ్‌కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రారి్థంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా ఆదివారం పుట్టిన రోజు జరుపుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, గవర్నర్ ఆర్.ఎన్.రవి, సినీనటుడు రజనీకాంత్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే ప్రముఖులు అన్నాదురై, ఎం.కరుణానిధి స్మారక చిహ్నాల వద్ద స్టాలిన్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. తమిళ భాష, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తన జీవిత ధ్యేయమని ఎక్స్ వేదికగా ప్రకటించారు. మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్‌కు కూడా ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్ ప్రజల సేవలో ఆయన దీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. -
మణిపుర్ చక్కబడేనా!
రెండున్నరేళ్లపాటు కనీవినీ ఎరుగని హింసతో అట్టుడికి, నిరుడు ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలనలో కొచ్చిన మణిపుర్లో ఎట్టకేలకు బుధవారం ముమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కుకీ, నాగా తెగలకు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే మెయితీ తెగకు చెందినవారే అయినా ఖేమ్‌చంద్‌కు మధ్యేవాదిగా ముద్ర ఉంది. మణిపుర్ సమాజంలో తీవ్రస్థాయి విద్వేషాలు ప్రబలిన వర్తమానంలో ఆగ్రహావేశాలు అంత త్వరగా సమసిపోవు. అందుకే కుకీ–జో తెగలకు చెందిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఎవరూ ‘మెయితీ ప్రభుత్వం’లో చేరొద్దంటూ ఆ తెగలకు చెందిన సంస్థలు హెచ్చరించాయి. దాన్ని బేఖాతరు చేసి, ఢిల్లీలోని మణిపుర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ప్రమాణం చేసిన మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్జెన్పై నిప్పులు చెరిగారు. రాజధాని ఇంఫాల్‌లో ఆమె ప్రమాణం చేయలేకపోవటానికి రెండు కారణాలున్నాయి. మెయితీల ఆధిక్యత గల ఇంఫాల్ మణిపుర్ లోయలో ఉంది. వారినుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతోపాటు, కుకీలు కూడా దాడిచేసే ప్రమాదం ఉంటుంది. సమస్య ఎంత జటిలంగా మారిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యవహార శైలి మెరుగ్గావుంటే, ఇలాంటి సమస్యలు త్వరలోనే సర్దుకుంటాయి. అయితే సమాజంలో సామరస్యతకు ముందు సొంతింటిని చక్కదిద్దుకోవటానికి బీజేపీ కృషి చేయాల్సి ఉంది. అధిష్ఠానం మాటవినే సంస్కృతికి భిన్నంగా అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇష్టారాజ్యం సాగించారు. పరిస్థితి క్షీణిస్తోందని ఢిల్లీ పెద్దలు హెచ్చరిస్తున్నా ధోరణి మార్చుకోలేదు. రాజీనామా చేయమని ఆదేశిస్తే శిరసావహించి నట్టు కనబడి, పెద్ద డ్రామా సృష్టించి జనం అడ్డుకున్నారని ఆగిపోయారు. ఎట్టకేలకు నిరుడు ఫిబ్రవరి 9న ఆయనతో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అప్పటికే ఆయన తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ఏకపక్షంగా వ్యవహరించి కుకీల్లో అసంతృప్తి రెచ్చగొట్టారు. వారితో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకొని ఆగ్రహావేశాలను పెంచారు. వారిని గంజాయి పండించేవారిగా, మాదకద్రవ్య పంపిణీదార్లుగా, అక్రమ వలసదారులకు ఆశ్రయమిచ్చేవారిగా చిత్రించారు. మణిపుర్లో హింస చెలరేగే నాటికే అక్కడ ఇరుపక్షాల్లోనూ ప్రభుత్వంపై అవిశ్వాసం ఏర్పడింది. 2023 మే నుంచి హత్యలు, లూటీలు, గృహదహనాలు, పార్థనా స్థలాలకు నిప్పెట్టడ యథేచ్ఛగా కొనసాగాయి. 260 మంది హత్యకు గురయ్యారని, 1,000 మంది గాయపడ్డారని, 32 మంది అదృశ్యమయ్యారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 60,000 మందికి పునరావాస శిబిరాలే శాశ్వత చిరునామాలయ్యాయి. అంతా సవ్యంగా ఉన్నందువల్లే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందని అనుకోనవసరం లేదు. రాష్ట్రపతి పాలన ఏడాదికి మించి పొడిగిస్తే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటు తప్పలేదు. ఇప్పటికీ మెయితీలు, కుకీ–జోలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు పోయే పరిస్థితి లేదు. తమ ప్రాంతాలకు స్వయంపాలన హక్కు ఇచ్చేందుకు అంగీకరించి, అందుకు నిర్దిష్ట కాల పరిమితిని లిఖిత పూర్వకంగా ప్రకటిస్తేనే ప్రస్తుతానికి ప్రభుత్వంలో పాలుపంచు కునేందుకు సిద్ధపడతామని కుకీ–జో తెగలు ఇప్పటికే తెలిపాయి. ఆ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదన్న ఆగ్రహంతోనే కొత్త సర్కారులో ఎవరూ భాగస్వామ్యం తీసుకోవద్దని వారు పిలుపునిచ్చారు. ఆ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే కేంద్రం విడిచిపెట్టదల్చుకున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం సంగతలా ఉంచి ముందు సంయమనం పాటించటం, అందరినీ కలుపుకొని వెళ్లటం వంటివి అవసరమని ఖేమ్‌చంద్ తెలుసుకోవాలి. ఎన్నికైన ప్రభుత్వం వస్తే కనీసం సమస్యలు చెప్పుకునే వీలుంటుందని జనం అనుకుంటారు. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ పరిష్కారాలపై పెద్ద ఆశలేమీ ఉండవు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న విశ్వాసమైతే కలగాలి. ఆ విశ్వాసాన్ని ఖేమ్‌చంద్ ప్రభుత్వం పొంద గలిగితే కొంతమేర విజయం సాధించినట్టే! -
మణిపూర్ సీఎంగా ఖేమ్‌చంద్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పరిణామాలు ఒక్కరోజులో మారిపోయాయి. రాష్ట్రపతి పాలన రద్దు కాగా, ఆ వెంటనే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఏడాది కాలంగా కొనసాగుతున్న రాజకీయ అనిశి్చతికి తెరపడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా బీజేపీ సీనియర్ నేత వై.ఖేమ్‌చంద్ సింగ్‌తో గవర్నర్ అజయ్‌భల్లా లోక్‌భవన్‌లో బుధవారం ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యే, కుకీ వర్గానికి చెందిన మహిళా నేత నేమ్చా కిప్జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్.డిఖో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సభ్యుడు గోవింద్‌దాస్ కాంథౌజమ్, ఎన్పీపీ సభ్యుడు కె.లోకెన్‌సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కిప్జెన్ అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ కొత్త ప్రభుత్వ గడువు వచ్చే ఏడాది దాకా ఉంది. ప్రమాణ స్వీకారం కంటే ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వు జారీ చేశారు. -
'తన్నండి కానీ.. ఎముకలు విరగ్గొట్టొద్దు'
మీరట్: తమ సంస్థకు చెందిన యువ గో సంరక్షకులకు విశ్వహిందూ పరిషత్ మరో సలహా చెప్పింది. గోవులను అక్రమంగా తరలించేవారిని, హింసించేవారిని కొట్టండి అయితే, వారి ఎముకలు మాత్రం విరగ్గొట్టద్దు అంటూ మరో వివాదాస్పద సలహాను ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బ్రజ్, ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన గో సంరక్షక బృందం ఉన్నత ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరంతా విశ్వహిందూపరిషత్ కు చెందిన వారే. ఈ సందర్భంగా గో సంరక్షక శాఖ కేంద్ర కమిటీ సభ్యుడు ఖేమ్‌చంద్ మాట్లాడుతూ 'గోవులను స్మగ్లింగ్ చేసేవారిని కొట్టండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టద్దు. విశ్వహిందూపరిషత్‌కు చెందినవారు, చెందని వారు ఈ విధంగా ముందుకు వెళితే ఏ ఒక్కరూ ఆవులను తరలించేందుకు సాహసం చేయలేరు. కనీసం అలాంటివారు ఎదురుపడలేరు. ఆవుల సంరక్షణ అంటే మేక్ ఇన్ ఇండియా కాదని.. దేశాన్ని రక్షించుకోవడం' అని చెప్పారు. 'ఈ మధ్య ప్రధాని మోదీ గో సంరక్షణపై చాలా మాట్లాడారు. ఆయన చెప్పిన చాలా అంశాలతో నేను అంగీకరించను. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరిస్తా. ఏ ఒక్కరం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఈ విషయం నేను తరుచుగా చెబుతూనే ఉన్నాను. అందుకే స్మగ్లర్లను తన్నండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టొద్దు. ఎందుకంటే పోలీసులతో కేసులై సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇక మోదీ మాటలతో నేను విభేదించకుండా ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు భారత్‌ను బంగారు పక్షి అనేవారు. నాడు ఎలాంటి పరిశ్రమలు లేవు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఆ రోజుల్లో భారత్ కు బంగారు పక్షి అని పేరు వచ్చిందా? మొత్తం భారత్‌ను ఆ రోజుల్లో కాపాడింది గోవులే. గో సంరక్షకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలో వారు వీరమరణం కూడా పొందుతున్నారు' అని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో గో సంరక్షణ పేరిట దళితులపై, ముస్లింలపై దాడులు ఎక్కువవుతున్నాయని కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.


