హరిద్వార్-ఢిల్లీ మార్గంలో కన్వర్ యాత్రికుల కోలాహలం! | Heavy Rush of Dak Kanwar Yatris in Haridwar | Sakshi
Sakshi News home page

హరిద్వార్-ఢిల్లీ మార్గంలో కన్వర్ యాత్రికుల కోలాహలం!

Aug 9 2026 1:01 PM | Updated on Aug 9 2026 1:01 PM

Heavy Rush of Dak Kanwar Yatris in Haridwar

హరిద్వార్‌: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో కన్వర్ యాత్ర సందర్భంగా భక్తిప్రపత్తులు పొంగిపొర్లుతున్నాయి.  ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కన్వర్లతో హరిద్వార్‌కు పోటెత్తారు. లక్సర్ రోడ్డు నుంచి పవిత్ర నగరంలోకి యాత్రికుల ప్రవాహం  కొనసాగుతోంది.

హరిద్వార్ నుంచి లక్సర్ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా కేవలం కన్వర్‌ వాహనాలే దర్శనమిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న రహదారి వెంబడి ఈ దృశ్యం చూస్తుంటే హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు సమాంతరంగా ఒక భక్తివిశ్వాస ప్రవాహం సాగుతున్నట్లు కనిపిస్తోంది.

హర్ కి పౌరీ గంగా ఘాట్లు, మార్కెట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీతో బైరాగీ క్యాంప్ సహా ప్రధాన పార్కింగ్ స్థలాలు నిండిపోతున్నాయి. ట్రాఫిక్, భద్రత, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్, ఎస్పీ నవనీత్ సింగ్ మేళా ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తూ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: చైనాలో ‘డాల్ఫిన్‌’ బీభత్సం.. 1,300 విమానాలు రద్దు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement