క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్‌చల్‌! | Mojtaba Khamenei Video Surfaces Amid Health Rumours Where Is Irans Supreme Leader | Sakshi
Sakshi News home page

క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్‌చల్‌!

Aug 9 2026 7:25 AM | Updated on Aug 9 2026 7:46 AM

Mojtaba Khamenei Video Surfaces Amid Health Rumours Where Is Irans Supreme Leader

టెహ్రాన్‌: ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం, ఆచూకీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే ఒక  వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఇరాన్‌క చెందిన సెమీ-అఫీషియల్ మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వీడియో, ఖమేనీ ఆరోగ్యం విషమంగా ఉందనే వదంతులను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది.
 

అయితే ఈ ఫుటేజ్ ఎప్పుడు రికార్డ్ చేసిందనే దానిపై స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులలో ఆయన తండ్రి అయతొల్లా అలి ఖమేనీ హత్య తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం రాతపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారాన్ని అందిస్తున్నారు. దాడుల సమయంలో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని చెబుతున్నారు.

జూలైలో సౌదీ వార్తా సంస్థ అల్-హదత్ ఇజ్రాయెల్.. ఖమేనీ ఇరాన్‌లో లేరని తెలిపింది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, సర్వోన్నత నేతతో ప్రత్యక్ష సంబంధాలు ప్రస్తుతం చాలా కష్టంగా ఉన్నాయని అంగీకరించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగా లేదని ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు.

ఇది కూడా చదవండి: జపాన్ పర్యటనకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement