'మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే.. | Health Tips: Did you know about the flesh-eating disease | Sakshi
Sakshi News home page

'మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..

Aug 6 2026 3:52 PM | Updated on Aug 6 2026 4:14 PM

Health Tips: Did you know about the flesh-eating disease

'మాంసాన్ని తినే వ్యాధి' అనే పేరు వినగానే ఎవరికైనా భయం, ఆందోళన కలగడం సహజం. ఈ వ్యాధి శాస్త్రీయ నామం 'నెక్రోటైజింగ్ ఫాసిటిస్' అని చెబుతున్నారు వైద్యులు. దీనికి చికిత్స సైతం అందుబాటులో ఉందట. వినడానికే భయం కలిగిస్తున్న ఈ వ్యాధి ఏంటో, ఎందువల్ల వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌గా వ్యవహరించి మాంసాన్ని తినే వ్యాధి చర్మం క్రింద ఉండే మృదు కణజాలాన్ని ప్రభావితం చేసే ఒక అరుదైన ఇన్ఫెక్షన్‌గా పేర్కొంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. అత్యంత అరుదైన సందర్భాలలో కళ్ల చుట్టూ కూడా రావొచ్చు. చిన్న కోత, శస్త్రచికిత్స గాయం లేదా కీటకం కాటు వంటి వాటి ద్వారా చర్మంలో ఏర్పడిన గాయం గుండా కొన్ని రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి బారిన పడే వారిలో చాలామందికి బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.

లక్షణాలు..చికిత్స..
ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా తీవ్రతరమవుతాయి. సులభంగా గుర్తించగలిగే మార్పులు ఇవి:

వాపు, ఎర్రబడటం
ఒక నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి లేదా సున్నితత్వం (స్పర్శకు నొప్పిగా అనిపించడం)అయితే, బయటకు కనిపించే దానికంటే ఆ అసౌకర్యం లేదా నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చని వైద్యులు తెలిపారు. దీనికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కణజాలాన్ని తొలగించే ప్రక్రియ అవసరం కావచ్చు అని చెబుతున్నారు వైద్యులు.

నివారించడం ఎలా అంటే..
నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌ను పూర్తిగా నివారించడం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. అయితే, దీని ముప్పును తగ్గించడానికి ఇలా చేయండని చెబుతున్నారు వైద్యులు. 

అవేంటంటే..

  • గాయాలను సబ్బు  నీటితో శుభ్రం చేయండి. అవి నయమయ్యే వరకు శుభ్రమైన కట్టుతో (bandage) కప్పి ఉంచండి.

  • ఏదైనా లోతైన కోత లేదా గుచ్చుకున్న గాయం అయినట్లయితే వైద్యుడిని సంప్రదించండి.

  • చర్మంపై గాయం లేదా కోత ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్, హాట్ టబ్స్ లేదా బయట ఉండే నీటి వనరులలోకి వెళ్లకండి.

     

(చదవండి: షాంపూ బదులు.. ప్రకృతి సిద్ధమైన ప్రత్యామ్నాయం ఇదే! వైద్యులు సైతం..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement