‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’ | Gossip Psychology Social Behavior Good Or Bad | Sakshi
Sakshi News home page

‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’

Sep 12 2026 6:16 AM | Updated on Sep 12 2026 6:16 AM

Gossip Psychology Social Behavior Good Or Bad

లైఫ్‌

కాసింత గుసగుస!

‘‘నీకో విషయం చెప్పాలి.. కానీ ఎవరికీ చెప్పకూడదు!’’ ఇలాంటి మాట వినగానే  చాలామందికి ఆసక్తి పెరిగిపోతుంది. 
స్నేహితుల మధ్యైనా, ఆఫీసులోనైనా, కుటుంబంలోనైనా.. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడటం రోజువారీ మాటల్లో ఒక భాగమైపోయింది. అయితే దానిని వెంటనే 
‘గాసిప్‌’ అంటూ చెడ్డ అలవాటుగా ముద్ర వేస్తాం. కానీ శాస్త్రవేత్తలు మాత్రం గాసిప్‌ను అంత 
సులభంగా చెడ్డదిగా చూడటం లేదు. గాసిప్‌ అనేది మనుషుల సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన ΄ాత్ర పోషించే సాధనం కూడా కావచ్చని అంటున్నారు.

గాసిప్‌ అంటే సాధారణంగా మనం మన దగ్గర లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం అని అనుకుంటాం.. కానీ ఇతరుల వ్యక్తిగత విషయాలు, నిర్ధారణ లేని వార్తలు, ఇతరుల గురించి నిజా
నిజాలు తెలుసుకోకుండా వ్యాప్తి చేసే సంభాషణలను కూడా గాసిప్‌ అంటారు.

ఎందుకంత కుతూహలం!
చాడీలు, రూమర్లు అనేవి కొత్తగా వచ్చిన అలవాటేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఇతరుల గురించి తెలుసుకోవడం, ఎవరు నమ్మదగినవారు? ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరి మాట నమ్మాలి? వంటి విషయాలు తెలుసుకోవడం సహజంగానే సాగుతుంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. ఒకరి గురించి సమాచారాన్ని పంచుకుని, ఇతరులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఒక రకమైన ఉపయోగం కావచ్చు. అదే సమయంలో, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఒకరిని బ్లేమ్‌ చేసేందుకు అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం హానికరమైన గాసిప్‌గా మారుతుంది.

ఆఫీసుల్లోనూ గాసిప్స్‌
‘ఆఫీసులో గాసిప్‌ చేయకూడదు’ అని ఎన్ని నియమాలు పెట్టినా.. ఉద్యోగుల మధ్య అనధికారిక చర్చలు ఉండటం సహజం. ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? వంటి సమాచారాన్ని ఉద్యోగులు పరస్పరం పంచుకుంటుంటారు. ఇలాంటి సమాచారం కొన్నిసార్లు సహకారాన్ని పెంచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోనూ పడేయవచ్చు. అనుమానాలు సృష్టించడం, నమ్మకాన్ని కోల్పోయేలా చేయడం, సంబంధాలను దెబ్బతీయడం మాత్రమే ఉద్దేశమైతే.. అది హానికరమైనదే.

గాసిప్‌ అనేది జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ.. పరిశోధనలు సూచించేది ఏమిటంటే.. గాసిప్‌ ఉందా లేదా అన్నది కంటే, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. మంచి గాసిప్‌ సమాచారం ఇవ్వొచ్చు.. స్నేహాన్ని బలపరచొచ్చు.. అవసరమైనప్పుడు ఇతరులను జాగ్రత్తపరచొచ్చు. కానీ అవే గాసిప్స్‌ ఒక్కోసారి సంబంధాలను దెబ్బతీయొచ్చు.. నమ్మకాన్ని కోల్పోయేలా చేయొచ్చు.. నష్టం కలిగించవచ్చు.
– నిర్వహణ: రమా జంబుల

ఇవి కూడా చదవండి: ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement