ఇంతవరకు చాలామంది ఒత్తిడితో కూడిన కార్పొరేట్ ఫీల్డ్ వద్దని ప్రశాంతమైన ఉద్యోగమో లేక అభిరుచినే వ్యాపారంగానో మలిచి సక్సెస్ అందుకున్నవాళ్లను చూశాం. కానీ ఈమె నచ్చిన ఉద్యోగం లేదా అభిరుచి కోసం మంచి జాబ్‌ని వదులుకోకూడదని, ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ..అధిక ఆధాయ మార్గంగా మార్చుకోవచ్చని చెబుతోంది. పైగా సంప్రదాయ వృత్తి విజయాన్ని బేఖాతారు చేస్తూ..తనకున్న నైపుణ్యాలన్నింటితో ఆదాయం ఆర్జిస్తూ ఒత్తిడే తనముందు చిత్తు అని చూపిస్తోంది ఈ పవర్‌ఫుల్ లేడీ.
ఆ అమ్మాయే అదితి మిశ్రా. కార్పొరేట్ ఉద్యోగమా, వ్యాపారమా అనే కన్ఫ్యూజన్ వద్దు. ‘నైపుణ్యాలు అందిపుచ్చుకో..సంపాదనగా మార్చుకో’ అనే నినాదంతో దూసుకుపోతోంది లండన్‌లో నివశిస్తున్న అధితి. ఆమె ఒకటి రెండు కాదు, ఎన్ని విధాలుగా ఆదాయలు ఆర్జిస్తోందో వింటే షాకవ్వుతారు. తన పూర్తికాలపు కార్పొరేట్ జాబ్ తోపాటు నిర్మించుకున్న నైపుణ్యాల నుంచి పలువిధాలా ఆధాయమార్గాలను సృష్టించిందామె. ఆమె ముందుగా 2017లో భారతదేశం నుంచి యూరప్‌కు వెళ్లి అక్కడ వృత్తిని నిర్మించుకున్నారు. యూరోపియన్ ఫిన్‌టెక్ రంగంలోకి ప్రవేశించడానికి ముందు లింక్డ్‌ఇన్ నియమాకాలు, కెరీర్ సంబంధిత ఉత్పత్తులపై పనిచేస్తూ ఐదేళ్లు గడిపింది.
ప్రస్తుతం ఆమె లండన్‌లోని ఒక ఫిన్‌టెక్ కంపెనీలో సీనియర్ హోదాలో పనిచేస్తూ ..పార్ట్‌టైం కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఫుల్-టైమ్ కార్పొరేట్ కమ్ పార్ట్ టైం కంటెంట్ క్రియేటర్. కంటెంట్ క్రియేటర్‌గా లింక్డ్‌ఇన్, సబ్‌స్టాక్‌లలో ఏకంగా 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కెరీర్‌లో విజయం అంటే సంప్రదాయ నిచ్చెన కాదు..ఆధునికతకు అనుగుణమైన హైటెక్ మార్పు అని అంటోంది అదితి.
ఆమె తన కార్పొరేట్ ఉద్యోగంలో వారానికి 60 గంటలు పైగా పనిచేస్తూ..ఇవి కూడా చేస్తోందామె. తనకి ఉన్న నైపుణ్యాలే ఆమె సంపాదన మార్గాలని చెప్పొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్, కన్సల్టింగ్, పెయిడ్ న్యూస్‌లెటర్లు, పబ్లిక్ స్పీకింగ్, వర్క్‌షాప్‌లు, యూజీసీ కంటెంట్ అండ్ బ్రాండ్ సహకారాలు తదతరాలతో ఆదాయం గడిస్తోంది. ఉన్నాయి. ఆమె ఆ ఒక్కోక్కదానితో సంపాదించే ఆదాయ వివరాలు..
అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కేవలం రూ. 1548/-
కన్సల్టింగ్ ద్వారా సుమారు రూ. 6,45,323/-
బ్రాండ్ డీల్స్ ద్వారా రూ. 32,39,767.04/-
ప్రజా ప్రసంగాల ద్వారా రూ. 12,26,113/-
యూజీసీ పనుల ద్వారా రూ. 12,90,646/-
అలా మొత్తం నెల తిరిగేటప్పటికీ ఆర్జించే ఆదాయం రూ. 63 లక్షలు పైనే వస్తుందామెకు. ఇక్కడ అదితి చెబుతోంది ఒక్కటే ఉద్యగోం కోసం నేర్చుకున్న నైపుణ్యాలు మనకు ఉద్యోగం వెలుపల ఆదాయంగా మారతాయని అవి మనం గమనించమని చెబుతోంది. అంటే..కమ్యూనికేషన్ నైపుణ్యాలు పబ్లిక్ స్పీకింగ్‌గా మారవచ్చు. వృత్తిపరమైన జ్ఞానం కన్సల్టింగ్‌గా మారవచ్చు. రచన ఒక న్యూస్‌లెటర్‌గా మారవచ్చు. సోషల్ మీడియా పరిజ్ఞానం యూజీసీ (UGC) లేదా బ్రాండ్ భాగస్వామ్యాలుగా మారవచ్చు.
వాటిని మనం గమనించకుండా మొదటి నుంచి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని అంటోంది. అంతేగాదు కంటెంట్ క్రియేటర్ మారాలంటే చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సిన పనిలేదు. ఆ రెండింటిని ఎంచుకుంటూ సాగొచ్చని అంటోంది. ఇక్కడ అదితి ఉన్నత కార్పొరేట్ పదవి తోపాటు, వ్యక్తిగత బ్రాండ్‌గా మారింది. ఇక్కడ సోషల్‌మీడియా సాయంతో తన వృత్తిగత జర్నీని వివరిస్తూ ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్ ఇచ్చుకుంటూనే..మరోవైపు ఫాలోవర్ల సాయంతో, అడ్వర్టైస్‌మెంట్ దక్కించుకుని ఆదాయ మార్గాలను సృష్టించుకుంటూ పోయింది.
తన ఉద్యోగం ఎదుగుదలకు సంపాదించుకున్న నైపుణ్యాలనే సంపాదన మార్గాలుగా మార్చి..అసాధారణమైన రీతీలో డబ్బు గడిస్తోంది. ఇక్కడ అభిరుచిని, ఆనందాన్ని వెతుక్కుంటూనే అధిక ఆదాయన్ని కూడా ఆర్జించొచ్చు అనే చెప్పే స్ఫూర్తిదాయక కథ ఆమెది. అదితి అసాధారణ ఆధాయ మార్గాల సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది.


