ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు | 8 Including 3 Children Killed In Truck Pickup Van Collision In Maharashtra | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Sep 11 2026 12:21 PM | Updated on Sep 11 2026 12:35 PM

8 Including 3 Children Killed In Truck Pickup Van Collision In Maharashtra

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్-పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి ప్రాణాలుకోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం  రోజు తెల్లవారుజామున  ఈ  ఘటన జరిగింది.  

నాగ్‌పూర్-రాయ్‌పూర్ జాతీయ రహదారిపై ఉన్న పింపల్‌గావ్ రోడ్డు ప్రాంతంలోని 'భౌ ధాబా' సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి మరణించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రమాద స్థలం నుండి వెలికితీశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గుర్ని తక్షణమే సకోలి సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతమేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా: గడ్కరీ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement