ఉరవకొండ/వజ్రకరూరు: అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. వజ్రకరూరుకి చెందిన కణేకల్లు జైనుల్లా(45), మహబూబ్బాషా(32), భగవాన్ మహ్మద్రఫీ(30) ద్విచక్రవాహనంపై ఉరవకొండకు కోర్టు కేసు నిమిత్తం గురువారం వచ్చారు. వాయిదా ముగించుకుని∙స్వగ్రామం బయలుదేరారు.
ఉరవకొండ దాటగానే టీవీ టవర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనాన్ని దాదాపు అర కిలోమీటరు మేర ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


