యాపిల్ సంస్థ ఎట్టకేలకు తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, ఫోల్డబుల్ స్క్రీన్, ఇతర ప్రత్యేకతలపై కాకుండా సోషల్‌మీడియాలో జరుగుతున్న సంభాషణ మాత్రం విభిన్నంగా సాగుతోంది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న జోక్‌కు IYKYK (if you know, you know) ) అనేది ట్రెండింగ్ ట్యాగ్‌లైన్‌గా మారింది.
మైక్రోసాఫ్ట్ 2020లోనే తన రెండు స్క్రీన్ల ఫోల్డబుల్ డివైజ్‌ను యాపిల్ కాపీ కొట్టిందంటూ మీమ్స్, జోకులు పేలిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన ఫోన్‌కు 'Surface Duo' అని పేరు పెట్టింది. దీంతో 'Duo' అనేది కొత్త పేరేమీ కాదు, పాతదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యాపిల్ 'Fold' అని పెట్టకుండా మైక్రోసాఫ్ట్‌ను కాపీ కొట్టిందని కొందరు ఎక్స్‌లో విమర్శించారు. మరికొందరు ఇది మైక్రోసాఫ్ట్‌దే కాకుండా, గతంలొ వచ్చిన ఇంటెల్ (Core Duo) చిప్‌ల పేరును కూడా గుర్తుచేస్తోందన్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో కంటే ముందే, అంటే 1990లలోనే యాపిల్ తన PowerBook Duo ల్యాప్‌టాప్‌లకు ఈ పేరును వాడిందని మరికొందరు గుర్తుచేశారు.
విండోస్ సెంట్రల్ ఎడిటర్ జాక్ బౌడెన్ మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ తమ 'Duo' ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలేయడం వల్ల యాపిల్ ఉద్దేశపూర్వకంగానే ఈ పేరును (మరియు MacBook Neo రూపంలో 'Neo' పేరును) ఉపయోగించుకుందని నిపుణులంటున్నారు. పేర్కొన్నారు. డ్రాయిడ్ లైఫ్ అనే టెక్ సైట్ వ్యాఖ్యానిస్తూ, మైక్రోసాఫ్ట్ తయారు చేసిన అత్యంత దారుణమైన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకటైన సర్ఫేస్ డ్యూయో పేరునే యాపిల్ ఎంచుకోవడం నవ్వు తెప్పిస్తోందని రాసుకొచ్చింది.
విండోస్ లేటెస్ట్ కథనం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో హార్డ్‌వేర్ అద్భుతంగా ఉన్నప్పటికీ సోఫ్ట్‌వేర్ పరంగా విఫలమైంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఆ ప్రాజెక్ట్‌ను కొనసాగించి ఉంటే సర్ఫేస్ డ్యూయో ఎలా ఉండేదో, యాపిల్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు అలా వచ్చిందని విశ్లేషించింది.
యాపిల్ గతంలో 'MagSafe Duo' ఛార్జర్ వంటి వాటికి ఈ పేరు వాడినప్పటికీ, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ విఫలమైన ప్రాజెక్ట్ పేరు మళ్లీ యాపిల్ ఫోన్‌కు రావడాన్ని నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అయితే ఈ పేర్ల సారూప్యతపై యాపిల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
'Huawei made a foldable phone five years ago...'
'"Junk, that phone will break in an instant... Chinese junk... Why do you need so much screen on a single phone? Just buy a tablet."'
'Apple makes a foldable phone...'
'"Only Apple could pull this off."'
😁😁😁 pic.twitter.com/kbeCGujp8d— FierceGoys (@GrahamInHell) September 10, 2026


