ఇప్పటికీ ఆశ్చర్యమే..! తన ప్రెగ్నెన్సీపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు | Samantha Ruth Prabhu Shares Why Her Pregnancy Was A Surprise | Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: ఇప్పటికీ ఆశ్చర్యమే..! తన ప్రెగ్నెన్సీపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Sep 10 2026 12:55 PM | Updated on Sep 10 2026 1:21 PM

Samantha Ruth Prabhu Shares Why Her Pregnancy Was A Surprise

మా ఇంటి బంగారం సక్సెస్‌ మీట్‌లో తన ప్రగ్నెన్సీ గురించి ప్రకటించారు సమంత రాజ్‌ నిడిమోరులు. తాము మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ప్రసూతి శెలవులు అనంతరం మరిన్ని హిట్‌లతో మళ్లీ మీ ముందుకు వస్తానని తన అభిమానులకు హామీ ఇచ్చింది నటి సమంత. ఆ తర్వాత నుంచి తన ప్రగ్నెన్సీకి సంబంధించి ప్రతీ అప్‌డేట్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ చిల్‌ అవుతోంది సమంత. 

ఈ జర్నీలో ప్రతి నెల ఓ అద్భుతం..అలాగే ఈ ప్రెగ్నెన్సీ తనకు ఎప్పటీ ఆశ్చర్యమే ఎందుకంటే..అంటూ తన మాతృత్వపు మధురిమకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంది. తను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు రీత్యా పిల్లలు కలిగే అవకాశం లేదనుకున్నాని, అందుకు తామిద్దరం సిద్ధపడిపోయామని చెప్పుకొచ్చింది. అసలు ఏం జరిగినా ఇద్దరం కలిసి ముందుకు సాగుదాం అని అనుకున్నాం. 

అలా నిర్ణయించుకున్న తరుణంలో ప్రెగ్నెంట్‌ అని నిర్థారణ కావడం తనని చాలా ఆశ్చర్యంలో ముంచెత్తిందని సంబరంగా చెబుతోంది సమంత. సరిగ్గా తాను ప్రెగ్నెంట్‌ అని తెలిసింది మా ఇంటి బంగారం మూవీ షూటింగ్‌ల త త తతస్సాదియ్యా పాట షూట​ చేస్తున్నప్పుడే తెలిసిందని, దాంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్‌ చేయాల్సి వచ్చిందని నాటి పరిస్థితిని వివరించింది. 

తనకి 2022లో ఆటోఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్ ఉన్నట్లు నిర్థారణ అయినప్పుడు అవేళ తాను పడ్డా నరకం ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. అసలు ఆ టైంలో జీవితమే అయిపోయిందనిపించింది, పైగా లేని ఆత్మవిశ్వాసాన్ని కొని తెచ్చుకున్నట్లుగా నటిస్తున్నట్లుగా అనిపించిందంటూ నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. అంతేగాదు ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులకు ఎలా స్పందిస్తాననేది కూడా తన నియంత్రణలో లేనట్లుగా, చాలా బలహీనంగా అయిపోయినట్లు అనిపించిందంటూ కన్నీటిపర్యంతమైంది. 

కానీ ఆ వ్యాధి నుంచి బయటపడేలా వర్కౌట్లు చేస్తూ..మెరుగ్గా మారి, తిరిగి తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలిగానని చెప్పుకొచ్చింది. ఒక రకంగా ఈ వ్యాధి తనకు జీవితంలో దృఢచిత్తం, ఆశ, విశ్వాసం వంటి విలువల గురించి గొప్ప పాఠాన్ని నేర్పిందని పేర్కొంది. ఆ తర్వాతే తన నటన, జీవితం మరింత వాస్తవికంగా మారినట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది.

 

(చదవండి: జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్‌ భావోద్వేగభరిత లేఖ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement