ఇటీవల కాలంలో చాలామంది సంపాదన, పిల్లలను సెటిల్ చేయడం వంటి ఉరుకుల పరుగుల జీవితం వద్దంటూ ప్రకృతితో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కొందరు ఆ క్రమంలో ప్రయాణాలు చేస్తుంటే ఇంకొందరు మాత్రం గజిబిజి వాతావరణం మాకే కాదు మా పిల్లలకు వద్దు అంటూ మన పూర్వీకుల జీవిన విధానంలో బతికి చూపిస్తూ..మర్చిపోతున్న లేదా విస్మరిస్తున్న అద్భుత పేరెంటింగ్ పాఠాలను గుర్తు చేస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఈ దంపతులు
ఆ దంపతులే ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య, గరిమలు. ఈ జంట ఉత్తరాఖండ్‌లో మారుమూల గ్రామం బస్‌గావ్‌లో నివశిస్తూ..అన్ని రకాల ఒత్తిళ్లు, కాలుష్యంకు దూరంగా ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్నారు. చెప్పాలంటే వారు కోరుకున్న కలల జీవితంలో ఆనందంగా గడుపుతున్నారు. తమ బిడ్డకు కూడా నో స్కూల్, నో స్క్రీన్, నో సిలబస్ వంటి ఎలాంటి ఒత్తిడులు దరిచేరనీకుండా ప్రకృతితో మమేకమయ్యేలా పెంచుతున్నారు. ఆ చిన్నారి ప్రతీదీ సహజసిద్ధంగా నేర్చుకునేలా పెంచుతున్నారు. అంతకుముందు ఈ దంపతులు జీవన విధానం ఎలా ఉండేదంటే..
సిమ్లాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆదిత్య, కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగడమే విజయానికి కీలకం అని నమ్మేవారు. ఆ నేపథ్యంలోనే ఆదిత్య ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ చేయడం కోసం ఢిల్లీకి వెళ్లాడు, అక్కడ గరిమను కలిశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, గరిమకు మంచి ఉద్యోగం లభించింది, శిక్షణ కోసం ప్రపంచమంతా పర్యటించే అవకాశం కూడా దొరికింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు, తీవ్రమైన ఒత్తిడి బారినపడింది.
ఇక 2015లో ఆదిత్య ఉద్యోగ రీత్యా ఈ జంట వివాహం చేసుకుని సింగపూర్‌కు వెళ్లిపోయారు. అక్కడ గరిమ తన ఉద్యోగాన్ని వదిలేసి, బాలల మనస్తత్వ శాస్త్రం(చైల్డ్ సైకాలజీ) చదవడంపై దృష్టి సారించింది. ఆ సబ్జెక్టులో మరింత లోతుగా పరిశోధన చేయడంతో కార్పొరేట్ లైఫ్ జీవితాలను ఎలా నాశనం చేస్తుందో గ్రహించారు. దాంతో ఇద్దరు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 33 ఏళ్లకే ఆదిత్య ఉద్యోగాన్ని వదిలేసి గర్భవతిగా ఉన్న గరిమను తీసుకుని ఉత్తరాఖండ్‌కి వచ్చేశాడు.
ప్రకృతి మూలికలకు స్వస్థపరిచే శక్తి, ప్రకృతి ఆధారిత పాఠశాల విద్య వారి జీవితాలను ఎంతలా తీర్చిదిద్దుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు వారి కూమారుడు వేదాస్ ఇప్పటి వరకు ఏ పాఠశాలకు వెళ్లలేదు, అతని ప్రాథమిక విద్య అంతా ప్రకృతి నుంచే స్వయంగా నేర్చుకున్నాదే. సూర్యోదయంతో మేల్కోవడం నుంచి పక్షుల కిలకిలరావాలు, వర్షపు వాసన వంటివి స్వయంగా అనుభవిస్తాడు, తనే తెలుసుకుంటాడని చెబుతున్నారు ఆదిత్య గరిమ దంపతులు.

అంతేగాదు ఆ చిన్నారే స్వయంగా మొక్కలు నాటుతాడు, కంపోస్ట్ కూడా తయారు చేస్తాడని అన్నారు. అతను మట్టితో చిత్రాలు గీస్తాడు, నేర్చుకుంటాడని చెప్పుకొచ్చారు. అలాగని తామేమి పరీక్షలకు వ్యతిరేకం కాదని, వాళ్లని గుడ్డిగా ఒత్తిడికి గురిచేయడాన్ని నిరాకరిస్తామని అన్నారు. తమ బిడ్డ వేగంతో నేర్చుకుంటూ ఉత్సుకతతో ఉండటమే గాక ప్రకృతి తన రోజువారి జీవితంతో బలమైన అనుబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు.
చెప్పాలంటే..చిన్నారులు ప్రతి విషయాన్ని విశ్వంతో స్వయంగా అనుభవిస్తూ నేర్చుకున్న జ్ఞానం, అద్భుతాలు, ఆవిష్కరణాలకు దారితీస్తుందని తమ జీవన విధానంతో చెప్పకనే చెబుతున్నారు. నెటిజన్లు కూడా ఆ దంపతుల ధైర్యానికి మెచ్చుకుంటూ..చక్కటి ముందడుగు వేశారంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: యూట్యూబ్ సాయంతో శాండ్‌విచ్ తయారీ..ఇవాళ ఏకంగా..!)


