తొలిసారి కొడుకు ఫొటో పంచుకున్న వరుణ్‌ తేజ్‌–లావణ్య | Varun Tej-Lavanya Tripathi Reveal Son Vaayu Tej’s First Photo on His First Birthday | Sakshi
Sakshi News home page

తొలిసారి కొడుకు ఫొటో పంచుకున్న వరుణ్‌ తేజ్‌–లావణ్య

Sep 10 2026 9:34 PM | Updated on Sep 10 2026 9:40 PM

Varun Tej-Lavanya Tripathi Reveal Son Vaayu Tej’s First Photo on His First Birthday

టాలీవుడ్‌ నటుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్‌ తేజ్‌ ఫొటోను తొలిసారి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. వాయువ్‌ తొలి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోను షేర్‌ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2025 సెప్టెంబర్‌లో వరుణ్‌–లావణ్య దంపతులకు కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. అనంతరం తమ బిడ్డకు ‘వాయువ్‌ తేజ్‌’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.


కుమారుడి ఫొటోను షేర్‌ చేసిన వరుణ్‌ తేజ్‌.. “నా ప్రపంచాన్నే మార్చేశావు” అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ‘నా ప్రియమైన వాయువ్‌ తేజ్‌.. నా ప్రపంచాన్ని సాధ్యమైనంత అందంగా మార్చేశావు. నిన్ను తొలిసారి కళ్లారా చూడకముందే నీతో ప్రేమలో పడిపోయాను. నీ తండ్రిగా ఉండటం నా జీవితంలోనే అత్యంత అందమైన విషయం’ అంటూ వరుణ్‌ తేజ్‌ భావోద్వేగ పోస్ట్‌ చేశాడు.

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి తొలిసారి 2017లో వచ్చిన ‘మిస్టర్‌’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచిన ఈ జంట 2023లోకుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

ఇదీ చదవండి: డిసి’ సక్సెస్‌.. లోకేశ్‌, అనిరుధ్‌లకు ఖరీదైన గిఫ్ట్స్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement