‘డిసీ’ బ్లాక్‌బస్టర్ విజయంతో చిత్ర బృందంపై నిర్మాత కళానిధి మారన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌లను అభినందించారు. వీరికి సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ మేరకు కార్ల తాళాలను స్వయంగా అందజేసి తన ఆనందాన్ని పంచుకున్నారు.

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపింది. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం సన్ నెక్ట్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో అలరిస్తోంది.
Mr. Kalanithi Maran congratulated and presented the keys to brand-new BMW cars to Arun Matheswaran, Lokesh Kanagaraj and Anirudh, for the success of Blockbuster #DC! 💥@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #DCMegaBlockbuster pic.twitter.com/QOgmCA6ZqI
— Sun Pictures (@sunpictures) September 10, 2026


