సమంత కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ.. తన ప్రగ్నెన్సీకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ అభిమానులతో పంచుకుంటూ ఏదో సందర్భంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’తో మాట్లాడిన సమంత.. తన ఎంగేజ్‌మెంట్ రింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సమంత ధరించిన ఎంగేజ్‌మెంట్ రింగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?
‘ఈ రింగ్ ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం రాజ్ చూసుకున్నాడు. ఆయన్నే అడగాలి. రాజ్ ప్రపోజ్ చేసిన సమయంలోనే తొలిసారి ఆ రింగ్‌ను చూశాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఉంగరాన్ని గ్రీస్‌కు చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ రూపొందించారని మాత్రం నాకు తెలుసు. అని సమంత తెలిపింది. అయితే దీనిని ఏథెన్స్‌కు చెందిన థియోడోరోస్ సవోపౌలోస్ రూపొందించినట్లు తెలుస్తోంది. సమంత రింగ్ ధరించిన ఫొటోను ఆయన కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.
విలువ ఎంతంటే..
అయితే ఇప్పుడు ఆ రింగ్ ఖరీదు ఎంత ఉంటుందనే చర్చ. లొజెంజ్ కట్ డైమండ్‌తో రూపొందించిన ఈ రింగ్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందట. ఇందులో ఎనిమిది పోర్ట్రెయిట్ కట్ వజ్రాలు పూల రేకుల మాదిరిగా అమర్చినట్లు తెలుస్తోంది. అయితే పోర్ట్రెయిట్ కట్ వజ్రాలకు భారతీయ ఆభరణాల చరిత్రతోనూ మంచి అనుబంధం ఉంది. మొఘల్ కాలంలో ఈ తరహా డిజైన్లు దొరికేవని చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి అరుదైన డిజైన్లను రూపొందించేవారి సంఖ్య కూడా తక్కువేనట. కాగా సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
ఇదీ చదవండి: హీరోయిన్ ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక


