breaking news
engagment
-
వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్ ఇంత ఖరీదా..? డిజైనర్ ఎవరంటే.?
సమంత కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇస్తూ.. తన ప్రగ్నెన్సీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానులతో పంచుకుంటూ ఏదో సందర్భంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’తో మాట్లాడిన సమంత.. తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సమంత ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?‘ఈ రింగ్ ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం రాజ్ చూసుకున్నాడు. ఆయన్నే అడగాలి. రాజ్ ప్రపోజ్ చేసిన సమయంలోనే తొలిసారి ఆ రింగ్‌ను చూశాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఉంగరాన్ని గ్రీస్‌కు చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ రూపొందించారని మాత్రం నాకు తెలుసు. అని సమంత తెలిపింది. అయితే దీనిని ఏథెన్స్కు చెందిన థియోడోరోస్ సవోపౌలోస్ రూపొందించినట్లు తెలుస్తోంది. సమంత రింగ్ ధరించిన ఫొటోను ఆయన కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.విలువ ఎంతంటే..అయితే ఇప్పుడు ఆ రింగ్ ఖరీదు ఎంత ఉంటుందనే చర్చ. లొజెంజ్ కట్ డైమండ్‌తో రూపొందించిన ఈ రింగ్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందట. ఇందులో ఎనిమిది పోర్ట్రెయిట్ కట్ వజ్రాలు పూల రేకుల మాదిరిగా అమర్చినట్లు తెలుస్తోంది. అయితే పోర్ట్రెయిట్ కట్ వజ్రాలకు భారతీయ ఆభరణాల చరిత్రతోనూ మంచి అనుబంధం ఉంది. మొఘల్ కాలంలో ఈ తరహా డిజైన్లు దొరికేవని చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి అరుదైన డిజైన్లను రూపొందించేవారి సంఖ్య కూడా తక్కువేనట. కాగా సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇదీ చదవండి: హీరోయిన్ ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక -
పెళ్లి పీటలెక్కనున్న స్టార్ నటి.. వరుడు ఎవరో తెలుసా..?
తమిళ నటి నివేదితా సతీశ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నిశ్చితార్థం అయిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం.’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. (మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను)ఈ వేడుకలో నివేదితా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. నివేదితా షేర్ చేసిన ఈ ఫొటోలకు గాయత్రి శంకర్, ఆండ్రియా జెర్మియా, సంయుక్తా, ఎస్తర్ అనిల్, ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.హలో సినిమాతో..అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన హలో (2017) సినిమా ద్వారా నివేదితా సతీష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె హీరోయిన్ ప్రియా స్నేహితురాలు కవితగా కనిపించారు. ధనుష్ హీరోగా నటించిన ఈ తమిళ పీరియాడిక్ యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్(2024). తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది ఇందులో ఆమె 'తేన్పాసియార్' (యాక్షన్ రోల్) అనే కీలక పాత్రను పోషించారు. దీంతో పాటు పలు తమిళ చిత్రాలు, ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటించారు. (రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్) -
కరూర్ తొక్కిసలాట మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి
తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారి శోకం వర్ణనానీతం. విగతజీవులుగా మారిన తమ బిడ్డలను చూసి కన్నీరమున్నీరుగా విలవిస్తున్న దృశ్యాలు ఎవరికైనా కంట తడిపెట్టించక మానవు. ఈ క్రమంలో గుండె పగిలే మరోహదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కరూర్ తొక్కిసలాటల కాబోయే జంట కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. హీరో విజయ్ ఫ్యాన్‌గా భావిస్తున్న ఆకాశ్ (24) మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఉంది. కానీ అంతలోనే అనంత లోకాలకు చేరాడు. ఆకాశ్ కు ఇటీవల గోకులశ్రీ ( 24)తో ఇటివల ఎంగేజ్మెంట్ అయింది. త్వరలో ఇద్దరికీ వివాహం జరగనుంది. ఆకాశ్ తన కాబోయే భార్యతో కలిసి గోకులశ్రీ ఎంతో ఉత్సాహంగాతన అభిమాన హీరో సభకు వెళ్లాడు. కానీ విధి మరోలా ఉంది. శనివారం విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభ, అక్కడ జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని ఆకాశ్, గోకులశ్రీ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.ఈ ఘోరం ప్రమాదం విజయ్ Xలో స్పందించారు: “నా హృదయం ముక్కలైంది, నేను భరించలేని, వివరించలేని బాధ దుఃఖంలో ఉన్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. టీవీకే తరఫున మృతులకు రూ.20 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.2లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ విషాదంపై తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి సాధ్యమైన అన్ని వైద్య సహాయం అందించాలని ఆదేశించారు, తొక్కిసలాటపై విచారణ కమిషన్‌ను ఆదేశించారు.A woman lost her 5-year-old child in the Karur tragedy. Disturbing video shows her crying inconsolably. #Karur #KarurVijaySpeech #KarurTragedy https://t.co/YRskL4GoDr pic.twitter.com/cVOLJcN4cX— Vani Mehrotra (@vani_mehrotra) September 28, 2025 > కాగా కాగా తమిళ హీరో విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది ఆహారం లేదా నీరు లేకుండా ఎండలో గంటల తరబడి వేచి ఉండటంతో ఉద్రిక్తత్తకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో 39 మంది చనిపోగా, మరో కొంతమంది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మ్యూజిక్ సిట్టింగ్స్ లో ‘ఎంగేజ్మెంట్’
‘రాజు బొనగాని’ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘ఎంగేజ్మెంట్’. బొనగాని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో హీరోయిన్లుగా కొత్తవాళ్లను పరిచయం చేస్తూ... తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్టు పనులు ముగించుకుని... ప్రి ప్రొడక్షన్ వర్క్స్ తోపాటు... దిలీప్ బండారి సంగీత సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి మన్నం వెంకట్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దర్శకనిర్మాత రాజు బొనగాని మాట్లాడుతూ... "పెళ్లి చూపులతో మొదలై... "ఎంగేజ్మెంట్"తో శుభం కార్డు పడే ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ "ఎంగేజ్మెంట్". యూనివర్సల్ అప్పీల్ కలిగిన సబ్జెక్ట్ కాబట్టి... తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. -
ఘనంగా సీనియర్ నటి శరణ్య కూతురి ఎంగేజ్మెంట్..
-
వైవా హర్ష నిశ్చితార్థం ఫొటోలు
-
డిసెంబర్ 7న వరుణ్ నిశ్చితార్థం
చాలా రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలకు యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. త్వరలోనే తన ప్రియురాలు వితికా షేరుతో నిశితార్థానికి రెడీ అవుతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించేశాడు. సోమవారం తన ట్విట్టర్ పేజ్‌పై వితికా షేరుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన వరుణ్.. డిసెంబర్ 7వ తేదీన నిశ్చితార్థం జరగనున్నట్టు ప్రకటించాడు. హ్యాపీడేస్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, తరువాత కొత్త బంగారులోకం సినిమాతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్‌కు దగ్గరవుతున్నాడనుకున్న సమయంలో వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయాడు. ప్రస్తుతం ఉదయం, ట్విస్ట్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనతో 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించిన వితికా షేరును పెళ్లాడనున్నాడు. Getting ENGAGED on DECEMBER 7th to the LOVE of my LIFE @IamVithikaSheru :-) #HappyDays God Bless!!! pic.twitter.com/ucf9AMHuqM — Varun Sandesh (@iamvarunsandesh) November 30, 2015


