
తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారి శోకం వర్ణనానీతం. విగతజీవులుగా మారిన తమ బిడ్డలను చూసి కన్నీరమున్నీరుగా విలవిస్తున్న దృశ్యాలు ఎవరికైనా కంట తడిపెట్టించక మానవు. ఈ క్రమంలో గుండె పగిలే మరోహదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కరూర్ తొక్కిసలాటల కాబోయే జంట కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది.
హీరో విజయ్ ఫ్యాన్‌గా భావిస్తున్న ఆకాశ్ (24) మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఉంది. కానీ అంతలోనే అనంత లోకాలకు చేరాడు. ఆకాశ్ కు ఇటీవల గోకులశ్రీ ( 24)తో ఇటివల ఎంగేజ్‌మెంట్ అయింది. త్వరలో ఇద్దరికీ వివాహం జరగనుంది. ఆకాశ్ తన కాబోయే భార్యతో కలిసి గోకులశ్రీ ఎంతో ఉత్సాహంగాతన అభిమాన హీరో సభకు వెళ్లాడు. కానీ విధి మరోలా ఉంది. శనివారం విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభ, అక్కడ జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని ఆకాశ్, గోకులశ్రీ ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.
ఈ ఘోరం ప్రమాదం విజయ్ Xలో స్పందించారు: “నా హృదయం ముక్కలైంది, నేను భరించలేని, వివరించలేని బాధ దుఃఖంలో ఉన్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. టీవీకే తరఫున మృతులకు రూ.20 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.2లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ విషాదంపై తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి సాధ్యమైన అన్ని వైద్య సహాయం అందించాలని ఆదేశించారు, తొక్కిసలాటపై విచారణ కమిషన్‌ను ఆదేశించారు.
A woman lost her 5-year-old child in the Karur tragedy. Disturbing video shows her crying inconsolably. #Karur #KarurVijaySpeech #KarurTragedy https://t.co/YRskL4GoDr pic.twitter.com/cVOLJcN4cX
— Vani Mehrotra (@vani_mehrotra) September 28, 2025
> కాగా కాగా తమిళ హీరో విజయ్ తన టీవీకే పార్టీ తరఫున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వేలాది మంది ఆహారం లేదా నీరు లేకుండా ఎండలో గంటల తరబడి వేచి ఉండటంతో ఉద్రిక్తత్తకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో 39 మంది చనిపోగా, మరో కొంతమంది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.