బరువు తగ్గేందుకు రకరకాల డైట్‌లు, వ్యాయామాల తోపాటు..డిటాక్స్ డ్రింక్‌లు తోడైతే మరింత త్వరితగతిన బరువు తగ్గుతాం. ఇవి మన ఇంట్లోదొరికే వాటితోనే సులభంగా తయరు చేసుకోవచ్చు కడా. కఠినమైన డైట్, వర్కౌట్ల కంటే..ఇలాంటి సింపుల్ చిట్కాలతో మరింత సులభంగా బరువు తగ్గిపోగలమని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. తేలిక పాటి వర్కౌట్లు, చక్కటి ఆరోగ్యకరమైన డైట్ తోపాటు ఇలాంటి కొలెస్ట్రాల్‌ని తగ్గించే అద్భతమైన పానీయాలు త్వరితగతిన వెయిట్‌లాస్ అవ్వడంలో బాగా హెల్ప్‌అవుతాయట. నిశబ్దంగా వొంట్లో కొవ్వుని తగ్గించే ఆ గట్ రీసెంట్ డ్రింక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
ఫిట్‌నెస్ కోచ్ నేహా పరిహార్ కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గారట. అందుకు ఈ గట్ రీసెట్ డ్రింక్ బాగా హెల్ప్ అయ్యిందట. ఇది మన ఇంట్లో దొరికే దేశీ వస్తువులతో తయారు చేసే సాధారణ దేశీ మిశ్రమ టానిక్‌గా చెబుతున్నారు నేహా.
అందుకు కావాలసినవి:
అజ్వైన్ (వాము): 1 టేబుల్ స్పూన్
సోంపు : 2 టేబుల్ స్పూన్లు
మెంతి గింజలు (మెంతి గింజలు): 1 టేబుల్ స్పూన్
తాజాగా తురిమిన అల్లం: 1 టేబుల్ స్పూన్
నీరు: 2.5 లీటర్ల
తయారీ విధానం:
నీటిలో వాము, సొంపు, మెంతి గింజలు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మంటను కాస్త తగ్గించిన అప్పుడే తురిమిన తాజా అల్లం వేసి కొద్దిసేపు మరగనివ్వండి. ఆ తర్వాత వడకట్టి దానికి కొంచెం నిమ్మకాయ రసం జోడించి సేవించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా 14 రోజుల చేసి చూస్తే..తప్పక మంచి ఫలితాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఫిట్‌నెస్ కోచ్ నేహా.
కలిగే లాభాలు..
నేహా ప్రకారం,కొలెస్ట్రాల్‌ని ఎలా కరిగిస్తుందంటే..
జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
అదనపు నీటి నిలుపుదలను బయటకు పంపిచేయడంలో సహాయపడుతుంది
ఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది.
జీవక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది
పేగు మంటను శాంతపరుస్తుంది
చెడుకొలెస్ట్రాల్‌ని బయటకు పంపించేస్తుంది
చివరగా ఈ పానీయం బరువు తగ్గేలా చేయదు, మన శరీర వ్యవస్థకు మద్దతు ఇచ్చి..ఆయా వ్యవస్థల పనితీరుని సమర్థవంతంగా ఉంచి..బరువుతగ్గేందుకు దారితీస్తుందని చెబుతోంది నేహా. దీంతోపాటు సమతుల్య భోజనం, తేలికపాటి వ్యాయామాలు, వేళ్లకు నిద్ర తోడైతే బరువు తగ్గడం మరింత సులభమని చెబుతోంది ఫిట్‌నెస్ కోచ్ నేహా. ఈ చిన్నపాటి సాధారణ మార్పులు చోటుచేసుకుంటే సత్ఫలితాలను త్వరితగతిన పొందుగలమని చెప్పుకొచ్చింది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సూచనలు సలహాలు పాటించటం ఉత్తమం.
(చదవండి: సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్‌లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..! అంత ఖరీదా..?)


