చిన్న చిన్న పనులు కూడా మానవత్వానికి అద్దం పడతాయని చెప్పకనే చెప్పిన ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ‘వేడుకలలో మనం కూడా ఇలాగే చేయాలి’ అనిపించేలా చేసింది. సాధారణంగా వివాహ వేడుకల్లో ఎవరి బిజీలో వారు ఉంటారు. వేరే వ్యక్తుల గురించి పట్టించుకోరు. ఇక ఈ వివాహం విషయానికి వస్తే....క్యాటరింగ్ స్టాఫ్ పెళ్లికి వచ్చిన వారికి రుచికరమై పదార్థాలు వడ్డించారు. విందు కార్యక్రమం పూర్తయింది.
ఈలోపు వధూవరులు...
‘క్యాటరింగ్ స్టాఫ్ ఎక్కడా?’ అంటూ వచ్చారు. ‘వడ్డించడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా?’ అని వారు భయపడ్డారు. ‘సర్, ఎనీ ΄ప్రాలాబమ్?’ అని వినయంగా అడిగారు. ‘ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంతకీ మీరు భోజనం చేశారా?’ అని అడిగారు.
‘లేదు’ అని చెప్పడంతో వధూవరులు వారికి ఆప్యాయంగా ఆహారపదార్థాలు వడ్డించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. వధూవరులకు పాన్‌ఇండియా నుంచి ప్రశంసలు వచ్చాయి.


