ఇటీవల కాలంలో లేఆఫ్స్ కామన్‌గా మారాయి. ఇంతకుమునుపు కేవలం ఐటీ రంగానికే పరిమితమవ్వగా, ఇప్పుడు అన్నిరంగాలకు ఇది పాకింది. దీని ప్రభావంతో ఉద్యోగుల్లో అభద్రతా, ఏ క్షణం ఏ జరుగుతోందన్న ఒత్తిడి ఎక్కువయ్యాయి. తమ సహోద్యోగులు ఉద్యోగాలు పోయాయంటేనే..మనకేం జరుగుతోందో అనే ఆందోళన. ఇది ఉద్యోగం సంపాదించడాని కంటే భయంకరమైన టెన్షన్. సింపుల్‌గా చెప్పాలంటే 40 ఏళ్లు వస్తే ఆ ఉద్యోగి జాబ్ ఉంటుందా లేదా అన్నంత గుబులు మదిలో మెదులుతోంది. అలాగని టెన్షన్‌తో బతకలేం కదా..మరి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసి..మళ్లీ మన ట్రాక్‌లోకి రావాలో ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి మాటల్లో తెలుసుకుందామా..!.
అతడే 47 ఏళ్ల మాజీ టెక్ ప్రొఫెషనల్ హేమంత్ విర్మానీ. ఈ భారత సంతతి వ్యక్తి తన అనుభవాన్ని వివరిస్తూ..లేఆప్‌ని ధైర్యంగా ఫేస్ చేయక తప్పదని అంటున్నాడు. తన గురించి వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు హేమంత్. "నేను యూఎస్‌లోని అమెజాన్‌లో సుమారు పదకొండున్నరేళ్లుగా సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశాను. సరిగ్గా 2023 నుంచి మా కంపెనీలో తొలగింపులు చేపట్టడం చూశాను. నా బృందంలోని సభ్యలను తొలగించడం చాలా దగ్గరగా చూశాను.
అది ఎంత కష్టంగా ఉంటుందో కూడా తెలుసు. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి నాకు వస్తుందని ఆ రోజు నాకు తెలియలేదు. సరిగ్గా అక్టోబర్ 2025 అర్థరాత్రి నన్ను తొలగిస్తున్నట్లు మెయిల్ వచ్చాక గానీ అవగతం కాలేదు. ఆ క్షణం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యా..కళ్లముందే పరిస్థితి తలకిందులైనట్లుగా అనిపించింది. ఏం చేయాలో పాలుపోలేదు. చాలా రోజుల వరకు ఉద్యోగం పోగొట్టుకున్నా అనే బాధలోనే ఉండిపోయా. అయితే ఆ రోజు నా ఉద్యోగం పోయిన వెంటనే నా మేజనర్‌తో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడాను. ఆయన నాతో చాలా సానుకూలంగా, మానవీయంగా మాట్లాడారు, పైగా నా స్కిల్స్‌ని అభినందించారు కూడా.
అంతేగాదు ఆ తదుపరి మరసటి రోజు ధైర్యంగా ఉన్నానా? లేదా? అని నా పాత మేనేజర్ కాఫీషాప్ వద్దకు వచ్చి కలుస్తుండేవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగినే లేఆఫ్ అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ వాళ్లంతా సానుకూలంగా వ్యవహరిస్తున్నా..హేమంత్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్నట్లుగా..నిరాశ నిస్ప్రుహలకు గురవ్వుతుండేవాడు. ఈ పరిస్థితిలో తన కూతురు ఎలా ఉంటుందా అని పరిశీలించగా..ఆ అమ్మాయే నాకు గొప్ప పాఠం నేర్పిందని చెబుతున్నాడు హేమంత్.
పరిస్థితులు మారినప్పుడూ వాటిని అంగీకరిస్తూ..ఆమె తన ఖర్చులను సర్దుబాటు చేసుకున్న తీరు..ఎప్పటికీ ఇలానే ఉండపోమన్న ఆమె నమ్మకం..మళ్లీ నన్ను భుజం తట్టి నిలబడేలా చేశాయి. అప్పుడే తెలిసింది..లేఆఫ్‌తో..అప్పటి వరకు నేను వదిలేసిన ప్రతి పనులను తిరిగి చేయడం మొదలుపెట్టా. ముఖ్యంగా నా కూతురు ప్రాజెక్ట్ వర్క్స్‌లో హెల్ప్ చేయడం దగ్గర నుంచి ఆరోగ్యంపై కేర్ తీసుకోవడం వరకు అన్నిటిపై ఫోకస్ పెట్టా. అలాగే ఇక తదుపరి నేనేం చేయాలనే దిశగా ఏఐ స్కిల్స్‌పై దృష్టిసారించాను.
అలాగే మళ్లీ పుంజుకోవడానికి మార్గాలేంటో అన్వేషించడం ప్రారంభించా. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేసినప్పుడూ..అలా ఉండిపోకూడదు..మరింత బలంగా పైకి ఎగరడం ఎలాగో ఆలోచించాలి. అలాగే ఆ లేఆఫ్‌ని మన అభ్యున్నతికి వరంగా మార్చుకోవాలని తెలుసుకున్నా" అంటూ..తన అనుభవాన్ని అత్యద్భుతంగా వివరించాడు హేమంత్. అతని పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..గొప్ప స్ఫూర్తిని నింపావు బాస్ అని పోస్ట్‌లు వెల్లువెత్తాయి.
(చదవండి: టీనేజ్ వయసులో చదువుకి డుమ్మా..! కట్‌చేస్తే..)


