Vizianagaram
-
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు. టాటా ఏమైనా పేద సంస్థా? పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్‌తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తోటపల్లి కాలువగట్లపై కంకర తవ్వకాలు
బొబ్బిలి రూరల్: అక్రమ సంపాదనకు అలవాటు పడిన కంకర దొంగలు తోటపల్లి కాలువ గట్లపై ఉండే కంకరకుప్పలపై కన్నేశారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో ఇష్టానుసారం గట్లను తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. మరో వైపు గట్లను చదును చేస్తూ ఆక్రమణలకు పూనుకుంటున్నారు. మండలంలోని పిరిడి గ్రామం వద్ద నున్న తోటపల్లి కాలువకు ఇరువైపులా కంకర గట్లను తవ్వి కంకరను తరలించుకు పోతున్నారు. కాలువ నిర్మా ణానికి రైతుల నుంచి భూసమీకరణ చేయగా ప్రభుత్వం వారందరికీ నష్టపరిహారం చెల్లించింది. కానీ కొంతమంది కంకరను తవ్వి ఆ భూములను ఆక్రమించే పనిలోపడ్డారు. గ్రామానికి కూతవేటు దూరంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ వెళ్తుంది. గతంలో కాలువ నిర్మాణానికి అక్కడ కాలువ పొడవునా తవ్విన కంకర, మట్టిని అక్కడే పోగు చేసి కుప్పలుగా వేశారు. దీనిపై కన్నేసిన కంకర దొంగలు రాత్రిళ్లు పెద్ద ఎత్తున కంకరను తవ్వి తరలించుకుపోతున్నారు.దీనిపై అటు నీటిపారుదలశాఖ, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువ వెంబడి ఉన్న అనేక చోట్ల కంకరను తవ్వి తోలుకుపోగా ఉన్నదాన్నైనా కాపాడేందుకు, ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
భూసార పరీక్షలతో సత్ఫలితాలు
● విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగం ● క్రమేపీ సారం కోల్పోతున్న భూమి ● జిల్లాలో 28,425 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం ● ఇప్పటివరకు 17,373 నమూనాల సేకరణ రైతులకు అవగాహన భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.భూసార పరీక్షలు ఫలితాలను బట్టి రైతులు ఏ పంటలు వేసుకోవాలో తెలియజేస్తున్నాం. సాగుకు ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి. ఫలితాలు ఎలా వస్తాయే అంశాలను వివరిస్తున్నాం. – హరికృష్ణ, మండల వ్యవసాయ అధికారి భోగాపురంపూసపాటిరేగ: వ్యవసాయ సాగులో ఇష్టానుసారం రసాయన ఎరువులు వినియోగించడంతో భూములు సారం కోల్పోయి చౌడుభూములుగా మారుతున్నాయి. భూములు సారం కోల్పోవడంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలుసుకోకుండా ఎరువులు వేసినా ఆశించిన ఫలితం ఉండదు. భూమి ఆరోగ్యం తగిన పోషకాలతో ఉన్నప్పుడే సత్ఫలితాలు సాధ్యం. ఎంత మోతాదులో ఎరువులు వేయాలో తెలుసుకోవాలన్నా భూసార పరీక్షలు తప్పనిసరి. భూసార పరీక్షల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటే వ్యయభారాన్ని రైతులు తగ్గించుకోవచ్చు. పంటల్లో అధిక దిగుబడులు వచ్చినట్లయితే రైతులు ఆనందంగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దిగుబడి ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, పెట్టుబడి ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలపై రైతులు అవగాహన చేసుకోవాలి. నేలను ఆరోగ్యవంతంగా ఉంచడం, భూమిలో ఉన్న పోషకాలు, ఏ పంట సాగు చేయాలి, ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనే అంశాలను రైతులు తెలుసుకోవాలని చెబుతున్నారు. ఖరీఫ్ సాగును దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు మట్టి నమూనాల సేకరణలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాలో 28,425 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కాగా నేటివరకు 17,373 మట్టి నమూనాల సేకరణ జరిగింది, నెలిమర్ల నియోజకవర్గంలో 3450 మట్టి నమూనాల సేకరణను లక్ష్యంగా పెట్టుకుని 2438 వరకు సేకరించారు. కమతాల మధ్యలో 15 సెంటీమీటర్లు లోతులో గుంత తవ్వి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రతి ఆరున్నర ఎకరాలుకు ఒక నమూనా తీసుకుంటున్నారు. ఎనిమిది లేదా పదిచోట్ల సేకరించిన మట్టిని ఒక గోనె సంచిపై వేసి కలుపుతారు. దానిని నాలుగు భాగాలుగా చేసి ఎదురెదురుగా ఉన్న భాగాలను కలిపి అందులో అరకిలో చొప్పున మట్టిని సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపుతారు. అనంతరం భూసార పరీక్షలు ఫలితాల కార్డులును రైతులకు అందజేస్తారు. జీపీఎస్ ఆధారంగా సేకరించిన చిత్రాలను యాప్‌లో అప్లోడ్ చేసి ఫలితాల స్వభావాన్ని రైతుల సెల్‌ఫోన్‌కు తెలుగులో పంపిస్తారు. ప్రారంభమైన నమూనాల సేకరణ జూన్ నుంచి ఖరీఫ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలోగానే మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. భూమిలో ప్రధాన పోషకాలైన నత్రజని, బాస్వరం, పొటాష్ పరిమాణాల్లో మార్పులు గుర్తించవచ్చు. ఫలితాలు వచ్చిన తరువాత భూమిలో ఏ సూక్ష్మధాతువుల లోపం ఉందో తెలుసుకుని రైతులు ఎరువులు వినియోగించాలని, లేకుంటే నేల సారం కోల్పోయి దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందాం
రేగిడి: సమష్టి పోరాటంతో సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటుకు రైతులంతా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. రైతులకు అన్నివేళలా అండగా నిలుస్తామని, రైతుల హక్కులు కాపాడేందుకు పోరాటాలకు వెనుకాడబోమని స్పష్టంచేశారు. రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద కర్మాగారం పరిధిలోని 8 మండలాల చెరకు రైతులు మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ మాట్లాడుతూ ఈ ఏడాది చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు కర్మాగారం దృష్టిసారించకపోవడం, కొంత మంది సిబ్బందిని తొలగించడం, ప్రాంతీయ కార్యాలయాలను ఎత్తివేయడం, ప్లాంటేషన్‌ను నిర్వహించకపోవడం వంటి పరిస్థితులు కర్మాగారం మనుగడపై రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. చక్కెర కర్మాగారం ప్రారంభ సమయం 1995లో 75వేల మెట్రిక్ టన్నులు చెరకు క్రషింగ్ జరిగేదని, అనంతరం అంచెలంచెలుగా 8 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి పెరిగిందన్నారు. ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 50వేల మంది రైతులు, ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని వెల్లడించారు. అప్పట్లో రైతులకు అవసరమైన అన్ని రకాల రాయితీలను ఇవ్వడంతో పాటు భరోసా కల్పించడం వల్లే చెరకును సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపారన్నారు. కాలక్రమేణా రాయితీలు ఎత్తేయడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లిందన్నారు. కర్మాగార యాజమాన్యం కూడా క్రషింగ్‌ను పక్కనపెట్టి ఇతర విభాగాలపై మొగ్గుచూపుతోందన్నారు. కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కర్మాగారం నుంచే జేఏసీ కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే జేఏసీ నిర్వహణకు అవసరమైన భవన సౌకర్యం సొంతంగా కల్పిస్తామని భరోసానిచ్చారు. చెరుకు సాగు విస్తరణకు రైతులు మొగ్గుచూపాలని కోరారు. వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ వేలాది రైతు కుటుంబాలకు జీవనాధారమైన చక్కెర కర్మాగారాన్ని కాపాడుకునేందుకు సమష్టిగా ఉద్యమిద్దామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెంనాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం జెడ్పీటీసీ బండి నర్శింహులు, లావేటి రాజగోపాలనాయుడు, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, కిమిడి సూరపునాయుడు, కిమిడి సీతబాబు, కెంబూరు వెంకటేశ్వరరావు, చింత సంగంనాయుడు, నారు జనార్ధనరావు, సాసుబిల్లి జగన్నాధనాయుడు, వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు. కర్మాగారం కొనసాగకపోతే నష్టపోతాం ప్రస్తుతం నేను 15 ఎకరాల్లో చెరకును పండిస్తున్నాను. ఈ తరుణంలో కర్మాగారం రైతులకు ప్రోత్సా హం అందించకపోతే నష్టపోతాం. కర్మాగారం కొనసాగింపును విస్మ రిస్తే ఉద్యమిస్తాం. చక్కెర కర్మాగారం కొనసాగింపునకు జేఏసీతో ప్రణాళికలు రూపొందిస్తాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తాం. పార్టీలకు అతీతంగా నేతలను కలుస్తాం. – నక్క శ్రీనివాసరావు, రైతు, బొద్దాం, రాజాం మండలం పార్టీలకు అతీతంగా రైతులు ముందుకు రావాలి జేఏసీ ఏర్పాటుతో యాజమాన్యంతో చర్చలకు అవకాశం చెరకు రైతులు సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
ఐటీఐలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
● వచ్చే నెల 24వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలివిజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ విద్యాలయాల్లో ఆగస్టు–2025 సెషన్‌కు సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్ టీవీగిరి మంగళవారం ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు తొలుత ‘ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా నేరుగా సదరు వెబ్సైట్లో సూచనల ప్రకారం మే 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తరువాత వచ్చిన యూనిక్ నంబర్‌తో మే 26వ తేదీ వరకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రాసెస్ చేయించుకోవాలి. అభ్యర్థి ఏ జిల్లాలో అయినా దరఖాస్తు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. లాగిన్‌లో ఎస్ఎస్సీ హాల్‌టికెట్ నంబర్ టైప్ చేయగానే అభ్యర్థి వివరాలను చూపిస్తుంది. దరఖాస్తు సబ్మిట్ చేసిన వెంటనే, జనరేట్ అయ్యే యూనిక్ నంబర్‌తో కూడిన ప్రింటవుట్‌తో ఏదైనా జిల్లాలో గల ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్స్‌ను అభ్యర్థులు వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్నవారు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హులవుతారు. వెల్డర్, ప్లంబర్లకు 8వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మిగతా అన్ని ట్రేడ్లకు దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి పాసై ఉండాలని అభ్యర్థులు గమనించాలని ప్రిన్సిపాల్ సూచించారు. రిజిస్ట్రేషన్ సమయంలో గమనించాల్సిన అంశాలు ● అభ్యర్థి ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో మాత్రమే ఐటీఐ వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ● ఒకసారి అడ్మిషన్ పొందిన అభ్యర్ధి అదే మొబైల్ నంబర్‌ను స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయ్యేంత వరకు అభ్యర్థి వద్దే ఉండాలి. ● అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్ పదవ తరగతి సర్టిఫికెట్ ఆధార్ కార్డులో ఒకే విధంగా ఉండాలి. ● పూర్తి వివరాల కోసం ఫోన్ 9849118075, 9849944654, 7780658035 నంబర్లలో సంప్రదించాలి. -
వ్యాన్ బోల్తా: పలువురికి గాయాలు
గజపతినగరం: మండలకేంద్రంలోని ఆంజనేయ స్వామి అలయం సమీపంలో జాతీయ రహదారి వద్ద వ్యాన్ బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలలోకి వెళ్తే.. బొబ్బిలి నుంచి విజయనగరం మొక్కజొన్న లోడుతో ప్రయాణిస్తున్న వ్యాన్ గజపతినగరం మండల కేంద్రంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆ వ్యాన్‌లో పద్మనాభం మండలం అయినాడకు చెందిన ఎం.రాము, జి.శివ, డి.మురళీకృష్ణ, బి.సాయిలకు గాయాలయ్యాయి. వారిలో రాము పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన విజయనగం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మిగతావారికి గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు అందజేసి బుధవారం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పీజీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి
విజయనగరం అర్బన్: వివిధస్థాయిల్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అందే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశించారు. లబ్ధిదారులు సంతృప్తిచెందే విధంగా ఈ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత గడుపులోగానే సమస్యలకు పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు. మంత్రుల కార్యాలయాలకు జిల్లా నుంచి అందిన దరఖాస్తులపై కలెక్టర్ తమ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. మొత్తం 10 వినతులను ఈ సందర్భంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులను తన చాంబర్‌కు రప్పించి, వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వారి దగ్గరున్న సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఆ ఫిర్యాదులకు సంబంఽధించి రెవెన్యూ అధికారులపై ఈ సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి అక్కడికక్కడే పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ మురళి, డ్వామా పీడీ శారదాదేవి, సహకార అధికారి రమేష్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ ఆశయ్య, ఆర్డీఓ కీర్తి, తహసిల్దార్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడిగా కిల్లి సత్యనారాయణ
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన కిల్లి సత్యనారాయణను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా నియోజకవర్గ పరిశీలకులు పనిచేస్తారు. పార్టీలో సీనియర్ నేతగా, సుదీర్ఘకాలం సర్పంచ్‌గా, రెండు పర్యాయాలు ఎంపీపీగా సత్యనారాయణ పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వెబ్సైట్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా విజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో 29 ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్సైట్లో పొందుపరచినట్టు డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే మే నెల 3వ తేదీలోగా డీసీహెచ్ఎస్ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. బాల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలి ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో 32 బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, వీటిలో ప్రభుత్వ ఆధ్వర్వంలో ఐదు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 27 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తులు అందినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. జువైనల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం కేంద్రాల ఏర్పాటుకు డీపీఓ కన్వీనర్‌గా ఉన్న ఇన్స్పెక్షన్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. వాటిని కలెక్టర్ చాంబర్లో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా స్థాయి కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, ఏఎస్పీ సౌమ్యలత, ఐడీసీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, తదితరులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఏటీఎల్ సమ్మర్ బూట్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణవిజయనగరం అర్బన్: వచ్చే నెల 1 నుంచి 3వ తేదీవరకు ధర్మవరం ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించనున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) బూట్ క్యాంప్ పోస్టర్‌ను డీఈఓ యూ.మాణిక్యనాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాంప్‌లో అందించే శిక్షణ వివరాలపై జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్యాంపులో విద్యార్థులకు డిజైనింగ్, క్రిటికల్ థింకింగ్, డ్రోన్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ, ఆర్డినోకోడింగ్, రోబోటిక్ ఆటోమెషీన్ టెక్నాలజీలపై శిక్షణ ఇస్తామన్నారు. ఽకార్యక్రమంలో డీప్యూటీ ఈఓ కె.వెంకటరమణ, హబ్ ఏటీఎల్ ఇన్చార్జ్ వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని మిమ్స్ డ్రైవర్ మృతినెల్లిమర్ల: పట్టణంలోని మిమ్స్ సమీపంలో పాత రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని, మిమ్స్ డ్రైవర్ మృతి చెందాడు. మిమ్స్ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బి.సూర్యనారాయణ(45) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడి ట్రాక్ దాటుతుండగా విజయనగరం వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక అమ్మాయి ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అత్యుత్సాహమేనా..?పార్వతీపురంటౌన్: ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ ఫొటోలతో పాటూ సీఎం, డివ్యూటీ సీఎం ఫొటోలు పెట్టుకోవడంలో తప్పులేదు. అయితే పార్వతీపురం మున్సివల్ కార్యాలయం కమిషనర్ చాంబర్లో మాత్రం ఎమ్మెల్యే ఫొటోను పెట్టి అధికారి అయి ఉండి అత్యుత్సాహం చూపుతున్నారా..? అభిమానం చూపుతున్నారా అని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎమ్మెల్యే వద్ద సానుభూతి పొందేందుకే ఇలా చేస్తున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రయోజనకరం● జేసీ సేతు మాధవన్ విజయనగరం ఫోర్ట్: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మంగళవారం డ్రోన్ టెక్నాలజీపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాంకేతిక పెరుగుతోందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడంలో ఖర్చులను తగ్గించడంలో సమర్థతను పెంచడంలో డ్రోన్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు. కిసాన్ డ్రోన్ ఎఫ్ఎంబీ గ్రూపుల ఖాతాల ప్రారంభం, రుణమంజూరుకు సంబంధించి పక్రియను వేగవంతం చేయాలని సూచించారు. -
సంగీత సాహిత్య సమలంకృతే..!
● 106 ఏళ్ల పండగకు సర్వం సిద ్ధం ● సంగీత కళాశాల తొలి అధ్యక్షుడిగా ఆదిభట్ల ● ఉత్సవానికి తరలిరావాలని ప్రిన్సిపాల్ పిలుపు ● నేడు మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల 106వ వార్షికోత్సవంసంగీతాభిమానులందరూ తరలిరండి కళాశాల 106వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకం. కళాశాల అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ అభినందనలు. ఎందరో మహానుభావులు నడయాడిన ప్రాంతమిది. కళాశాలలో పరికరాల మరమ్మతులకు రూ.2.50 లక్షలు ఎమ్మెల్యే అందజేశారు. – కేవీఎల్ఎన్.శాస్త్రి, ప్రిన్సిపాల్, ఎఫ్ఏసీ, మహారాజా సంగీత, నృత్యకళాశాల, విజయనగరం 1953లో ప్రభుత్వ ఆధీనంలోకి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1953లో కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. నాటి నుంచి మహారాజా ప్రభుత్వ సంగీత, నత్యకళాశాలగా రూపాంతరం చెందింది. అప్పుడు కేవలం ఐదు విభాగాలు గాత్రం, వీణ, వయోలిన్, మదంగం, భరతనాట్యం విభాగాలతో ప్రారంభమైంది. తర్వాత స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో కొంతకాలం కొనసాగి, ప్రస్తుతం 1980 నుంచి కల్చరల్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్లో కొనసాగుతోంది.విజయనగరం టౌన్: సంగీత సరస్వతి 106వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. సంగీతానికి అధిక ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో విజయనగర రాజులు 1919 ఫిబ్రవరి 5న సంగీత కళాశాలకు అంకురార్పణ చేశారు. ఎందరో మేధావులు, మహానుభావులు కళాశాలలో విద్యనేర్చుకుని ప్రపంచ దేశాల్లో వారి ప్రతిభను ప్రదర్శించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కళామతల్లి ఒడిలో స్వరాలు నేర్చుకున్న ఎందరో గానగంధర్వులు కలియదిరిగిన సంగీత సరస్వతికి వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అబీవ్మెంట్ అవార్డు 2023లోనే వరించింది. 106వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
జామి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ వకుల్‌జిందల్ విజయనగరం సబ్ డివిజన్ పరిధి జామి పీఎస్‌ను మంగళవారం సందర్శించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం సీడీ ఫైల్స్, జనరల్ డైరీ, సెంట్రీ, బీట్ బుక్‌లను ఎస్పీ తనిఖీ చేశారు. తొలుత రిసెప్షన్ కౌంటర్‌ను ముందుగా తనిఖీ చేసి ఆర్సీలో సిబ్బంది నిర్వహిస్తున్న విధుల సమయాన్ని స్టేషన్‌హౌస్ ఆఫీసర్ జనార్దన్‌ను అడిగారు. స్టేషన్ మొత్తం పరిశీలించి సీసీ కెమెరాలపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎక్కువగా సీసీ కెమెరాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలని, అందుకు తగిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గ్రామ సందర్శన తరచూ చేయాలని పీస్ కమిటీలతో సమావేశం కావాలని చెప్పారు. తనిఖీల్లో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్, ఎస్.కోట సీఐ అప్పలనాయుడు, జామి ఎస్సై వీరజనార్దన్, ఎస్బీ సీఐ లీలారావు ఉన్నారు. -
సైనిక్ స్కూల్లో ఆటల సందడి
విజయనగరం రూరల్: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ పుట్‌బాల్ టోర్నీలో భాగంగా జిల్లాలోని కోరుకొండ సైనిక్ పాఠశాలలో ‘ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఇంట్రా గ్రూప్ ఆఫ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్–2025–26 సోమవారం ప్రారంభమైంది. పోటీలను కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి ప్రారంభించారు. ఈ పోటీల్లో అంబికాపూర్, భువనేశ్వర్, సంబల్పూర్, కోరుకొండ సైనిక్ స్కూల్స్ నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ కిరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్క్వాడ్రన్ లీడర్ అతుల్ జాన్ థామస్ పాల్గొన్నారు. టోర్నీలో బాలురు, బాలికలకు సబ్–జూనియర్, జూనియర్ విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా ఇంట్రా సైనిక్ ఫుట్‌బాల్ టోర్నీ– 2025 ప్రారంభం -
● ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్ష
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక, ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల పాటు చేపట్టాలన్న యూనియన్ పిలుపు మేరకు విజయనగరం డిపో ఎదుట సోమవారం దీక్ష శిబిరం నిర్వహించారు. రాష్ట్రంలోని 129 డిపోల ఎదుట రిలేనిరాహార దీక్షలు చేపట్టినట్టు ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీరాఫిల్ తెలిపారు. ఉద్యోగుల 38 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1/2019 సర్క్యులర్ అమలు, సీలింగ్లేని వైద్య విధానం, పెంచిన నైట్ అలవెన్స్‌ల చెల్లింపు, మహిళా ఉద్యోగులకు మూడురోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరారు. రిలే నిరాహార దీక్షలో బి.రమణమ్మ, సరిత, బి.ఎల్.వి.కుమారి, జేజేరావు, శివాజీ, కేఈరావు, ఎం.శంకరరావు పాల్గొనగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సుజాత, ఎల్డీప్రసాద్, డిపో కార్యవర్గం, బి.రామారావు, కె.చంద్రమౌళి మద్దతు తెలిపారు. – విజయనగరం అర్బన్ -
నియామక పత్రాలు అందజేత
విజయనగరం రూరల్: మండల పరిషత్ కార్యాలయాల్లో పరిపాలన అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులుగా విధులు నిర్వహిస్తూ, ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన చాంబర్లో సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయనగరం మండల పరిపాలనాధికారిగా పనిచేస్తున్న జి.వెంకట రావుకు ఇదే మండలంలో ఎంపీడీఓగా నియ మించారు. సీతానగరం మండల పరిషత్ ఏవోగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ పాచిపెంట ఎంపీడీఓగా, గుమ్మలక్ష్మీపురం విస్తరణ అధికారి కె.ధర్మారావు జియ్యమ్మవలస ఎంపీడీఓగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఇదెక్కడి అన్యాయం?
విజయనగరం ఫోర్ట్/విజయనగరం అర్బన్: వేట నిషేధ భృతి సకాలంలో అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఏడాది భృతి ఎగ్గొట్టడం తగదంటూ పలువురు మత్స్యకారుల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. మత్స్యకారులకు అన్యాయం చేయడం తగదన్నారు. 505 మంది అర్హులను అనర్హులుగా ప్రకటించడంపై గగ్గోలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మత్స్యకార భృతిలో భాగంగా జిల్లాలోని లబ్ధిదారులకు విడుదలైన నిధుల నమూనా చెక్కు ను విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విడుదలచేశారు. జిల్లాకు చెందిన 3,796 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున రూ.7.59 కోట్లు మంజూరైనట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, అదితిగజపతి, ఎమ్మెల్సీ రఘురాజు, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏడాది భృతి చెల్లించకపోతే ఎలా? మంత్రిని ప్రశ్నించిన మత్స్యకారులు -
● ప్రైవేటు ఫిట్నెస్ కేంద్రం ఎత్తేయాలి
ఆటో కార్మికులకు గుదిబండగా మారిన ప్రైవేటు ఫిట్నెస్ కేంద్రాన్ని ఎత్తివేయాలని, మోటారు కార్మికులకు ఉరితాడుగా మారిన మోటారు కార్మికుల వ్యతిరేక చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయనగరం పాతబస్టాండ్ వద్ద మేడే పోస్టర్లను యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నీలాపు అప్పలరాజురెడ్డి, రెడ్డి నారాయణరావు, ఆటోవాలాలు సోమవారం ఆవిష్కరించారు. మేడే రోజున ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగతామన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చెన్నా ధర్మా, బాలి సన్యాసిరావు, గేదెల నారాయణరావు, తర్లాడ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్ -
ఎం.ఎల్.సి రోగులకు తిప్పలు..!
‘విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామానికి చెందిన కె.సూర్యనారాయణ అనే వ్యక్తిపై భూ తగాదాలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దాడిచేశాడు. ఆయనకు దంతాలు, మొఖంపై గాయాలయ్యాయి. రెండు రోజుల కిందట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. కొట్లాట కేసు కావడంతో ఎం.ఎల్.సిగా నమోదుచేసి చికిత్స కోసం డెంటల్ విభాగానికి పంపించారు. ఎం.ఎల్.సి కేసు కావడంతో గాయం ఎంత అయిందనే సర్టిఫికెట్ సంబంధిత వైద్యుడు ఇవ్వాల్సి ఉంటుంది. వైద్యుడు డెంటల్ ఎక్స్‌రే తీసుకుని రావాలని ఎక్స్‌రే విభాగానికి పంపించారు. డెంటల్ ఎక్స్‌రేకు సంబంధించి ఫిల్మ్‌లు లేకపోవడంతో ఇక్కడ ఎక్స్‌రే తీయలేమని చెప్పడంతో అతడిని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. చేసేది లేక కేజీహెచ్‌కు వెళ్లారు.’ విజయనగరం ఫోర్ట్: జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎం.ఎల్.సి (మెడికో లీగల్ కేస్)కి సంబంధించిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందక ఆవేదన చెందుతున్నారు. మెడికో లీగల్ కేస్లలో డెంటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు అందుబాటులో లేకపోవడం, ఏజ్ సర్టిఫికెట్ మంజూరుకాకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీకి సంబంధించి సంబంధిత రోగికి తగిలిన దెబ్బలు వల్ల ఎంత గాయం అయిందన్నది నిర్ధారించేందుకు ఎక్స్‌రే అవసరం. వైద్యులు ఏ ప్రాతిపదికన రోగికి సర్టిఫికెట్ ఇచ్చారని అడిగితే దానికి సాక్ష్యంగా కోర్టులో ఎక్స్‌రే చూపించాల్సి ఉంటుంది. వయసు నిర్ధారణలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఆ సదుపాయం లేకపోవడంతో కేజీహెచ్‌కు వెళ్లాల్సి వస్తోంది. ప్రతిపాదనలు పంపించాం ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్‌రే విభాగం అందుబాటులో ఉంది. ఫిల్మ్‌లు ఇచ్చే ఎక్స్‌రే విభాగం లేదు. దీనికోసం ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి డెంటల్ ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేక ఇబ్బందులు కోర్టులో సాక్ష్యం చూపించడానికి ఎక్స్‌రే ఫిల్మ్‌లు అవసరం ఏజ్ సర్టిఫికెట్ కోసం వచ్చే వారిదీ అదే పరిస్థితి ఫిల్మ్‌లు లేక కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్న వైనం -
వెబ్సైట్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఐదు కేటగిరీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరచినట్టు ప్రభు త్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెట్వర్క్ ఆడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ప్రొగ్రామర్, ఈఎంటీ, స్టోర్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంఽధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో అభ్యంతరాలుంటే ఈ నెల 29, మే 3, 5, 6 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోగా తెలియజేయాలన్నారు. ప్రతిభావంతులకు సత్కారం విజయనగరం అర్బన్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన చాంబర్లో సోమవారం సత్కరించారు. సంగారెడ్డి వివేక్ (జెడ్పీ హైస్కూల్ గర్భాం), కొయ్య హరీష్ (ఏపీమోడల్ స్కూల్, భోగాపురం), లావేటి మెహర్ రేష్మ (బీసీ సంక్షేమ గురుకులం, నెల్లిమర్ల), చోడవరపు శివ (బీసీ సంక్షేమ గురుకులం కారాడ), పెదిరెడ్ల భాగ్యశ్రీ (జెడ్పీ హైస్కూల్, కొట్యాడ), శంబంగి కలవల లక్ష్మి (జెడ్పీహెచ్ఎస్, పక్కి), తాడేల రేవంత్ (జెడ్పీ హెచ్ఎస్, భైరిపురం), సెనేట మోహన్ (బీసీ సంక్షేమ గురుకులం, కారాడ), పైల యశోద (జెడ్పీ హెచ్ఎస్, జిన్నాం) విద్యార్థులను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రచించిన ఒక విజేత ఆత్మకథ, డాక్టర్ బీవీపట్టాభిరాం రచించిన ‘కష్టపడి చదవొద్దు–ఇష్టపడి చదవండి’పుస్తకాలిచ్చి అభినందించారు. విద్యార్థుల తల్లి దండ్రులను దుశ్శాలువలతో సత్కరించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించిన జామి, వంగర, గజపతినగరం, ఎస్.కోట కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ యు. మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్షణ ఏపీసీ డాక్టర్ ఏ.రామారావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ టీ.సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్యం, కళలను ప్రోత్సహిస్తాం
విజయనగరం టౌన్: సాహిత్యం, కళలకు ఎల్లప్పుడూ వెన్నుదన్ను గా నిలుస్తానని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు రాసిన పాడుదుమా.. స్వేచ్ఛాగీతం పుస్తకాన్ని సాహితీ వేత్తలతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు అయిన గురజాడ, ద్వారం, ఘంటసాల, సుశీలమ్మ వంటి ఉద్దండులు నడయాడిన ఈ నేల ఎంతో ప్రశస్తమై నదని కొనియాడారు. సాహిత్యాన్ని, కళలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తమ వంతుగా వీటిని నిరంత రం ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని హామీనిచ్చారు. గంటేడ రాసిన పుస్తకా న్ని జెడ్పీ పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో విద్యార్థుల కు అందుబాటులో ఉంచుతామన్నారు. ఉత్తరాంధ్ర కవులు, కళాకారులకు సముచిత గౌరవాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. సాహితీ స్రవంతి నిర్వహకులు చీకటి దివాకర్, చంద్రికారాణిల ఆధ్వర్యంలో వారి కుమారుడు రవితేజ, కోడలు వైష్ణవిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్నంగా సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, కవి డాక్టర్ డివిజి.శంకరరావు, ప్రముఖ కవులు గంటేడ గౌరు నాయుడు, అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరా వు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు డాక్టర్ గేదెల సన్యాసమ్మ, కవులు, కళాకారులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాడుదుమా.. స్వేచ్ఛాగీతం పుస్తకావిష్కరణ -
విజయనగరం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఆటాడుకుందాం రా..! వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత సేదదీరుతుంటారు. –8లో‘చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన రమణ అనే ఉపాధ్యాయుడు చీపురుపల్లిలో సొంత ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ అనుమతుల కోసం మేజర్ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు రూ.లక్షా 4 వేలు చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పడంతో కంగుతిన్న ఆయన కాగితాలు తీసుకుని వెనక్కి వచ్చేశాడు.’ ‘చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురానికి చెందిన కలిశెట్టి రాము సర్వే నంబర్ 9/3, 4లోని సొంత స్థలంలో 2003లో ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో మేజర్ పంచాయతీకి బిల్డింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి బిల్డింగ్ అనుమతులు పొందారు. ఆయన మరో రూ.1,27,050 చెల్లించాలని కొద్దిరోజుల కిందట పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో అతికించారు. ఆయనకు ఇప్పుడు నోటీసు పంపారు.’ ‘చీపురుపల్లి పట్టణంలోని లావేరు రోడ్డు ప్రాంతానికి చెందిన గుసిడి సత్యం సర్వే నంబర్ 73/1లోని సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు 2023లోనే మేజర్ పంచాయతీ కార్యాలయం నుంచి నిబంధనల ప్రకారం బిల్డింగ్ అనుమతులు పొందారు. మరో రూ.1,47,840 ఫీజు చెల్లించాలంటూ పంచాయతీ పంచాయతీ కార్యాలయం వద్ద నోటీస్ బోర్డులో ఆయన పేరు పెట్టారు. నోటీసులు కూడా పంపించారు.’ చందనోత్సవానికి ఆర్టీసీ అదనపు సర్వీసులు విజయనగరం అర్బన్: సింహాచలంలో ఈ నెల 30వ తేదీన జరిగే వరాహలక్ష్మీ స్వామి చందనోత్సవం సందర్శన కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి ప్రయాణికుల రద్దీ ఉన్నంత వరకు దాదా పు 15 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరికొన్ని సర్వీసులను నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురుకులం ప్రవేశ పరీక్ష ప్రశాంతం నెల్లిమర్ల: పట్టణంలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. బాలికల పాఠశాల కేంద్రంలో 201 మందికిగాను 180 మంది, మత్స్యకార బాలుర పాఠశాలలో 44 మందికి 38 మంది హాజరయ్యారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ కేబీబీ రావు, కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ● తాగునీటి కష్టాలు గుమ్మలక్ష్మీపురం మండలం రాయగడ జమ్ము పంచాయతీ చినరావికోన గ్రామ గిరిజనులు కొద్ది రోజులుగా తాగునీటి కష్టాలు పడుతున్నారు. గ్రామంలో 76 కుటుంబాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు గెడ్డ చెలమకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన గ్రావటీ వాటర్ స్కీం నుంచి కొన్నాళ్లుగా నీటి సరఫరా నిలిచిపోయింది. వేసవి ఎండల ధాటికి గెడ్డ చలమలోని నీరు ఇంకిపోవడంతో వాటర్ స్కీం నుంచి నీరు ఆగిపోయింది. దీంతో గ్రామానికి దిగువన ఉన్న పాములగీసాడ సమీపంలోని గెడ్డ చెలమ వద్దకు కొండ దిగి నీటిని సేకరించి మళ్లీ కొండపైకి వెళ్తారు. గిరిజనులు తాగునీటి కష్టాలు ఇటు పాలకులకుగాని, అధికారులకుగాని పట్టడం లేదు. – గుమ్మలక్ష్మీపురం తక్షణమే డబ్బు చెల్లించాలి 2023, 2024 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించుకు న్న వారినీ కూటమి ప్రభుత్వం వదిలి పెట్టడం లేదు. అప్పట్లో వారు పంచాయతీ కార్యాలయం నుంచి నిబంధనలు ప్రకారం అనుమతులు పొందినప్పటికీ 14 శాతం ఫీజు చెల్లించాలంటూ 13 మంది పేర్లును మేజర్ పంచాయతీ కార్యాలయం నోటీ సు బోర్డులో పెట్టారు. అప్పట్లో చెల్లించిన ఫీజు చాలదని, కచ్చితంగా 14 శాతం చెల్లించాల్సిందేనని, 13 మంది కలిపి రూ. 11,56,455లు చెల్లించా లని అధికారులు స్పష్టం చేశారు. మేజర్ పంచాయతీ కార్యాలయం చీపురుపల్లి: సొంతింటి భాగ్యం పేదలకే కాదు.. సొంత స్థలం ఉన్నవారికీ ఇక భారమే. రూ.లక్షల ఫీజు చెల్లించనిదే మేజర్ పంచాయతీలో ఇంటిప్లాన్ అనుమతులు మంజూరు కావడం లేదు. సామాన్యుల సంగతి పక్కన పెడితే ఆ ఫీజులను చూసి ఉద్యోగు లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఒకేసారి మార్కె ట్ విలువకు 14 శాతం ఫీజు చెల్లించాలన్న కూటమి ప్రభుత్వ నిబంధనలను చూసి చిర్రెత్తిపోతున్నారు. సంపద సృష్టి అంటూ సీఎం చంద్రబాబు ప్రజలనెత్తిన భారం వేస్తున్నారని విమర్శిస్తున్నారు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జీవో ఎంఎస్ నంబర్ 12ను విడుదల చేశారు. తరువాత కాలంలో ఆ జీవో అమలు కాలేదు. తాజాగా మళ్లీ అధికా రంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయాలని, ప్రజల నుంచి ముక్కుపిండి 14 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇల్లు నిర్మించుకునే వారికి అదనపు భారం తప్పడం లేదు. ఇదెక్కడి అన్యాయం.. ఇల్లు నిర్మించుకునే వారు ఆ ఇంటి స్థలానికి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు చెల్లించాలన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏకంగా రూ.లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. చీపురుపల్లిలోని ఓ ప్రాంతంలో సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.6 లక్షలు ఉంటే 200 గజాలు స్థలం కలిగిన వ్యక్తి ఇంటిని నిర్మించుకునేందుకు బిల్డింగ్ అను మతులు కోసం వెళ్తే దాదాపు రూ.లక్షా25 వేలు ఫీజు చెల్లించుకోవాల్సి వస్తోందని ఓ నిర్మాణదారు వాపోయారు. గతంలో బిల్లింగ్ ప్లాన్ అనుమతి ఫీజుల కోసం రూ.10 వేలు లోపు ఖర్చేయ్యేదని, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం రూ.లక్షల్లో ఖర్చు చే యాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్జిల్లాకు కొత్తగా 1,521 పింఛన్లు మంజూరు పార్వతీపురం టౌన్: జిల్లాలో కొత్తగా 1,521 మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛను మంజూరైనట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ మధ్య కాలంలో వితంతువులైన వారికి జీవిత భాగస్వామి పింఛన్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓను విడుదల చేసిందని ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు తెలిపారు. మంజూరైన కొత్త పింఛన్లను రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా మే 1వ తేదీ ఉదయం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేదల సేవలో భాగంగా జిల్లాలో 1,39,752 మందికి రూ.59.72 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. వీటికి అదనంగా 1,521 మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున మొత్తం పింఛన్లకు సరిపడా నిధులను ముందుగానే సిద్ధం చేసుకొని మే 1వ తేదీ ఉదయం 10గంటల్లోగా శత శాతం పింఛన్లు పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా మంజూరైన కొత్త పింఛన్లు బలిజిపేట మండలంలో 69 మందికి, భామినిలో 86, గరుగుబిల్లిలో 77, గుమ్మక్ష్మీపురం 63, కొమరాడలో 66, జియ్యమ్మవలసలో 122, కురుపాంలో 51, మక్కువలో 131, పాచిపెంటలో 88, పాలకొండలో 77, పాలకొండ(అర్బన్)లో 47, పార్వతీపురం 126, పార్వతీపురం (అర్బన్)లో 60, సాలూరులో 75, సాలూరు (అర్బన్)లో 70, సీతంపేటలో 69, సీతానగరంలో 117, వీరఘట్టంలో 127 వెరసి మొత్తం 1,521 కొత్త పింఛన్లు మంజూరైనట్టు కలెక్టర్ వివరించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. చెల్లించాల్సిందే.. బిల్డింగ్ ప్లాన్ అనుమతులు కోసం మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు చెల్లించాల్సిందే. పంచాయతీల అభివృద్ధికి ఆదాయం అవసరం. 2023, 2024 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించుకున్న 13 మందికి మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు చెల్లించాలని ఆడిట్ విభాగం నుంచి నోటీసులు అందాయి. పంచాయతీ కార్యాలయం వద్ద వివరాలు ఉంచాం. 13 మంది కలిపి రూ.11,56,456 లక్షలు చెల్లించాల్సి ఉంది. – ఝాన్సీ, మేజర్ పంచాయతీ అధికారి, చీపురుపల్లి -
గరివిడిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు
● మే 9, 10, 11 తేదీల్లో నిర్వహణచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీరాం హైస్కూల్ ఆవరణలో మే నెల 9, 10, 11 తేదీల్లో కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు వాకాడ గోపి, అసోషియేషన్ ప్రతినిధులు తెలిపారు. గరివిడిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒకప్పుడు గరివిడి ప్రాంతం నాటిక, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా ఉండేదన్నారు. ఫేకర్ సంస్థ ప్రారంభమైన 1957 నుంచి మంచి నాటిక కార్యక్రమాలు జరిగేవని, తదానంతరం ఈ నాటిక, సాంస్కృతిక పోటీలు కనుమరుగయ్యాయని అన్నారు. గరివిడిలో మళ్లీ సాంస్కృతిక కళారంగ నాటిక పోటీలను ప్రారంభించి ప్రతీ ఏడాది కొనసాగించాలనే ఆలోచనతో గొప్ప ప్రయత్నంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఈ ఆహ్వాన నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని తెలి పారు. మూడు రోజుల పాటు ఎనిమిది నాటికలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆహ్వాన నాటిక పోటీలకు సినిమా ప్రముఖులను తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆహ్వాన నాటిక పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. నాటికలు ఇవే... మే 9వ తేదీన హైదరాబాద్‌కు చెందిన విశ్వశాంతి కల్చరల్ అసోషియేషన్ వారితో ’స్వేచ్ఛ’, మిత్ర క్రియేషన్స్ వారితో ‘ఇది రహదారి కాదు ’నాటిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 10వ తేదీన గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారితో ‘చిగురు మేఘం’, హైదరాబాద్‌కు చెందిన కళాంజలి వారితో ‘రైతే రాజు’ నాటిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 11వ తేదీన బొరివంకు చెందిన శర్వాని గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం వారితో ‘కొత్త పరిమళం’, కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి వారితో ‘చీకటి పువ్వు’, విశాఖపట్నంకు చెందిన సౌజన్య కళాస్రవంతి వారితో ‘దేవరాగం’ నాటిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. -
బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు సిద్ధమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లిమర్ల మండలం చంపావతి నది తీరప్రాంతంలో నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వారికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది సీ్త్ర, పురుషులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చేనెల 2 నుంచి 4 వరకు కాకినాడలో జరగనున్న 12వ రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎంపిక పోటీలను జిల్లా కబడ్డీ అసోసియేసన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నడిపేన లక్ష్మణరావు, ట్రెజరర్ శివ, వ్యాయామ ఉపాధ్యాయులు తౌడు బాబు, శ్రీను, గోపాల్, భాను, తిరుపతిరావు, ఆదిబాబు, వెంకటరావులు పర్యవేక్షించారు. వచ్చే నెల 2 నుంచి కాకినాడలో రాష్ట్రస్థాయి పోటీలు -
ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
పార్వతీపురంటౌన్: ఏపీయూడబ్ల్యూజేఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో నియమించారు. పూర్తిస్థాయి జిల్లా కమిటీ ఏర్పాటుతో పాటు కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజక వర్గాల కార్యవర్గాల ఏర్పాటుకు కమిటీ తీర్మానించింది. అంతవరకు అడహాక్ కమిటీ అధ్యక్షుడిగా డీఎస్ఆర్ పట్నాయక్, కార్యదర్శిగా కేవీ నారాయణరావు నాగు, ఉపాధ్యక్షుడిగా తలేనవీన్, కోశాధికారిగా అంటిపేట సోమశేఖర్, సంయుక్త కార్యదర్శిగా సాలాపు ప్రసాద్‌తో పాటు పదిమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి నియోజకవర్గాల్లో పర్యటించి కమిటీల ఏర్పాటుతోపాటు సంఘాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు. -
పెరుగుతున్న పాముకాటు బాధితులు
విజయనగరం ఫోర్ట్: గుర్ల మండలం బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (17) కొద్ది రోజుల క్రితం ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఫోన్ చేస్తుండగా పాము కాటువేసింది . కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. ● గంట్యాడ మండలం బురదపాడుకు చెందిన చుక్క రాంబాబు (39) పొలంలో గడ్డి చేనుకు నీరు పెట్టడానికి వెళ్లగా పాము కాటువేసింది. కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ● జిల్లాలో అనేక మంది పాముకాటు బారిన పడుతున్నారు. వారిలో కొంతమంది మత్యువాతపడుతుండగా మరికొంతమంది బతికి బట్టకడుతున్నారు. వ్యవసాయ పనులకు రైతులు వెళ్లేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు, పంటపొలాలకు నీరు కట్టేందుకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయాల్లోనే ఎక్కువగా పాముకాటు బారిన పడే ప్రమాదం ఉంది. పంట పొలాల్లోనే ఎక్కువ: సాధారణంగా నిర్జీవ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడే పాములు ఆహారం కోసం జనారణ్యంలోకి చొచ్చుకువస్తున్నాయి. చెత్తా చెదారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పాడుబడిన భవన శిథిలాలు, పూరిగుడిసెలు, గుబురుగా ఉండే పంటచేలల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఎలుకలను, కప్పలను ఎక్కువగా ఇష్టపడే పాములు పొలాల్లో రాత్రి పూట సంచరిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలాల్లోనూ, ఆరుబయట నిద్రిస్తున్న వారు ఎక్కువగా పాముకాటుకు గరవుతున్నారు. వేసవిలోనూ తప్పని బెడద సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా పాముల బెడద ఉంటుంది. కానీ ప్రస్తుతం వేసవికాలంలో కూడా పాముల బెడద ఎక్కువగా ఉంటోంది. పాములపై అవగాహన ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు పాములపై కనీస అవగాహన అవసరమని వైద్యులు అంటున్నారు. కనిపించే పాములన్నీ విషపూరితం కాదు. కట్లపాము, తాచుపాము, రక్తపింజర, నాగుపాము వంటి 15 శాతం పాములతోనే ముప్పు ఉంది. సరైన సమయంలో చికిత్స పొందితే విషసర్పం కరిచినా ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు ధైర్యం చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పనసరి రాత్రి వేళ పొలాలకు వెళ్లేటప్పుడు చెప్పులు, టార్చిలైట్లుతో పాటు శబ్దం చేసే పరికరాలు వెంట తీసుకుని వెళ్లడం మంచిది. పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడికి గురైతే బీపీ పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పసర వైద్యం, మంత్రాలు అంటూ అలసత్వం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. పాముకాటు వేయగానే పైభాగం గుడ్డతో కట్టాలి. కాటు వేసిన భాగాన్ని కొత్త బ్లేడుతో గాటు వేసి రక్తాన్ని నోటితో లాగేయాలి. నోటి గాయాలు ఉన్న వారు ఇలా చేయకూడదు. ప్రాథమిక వైద్యం అందించిన వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. కరిచిన పాము ఏదో తెలుసుకుంటే చికిత్స అందించడం సులభమవుతుంది. పంటపొలాలు, ఆరుబయట నిద్రస్తున్న వారికే ప్రమాదం సకాలంలో ఆస్పత్రికి చేర్చితే కాపాడవచ్చంటున్న వైద్యులుసకాలంలో ఆస్పత్రికి తీసుకువస్తే.. పాము కాటు బాధితులను సకాలంలో ఆస్పత్రికి తీసుకురాగలిగితే ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. సీహెచ్సీల్లోనూ, ఏరియా ఆస్పత్రుల్లోనూ, ఏఎస్వీ(యాంటీ స్నేక్ వీనమ్) అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ -
భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం
విజయనగరం టౌన్: స్థానిక ఫూల్‌బాగ్ లక్ష్మీగణపతికాలనీలో కొలువైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం వద్ద కొలువైన 60 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయవ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి ఉపాసకుడు కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో పాలాభిషేకం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కనులపండువగా నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బేతా కృష్ణారావు, కార్యదర్శి ఇసరపు శ్రీనివాస గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు దువ్వు శ్రీనివాసరావు, బెహరా కూర్మారా వు, దన్నాన రామమూర్తి, అర్చకులు శ్రీనివాసశర్మ, సభ్యులు సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.60 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న భక్తులు -
ఇరువర్గాలపై కొట్లాట కేసు నమోదు
సంతకవిటి: మండలంలోని గుళ్లసీతారాంపురం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన కొట్లాటలో ఇరువర్గాల వారి పరస్పర ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేశామని ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం 15 రోజుల క్రితం పక్కపక్క పొలాలు గల ముగడ సూర్యనారాయణ పొలం గట్టుపై ఉన్న చెట్టును కొల్లి మురళి కొట్టడంతో ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరిగి శనివారం రాత్రి కొట్లాట జరిగింది. ఈ కొట్లాటలో 9 మందికి గాయాలవడంతో ముగడ గణేష్ వైజాగ్ కేజీహెచ్‌లో, ముగడ సూర్యనారాయణ, ముగడ రామకృష్ణ, ముగడ సత్యంలు, కె.బంగార్రాజులు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో, కొల్లి శ్రీను, కొల్లి పవన్, కొల్లి మణికంఠలు రాజాంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. ఆదివారం ముగడ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మురకు 13 మందిపై, కొల్లి పవన్‌కుమార్ ఇచ్చిన ఫి ర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపా రు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న బాధితులను సంతకవిటి ఎస్సైతో కలిసి రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు పరామర్శించి కొ ట్లాటకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
ఐపీఎల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలి
విజయనగరం: ఐపీఎల్ స్థాయిలో ఆడేవిధంగా జిల్లాలోని క్రీడాకారులు తయారు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్, రాష్ట్ర స్థాయిలో ఆడి,విజేతలుగా నిలిచిన క్రీడాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి మైదానం, క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులుగా తయారుకావాలని పిలుపునిచ్చారు. ఐపీఎల్లో మన జిల్లా క్రీడాకారులు ఆడాలని, తన కోరిక నెరవేర్చాలని పిలుపునిచ్చారు. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. క్రీడా మైదానాలు చిల్లర కొట్టు మాదిరిగా తయారయ్యాయని అసహనం వ్యక్తం చేశారు. ఉన్న క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని మంచి భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ చరిత్ర కలిగిన మైదానం విజ్జి క్రీడా మైదానం పేరు నిలబెట్టే విధంగా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రాంబాబు, మాజీ క్రీడాకారులు, అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తోండ్రంగి విద్యార్థిని
చీపురుపల్లిరూరల్(గరివిడి): దేశ రాజధాని న్యూడిల్లీలో జరగనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీలకు తోండ్రంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రౌతు జాహ్నవి ఎంపికై ంది. మే 1 నుంచి 5 వరకు జరగనున్న 68వ స్కూల్‌గేమ్స్ పోటీల్లో అండర్–19 విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున జాహ్నవి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ క్రీడాకారిణి జనవరిలో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సాధించింది. ఈ సందర్భంగా జాహ్నవిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.రమేష్‌కుమార్, పీడీ సత్యనారాయణ అభినందించారు. -
ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!
పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. -
‘ఉపాధి’ కల్పనలో వెనుకబాటు
విజయనగరం ఫోర్ట్: కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాల అమలుతో పాటు ఉపాధిహామీ పనుల కల్పనలోనూ వెనుకంజలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా వేతనదారులకు చేతినిండా పనికల్పించడంలో శ్రద్ధ చూపడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. గతేడాది కంటే ఈ ఏడాది వేలాది పనిదినాలు తగ్గడం, వేతనాలు నెలలు తరబడి జమ కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరుతో ఉపాధిహామీ పనులకు వెళ్లేందుకు వేతనదారులు ఆసక్తి చూపడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 3.84 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 6.08 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల పనిదినాల లక్ష్యం 1.33 కోట్లు. ఏప్రిల్ 19 నాటికి 9.21 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. గత ఏడాది ఏప్రిల్ 19 నాటికి 10.01 లక్షల పనిదినాలు కల్పించారు. గతేడాది కంటే ఈ ఏడాది 80 వేల పని దినాలు తగ్గిపోయాయి. ఇదే విషయంపై డ్వామా పీడీ ఎస్.శారదాదేవి స్పందిస్తూ పనిదినాల కల్పనలో కాస్త వెనుకబాటు ఉందని, జూన్ నాటికి లక్ష్యం చేరుకుంటామని చెప్పారు. గతేడాది కంటే తగ్గిన పనిదినాల కల్పన గతేడాది ఏప్రిల్ 19 నాటికి 10.01 లక్షల పనిదినాల కల్పన ఈ ఏడాది 9.21లక్షలు మాత్రమే.. గతేడాది కంటే 80 వేలు తక్కువ -
వితంతువులందరికీ పింఛన్లు ఇవ్వాలి
సాలూరు: వితంతు పింఛన్ల మంజూరు విషయంలో కూటమి ప్రభుత్వం వ్యత్యాసాలు చూపిస్తుందని, మానవత్వంతో ఆలోచించి అర్హులైన వారందరికీ వెంటనే మంజూరు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర కోరారు. పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో శనివారం మాట్లాడారు. డిసెంబరు 2023 నుంచి అక్టోబరు 2024 మధ్యలో భర్తకు పింఛన్ అందుతూ మృతి చెందిన సదరు పింఛన్‌దారుల భార్యలు మాత్రమే పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. 60 సంవత్సరాల వయసు దాటి పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే వారి భార్యలకు పింఛన్ అందిస్తామంటున్నారని, అంత కంటే చిన్న వయసులో ఉన్న భర్తలు మరణించిన భార్యలకు వితంతు పింఛన్ మంజూరు చేయకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కనీసం వారికి అమ్మకు వందనం, చేయూత వంటి పథకాలు కూడా నేడు రావడం లేదని వారి కుటుంబ పోషణ ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి అర్హులైన వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
డీసీపీయూ పోస్టులపై.. కూటమి నేతల కన్ను
● డీసీపీయూ, బాలసదన్ల్లో ఉద్యోగాలు తమ వారికే ఇవ్వాలని అధికారులపై ఒత్తిళ్లు ● 23 పోస్టులకు ఇటీవల ఇంటర్వ్యూల నిర్వాహణ విజయనగరం ఫోర్ట్: కూటమి నేతలు అధికారం ముసుగులో అధికారులపై దర్పం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, పోస్టులను తమ వారికే కట్టబెట్టాలని అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్టు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మినీ గోకులాలు, యంత్ర పరికరాలు అధికార పార్టీకి చెందిన వారికే ఇచ్చారనే గుసగుసలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులు సర్పంచ్‌లు చేపట్టాల్సి ఉన్నప్పతికీ సర్పంచ్‌లతో సంబంధం లేకుండా వెండర్ విధానంలో కూటమికి చెందిన నేతలకు కట్టబెట్టి వారితో పనులు చేయిస్తున్నారు. తాజాగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలను కూడా తమ వారికే ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అధికారులకు ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. 23 పోస్టులకు నోటిఫికేషన్ సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో డీసీపీయూ (జిల్లా బాలల సంరక్షణ విబాగం), బాలసదన్ల్లో ఖాళీల భర్తీకి 2024 సెప్టెంబర్ 4వ తేదీన 23 పోస్టులకు నోటిఫికేషన్‌ను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం 640 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీసీపీయూ పోస్టు కోసం 129 మంది, డీఈఓ పోస్టు కోసం 218 మంది, సోషల్ వర్కర్ పోస్టు కోసం 55 మంది, స్టోర్ కీపర్ పోస్టు కోసం 107 మంది, కుక్ పోస్టు కోసం 36 మంది, హౌస్ కీపర్ పోస్టు కోసం 12 మంది, నైట్ వాచ్మెన్ పోస్టు కోసం 17 మంది, ఎడ్యుకేటర్ పోస్టు కోసం 28 మంది, మ్యూజిక్ టీచర్ పోస్టు కోసం 25 మంది, యోగా టీచర్ పోస్టు కోసం 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. మా వారికే ఇచ్చేయండి.. 23 పోస్టులకు ఇటీవల సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే ఈ పోస్టులపై కన్నేసిన కూటమి నేతలు తమ వారికి ఆ పోస్టులను కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువు ఒకరు ఓ జాబితాను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులకు పంపించి వారికే పోస్టులు కట్టబెట్టాలని హుకుం జారీ చేసినట్టు విమర్శిలున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు ఇచ్చిన జాబితాలో అర్హత లేని అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. అర్హత లేకపోయినా అధికార పార్టీకి చెందిన వారు కాబట్టి ఆ పోస్టులను కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి చేస్తుండడంతో ఈ పోస్టుల భర్తీ చేసేది ఎలా? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.పారదర్శకంగానే.. డీసీపీయూ, బాలసదన్ పోస్టుల భర్తీకి సంబంధించి సిఫార్సులు అనేవి నా దృష్టికి రాలేదు. పోస్టులను నిబంధనల ప్రకారం పారదర్శకంగానే భర్తీ చేస్తాం. – రుక్సానా సుల్తానా బేగం, పీడీ, ఐసీడీఎస్ -
ఆ కేసులు న్యాయస్థానంలో నిలవవు
● మంత్రివి మాయమాటలు.. ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి గోదావరి జలాలను జిల్లాకు తీసుకొస్తామంటూ ప్రజలను అమాయకులను చేసి మాయమాటలు చెబుతున్నారు. పోలవరం స్టోరేజీ కెపాసిటీ ఎత్తు తగ్గించి ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?. ఇప్పటి వరకు బడ్జెట్లో కనీసం నిధులు కేటాయించారా..? అధికారులతో సమీక్ష నిర్వహించారా...? భూసేకరణ పూర్తి చేశారా...? ఇవేమి జరగకుండా జిల్లా ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. తారక రామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పిన మంత్రి మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. తోటపల్లి మిగులు పనులు పూర్తి చేసి చివరి ఆయకట్ట వరకు నీరు అందించే దిశగా కృషి చేయాలి. ● కొత్త పింఛన్లు ఇస్తున్నామంటూ మంత్రి మాయ మాటలు ● ఇప్పటి వరకు పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు మాత్రమే పింఛన్లు ● ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు ● మత్స్యకారులకు రెండేళ్లకు రూ. 40 వేల భృతి చెల్లించాలి ● ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి నిమ్మలవి మోసకారి ప్రకటనలు ● ఎన్నికలకు ముందు చేసిన హామీలు అమలుపై ప్రజా పోరాటం చేస్తాం ● జెడ్పీచైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు చెల్లూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయండి విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలో చెల్లూరులో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ పూర్తయింది. తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరంలో ఆటోనగర్ ఏర్పాటుచేస్తామంటూ ప్రకటించారు. అక్కడ కాకుండా ఇప్పటికే గుర్తించిన స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తే ప్రక్రియ సులభతరం అవుతుంది. జిల్లాలో మూతపడుతున్న జిందాల్, ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలను తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలి. జిల్లాలో మూతపడుతున్న పరిశ్రమలపై దృష్టి సారిస్తే బాగుంటుందని జెడ్పీ చైర్మన్ అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వలిరెడ్డి శ్రీనివాసరావు, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం: అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు గుప్పించిన హమీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం మోసకారి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సూపర్‌సిక్స్ పేరిట ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్న వారు ఆ హమీలు అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన హమీల అమలు చేయాలన్న డిమాండ్‌తో ప్రజాపోరాటం చేస్తామని, ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. జెడ్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ● కొత్త పింఛన్లు ఏవీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క హమీ సక్రమంగా అమలు చేయలేదు. తాజాగా జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అవి కొత్త పింఛన్లు ఎలా అవుతాయి. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న భర్తలు చనిపోతే వారి స్థానంలో భార్యలకు మాత్రమే వితంతు పింఛ న్లు ఇస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 89,788 పింఛన్‌దారులున్నారు. జిల్లా వరకు 4,400 మంది లబ్ధిదారులున్నారు. ఇవన్నీ బదిలీ పింఛన్లు మాత్రమే. పాత పింఛన్లు లెక్కలోకే వస్తాయి. కొత్తగా కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛను మంజూరు చేయకుండా ప్రజలను మోసగించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 65.94 లక్షల పింఛన్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 63.92 లక్షలకు తగ్గిపోయింది. సుమారు 1.57 లక్షల పింఛన్లు తగ్గిపోయాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వాస్తవాలన్నీ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. 2024 జనవరి 1 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల భర్త చనిపోతే ఆ భార్యకు కొత్త పింఛను మంజూరు చేయడం లేదు. 60 ఏళ్లు పైబడిన వారికి, కొత్తగా దివ్యాంగత్వం కలిగిన వారికి పింఛన్లు ఒక్కటైనా ఈ ప్రభుత్వం మంజూరు చేసిందా...? కనీసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ ప్రారంభించలేదు. ఎన్నికల హమీల్లో ప్రకటించిన 50 ఏళ్లు పైబడిన వారికి పింఛను మంజూరు ఊసేలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకొకసారి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేసింది. ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బకాయిలతో కలిపి పింఛన్ మొత్తం చెల్లించాలి. ● మత్స్యకారులకు రూ.40వేల భృతి చెల్లించాలి సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన భృతిని గడిచిన రెండేళ్లకు సంబంధించి రూ.40వేల చొప్పున చెల్లించాలి. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఆ సంవత్సరానికి సంబంధించిన భృతిని ఎగ్గొట్టే చర్యలు తగవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 సంవత్సరానికి సంబంధించిన మత్స్యకార భృతిని నవంబర్ నెలలో విడుదల చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అవి న్యాయ స్థానంలో నిలబడవు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వమే షాపులు నిర్వహించినప్పుడు అక్రమాలకు ఆస్కారం ఎలా ఉంటుంది..? -
గిన్నిస్ బుక్‌లో చోటు
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ వద్ద ఉన్న మెర్సీమిషన్ పాఠశాల ప్రిన్సిపాల్ కె.కిరణ్‌బాబు, విద్యార్థిని కె.కెరెన్ జాస్పర్‌కు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కింది. కీబోర్డు వాయిద్యంలో 45 నిమిషాల నిడివి గల వీడియో చేసి చోటు దక్కించుకున్నట్టు ప్రిన్సిపాల్ శనివారం తెలిపారు. విజయవాడకు చెందిన హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు పాస్టర్ అగస్టీన్ దండంగి ఇన్‌స్ట్రాగామ్ సోషల్ మీడియాలో 18 దేశాలకు చెందిన 1090 మంది కీ బోర్డు వాయిద్యంలో 45 నిమిషాల విడివి ఉన్న సరళీ స్వరాల వీడియోను అప్ లోడ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 1న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం వీటిని అప్లోడ్ చేశారు. వీటిలో 1046 చోటు సంపాదించుకున్నాయి. వీరిలో మెర్సీమిషన్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ కె.కిరణ్‌బాబు, 4వ తరగతి విద్యార్థిని కె.కెరెన్ జాస్పర్ చోటు సంపాదించుకోవడంతో విజయవాడలో ఈ నెల 25వ తేదీన జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. -
మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు... : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : మాదక ద్రవ్యాల జోలికి యువత పోవద్దని బంగారం లాంటి జీవతాన్ని పాడుచేసుకోవద్దని ఎస్పీ వకుల్ జిందల్ యువతకు విజ్ఙప్తి చేశారు. కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్, చేయూత ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ ఉపయోగం వలన కేరిర్ ఎలా పాడవుతుంది, మానవ జీవితాలు ఎలా నాశనం అవుతాయో అన్న దానిపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు సంకల్పం కార్యక్రమం చేపట్టామన్నారు. యువత ఒకసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే దాని ప్రభావం ఎంతవరకు దారి తీస్తుందో తెలియని మైకంలో పడతారన్నారు. కన్నవారి ఆశలను తెంచేవారవుతారని ఎస్పీ హితబోధ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మాజీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సలహదారు డా.సతీష్‌రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల కంటే ముందున్నదని నేటి యువతరం ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. తద్వారా భారత రక్షణ రంగాన్ని మరింత మందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపైనే ఉందన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2045 నాటికి వికసిత భారత్ కలను నిజం చేయాలని కోరారు. యువ సమ్మేళంలో ఆర్డీఓ దాట్ల కీర్తి, ఎండీ కలీయుల్లా షరీఫ్, రవీంద్రరెడ్డి, చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు రాము లెండి, రఘు, సీతం కళాశాలలల ప్రొఫెసర్లు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. -
రామతీర్థంలో జనసేన – టీడీపీ నాయకుల కొట్లాట
నెల్లిమర్ల రూరల్: మండలంలోని రామతీర్థం గ్రామంలో శుక్రవారం రాత్రి టీడీపీ, జనసేన నాయకులు పరస్పర కొట్లాటకు దిగారు. ఈ ఘటనపై ఇరు వర్గాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనసేన పార్టీ నేతగా వ్యవహరిస్తున్న పైడిరాజు ఇటీవల తన పొలంలో ఉన్న తాటి చెట్లను తొలగించారు. తన భూమి పరిధిలో ఉన్న చెట్లను సమాచారం ఇవ్వకుండా ఎందుకు తొలగించావని టీడీపీ నాయకడు తాడ్డి సత్యనారాయణ జనసేన నేత పైడిరాజు ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ కొట్లాటలో ఇద్దరికీ గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. దీనిపై ఎమ్మెల్సీ నమోదు కాగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా జనసేన నాయకుడు పైడిరాజు మాట్లాడుతూ గతంలో తన భూమి పరిధిలో ఉన్న చెట్లను కూడా తొలగించారని, కేవలం రాజకీయంగా తన ఎదుగుదల చూడలేకే తనపై దాడి చేశారని తెలిపాడు. -
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలి
బొబ్బిలిరూరల్: మండలంలోని పిరిడి, పక్కి గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో జీవనరాణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. గర్భిణులకు ఆపరేషన్ కాకుండా సాధారణ ప్రసవాలు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఈ నెలలో నాలుగు సాధారణ ప్రసవాలు చేశామని, గత నాలుగు నెలల్లో 52 సాధారణ ప్రసవాలు చేశామని వైద్యుడు రఘువంశీ తెలిపారు. పశువుల శాల, వరి కుప్పలు దగ్ధం నెల్లిమర్ల రూరల్: మండలంలోని వల్లూరు గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పశువుల శాల, వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక బీసీ కాలనీ సమీపంలో చెత్త కుప్పలకు నిప్పు పెట్టడంతో.. దగ్గరలో ఉన్న పశువుల శాలకు మంటలు అంటుకొని దట్టంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పంచాది ఈశ్వరరావు, గాదిపల్లి సత్యంకు చెందిన ఆవుల శాలతో పాటు రెండు వరికుప్పలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. స్థానికులు స్పందించి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేశారు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి బాధితుల వివరాలు సేకరించారు. ‘అంగన్వాడీ’లను సందర్శించిన నాగాలాండ్ బృందంబలిజిపేట: సుపోషిత పంచాయతీ పలగరలోని 2, 4 అంగన్వాడీ కేంద్రాలను నాగాలాండ్ బృందం సభ్యులు హవీబు మేహవుడ్, లాంగ్ కుహంలు శనివారం సందర్శించారు. కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, బోధనకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపడతారనేది ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ వారికి వివరించారు. కేంద్రాల్లో ఉండే టాయిలెట్లు, తాగునీటి సదుపాయం, కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం, చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనం, గర్భిణుల, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం తదితర వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణులకు సీమంతాలు చేశారు. బలిజిపేట సీడీపీఓ సులేఖ, సూపర్వైజర్ పద్మ, టాటా ట్రస్టు అసోసియేట్ సూపర్వైజర్ పూర్ణిమ, మహిళా పోలీసు, సిబ్బంది, జాన్, తదితరులు పాల్గొన్నారు. -
డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదల
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో ప్రవేశించేందుకు ఉద్దేశించిన డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీఈఈ సెట్–2025) నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పట్టణంలో ఉన్న డైట్ కళాశాలతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు. జూన్ 2, 3 తేదీల్లో ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపులు డీఈఈ సెట్–2025కు దరఖాస్తు చేసుకునేందుకు రూ.750 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 22 నుంచి మే 7వ తేదీ వరకు ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆన్లైన్లో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా ఏపీడీఈఈఈసెట్.ఏపీఈఎఫ్ఎస్ఎస్.ఇన్ ద్వారా ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షకు అర్హతలివే... దరఖాస్తుదారులకు ఈ ఏడాది సెప్టె ంబర్ ఒకటో తేదీ నాటికి 17 ఏళ్లు నిండి, భారత జాతీయుడై ఉండాలి. పదో తరగతితో పాటు, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్లో 50 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కుల అర్హత ఉండాలి. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణతకు ఓసీ, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 25 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు ప్రవేశ పరీక్ష రాసేందుకు అనర్హులు. మార్కుల కేటాయింపు ఇలా... గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజిలక్ సైన్స్, సోషల్ స్టడీస్‌కు ఒక్కో బ్రాంచ్‌కు 25 శాతం వంతున సీట్లు కేటాయిస్తారు. 6 – 10వ తరగతుల వరకు ఉన్న సిలబస్‌పై ప్రశ్నపత్రం ఉంటుంది. 100 మార్కులకు ఆన్లైన్ తరహాలో 2.30 గంటల పాటు పరీక్ష ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. పార్ట్–ఏ 60 మార్కులు, పార్ట్–బీ 40 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. పార్ట్–ఏ లో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, తెలుగులో ఐదేసి మార్కుల వంతున, ఎంచుకున్న భాష, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్‌కు సంబంధించి ఒక్కో సబ్జెక్టుకు 10 మార్కుల వంతున మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. పార్ట్–బీలో అభ్యర్థి ఎంచుకున్న ప్రధాన సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు వస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మే 8వ తేదీ తుది గడువు జూన్ 2, 3 తేదీల్లో పరీక్ష -
వేతనదారులకు రెండు బీమా పఽథకాలు
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ వేతనదారులు దురదృష్టవశాత్తు మరణించినా, ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించినా బీమా రక్షణ అందించే రెండు పథకాలు అమలులో ఉన్నట్టు డ్వామా పీడీ ఎస్.శారదాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వేతనదారులు రూ.20 సంవత్సరానికి చెల్లించాలన్నారు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తూ మరణించిన, లేదా పూర్తి వైకల్యం కల్గిన వారికి రూ.2లక్షలు పరిహారం పొందగలరన్నారు. పాక్షికంగా వైకల్యం పొందిన వారికి రూ.లక్ష పొందవచ్చునన్నారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారు రూ.435 ప్రీమియం ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏ కారణంగా మరణించిన వారి వారసులకు రూ.2 లక్షల పరిహారం అందుతుందన్నారు. ఈ బీమాల కోసం పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లో ఖాతా నమోదు చేసుకోవాలన్నారు. వారి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9849903737 నంబరుకు సంప్రదించాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల పంపిణీ ● వేసవి దృష్ట్యా పని వేళల తగ్గింపు : ఎస్పీ విజయనగరం క్రైమ్ : ఎండ వేడి, తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ కిట్లను పంపిణీ చేశారు. నగరంలోని పద్మావతీ నగర్లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం 18 మంది ట్రాఫిక్ సిబ్బందికి వాటర్ బాటిల్, హేట్, చిన్న బ్యాగ్‌ను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా సిబ్బంది పని వేళలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎండ తీవ్రతతో ట్రాఫిక్ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మీరు సక్రమంగా పని చేస్తే నగరం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఎండ వేడిలో ట్రాఫిక్ సిబ్బంది పడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు పని వేళలను తగ్గించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్ఐలు భాస్కర్, రవి, రమణ, నూకరాజు, ఏఎస్ఐ రాజు, పీసీలు భాస్కర్, రవి, నాయుడు, కిరణ్ పాల్గొన్నారు. కాగా మొత్తం 80 మందికి కిట్లు అందజేశారు. ప్రముఖ వ్యాపార, సేవా సంస్థలైన గోవిందా జ్యూయల్లరీ,ఽ రోటరీ క్లబ్ వారి సహకారంతో వీటిని పంపిణీ చేశారు. -
బాసంగి గదబవలసలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి పంచాయతీ గదబవలస, గవరమ్మపేట పంచాయతీ వెంకటరాజపురం పంట పొలాలలో ఏనుగులు శనివారం ఉదయం దర్శనమిచ్చాయి. చాలా రోజుల నుంచి పరిసర గ్రామాలలోని పంట పొలాలలో తిరుగుతూ రాత్రి సమయాన గ్రామంలోకి చొచ్చుకు వస్తున్నాయని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని ఆనుకొని అరటి, పామాయిల్ తోటలతో పాటు వరి పంట ఉండడంతో గ్రామాన్ని వీడడం లేదు. పుష్కలంగా పంటలు, తాగునీరు ఉండడం వల్లే గ్రామాన్ని విడిచిపెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. చేతికందుతున్న పంట ధ్వంసం కావడంతో ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణాలకు వెళ్లి రాత్రి సమయాన ఇళ్లకు రావడం కష్టంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
44 కేజీల గంజాయి స్వాధీనం
పార్వతీపురం రూరల్: రాయగడ నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 44 కేజీల గంజాయిని పార్వతీపురం పట్టణం శివారు రాయగడ రోడ్డులోని పెట్రోల్‌బంకు సమీపంలో పట్టుకున్నట్టు పార్వతీపురం పట్టణ సీఐ కె. మురళీధర్ శనివారం తెలిపారు. తమిళనాడు రిజిస్టేషన్‌తో ఉన్న కారులో ఆరుగురు వ్యక్తులు 44 కేజీల గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గోవింద సిబ్బందితో కలిసి దాడిచేశారన్నారు. సుమారు రూ.5లక్షల విలువైన గంజాయితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. దినసరి వేతనం పెరిగేలా చూడాలి ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం ఫోర్ట్: ఉపాధిహామీ వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఉపాధి హామీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని తెలిపారు. రెండు పూటలా కనీసం 6 గంటలు పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని, తాగునీరు, నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. జలవనరులను పెంచే ఫారం పాండ్స్, పూడిక తీత పనులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పనుల్లో పురోగతి చూపించని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎస్.శారదాదేవి పాల్గొన్నారు. -
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
పార్వతీపురం టౌన్: పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శనివారం ఆయన గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని గమనించారు. గోదాములకు వేసిన సీల్డ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ఏర్పాట్లుపై పరిశీలించి అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయన వెంట డీఆర్ఓ హేమలత తదితరులు ఉన్నారు. -
చేపలవేటే జీవనాధారం
జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 21 వేలు మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో 6 వేల మంది సముద్రంలో వేట చేస్తుండగా, 15 వేలు మంది వారిపై ఆధారపడి జీవిస్తున్నారు. రెండు మండలాల్లో 885 బోట్లలో 3,798 మంది మత్స్యకారులు వేట సాగిస్తుండగా మిగతా మత్స్యకారులు ఇతర రాష్ట్రాల బోట్లలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి, నీలగెడ్డపేట, బర్రిపేట, పెద్దూరు, కొత్తూరు, పతివాడ బర్రిపేట, తిప్పలవలస, తమ్మయ్యపాలెం, పులిగెడ్డపేట, కోనాడ, బొడ్డుగురయ్యపేట, బొడ్డువెంకటేషుపేట, భోగాపురం మండలం చినకొండ్రాజుపాలెం, పెద కొండ్రాజుపాలెం, చోడిపల్లిపేట, ఎర్రముసలయ్యపాలెం, చోడిపల్లిపేట, ముక్కాం, చేపలు కంచేరు గ్రామాలు ఉన్నాయి. గతేడాది పరిహారం ఎగ్గొట్టడం మత్స్యకారులను నిర్లక్ష్యం చేయడమే అంటున్నారు. -
చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
సాక్షి, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ నడుపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లిదండ్రులనే కన్న కొడుకు హత్య చేశాడు. తల్లిదండ్రులను కన్నకొడుకు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. అక్కడిక్కడే తండ్రి అప్పలనాయుడు (60), తల్లి జయమ్మ (58) మృతి చెందాడు. కుమారుడు పాండ్రంగి రాజాశేఖర్ (25) పరారీలో ఉన్నాడు.ఆస్తి తగాదా నేపథ్యంలోనే దాడి చేసినట్టు బంధువులు అంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్.. అనంతరం వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు. పూసపాటిరేగ మండలంలో జరిగిన అమానవీయ ఘటనతో మృతుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సమస్యలు చెప్పుకునే వేదిక వెల్ఫేర్ ‘డే‘
విజయనగరం క్రైమ్: వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వారి సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి శుక్రవారం తన చాంబర్లో పోలీస్ వెల్ఫేర్‌డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్‌జిందల్ చెప్పారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులతో ప్రతివారం సంక్షేమ రోజును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్, ఏఆర్, ఫింగర్‌ప్రింట్స్, ఎస్టీఎఫ్, హోంగార్డ్స్, మినిస్టీరియల్ సిబ్బంది ఇలా ప్రతి ఒక్క ఉద్యోగి వారి పనుల్లో ఎదురయ్యే బదిలీలు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, వ్యక్తిగత, వృత్తిపరమైన వినతులను ఈ వెల్ఫేర్ డే సందర్భంగా తెలియజేయగా పరిశీలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
27న సారిపల్లిలో బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా సీ్త్ర, పురుషుల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 27న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రంగారావుదొర, కేవీ ప్రభావతి శుక్రవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో గల చంపావతి నదిలో ఎంపిక పోటీలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే పురుష క్రీడాకారులు 85 కేజీలలోపు, సీ్త్రలు 75 కేజీలలోపు బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆ రోజు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడలో జరగనున్న అంతర్‌జిల్లాల సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు. 28న జీఎంఆర్నైరెడ్లో ఇంటర్వ్యూలురాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఈ నెల 28న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు శిక్షణకు అర్హులన్నారు. పురుషులకు హౌస్వైరింగ్ (30 రోజులు), బైక్ రిపేరింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ ట్యాలీ అండ్ బేసిక్స్ (30 రోజులు), అలాగే సీ్త్రలకు లేడీస్ టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ (35 రోజులు), మగ్గం వర్క్స్ అండ్ శారీ పెయింటింగ్ వర్క్స్ (31 రోజుల పాటు)లో శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతో రావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129, 9866913371, 9989953145 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌గా డాక్టర్ సాయిరాంవిజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) జిల్లా కోఆర్డినేటర్‌గా డాక్టర్ కేసీపీఏవీ సాయిరాం నియమితులయ్యారు. ఈమేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన సతివాడ పీహెచ్సీ వైద్యాధికారిగా ఉన్నారు. ఫారిన్ సర్వీస్‌పై ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్సీపీలో నూతన నియామకాలుపార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగ కమిటీలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా బంకపల్లి వాసుదేవరావు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా దాసరిమాధవ రావు నిమితులయ్యారు. -
బైక్‌ల దొంగ అరెస్ట్
ఎంవీపీకాలనీ (విశాఖ): నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడిని ఎంవీపీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర క్రైం ఏడీసీపీ మోహనరావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మార్చి 17న పెదవాల్తేర్ రిలయన్స్ మార్ట్ ఎదుట దాసరి శంకరరావు అనే వ్యక్తికి చెందిన హోండా యాక్టివా బైక్ దొంగతనానికి గురైంది. మార్ట్ ఎదుట వాహనాన్ని పార్క్ చేసిన శంకరావు పక్కనే ఉన్న చికెన్ షాపునకు వెళ్లి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. దీనిపై ఎంవీపీ క్రైం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ద్వారకా క్రైం సీఐ చక్రధర్‌రావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. మార్ట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు చివరిగా సంచరించిన ప్రాంతాన్ని గుర్తించి, సెల్‌ఫోన్ నంబర్ కనుగొన్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం, కోట సీతారామపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు కోట శివగా గుర్తించారు. ఈ నెల 24న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నగరంలోని ఎంవీపీ కాలనీ, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ద్వారకా పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 17 వాహనాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. 2024 నుంచి శివ విశాఖలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అలాగే అతనిపై 31 పాత కేసులతో పాటు జీఆర్పీలో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గర సేకరించిన వివరాలతో 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శివను కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన ద్వారకా క్రైం సీఐ చక్రధర్‌రావుతో పాటు ఎస్సై అప్పలరాజు, ఏఎస్సై కిశోర్‌బాబు, పీసీలు జగత్ కిరణ్, హరిప్రసాద్, సాయి, అప్పలరాజు, అగస్టీన్లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
అదానీని అడ్డుకుందాం
● ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ గిరిశిఖరంపై ఉన్న మారిక గిరిజన గ్రామంలో భూములను, కొండను దోచుకునేందుకు వస్తున్న ఆదానీకి చెందిన గుజరాత్ కంపెనీ మారిక రాకుండా అడ్డుకుందామని సీపీఎం నేత, ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మారిక గిరిజనులతో కలిసి ఆయన మాట్లాడుతూ మారిక గ్రామ రెవెన్యూలో 35 సర్వే నంబర్లు ఉన్నాయని అందులో 32 సర్వే నంబర్లలో ఉన్న భూములు, ఇళ్లు, బడి, గుడి ఆదాని కంపెనీకి చెందిన హైడ్రో పవర్‌ప్లాంట్‌కు అప్పగిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదానిపై ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం బాధాకరమన్నారు. మారిక గిరిజన గ్రామాన్ని ఆదానీ గ్రూప్‌కు అప్పగించడాన్ని వెనక్కి తీసుకోకపోతే జిల్లాలో ఉన్న గిరిజనులంతా ఏకమై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదానీ గ్రూప్ మారికలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాబూరావు, ఆనంద్ రామకృష్ణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పేద పిల్లలకు కార్పొరేట్ విద్య
● గత ప్రభుత్వం సంస్కరణల ఫలితమే ● ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం ఉచితవిద్య ● 2022–23లో పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ● తాజాగా నోటిఫికేషన్ జారీచేసిన సమగ్ర శిక్ష అభియాన్రామభద్రపురం: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా, తరతరాల వారి తలరాతలను మార్చాలని గడిచిన ఐదేళ్ల పాటు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో సంస్కరణల విప్లవం తీసుకువచ్చారు. ఒక చదువుతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి ప్రాథమిక విద్యావ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పేద విద్యార్థులకు అమ్మఒడి, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బైల్టులు, టై తదితర పథకాలు పకడ్బందీగా అమలు చేశారు. ఈ క్రమంలోనే అక్షరాన్ని కాసులు పెట్టి కొనుక్కునే స్థోమత లేని ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు అంతరాలు, అడ్డగోడలు ఉండకూడదని ఆలోచించి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను నాటి ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. దీనికి అనుగుణంగా ప్రైవేట్, అన్ఎయిడెడ్, పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఉచిత విద్యనందించేందుకు 2022–23 విద్య సంవత్సరంలోనే ఈ పఽథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా 302 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా విద్యాహక్కు చట్టం–2009 ద్వారా గత ఏడాది 283 పాఠశాలల్లో 1326 మంది పేదవిద్యార్థులు ప్రవేశం పొందారు. వారిలో అధికశాతం విద్యార్థులు ఆయా విద్యాసంస్ధల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అదే ఉచిత విద్యావిధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించేలా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాహక్కు చట్టం–2009 అమలులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలవుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకూ వివిధ వర్గాల నుంచి ఉచిత విద్యకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హులైన విద్యార్థులు ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో హెచ్‌టీటీపీ://సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే సమయంలో వారి నివాసానికి సమీపంలో ఉండే పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంది. అర్హతలు.. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అమలవుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం 31.3.2025 నాటికి ఐదేళ్లు వయసు నిండి ఉండాలి.స్టేట్‌సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి 1.6.2025 నాటికి ఐదేళ్లు నిండాలి. అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లను ప్రభుత్వం కేటాయించగా అనాథలు, హెచ్ఐవీ ఎఫెక్టెడ్, డిజేబుల్డ్ వారికి 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు నాలుగు శాతం, బీసీలు, మైనార్టీలు, ఇతరులకు ఆరు శాతం సీట్లు మంజూరు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.1.44 లక్షల ఆదాయానికి మించి ఉండరాదు.విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా పాటించాలి అందరికీ విద్య అందించేందుకు విద్యాహక్కు చట్టం మేరకు పేదలకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.ఇది పేద విద్యార్థులకు వరం. నోటిఫికేషన్ ప్రకారం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.అలాగే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు పక్కాగా పాటించాలి. ఈ నెల 28వ తేదీలోపు ప్రతి పాఠశాల రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చే విద్యా సంవత్సరం కోసం విడుదల చేశారు. యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం -
16 అడుగుల గిరినాగు పట్టివేత
● ఊపిరి పీల్చుకున్న రైతులువేపాడ: మండలంలో చామలాపల్లి నుంచి వెంకయ్యపాలెం వెళ్లే రహాదారిలో అరిగివాని చెరువువద్ద 16 అడుగుల గిరినాగును స్థానికులు గుర్తించారు. శుక్రవారం రాత్రి అరిగివాని చెరువు కళ్లాలవద్ద బుస కొడుతుండగా అక్కడ ఉన్న రైతులు గమనించి చూసి గిరినాగుగా గుర్తించారు. తక్షణమే వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రతినిధి వరపుల కృష్ణకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్దలానికి చేరుకుని 16 అడుగుల గిరినాగును భద్రంగా పట్టుకుని గొనెసంచెలో భద్రపరిచారు. ఉదయాన్నే అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. దీంతో స్దానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఐశ్వర్య యాదవ్
విజయనగరం ఫోర్ట్: జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షరాలిగా ఐశ్వర్య యాదవ్ నియామితులయ్యారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆమెను నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. జిల్లాలో మహిళల కోసం, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బ్యారేజీ దాటిన ఏనుగుల గుంపు భామిని: మండలంలోని నేరడి బ్యారేజ్‌ను ఏనుగుల గుంపు శుక్రవారం దాటి వెళ్లింది. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణాగ్రతలకు ఏనుగుల గుంపు విలవిల్లాడుతోంది. సరైన చెట్ల నీడ లేకపోవడం, వేసవి తీవ్రత నుంచి ఉపశమనం లేకపోవడమే కారణమని ఫారెస్టు సిబ్బంది తెలిపారు. గురువారం రాత్రి బిల్లుమడ నుంచి నేరడి–బి మీదుగా వంశధార నదీ తీరం వెంబడి పయనించి శుక్రవారం నేడు నేరడి బ్యారేజీని ఏనుగులు దాటాయి. ఇదే నదీతీరంలో ఏపుగా ఉన్న జీడిమామిడి తోటలకు చేరుకున్నాయి. -
కోర్టు వాయిదాకు వెళ్లి వస్తూ నిందితుడి మృతి
● బస్సులో వస్తుండగా మార్గమధ్యంలో అస్వస్థత కొత్తవలస: జిల్లా కేంద్రంలో గల కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా లక్కవరపుకోట మండలం రేగ గ్రామానికి చెందిన గొల్ల అప్పారావు(40) మార్గమధ్యంలో అస్వస్థతకు గురై మృతిచెందాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అప్పారావు 2021వ సంవత్సరంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం జిల్లా కోర్టుకు కేసు వాయిదాకు తల్లిదండ్రులు, భార్యతో కలిసి వెళ్లాడు. వాయిదా ముగిసిన తరువాత భార్య మందుల కొనుగోలు కోసం విజయనగరంలో ఉండిపోగా తల్లిదండ్రులతో కలిసి విజయనగరం–అనకాపల్లి బస్సులో కొత్తవలస వచ్చేందుకు బస్సు ఎక్కాడు. భీమసింగి జంక్షన్‌కు వచ్చేసరికి అప్పారావు తీవ్ర అస్వస్థతకు గురికాగా కొత్తవలస తహసీల్దార్ గేటువద్దకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సు నుంచి అప్పారావును, తల్లిదండ్రులను సిబ్బంది దించేసిన అనంతరం బస్సు వెళ్లిపోయింది. స్పందించని 108 సిబ్బంది తీవ్ర ఆస్వస్థతకు గురైన అప్పారావును స్థానికులు గుర్తించి వెంటనే 108 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా కొత్తవలస, ఎల్.కోట, జామి మండలాల వాహనాలు అందుబాటులో లేవని వేరే మండలం నుంచి వాహనం రప్పించేందుకు గంటకు పైగా పడుతుందని అంతవరకు ఉంటే ఉండండి లేదంటే మీఇష్టమని సిబ్బంది బదులిచ్చారు. దీంతో కాసేపు వేచి ఉండి చెంతనే గల పీహెచ్సీ వైద్యులకు సమాచారం అందించగా డాక్టర్ వచ్చి పరిశీలించి పల్స్ పడిపోయిందని మృతిచెందినట్లు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న వృద్ధ తల్లిదండ్రులు భోరుమంటూ విలపించారు. స్థానికులు చందాలు వేసుకుని మృతదేహాన్ని స్వగ్రామం రేగకు ఆటోలో తరలించారు. కాగా మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
● ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ అగ్రహంగుర్ల: జాతీయ ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుర్లలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పొట్నూరు ప్రమీల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. గోషాడ, గరికివలసలలో ఉపాధి హమీ పనులు ఎందుకు ప్రారంభించలేదని ఏపీఓ రత్నమాలను ప్రశ్నించారు. వచ్చే వారం ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తామని ఆమె బదులు ఇచ్చారు. జమ్ములో ఫీల్డ్ అసిస్టెంట్‌కు తెలియకుండా ఉపాధి హమీ పనులు ఎలా చేపడతారని సర్పంచ్ గొర్లె నరసింహమూర్తి ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు ఉపాధి పనులు చేపట్టడం సమంజసం కాదని ఏపీఓకు జెడ్పీ చైర్మన్ సూచించారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న మేట్లను తొలగించకుండా కొత్త మేట్లను స్థానిక నేతలు సిఫార్సు చేసిన వారిని వేయాలని జెడ్పీ చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక ఆరోపణలు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే తొలగించాలని ఏపీఓను ఆదేశించారు. కొండగండ్రేడులో టీడీపీ నేతలు చెప్పారని ఉపాధి హామీ పనులను ప్రారంభించలేదని సర్పంచ్ సారిక గోవింద్ జెడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి హామీ వేతనదారులకు కనీస వేతనం రూ.307 ఉన్నప్పటికీ రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు వస్తుందని , కనీస వేతనం రూ.300లు వచ్చేలా పనులు చేపట్టేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉపాధి హామీ అధికారులకు జెడ్పీ చైర్మన్ సూచించారు. అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని , గ్రామాల్లో తరచూ పర్యటించకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు అంబళ్ల లక్ష్మి, తోట తిరుపతిరావు, ఎంపీడీఓ శేషుబాబు, డీటీ నారాయణమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో జిల్లాకు అదనపు జాగిలాలు
● నూతన కెన్నల్స్ నిర్మాణానికి చర్యలు ● పాత వాటిని పరిశీలించిన ఎస్పీ విజయనగరం క్రైమ్: నేరాలు జరిగినప్పుడు నిందితులను కనిపెట్టేందుకు సిబ్బందితో పాటు నేరం జరిగిన ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తులో ముఖ్యభూమిక పోషిస్తున్న జాగిలాలకు సరైన శాశ్వత విశ్రాంతి గదుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. ఈ మేరకు ఏఆర్ క్వార్టర్స్‌లో ఉన్న పాతభవనాలను ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ఏఆర్ సిబ్బందితో కలిసి పరిశీలిచారు. పాతబడిన గదులను, జాగిలాలు ఉంటున్న స్థలాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో పాటు నేరం జరిగే ప్రదేశానికి వెళ్తున్న జాగిలాలకు శాశ్వతమైన గదులు లేవని, నేరాలను కనిపెట్టడంలో, కేసు ఛేదనలో సిబ్బంది కంటే ముందే గుర్తులు ఇవ్వడంలో కీలక పాత్రను జాగిలాలు పోషిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న జాగిలాలకు అదనంగా మరికొన్ని నార్కొటెక్స్, స్నిప్పర్, ట్రాకింగ్ జాగిలాల అవసరం జిల్లా పోలీస్ శాఖకు ఉందన్నారు. ప్రతిపాదనల మేరకు అదనపు జాగిలాలు జిల్లాకు రానున్నట్లు తెలిఆపరు. ప్రస్తుతం ఏఆర్క్వార్టర్స్లో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఆర్ సిబ్బందిని ఆదేశించారు. పరిశీలనలో ఎస్పీ వెంట ఎస్బీ సీఐ లీలారావు, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, జాగిలాల హ్యండ్లర్స్ పాల్గొన్నారు. -
పాముకాటుతో దివ్యాంగుడి మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామంలో పాముకాటుతో ఓ దివ్యాంగుడు మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అట్టాడ పూడిపినాయుడు(39) దివ్యాంగుడు. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో డాబాపై నిద్రించేందుకు వెళ్తున్న క్రమంలో మెట్ల వద్ద మాటువేసి ఉన్న పాము ఒక్కసారిగా కాటువేసింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు విజయనగరం ప్రభుత్వాస్పత్రికి వెంటనే తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూడిపినాయుడు దివ్యాంగ పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్నాడు. మృతుడికి భార్యతో పాటు పాప, బాబు ఉన్నారు. ఇంటి యజమాని చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● చెట్టంత నిర్లక్ష్యం..
చిత్రంలో రోడ్డు మధ్యలో తాటిచెట్టు, బోరును చూశారా... రోడ్డు మధ్యలో ఉన్నవాటిని తొలగించకుండా రోడ్డు వేయడం ఏమిటని ఆశ్యర్యపోతున్నారా.. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి గజపతినగరం మండలం మధుపాడ గ్రామానికి జాతీయ రహదారి నుంచి వేసిన సీసీ రోడ్డు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును, బోరును తొలగించకుండా రోడ్డు నిర్మించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రోజ్లీనా వద్ద ప్రస్తావించగా త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పుకొచ్చారు. – గజపతినగరం రూరల్ -
15 శాతం వృద్ధిరేటు సాధించేలా ప్రణాళిక
రాజాం సిటీ/చీపురుపల్లి జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, 15 శాతం వృద్ధిరేటు నమోదుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. రాజాంలోని పాలకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్, చీపురుపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వేర్వేరుగా నియోజకవర్గ స్థాయి అధికారులు, సిబ్బందితో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తలసరి ఆదాయం పెంచే మార్గాలపై దృష్టిసారించాలన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో ఎక్కువ అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూమి జిల్లాలో 3 లక్షలు ఎకరాలు ఉండగా, లక్షా80 వేల ఎకరాల్లోనే పంటలు సాగవుతున్నాయన్నారు. ఉద్యాన, వాణిజ్య పంటల సాగు విస్తరణ, ఉత్పత్తి పెంచడంపై దృష్టిసారించాలని సూచించారు. త్వరలో ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక పౌల్ట్రీ ఫారం ఏర్పాటుచేసి మాంసం, గుడ్లు ఉత్పత్తి పెంపునకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో సగటున రోజుకి పాల వినియోగం 10 లక్షల లీటర్లు వరకు ఉండగా, కేవలం 6 లక్షల లీటర్కేల ఉత్పత్తి అవుతు న్నాయన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, ఉద్యానవశాఖ డీడీ జమదగ్ని, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ సత్యవాణి, ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఆనందరావు, కమిషనర్ రామప్పలనాయుడు, చీపురుపల్లి నియోజకవర్గ ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎనిమిది మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
జిందాల్ కార్మికుల ఆందోళన
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారాన్ని వెంటనే తెరవాలని కోరుతూ వైఎస్సార్ టీయూసీ, టీఎన్టీయూసీ, సీపీఎం కార్మిక సంఘాల నాయకులు కర్మాగారం గేటు ముందు శుక్రవారం ఆందోళన చేశారు. జిందాల్ యాజమాన్యం తీరుపై నిరసన తెలిపారు. కార్మికులను రోడ్డున పడేసి మిన్నకుండడం తగదన్నారు. లాకౌట్ కాలానికి పూర్థిస్థాయి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్, కార్మిక సంఘం జేఏసీ నాయుకులు లగుడు వామాలు, భీమన్న, సీపీఎం నాయుకులు గాడి అప్పారావు, నమ్మి చిన్నబాబు, మద్దిల రమణ, తదితరలు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష విజయనగరం అర్బన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఈఐ, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీఆర్ఈఐ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కోసం జిల్లాలో నిర్వ హించిన 6 కేంద్రాల్లో 1,288 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,064 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పూట 10 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షను 1,891 మంది రాశారు. ఏపీఆర్డీసీ కోసం దరఖాస్తు చేసుకున్న 77 మంది అభ్యర్థుల్లో 65 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రా లను ఆయన అకస్మికంగా తనిఖీచేశారు. ఆయన వెంట పరీక్షల సహాయ కమిషనర్ టి.సన్యాసిరాజు ఉన్నారు. ‘ఉపాధి’ వేతనం పెరగాలి ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజాం సిటీ: ఉపాధిహామీ వేతనదారులకు అత్యధిక వేతనం వచ్చేలా పని కల్పించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. రాజాం నియోజకవర్గ స్థాయిలో ఉపాధిహామీ పనులపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పనుల తీరు, వేతనదారులకు అందుతున్న వేతనంపై ఆరా తీశారు. ఎండల దృష్ట్యా రెండు పూటలా పనులు చేయించాలని సూచించారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని సూ చించారు. వేతనదారుకు రూ.307లు అందేలా పని కల్పించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎస్.శారదాదేవి, ఆర్డీఓ సత్యవాణి, ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
మలేరియా రహిత జిల్లాగా మార్చుదాం
విజయనగరం ఫోర్ట్: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో మలేరియా రహిత జిల్లాగా మార్చుదామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా చేపట్టిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిల్వ ఉన్న మంచి నీటిలో మలేరియాను వ్యాప్తి చేసే ఆడ ఎనాఫిలిస్ దోమలు పెరుగుతాయన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు దోమల నివారణకు సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారులు వసతి గృహాల విద్యార్థులు దోమకాటుకు గురికాకుండా ముందుగానే వసతి గృహాల కిటికీలు, గుమ్మాలకు దోమల జాలీలు అమర్చాలన్నారు. విద్యార్థులకు దోమల నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 157 గ్రామాలను మలేరియా అధిక ప్రభావిత గ్రామాలుగా గుర్తించి రెండు విడతల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయాలని ఆదేశించామన్నారు. మే 15వ తేదీ నుంచి మొదటి విడత పిచికారీ మొదలవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, సహాయక మలేరియా నివారణ అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
వెంటాడుతున్న వసతి సమస్య..
● నత్తనడకన సాగుతున్న ప్రభుత్వ వైద్యకళాశాల భవనాల నిర్మాణం ● అందుబాటులోకి రాని వసతి ● అవస్థలు పడుతున్న వైద్యులు, విద్యార్థులు ● ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్యకళాశాల... విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దానిని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాకారం చేసింది. గాజులరేగ సమీపంలో 70 ఎకరాల్లో రూ.500 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. మొదటి ఏడాది తరగతులు ప్రారంభించేలా బోధనాస్పత్రి ప్రధాన భవనాన్ని పూర్తిచేసింది. 150 మంది వైద్య విద్యార్థుల బోధనకు వీలుగా తరగతి గదులను సిద్ధం చేసింది. వసతి భవనాల పనులను సైతం చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు పడకేశాయి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కావాలనే వైద్యకళాశాల పనులపై నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు మణిహారంగా, ప్రజల వైద్యానికి భరోసాగా నిలిచిన ప్రభుత్వ వైద్యకళాశాల, బోధనాస్పత్రి భవనాల నిర్మాణం నత్త కంటే నెమ్మదిగా సాగుతుండడంపై జిల్లా ప్రజలు మండిపడుతు న్నారు. భవనాల నిర్మాణంలో జాప్యంతో వైద్యులు, విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. వైద్య విద్యార్థులకు రెండో ఏడాది విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న బోధనాస్పత్రి భవనం వైద్య కళాశాలపై చిన్న చూపు..! కూటమి ప్రభుత్వం కావాలనే వైద్య కళాశాలపై చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులు, వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహ్లాదకర వాతావరణం, సువిశాల ప్రాంతంలో ఏర్పాటైన వైద్యకళాశాల భవనాల నిర్మాణం పూర్తిచేయడంలో నిర్లక్ష్యం తగదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైద్య విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ప్రస్తుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులకు, యంత్ర పరికరాలు అమర్చేందుకు సరిపడా వసతిలేదు. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. గదులు చాలక ప్రొపెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒకే గదుల్లో ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థుల బోధనకు, రోగులకు వైద్యసేవలందించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు ఏర్పాటుకు గదులు చాలక వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటుతో రోగుల తాకిడి పెరిగింది. ఇన్‌పేషెంట్లకు సేవలందించేందుకు పడకలు చాలక పోవడంతో వరండాలోనే రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకుంది. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వార్డుల సంఖ్యను పెంచాల్సి ఉంది. వైద్య కళాశాల, సర్వజన ఆస్పత్రి వేర్వేరు చోట్ల ఉండడం వల్ల వైద్యులు ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వైద్యకళాశాల భవనాలన్నీ పూర్తయితే ఇక్కడే సేవలందించేందుకు అవకాశం ఉంటుందని, రోగులకు కూడా మెరుగైన సేవలందుతాయని వైద్యులు చెబుతున్నారు. వైద్య కళాశాలకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి మధ్య సుమారు 5 కిలోమీటర్ల దూరం. ప్రతిరోజు వైద్య కళాశాల నుంచి వైద్య విద్యార్థులు ప్రాక్టీస్ కోసం ఆస్పత్రికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. రెండూ ఒకే చోట ఉంటే సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. -
మే 10న జాతీయ లోక్‌అదాలత్
విజయనగరం లీగల్: జిల్లాలో వచ్చేనెల 10వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బబిత పేర్కొన్నారు. కేసు రాజీ వల్ల కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. మోటార్ వాహన ప్రమాద కేసులు అధిక సంఖ్యలో రాజీ చేయడంలో భాగంగా మోటార్ వాహన సంస్థ ప్రతినిధులు, ఆ సంస్థ స్టాండింగ్ న్యాయవాదులతో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీ పడదగిన కేసులన్నింటినీ పరిష్కరించేందుకు ఇన్సూరెన్స్ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. కౌమార దశ పిల్లలకు సన్మార్గం చూపాలి ● సెల్ఫోన్లకు పిల్లలను దూరం చేయాలి ● సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి విజయనగరం ఫోర్ట్: కౌమారదశ పిల్లల్లో మానసిక, శారీరక ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని, తల్లిదండ్రులు, సంరక్షకులు వారితో మేమేకమై సన్మార్గం చూపాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి పిలుపునిచ్చారు. స్థానిక కన్వెన్షన్ సెంటర్లో సీడీపీఓలకు గురువారం నిర్వహించిన వర్క్‌షాపును ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కిశోర బాలికల అలోచనలు ప్రమాదకర పరిస్థితుల నుంచి దూరం చేయాలన్నారు. బాల, బాలికలను డిజిటల్ మాధ్యమాలు ప్రభావితం చేస్తున్నాయని, కౌమారదశలో ఉన్న బాలబాలికలతో చర్చించి వారి అవసరాలు తీర్చాలని తెలి పారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, లేదంటే డిజిటల్ మాధ్యమాల ప్రభావంతో చెడుదారిన పడే ప్రమాదం ఉందన్నారు. గత 7, 8 సంవత్సరాలుగా జరుగుతున్న అధ్యయనాల్లో కౌమారదశలో ఉన్న పిల్లలు మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నట్టు తేలిందన్నారు. జిల్లాలో ఉన్న సఖి, యువ గ్రూప్ పరిధిలో కిశోర బాలబాలికలు, వారి తల్లిదండ్రులకు ఫోక్సో చట్టం గురించి వివరించాలని చెప్పారు. బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ నిరోధించాలన్నారు. సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లల్లో వివిధ వృత్తివిద్యాకోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రుక్సానా సుల్తానా బేగం, పార్వతీపురం మన్యం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గ, జిల్లా నోడల్ ఆఫీసర్ టి.జగన్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమిక రంగంలోనే అభివృద్ధి అవకాశాలు అధికం
బొబ్బిలి: ప్రాథమిక రంగంలోనే అభివృద్ధి అవకాశాలు ఎక్కువని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విజన్ ప్లాన్‌పై అవగాహన, నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో తలసరి ఆదాయాన్ని 15 శాతం పెంచేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కేవలం ప్రణాళిక రూపకల్పనే కాకుండా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ, లక్ష్య సాధన ఉండాలన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి 3 లక్షల ఎకరాల వరకు ఉండగా, సాగు మాత్రం కేవలం లక్ష ఎకరాల్లోనే ఉందన్నారు. మిగిలిన భూమిని దశల వారీగా సాగులోకి తీసుకురావాలని సూచించారు. ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయాలని చెప్పారు. గుడ్లు, పాలు, మాంసం ఉత్పత్తిని పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న చెరువుల్లో చేపలు పెంచాలన్నారు. సేవారంగం విస్తరణకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటైతే ఈ రంగాల్లో అభివృద్ధి మరింత కనిపిస్తుందని చెప్పారు. గ్రామస్థాయి అధికారులంతా తమ సొంత ప్రాంతంగా భావించి ఆ స్థాయిలోనే ప్రణాళికలు రూపొందించాలన్నారు. దీనికోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీపీఓ పి.బాలాజీ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, ఉద్యానవన శాఖ డీడీ ఏవీఎస్వీ జమదగ్ని, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, మత్స్యశాఖ ఇన్చార్జి డీడీ విజయకృష్ణ, బొబ్బిలి ప్రత్యేకాధికారి నూకరాజు, ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావు, ప్రకృతి వ్యవసాయ డీపీఓ ఆనందరావు, నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. అంతకు ముందు వివిధ స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
జిల్లా క్రీడాకారిణులకు చోటేది?
విజయనగరం: పోటీలు జిల్లా స్థాయివి.. పాల్గొనేది మాత్రం పొరుగు జిల్లా క్రీడాకారిణులు. జిల్లా క్రీడాధికారుల తీరుపై జిల్లా క్రీడా సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికారుల తీరును దుమ్మెత్తిపోస్తున్నాయి. క్రీడా రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా పథకంలో భాగంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అస్మిత సిటీ లీగ్ పోటీలు నిర్వహణకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విజయనగరంలో బాక్సింగ్ పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పోటీల నిర్వహణకోసం కొంత నగదును కేటాయించారు. ఇందులో భాగంగా స్థానిక విజ్జీ స్టేడియంలో గురువారం బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. వీటిలో జిల్లా స్థాయి క్రీడాకారిణులు మాత్రమే పాల్గొనాలి. అధికారిక సమచారం ప్రకారం ఈ పోటీల్లో 100 మంది క్రీడాకారిణులు పాల్గొనగా... అందులో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారిణులు కేవలం 15 మంది మాత్రమే. మిగిలిన 80 మందికి పైగా క్రీడాకారిణిలు విశాఖ జిల్లాలోని ఓ శిక్షణ కేంద్రానికి చెందినవారు కావడం గమనార్హం. స్థానిక అధికారులు శాప్ ఆదేశాలను తుంగలోతొక్కి తూతూ మంత్రంగా పోటీలు నిర్వహించి చేతులుదులుపుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీలు నిర్వహించిన జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారుల తీరుపై క్రీడా సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ● పోటీల నిర్వహణపై ప్రచారమేది...? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన అస్మిత సిటీ లీగ్ బాక్సింగ్ పోటీలపై సంబంధిత అధికారులు కనీసం ప్రచారం చేయకపోవడం ఆరోపణలకు ఊతమిస్తోంది. గతనెల 10వ తేదీన పోటీల నిర్వహణపై శాప్ ఉత్తర్వు లు జారీ చేయగా... సుమారు నెల రోజుల పైబడిన సమయంలో జిల్లా స్థాయిలో కనీస ప్రచారం లేకపోవడం శోచనీయం. శాప్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు పొరుగు జిల్లా క్రీడాకారిణులతో జిల్లాస్థాయి పోటీలు అస్మిత సిటీలీగ్ బాక్సింగ్ పోటీల నిర్వహణపై విమర్శల వెల్లువ భగ్గుమంటున్న క్రీడా సంఘాలు -
● కార్మికుల పొట్టకొట్టొద్దు
కూటమి ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టొద్దని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) శ్రీనివాసమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని కూటమి నేతలు మర్చిపోవద్దన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి కె.సురేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్మి బి.రమణ, శ్రావణ్ కుమార్, సతీష్, ఎర్రిబాబు, పైడిరాజు, సత్యం, అప్పన్న, దేవుడు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకం
విజయనగరం: మహాత్మా గాంధీ కలలు కన్న గ్వామస్వరాజ్య స్థాపన, పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థది కీలకపాత్ర అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగస్వాములైన అధికారులు గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మూడు గ్రామాల సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీడీఓలను సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్, జెడ్పీటీసీ సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, ఎం.శశికళ, వైస్ ఎంపీపీ అచ్చంనాయుడు, జెడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్‌లో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఇన్చార్జి ఏఈ
మక్కువ: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం విద్యుత్ సబ్ స్టేషన్లో ఇన్చార్జి ఏఈగా విధులు నిర్వహిస్తున్న గొర్లె జోగినాయుడు గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరానికి చెందిన రైతు బి.నరసింహరాజుకు మక్కువ మండలం సరాయివలస గ్రామం వద్ద కొంత భూమి ఉంది. ఆ భూములో వ్యవసాయ బోరుబోవి ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం గత కొద్ది రోజుల కిందట విద్యుత్ సబ్ స్టేషన్లో దరఖాస్తు చేశారు. బోరుబావికి కనెక్షన్ ఇవ్వాలంటే మూడు విద్యుత్ స్తంభాలు, వైరింగ్, విద్యుత్ తీగలు ఏర్పాటు చేయా ల్సి ఉందని, రూ.17వేలు లంచం ఇవ్వాలని ఇన్చార్జి ఏఈ జోగినాయుడు రైతును డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రైతు ఈనెల 22వ తేదీన ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో వలపన్నారు. మక్కువ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం రైతు నుంచి రూ.17వేలు లంచం తీసుకుంటున్న జోగినాయుడును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. విశాఖపట్నం ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడిలో విజయనగరం, శ్రీకాకుళం ఏసీబీ సీఐలు మహేష్, భాస్కరరావు, ఎస్ఐ వాసునారాయణ పాల్గొన్నారు. 2023లో మక్కువ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌కో ఏఈగా విధులు నిర్వహించిన పి.శాంతారావు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తరచూ దాడులు జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. వ్యవసాయ బోరు కనెక్షన్ కోసం లంచం డిమాండ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు నరసింహరాజు రూ.17వేలు లంచం తీసుకుంటుండంగా పట్టుబడిన ఇన్చార్జి ఏఈ జోగినాయుడు కేసు నమోదు -
ఎస్టీ నకిలీ సర్టిఫికెట్ల వ్వవస్థను అరికట్టాలి
● కమిషన్ చైర్మన్‌కు ఆదివాసీ జేఏసీ వినతి విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్రలో ఉన్న నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల వ్యవస్థను అరికట్టాలని ఆదివాసీ జాయింట్ ఏక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభ్యులు గురువారం ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావును ఆయన కాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంత భూములపై హక్కులు గిరిజనులకే దక్కేలా చూడాలని, ఇతర దీర్ఘకాల సమస్యలపై ప్రభుత్వ స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్టీల అభ్యున్నతికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో జేఏసీ నాయకులు నిమ్మక జయరాజు, ఆరిక నీలకంఠం, అమర్నాథ్ తదితరులు ఉన్నారు. మద్యం విక్రయదారు అరెస్ట్మెరకముడిదాం: మండలంలోని ఎం.రావివలస గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వుణ్నా కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని బుదరాయవలస ఎస్సై జె.లోకేష్‌కుమార్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం పక్కా సమాచారంతో ఎస్సై జె.లోకేష్‌కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి ఎం.రావివలస గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న వుణ్నా కిరణ్‌కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించగా ఇంట్లో 10 మద్యం బాటిల్స్ దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురం: ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్లమాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఓ మురళీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీటీడబ్ల్యూఆర్‌జేసీ పి.కోనవలస, కురుపాం, భద్రగిరి, ఏపీటీడబ్ల్యూఆర్‌జేసీ (బాలికలు), భద్రగిరిలో ఎంపీసీ–40, బైపీసీ–40, హెచ్ఈసీ–40 సీట్లు చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 7వ తేదీలోగా హెచ్‌టీటీపీఎస్:టీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సమీపంలో గల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు. పత్తి మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నంపార్వతీపురం టౌన్: పట్టణంలోన వైకేఎం కాలనీకి చెందిన ఓ వ్యక్తి పత్తి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైకేఎం కాలనీకి చెందిన వెలగాల శ్రీనివాసరెడ్డి అప్పులు చేసి ఎప్పటికప్పుడు తాగుతుండడంతో భార్య సావిత్రి మందలిస్తూ ఉండేది. బుధవారం రాత్రి కూడా తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెంది గురువారం తెల్లవారు జామున పత్తి మందు తాగేశాడు. కొత్తసమయం తరువాత వాంతులు చేసుకోవడంతో పత్తిమందు వాసన రాగా భార్య సావిత్రి గమనించి 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తీసుకొ రావడంతో వైద్యులు చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక కర్షక మహర్షి ఆస్పత్రికి తరలించారు. నేడు ఏపీఆర్జేసీ గురుకుల ప్రవేశ పరీక్షవిజయనగరం అర్బన్: ఏపీఆర్జేసీ, ఏపీఆర్ఈఐ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులతో గురువారం ఆయన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఆర్ఈఐ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతులలో ప్రవేశం కోసం ఈ నెల 25న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జిల్లాలోని 6 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష కోసం 1,287 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీల్లో ప్రవేశం కోసం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీఆర్జేసీ కోసం 10 కేంద్రాల్లో 2104 మంది అభ్యర్ధులు, ఏపీఆర్డీసీ కోసం 77 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారన్నారు. సమావేశంలో డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, పరీక్షల సహాయ కమిషనర్ టి.సన్యాసిరాజు, ఏపీఆర్ఐఈ జిల్లా కోఆర్డినేటర్ శంబాన రూపవతి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సీతానగరం: మండలంలోని జాతీయరహదారిలో లచ్చయ్యపేట సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గురువారం స్కూటీని వెనుక నుంచి వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.బొబ్బిలి పట్టణానికి చెందిన పట్నాయకుని అనిల్‌కుమార్, భార్య శ్రీదేవి స్కూటీపై సీతానగరంలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ముడుపుల పూజకు వస్తున్నారు. లచ్చయ్యపేట వచ్చే సమయానికి వెనుకనుంచి వస్తున్న బొలెరో వాహనం స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోవడంతో శ్రీదేవి తలకు బలమైన గాయం కాగా ఇద్దరినీ 108 వాహనంలో చికిత్స నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో శ్రీదేవి మృతి చెందింది. ఈ మేరకు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. బైక్‌ను ఢీ కొట్టిన బొలెరో: వ్యక్తికి గాయాలు మండలంలోని జాతీయరహదారిపై లచ్చయ్యపేట– కింతలివానిపేట గ్రామాల మధ్య ఉన్న హనుమాన్ గుడివద్ద మోటార్ సైకిల్‌ను ఎదురుగా వస్తున్న బొలెరో ఢీకొట్టడంతో ఒకరికి గాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలికి చెందిన ఆదిమూలం కిరణ్‌కుమార్ బొబ్బిలి నుంచి పార్వతీపురం బైక్‌పై వస్తున్న సమయంలో పార్వతీపురం నుంచి బొబ్బిలి వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వస్తున్న కిరణ్ కుమార్ రోడ్డుపై పడిపోగా బలమైన గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. క్షతగాత్రుడి తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు. చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతిచీపురుపల్లి రూరల్: గరివిడి మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కోరాడ రామస్వామి(51) అనే వ్యక్తి కొబ్బరిచెట్టు నుంచి కిందికి పడి మృతిచెందాడు.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల మేరకు రామస్వామి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ కొబ్బరి బొండాల కోసం చెట్లు ఎక్కి తీసుకువచ్చి వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలాగానే గురువారం ఉదయం కూడా చీపురుపల్లి మండలంలోని ఆర్ధివలస గ్రామంలో కొబ్బరి బొండాల కోసం చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో బొండాలు తీస్తుండగా కత్తి కాలుకు తగలడంతో చెట్టు నుంచి కిందికి జారి పడిపోయాడు. గాయాలతో ఉన్న రామస్వామిని హాస్పటల్‌కు తీసుకువెళ్లేందకు సమయాత్తమవుతుండగా మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై ఎల్.దామోదరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్‌లు ఢీకొని యువకుడు..రాజాం సిటీ: స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఫైర్‌స్టేషన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బొబ్బిలి పట్టణంలోని సంగవీధికి చెందిన పిట్ట రమేష్ (30) ప్రయా ణిస్తున్న బైక్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో రాజాం నుంచి వస్తున్న బైక్‌ను అదుపుచేసుకోలేక ఢీకొనడంతో రమేష్ రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలైన రమేష్‌ను స్థానికుల సహాయంతో రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందదించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదిలా ఉండగా మరో వాహనదారుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సీఐ అశోక్‌కుమార్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. స్కూటీని ఢీకొట్టిన వ్యాన్ -
అన్నింటిలోనూ టాపరే..
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్లో సర్వర్‌గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. -
మలేరియా పట్ల అప్రమత్తం
● గతంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి ● ప్రస్తుతం మైదాన ప్రాంతంలోనూ అధికంగా కేసుల నమోదు ● సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాల మీదికి ● నేడు ప్రపంచ మలేరియా నివారణ దినంవిజయనగరం ఫోర్ట్: మలేరియా పేరు వినగానే మన్యప్రాంత ప్రజలు వణికిపోతారు. మలేరియా బారిన పడి ఎంతోమంది ఇబ్బంది పడేవారు. మరికొంతమంది వ్యాధితో పోరాటం చేయ లేక మృత్యువాత పడేవారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలోనూ మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లాలో మలేరియా కేసులు కొంతకాలంగా పెరుగుతున్నాయి. మలేరియా వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు మీదికి వచ్చే ప్రమాదం ఉంది. అనాఫిలిస్ దోమ కుట్టడంతో వ్యాధి వ్యాప్తి మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే ఏకకణ పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్న జీవులు ఆడ అనాఫిలిస్ దోమకాటు వల్ల మనిషి నుంచి మరో మనిషికి వ్యాపిస్టుంది. మలేరియా వచ్చినతర్వాత చికిత్స పొందేకంటే దోమతెరలు వాడి దోమకాటును నివారించి, మలేరియా రాకుండా చేసుకోవడం ఉత్తమం. మలేరియాలో రెండు రకాలు మలేరియా వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. అవి వైవాక్స్ మలేరియా, పాల్సి ఫారమ్ మలేరియా. వ్యాధి లక్షణాలు: తీవ్రమైన చలి జ్వరం, రోజువిడిచి రోజు జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, మలేరియా లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికి 800 నుంచి 1000 వరకు కేసులు మలేరియా కేసులు ఏడాదికి 800 నుంచి 1000 వరకు నమోదవుతున్నాయి. 2023–24లో 439 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2024–25లో 805 కేసులు నమోదయ్యాయి. 2025 –26లో ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి.నివారణ చర్యలు మలేరియా సోకిన పిల్లలు, గర్భిణులకు చికిత్స చేయించడంలో జాప్యం చేయకూడదు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకమవుతుంది. మలేరియా వ్యాధి నిర్ధారణ అయిన గర్భిణులు 3 వనెల నుంచి ప్రసవించే వరకు వారానికి రెండు క్లోరోక్విన్ మాత్రలు వాడడం ద్వారా మలేరియా వ్యాధిని నివారించవచ్చు. ● సింథటిక్ ఫైరిడ్రాయిడ్ క్రిమిసంహారక మందును ఇంటి లోపల అన్ని గదులలోను పైకప్పు లోపలి భాగంలో పిచికారీ చేసి తుడవడం గాని, గోడలను అలకడం గాని చేయకుండా చూడాలి ● ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి ● సాయంత్రం వేళ వేపాకు పొగ రూపంలో దోమలను పారదోలవచ్చు ● జ్వరం వచ్చిన వారందరూ ఉచితంగా రక్త పరిక్ష చేయించుకుని ఒక రోజు క్లోరోక్విన్ మాత్రలు వేసుకోవాలి ●నీరు నిల్వ ఉండే గోలాలు, ఎయిర్ కూలర్లు, వారానికి ఒకసారి ఖాళీ చేసి బాగా తడి ఆరిన పిమ్మటనే మళ్లీ నీరు పెట్టాలి. వీధి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేలా చూడాలి ● బావుల్లోను, పూడ్చ లేని కందకాలలోను దోమ లార్వాలను తినే గంబూషియా చేపపిల్లలను విడిచిపెట్టి దోమలు పెరగకుండా చేయవచ్చు. ప్రతి ఇంట్లోను దోమల మందు పిచికారీ చేయించుకోవాలి. దోమతెరలు వాడితే మంచిది. మలేరియా నివారణకు చర్యలు మలేరియా నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. మలేరియా నివారణలో భాగంగా దోమలను నివారించేందుకు ఏడాదికి రెండుసార్లు స్ప్రేయింగ్ చేపడుతున్నాం. సచివాలయం సీహెచ్‌ఓలు, ఏఎన్ఎంల వద్ద కూడా మలేరియా టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వారు గ్రామస్థాయిలోనే మలేరియా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్ఓ -
విద్యార్థి ఆత్మహత్య
రామభద్రపురం: చైన్నె వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తున్న తల్లిదండ్రులకు ఓ బాలుడు తీరని శోకం మిగిల్చాడు. పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో రిజల్ట్స్’ రాకముందుగానే ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొట్టక్కి గ్రామానికి చెందిన కర్రి దుర్గాప్రసాద్(15) తల్లిదండ్రులు పార్వతి, పార్వతీశం చైన్నె వలస వెళ్లడంతో కొట్టక్కిలోని అమ్మమ్మ పెంటమ్మ వద్ద ఉంటూ అక్కడే ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు రాశాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలు 23న విడుదల కానున్నాయని ప్రకటన వెలువడడంతో ఫెయిలవుతానని భయంతో ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి వెంటనే సాలూరు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. విద్యార్థి అనుమానించినట్లుగానే పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అమ్మమ్మ పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. పదవ తరగతిలో ఫెయిలవుతానని భయం -
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
కొత్తవలస: విజయనగరాన్ని సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎకై ్సజ్ శాఖ సహాయ కమిషనర్ పైడి రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొత్తవలస మండల కేంద్రంలో గల ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను, నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించి తగు సూచనలు సలహాలను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవోదయం–2.0 కార్యక్రమాన్ని వచ్చేనెల 3వ వారంలోగా పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్ పరిధిలో గల వేపాడ, కొత్తవలస, లక్కవరపుకోట మండలా పరిధిలోని గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో బెల్లం అమ్మకాలు చేస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. బెల్లం వ్యాపారస్తులు ప్రతి 15 రోజులకు ఒక పర్యాయం బెల్లం అమ్మకాలకు సంబంధించిన నివేదికలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని స్పష్టం చేశారు. సిబ్బంది సారా తయారీ దారులతో కుమ్మకై నట్లు రుజువైతే వేటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ జీఎస్.రాజశేఖరనాయుడు, ఎస్సైలు వీఎన్.రాజు, ఎన్.రమశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు -
160లీటర్ల సీరాతో వ్యక్తి అరెస్టు
పార్వతీపురంటౌన్: 160లీటర్ల సీరా కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు బుధవారం కృష్ణపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా 160 లీటర్ల సారా దొరకడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి బైక్ సీజ్ చేసి కేసు నమెదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో హెచ్‌సీ నుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సహకరించండి
పార్వతీపురంటౌన్: జిల్లాలో అవసరమైన చోట్ల నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా బీఎల్ఓలకు సంపూర్ణ సహకారం అందించాలని, బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం సూచించిన ప్రొఫార్మాలో ఏజెంట్ల నియామకానికి సంబంధించి వివరాలు పంపాలని ఆమె కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన చాంబర్లో బుధవారం డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 800–1200 మంది ఓటర్ల ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి విభజించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ఓటర్లకు 2 కి.మీ లోపల పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో ఓటర్లకు అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు. అదేవిధంగా ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి వివరాలను అందజేస్తూ బీఎల్ఓలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఎలను నియమించుకోవాలి రాజకీయ పక్షాల ప్రతినిధులను కోరిన డీఆర్ఓ -
ఏఓబీలో ఎకై ్సజ్ దాడులు
పార్వతీపురంటౌన్: ఒడిశా సరిహద్దు గ్రామాలైన సందుబడి, తుంబాలిభాయ్, పనుసత్ర గ్రామాల్లో విస్తృతంగా దాడులు జరిపి 7,700 లీటర్ల బెల్లపు ఊట, 360 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ బి.శ్రీనాథుడు తెలిపారు. అలాగే 3వేల కేజీల విప్పపువ్వు, 2,400 కిలోల నల్ల బెల్లం, 3,900 కిలోల అమోనియం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎకై ్సజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ దేశ్ శర్మ ఆదేశాల మేరకు పార్వతీపురం జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం–ఒడిశా రాష్ట్ర ఎకై ్సజ్ సిబ్బంది, కురుపాం, జీఎల్‌పురం పోలీస్ సిబ్బంది సహకారంతో విస్త్తృత దాడులు జరిపినట్లు తెలిపారు. బెల్లం ఊట, సారా, విప్పపువ్వు, నల్ల బెల్లం, అమోనియం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు వ్యక్తులపై రెండు కేసులను నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించి సారా తయారీ కేంద్రాలను గుర్తించి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, సీతానగరం, సాలూరు, విజయనగరం, ఈఎస్టీఎఫ్ సాలూరు మొబైల్ పార్టీ, పార్వతీపురం మన్యం అధికారులు, సిబ్బంది, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బెల్లపు ఊట, సారా ధ్వంసం విప్పపువ్వు, నల్లబెల్లం, అమోనియ స్వాధీనం ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ -
మొబైల్ ట్రాకింగ్ సేవలు సులభతరం
విజయనగరం క్రైమ్: గడిచిన ఆరునెలల్లో పోయిన మొబైల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పోలీస్‌కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.ఆరుకోట్ల విలువైన 3,300 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ మేరకు డీపీఓలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోయిన మొబైల్ ఫోన్ కోసం ఫిర్యాదుకు ప్రత్యేకించి జిల్లా కేంద్రానికి రావనసరం లేదన్నారు. సైబర్‌సెల్ పోలీస్‌స్టేషన్‌కు కూడా వచ్చి ఫిర్యాదు చేయనవసరం లేదన్నారు. పోయిన సెల్ఫోన్లపై 8977945606 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, ముందుగా హాయ్ అని మెసేజ్ చేస్తే మా శాఖే ఓ యూఆర్ఎల్ను పంపుతుందని అందులో ఫిర్యాదు దారు వివరాలు, ఫోన్ నంబర్ ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేస్తే మొబైల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఫోన్ ట్రేస్ అవుట్ చేస్తామని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా 264 ఫోన్లను మొబైల్ట్రాకింగ్ విధానం ద్వారా ట్రేసవుట్ చేశామని తెలిపారు. ఫిర్యాదుదారులు సైబర్‌సెల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఐఎంఐఈ నంబర్ చెప్పి ఫోన్ పొందవచ్చని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, నగర డీఎస్పీ శ్రీనివాస్, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ లీలారావు, సైబర్ సెల్ ఎస్సై నజీమాబేగం, సైబర్ సెల్ సిబ్బంది వాసుదేవ్, తిరుపతి నాయుడు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి రాకుండా ఫిర్యాదు ప్రత్యేకించి వాట్సాప్ నంబర్ విడుదల -
జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ‘తోషిని’
తెర్లాం: రాష్ట్రస్థాయిలో జరుగుతున్న దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీల్లో తెర్లాం హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని అడ్డా తోషిని ‘బోసి గేమ్’ వ్యక్తిగత హయ్యర్ ఎబిలిటీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్‌ను కై వసం చేసుకోడంతోపాటు, దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 21–23వరకు నూజివీడులోని అగిరిపల్లి హిల్ పారడైజ్ స్కూల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్స్ భారత్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెర్లాం హైస్కూల్ నుంచి రాష్ట్రస్థాయి బోసి గేమ్ పోటీలకు హాజరైన తోషిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. అలాగే జూలై నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ఎంపికై ంది. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచిన ఆమె సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది. ఈ సందర్భంగా తోషినిని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు, జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, తెర్లాం హైస్కూల్ హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎస్కార్ట్ సునీల్ అభినందించారు. బ్యాడ్మింటన్‌లో కాంస్యపతకం దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 రాష్ట్రస్థాయి పోటీల్లో తెర్లాం హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి కొప్పర విజయకుమార్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్రస్థాయిలో తృతీయస్థానాన్ని సాధించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. విజయకుమార్‌కు రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ సంచాలకుడు శ్రీనివాసరావు పతకాన్ని అందజేసి అభినందించారు. రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని -
అనుమానాస్పద స్థితిలో పారిశుధ్య కార్మికుడి మృతి
భామిని: మండలంలోని తాలాడకు చెందిన పారిశుధ్య కార్మికుడు గొర్లె భీముడు(52) బుధవారం సీతంపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడ్డాడని బత్తిలి ఎస్సై డి.అనిల్‌కుమార్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి గ్రామంలో జరిగిన తగాదాలో గాయపడి అపస్మారకస్థితిలో పడి ఉన్న గోర్లె భీముడు(52)ను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన భార్య రోదిస్తూ తెలిపిందని చెప్పారు. ఈ సంఘటనపై పాలకొండ సీఐ చంద్రమౌళి తాలాడ గ్రామాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీమ్‌కు వివరాలు అందివ్వాలని గ్రామస్తులను సూచించారు. గొర్లె బీముడు(52)మృతిపై భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పాలకొండ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. -
బాలికను కాపాడిన కానిస్టేబుల్
● ప్రశంసాపత్రం అందజేసిన ఎస్పీ విజయనగరం క్రైమ్: నగరంలో ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన ఓ బాలికను టూటౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ కాపాడినందుకు ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తన చాంబర్లో ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. డయల్ 112కు వచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్ నగర్‌లోని ఓ ఆపార్టెమెంట్లో 17 ఏళ్ల బాలిక తలుపులేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న సమాచారాన్ని కానిస్టేబుల్ జగదీష్ అందుకున్నారు.సీఐ శ్రీనివాస్ ఆదేశాలతో ఆ అడ్రస్‌కు వెళ్లి సదరు బాలికను ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. విచారణలో బాలిక చదువును నిర్లక్ష్యం చేయడం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నందున తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. ఎస్పీ ఆదేశాలతో టూటౌన్ సీఐ శ్రీనివాస్ బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించారు.పాచిపెంటలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటనపాచిపెంట: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు పాచిపెంట మండలంలో బుధవారం పర్యటించారు. మండలంలోని పెద్దగెడ్డ నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని కొటికిపెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. అలాగే పెద్దగెడ్డ జలాశయం గిరిజన మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్, వలలు, పడవలు ప్రభుత్వం నుంచి ఉచితంగా అందజేయాలని కోరారు. కుడుమూరు రెవెన్యూ సర్వేనంబర్ 48లో గిరిజనులు సాగుచేస్తున్న సుమారు ఎనిమిది వందల ఎకరాల భూమికి సంబంధించి గిరిజన రైతులకు పట్టాలు అందించాలని, గిరిజన రైతు సూకురు అప్పలస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంట స్థానిక తహసీల్దార్ డి.రవి, ఆర్ఐ రమణ ఉన్నారు.మహిళపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్జియ్యమ్మవలస: మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడిన చినమేరంగి గ్రామానికి చెందిన సిరిపురపు నానిని చినమేరంగి ఎస్సై పి.అనీష్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వివాహితను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన సిరిపురపు నానిపై బాధితురాలు, ఆమె భర్త ఇటీవల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి కోర్డుముందు హాజరు పర్చామని తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని సీఐ చెప్పారు. మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, లైంగికదాడులకు పాల్ప డితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోక్సో కేసులో ముద్దాయికి పదేళ్ల జైలు శిక్షజియ్యమ్మవలస: మండలంలోని కన్నపుదొరవలస గ్రామానికి చెందిన సామల నవీన్ అనే వ్యక్తికి పోక్సోకేసులో పదేళ్ల జైలు శిక్ష పడిందని ఎస్సై అనీష్ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముద్దాయి సామల నవీన్(26)పై 25.3.2021లో చినమేరంగి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి కోర్టు విజయనగరం వాదోపవాదనల తరువాత నేరారోపణ రుజువు కావడంతో పదేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగమణి బుధవారం తీర్పు వెల్లడించారు. ముద్దాయికి శిక్ష పడేవిధంగా దర్యాప్తు నిర్వహించిన సీఐ తిరుపతిరావు, ఎస్సై బి.శివప్రసాద్, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన ఎస్సై అనీష్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ మాధవరెడ్డి అభినందించారు. -
వైభవంగా కోదండ రామస్వామి వార్షిక కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని నీలాచలం పర్వతంపై ఉన్న కోదండ రామాలయంలో శ్రీ కోదండ రాముడి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. బహుళ దశమిని పురస్కరించుకుని ఏటా కొండపై ఆలయంలో కోదండుడి కల్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో స్వామికి వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత స్వామివారి ఉత్సవ మూర్తులను ఆస్థాన మంటపంలో వేంచేపు చేసి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
అప్రోచ్ రోడ్డు రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
పూసపాటిరేగ: విమానాశ్రయానికి వెళ్లే రహదారిలోని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు విమానాశ్రయానికి సంబంధించిన వివిధ సమస్యలపై అప్రోచ్ రోడ్లో గుడెపువలస, రావివలస అమటాం, సవరవిల్లి, దల్లిపేట,బైరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన రహదారిలో బుధవారం ఆయన పర్యటించారు. ప్రధాన సమస్య అయిన విమానాశ్రయానికి వెళ్లే అప్రోచ్ రోడ్డులో పొలాల్లోకి రహదారి సౌకర్యం కల్పించాలని రైతులు, నాయకులు కోరారు. అప్రోచ్ రోడ్డుకు ఇరువైపులా భూమి ఎంత ఉందో కొలతలు వేయాలని అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే అప్రోచ్ రోడ్డు రహదారికి భూములు ఇచ్చినప్పటికీ కోర్టు వివాదంలో పరిహారం అందలేదని నాయకులు మట్ట అయ్యప్ప రెడ్డి, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, యర్ర అప్పల నారాయణ తదితరులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా అధికారులతో మాట్లాడి పరిహారం వచ్చేలా చూస్తానని కలెక్టర్ చెప్పారు. గతంలో విమానాశ్రయ ఆర్అండ్ఆర్ కాలనీలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ 22ఏ లో ఉండడంతో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిపాదనలు పంపండి అలాగే అప్రోచ్ రోడ్డు నుంచి అమకాం గ్రామానికి వెళ్లేందుకు రహదారి కావాలని ఆ గ్రామ నాయకులు కోరడంతో సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంపాడపేట శ్మశాన వాటిక సమస్య ఆయన దృష్టికి రావడంతో స్థలాన్ని ఖరారు చేసి పంపితే అనుమతులు ఇస్తానని చెప్పారు. అమటాం రావివలస వద్ద అండర్ పాత్ కావాలని గ్రామస్తులు కోరగా అందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎయిర్పోర్ట్ ప్రతినిధులు రామరాజు, సర్పంచ్ ఉప్పాడ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు సూర్యనారాయణ మూర్తి రాజు, కోరాడ తాతారావు, కొత్తయ్య రెడ్డి, కొల్లి రామ్మూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
రైల్వే ప్లాట్‌ఫాంపై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ సిబ్బంది ఇచ్చిన వివరాల మేరకు విజయనగరం రైల్వేస్టేషన్‌లోని 4వ నంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద నాలుగో రైల్వేలైన్ వద్ద సుమారు 5.6 అడుగుల మృతదేహం పడి ఉంది. చామనఛాయ రంగు, లేత నీలిరంగు దుస్తులు ధరించి ఆ వ్యక్తిని ఎవ్వరూ గుర్తించకపోవడంతో తామే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089,6301365605 నంబర్లు, ల్యాండ్ లైన్ నంబర్ 0891–2883218 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
పహల్గాం దాడి పిరికిపంద చర్య
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ● సజావుగా స్థాయీ సంఘ సమావేశాలు విజయనగరం రూరల్: జమ్ముకశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని, ఈ దాడిని భారతీయులంతా ఖండిస్తున్నారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కాల్పులకు ప్రతిచర్యగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రధాని మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన బుధవారం స్థాయీసంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని సన్నద్ధంగా ఉండాలన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. విత్తనాలు తప్పుదారిన దళారుల చేతికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు సక్రమంగా పనిచేయాలని సూచించారు. కేజీబీవీ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఆయన మాట్లాడుతూ ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా పరిషత్ నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పరీక్ష తప్పిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిగతంగా వాళ్లకు సహాయం అందించాలని సూచించారు. అనంతరం పహల్గాం దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఈ ఘటనను ఖండిస్తూ జిల్లా పరిషత్‌లో తీర్మానం చేశారు. -
గంజాయి కేసులో ఐదవ నిందితుడి అరెస్టు
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్ పోస్టు వద్ద ఫిబ్రవరి 10వ తేదీన ఒడిశా నుంచి అక్రమ రవాణా జరుగుతున్న 147 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడగా కారు వదిలేసి అందులో ఉన్న నిందితులు పరారైన వారిలో నలుగురిని గత నెల 31న పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో సీఐ నారాయణరావు, ఎస్ వి ప్రసాదరావులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాపుచేయడంతో మండలకేంద్రంలోని బైసాస్ రోడ్డులో మంగళవారం ఐదవ నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అరకు మండలం తురాయిగూడ గ్రామానికి చెందిన కొర్రా కోగేశ్వరరావు ఇంటర్మీడియట్ పాసై అరుకులో శ్యామ్గణేష్ ఫంగి అనే మెడికల్ షాపులో యజమాని వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఫంగి మెడికల్ షాపు నిర్వహిస్తూ కొర్రా కోగేశ్వరరావు ద్వారా ఒడిశా నుంచి కొద్దికొద్దిగా గంజాయి అక్రమరవాణా చేస్తూ పెందుర్తిలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులకు సరఫరాచేసేవాడు. 2024 ఫిబ్రవరిలో కారులో 150 కిలల గంజాయి అక్రమరవాణా చేస్తూ శ్యామ్గణేష్ పంగితో పాటు కారు డ్రైవర్ కొర్రా కోగేశ్వరరావులు పోలీసులకు పట్టుబడ్డారు.అప్పట్లో వారిపై కేసునమోదు చేసి వైజాగ్ సెంట్రజైల్కు తరలించారు.జైలులో ఉన్న సమయంలో కోగేశ్వరరావుకు మరో గంజాయి స్మగ్లర్ శెట్టి ఉమామహేశ్వరరావు పరిచయమయ్యాడు.వారిద్దరు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి అక్రమరవాణా ప్రారంభించారు. ఈ క్రమంలో పెదబయలు నుంచి ఈఏడాది ఫిబ్రవరి 10వ తేదీన కారులో గంజాయి తరలిస్తూ కొట్టక్కి వద్ద పోలీసులకు పట్టుపడడంతో కారు వదిలేసి పరారయ్యారు. మార్చి 31న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలించగా మంగళవారం కారు డ్రైవర్ కోగేశ్వరరావు పట్టుబడ్డాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన మరి కొంతమంది నిదింతుల కోసం గాలిస్తున్నారు. -
రెండు కేజీల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో జీఆర్పీ సిబ్బంది రెండు కేజీల గంజాయిని మంగళవారం పట్టుకున్నారు. జీఆర్పీ ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం జీఆర్పీ ఇన్స్పెక్టర్ రవి కుమార్ సూచనలతో ఎస్సై బాలాజీ, హెచ్‌సీ కృష్టారావులు విజయనగరం రైల్వేస్టేషన్లో తనిఖీ చేసి ఒడిశాకు చెందిన వ్యక్తి రాయగడ ట్రైన్లో విశాఖకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు కేజీల గంజాయి, రూ.పదివేల నగదు స్వాధీనం చేసుకున్నామని జీఆర్పీ ఎస్సై బాలాజీ చెప్పారు. -
దళితుల సామాజిక బహిష్కరణ దారుణం
● జైభీమ్‌రావు భారత్ పార్టీ ప్రతినిధులు నెల్లిమర్ల రూరల్: సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడం దారుణమని జై భీమ్రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మండలంలోని సతివాడ గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో ఘటన జరగడం అగ్రకులాల దురహంకారానికి నిదర్శనమన్నారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని, దళిత వ్యక్తిని చంపినప్పటికీ ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామస్తులపై అట్రాసిటి కేసులు నమోదు చేసి, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఇళ్ల స్థలాల పంపిణీలో జాప్యం
విజయనగరం గంటస్తంభం: కార్పొరేట్లకు లక్షల ఎకరాలు ధారాదత్తం చేస్తున్న కూటమి పాలకులు పేదోడికి 2 సెంట్లు ఇంటి స్థలం అడిగితే లేదని చెప్పడం చంద్రబాబు మోసకారితనానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటివరకూ పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మిగింలిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో 2సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్ధలాలు ఇచ్చి ఇంటి నిర్మాణనికి రూ.5 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలి. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ. సర్వేల పేరిట కాలక్షేపం సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇల్లు కట్టుకునేందుకు సొంత స్ధలం ఉన్నవారు చాలామంది ముందుకొస్తున్నారన్నారు. గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014–19 టీడీపీ పాలనలోనే ఇదే పరిస్ధితి నెలకొంది. తొలుత మూడేళ్లపాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి 2019 ఎన్నికలు దగ్గరపడ్డాయి. టీడీపీ ఓటమి పాలైంది. ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.పేదలకు రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పూర్తిగా అప్పగించకుండా నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్మించారు. ఇళ్ళ స్థలాలు, ఇంటి పట్టాలు పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఆనందరావు, ఎస్.రంగరాజు, కోట అప్పన్న, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు లక్షల ఎకరాలు ధారబోత ఇంటిస్థలం ఇచ్చేవరకు పోరాటం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య -
మంత్రి ఇలాకాలో మట్టిమాఫియా
● స్థానిక టీడీపీనేత అండతో దందా ● యథేచ్ఛగా తరలింపు ● చోద్యం చూస్తున్న అదికారులుగజపతినగరం రూరల్: నియోజకవర్గంలోని మరుపల్లి గ్రామం మధ్యలో ఉన్న కోనేటిలోనుంచి గడిచిన కొన్ని రోజులుగా మట్టిమాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరులను దోచేస్తు అడ్డదిడ్డంగా టీడీపీ తమ్ముళ్లు సంపాదించుకుంటన్నారు. గ్రామం మధ్యలో ఉన్న కోనేటిలోని మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిమాఫియాకు కేరాఫ్ మరుపల్లి నియోజకవర్గంలోని మరుపల్లి గ్రామంలో గతంలో ఆదర్శపాఠశాలను ఆనుకుని ఉన్న కొండనుంచి మట్టిని అక్రమంగా తరలించి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు సొమ్ముచేసుకున్నారు. పగటిపూట అయితే ఎవరి కంటైనా పడతామని రాత్రి సమయంలో జేసీబీలతో అక్రమంగా మట్టిని తరలించేవారు. ప్రస్తుతం కొండప్రాంతంలో మట్టి తరలింపునకు పుల్‌స్టాప్ పెట్టడంతో నేరుగా గ్రామంలో ఉన్న కోనేటి చెరువుపై పడ్డారు. అనుమతులు ఏవీ? గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రాంతం నుంచైనా మట్టిని తీయాలంటే స్థానిక పంచాయతీ అనుమతులు, తీర్మానం ఉండాలి. అలాగే రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది కూడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండానే నేరుగా మట్టిని తరలించేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. పంచాయతీ అనుమతులు ఇవ్వాలి గ్రామంలోని చెరువుల్లోంచి మట్టిని తీసుకోవాలంటే స్ధానిక పంచాయతీ అనుమతులు తీసుకోవాలి. రెవెన్యూ నుంచి మట్టి తరలించేందుకు ఎవరీకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. – రత్నకుమార్ తహసీల్దార్ సర్పంచ్ భర్త తోలుకోమన్నారు కోనేరులోని దెప్పులుగా ఉన్న మట్టిని స్థానిక సర్పంచ్ భర్త సత్యనారాయణ తీసుకెళ్లమన్నారు. ఆయన చెప్పారని మట్టిని ట్రాక్టర్‌తో తీసుకెళ్తున్నాం. – గౌరినాయుడు, మట్టి తరలింపుదారు కోనేరు లోతు అవుతుందని గ్రామంలో ఉన్న కోనేరులో మట్టి తరలిస్తే లోతు ఎక్కువవుతుందని చెప్పాం. మట్టి తరలింపునకు ఎటువంటి తీర్మానం చేయలేదు.డబ్బులు ఎవరి దగ్గరా తీసుకోలేదు. – లెంక సత్యనారాయణ, టీడీపీ నాయకుడు మరుపల్లి -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.24 నుంచి వేసవి సెలవులుపార్వతీపురంటౌన్: ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి రమాజ్యోతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. జూన్ 5వ తేదీన స్కూల్ రెసిడెన్షియల్ కార్యక్రమాల కోసం ఉపాధ్యాయులు పాఠశాలల్లో రిపోర్టు చేయాలని ఆమె స్పష్టం చేశారు. నాణ్యమైన జీడి పిక్కలు కొనుగోలు చేయాలి● జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక కొమరాడ: జీడి పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కొమరాడ మండలం చోళ్లపధం గ్రామంలోని జీడి పిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను పరిశీలించి రికార్డుల మేరకు సక్రమంగా ఉన్నదీ, లేనిది తనిఖీ చేశారు జిల్లాలో జీడి పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, నాణ్యమైన జీడిపిక్కలు కొనుగోలు చేసి రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. జీడి బస్తాలను గిడ్డింగిలో జాగ్రత పరచాలని, పరిశ్రమకు తరలించే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే వీడీవీకే సభ్యులు, జీడి రైతులతో సంభాషించి సంబంధిత అధికారులు పలు మార్గదర్శకాలను జారీచేశారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సురేష్, ఏఓ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి● ఇద్దరికి తీవ్ర గాయాలు గంట్యాడ: మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతానికి చెందిన గద్దెపల్లి దినేష్, గద్దెపల్లి సింహాద్రి, మంగమ్మపేటకు చెందిన గరికిన కార్తీక్‌లు అరకు వెళ్లి మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై విశాఖ వెళ్లిపోతుండగా కొండతామరపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ దాటిన తర్వాత జాతీయ రహదారిపై కానాను బలంగా ఢీకొట్టడంతో బైక్‌పై నుంచి ముగ్గురూ ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో దినేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సింహాద్రి, కార్తీక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108 అంబులెన్సులో గాయపడిన వారిని చికిత్స కోసం, దినేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
గంజాయి నిందితుల ఆస్తులు జప్తు చేయాలి
పార్వతీపురం రూరల్: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే నిందితుల ఆస్తులను జప్తు చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో పలు జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో డీఐజీ వెల్లడించినట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. అలాగే గంజాయి కేసుల్లో ఉన్న నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరాన్ని డీఐజీ తెలియజేసినట్లు చెప్పారు. గంజాయి రవాణా నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు ప్రారంభించాలని ఆదేశించారని, తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టుచేసి వారిపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు తక్షణమే అమలు చేయాలని ఆదేశించారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి నేరాల నిరోధంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చి సీసీటీవీలు, డ్రోన్ల సహాయంతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి దర్యాప్తు నిర్వహించాలని, సైబర్ క్రైం, అలాగే సోషల్ మీడియాలో వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని సైబర్ మోసాల పట్ల ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని, టోల్‌ఫ్రీ నంబర్ 1930 వినియోగం ప్రజలకు తెలియజేయాలని డీఐజీ ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో గంజాయికి అడ్డుకట్ట విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మంత్రి అనిత ఆదేశాలతో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తన కార్యాలయంలో ఐదు జిల్లాల ఎస్పీలతో మంళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాఽథ్ జెట్టి గంజాయి అక్రమరవాణా, వినియోగ నియంత్రణ, నిందితుల అరెస్ట్, వారి ఆస్తుల జప్తుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
మే నెలాఖరులోగా సారా రహిత జిల్లా
విజయనగరం అర్బన్: మే నెలాఖరు నాటికి సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ కోరారు. సారాకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్‌కు 14405కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో సారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని మంగళవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా సారా తయారీ కానీ, వినియోగం కానీ జరగడం లేదని అన్ని పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకునే ప్రక్రియను మే 15లోగా పూర్తి చేయాలని కోరారు. అలాగే మండలాల నుంచి తీర్మానాలను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమం అమలు, తీసుకున్న చర్యలను ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.శ్రీనాథుడు వవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఆర్డీఏ పీడీ కల్యాణ్‌చక్రవర్తి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డీఎస్పీ వీరకుమార్, అబ్కారీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 14405 జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ -
ఐపీఎస్ టు ఐఏఎస్
గంట్యాడ: సివిల్స్ ఫలితాల్లో గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్ సత్తాచూపాడు. హైదరాబాద్‌లో ఐపీఎస్‌లో శిక్షణ పొందుతూ సివిల్స్‌లో 455 ర్యాంక్ సాఽధించారు. ఆయన తల్లి పద్మ గృహణికాగా, తండ్రి విజయనగరం ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలన్నది భార్గవ్‌కు చిన్నప్పటి నుంచి కోరిక. ఐఏఎస్ అయితేనే అది నెరవేరుతుందని భావించారు. అందుకనుగుణంగా ప్రణాళికయుతంగా చదివారు. విజయనగరంలో 10వ తరగతి వరకు చదివి, పదోతరగతిలో 567 మార్కులు సాధించారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు చదివి 928 మార్కులు సొంతం చేసుకున్నారు. అనంతరం ముంబయిలోని ఐఐటీలో మెటలార్జికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఏడాదికి రూ.16.5 లక్షల ప్యాకేజీతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో 15 నెలలు పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. సమాజంలో ఎక్కువ మందికి సేవచేయగలగాలంటే అది సివిల్స్‌తో సాధ్యమని నమ్మి పరీక్షకు సిద్ధమయ్యారు. రాత్రీపగలు శ్రమించి గతేడాది సివిల్స్‌లో 590 ర్యాంక్ సాధించారు. ఐపీఎస్‌లో చేరారు. ఈ సారి ఏలాగైనా ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సివిల్స్ పరీక్షకు సిద్ధమై 455 ర్యాంకును సాధించారు. ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మా అబ్బాయికి సివిల్స్ ఫలితాల్లో 455 ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. దానికి అనుగుణంగా మా అబ్బాయిని ప్రోత్సహిస్తూ వస్తున్నాం. మా నమ్మాకాన్ని నిలబెట్టాడు. – పొటుపురెడ్డి పద్మ, సత్యం, భార్గవ్ తల్లిదండ్రులు -
ప్రాధాన్యతా క్రమంలో జలవనరుల అభివృద్ధి
విజయనగరం అర్బన్/గుర్ల: జిల్లాలోని జలవనరుల అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సూక్ష్మ, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రాజక్టుల అభివృద్ధి, ప్రతిపాదనల పనుల వివరాలను జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తోటపల్లి ఎడమ కాలువ నిర్మాణ పనుల ప్రతిపాదనలపై సమీక్షించిన సమయంలో ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 49 అభివృద్ధి పనులను ప్రతిపాదించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా మీకు మీరే ప్రతిపాదనలు తయారు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు పరిశీలించామని, ప్రాజెక్టు పనులు 90 శాతం, కాలువ పనులు 60 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు పూర్తిచేసేందుకు రూ.807 కోట్లు అవసరమవుతాయన్నారు. పనులు పూర్తయితే విజయనగరం పట్టణానికి తాగునీరు, భోగాపురం ఎయిర్ పోర్టుకు నీటి సరఫరాకు అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి నదీ జలాలతో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ జూన్ నాటికి పూర్తిచేసి గోదావరి నుంచి వంశధార వరకు అనుసంధానం చేసి ఉత్తరాంధ్రకు సాగునీరందిస్తామన్నారు. దీనికోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6,500 కోట్లను కేటాయించినట్టు స్పష్టంచేశారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పార్వతీపురం డివిజన్లో 8 పనులు, రాజాం, చీపరుపల్లిలో 4 పనుల తీరును అధికారులను అడిగి మంత్రి తెలుసుకు న్నారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు కోండ్రు మురళి, లోకంనాగమాధవి, పి.అధితిగజపతిరాజు, మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు, ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు, నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజినీర్ డి.రాంగోపాల్, విజయనగరం బొబ్బిలి ఎస్ఈలు స్వర్ణకుమార్, అప్పారావు, వివిధ ప్రాజెక్టుల ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
రామనారాయణాన్ని సందర్శించిన దేవిశ్రీప్రసాద్
విజయనగరం రూరల్: విజయనగరంలోని ఆధ్యా త్మిక పర్యాటక కేంద్రం రామానారాయణంను సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో గోడలకు చెక్కిన రామాయణం ఘట్టాలను తిలకించారు. రామనారాయణం పరిశోధన కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి కేంద్రాన్ని సందర్శించారు. ఈ ప్రదేశం ఎంతో పవిత్రతను సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. ఆలయ అర్చకుడు చాణక్య, శ్రీహర్ష ప్రత్యేక పూజలుచేసి దేవీశ్రీ ప్రసాద్‌కు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఎన్సీఎస్ ట్రస్టు సభ్యులు నారాయణ శ్రీనివాస్ జ్ఞాపికను బహూకరించారు. -
సివిల్స్ లక్ష్యంగా...
రాజాం సిటీ: రాజాం పట్టణం ఈశ్వరనారాయణకాలనీలో నివసిస్తున్న సారథి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ చిన్నప్పటి నుంచి చదువులో చురుకై న విద్యార్థి. ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఆయన ఆశయాన్ని తల్లిదండ్రులు ఈశ్వరమ్మ(గృహిణి), విష్ణు (జి.సిగడాం మండలం పాలఖండ్యాం యూపీ పాఠశాల హెచ్ఎం) ప్రోత్సహించారు. ఇంజినీరింగ్ అనంతరం ఉద్యోగాన్వేషణలో వచ్చిన ఉద్యోగాలు కూడా సంతృప్తినివ్వకపోవడం, అధికమందికి సేవచేయాలన్న సంకల్పంతో కఠోర దీక్షతో సివిల్స్ లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించించారు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 830వ ర్యాంకు సాధించారు. ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు రాజాంలోని శారదా కాన్వెంట్లో చదివి 557 మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ విద్యను స్థానిక వేదగాయత్రి కళాశాలలో పూర్తిచేసి ఎంపీసీలో 948 మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. జీఎంఆర్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. తొలిప్రయత్నంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా పీఓగా ఎంపికై నా చేరలేదు. స్టేట్‌బ్యాంకు క్యాషియర్‌గా రెండున్నరేళ్లు పనిచేసినా ఆయన తన లక్ష్యాన్ని మరువలేదు. పుస్తకాలతో స్నేహం చేశారు. పట్టదలతో చదివి గ్రూప్–1 పరీక్షలను రాసి రెండో ప్రయత్నంలోనే స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. అనంతరం అంతిమ లక్ష్యం సివిల్స్‌పై దృష్టిసారించారు. లక్ష్యసాధనలో మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలు ఎదుర్కొని నాలుగో ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. ఆయన ఎంపిక పట్ల కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయనే ప్రేరణ.. పదో తరగతి చదువుతున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రేవు ముత్యాలరాజు సివిల్స్‌కు ఎంపిక కావడంతో ఆయనను ప్రేరణగా తీసుకున్నా. ఎప్పటికైనా సివిల్స్ సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మూడు సార్లు ఇంట ర్వ్యూకు హాజరై విఫలమైనా నిరుత్సాహపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగాను. చివరి ప్రయత్నంలో సివిల్స్‌లో విజేతగా నిలిచాను. – వావిలపల్లి భార్గవ, సివిల్స్ 830వ ర్యాంకర్ -
● రోడ్డు పూర్తిచేయండి ప్లీజ్..!
చిత్రంలో కనిపిస్తున్నది బొబ్బిలి మండలంలోని డొంగురువలస, కొత్తవలస, కేశాయివలస గ్రామాలకు వెళ్లే రోడ్డు. మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.90 లక్షలు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఇంతలో అటవీశాఖ అభ్యంతరం తెలపడం, ప్రభుత్వం మారడంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా రోడ్డు పనులను కనీసం పట్టించుకోవడంలేదని, అటవీశాఖ అనుమతులు తెచ్చి రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు. అసంపూర్తిగా నిలిచిన రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. – బొబ్బిలిరూరల్ -
● సీహెచ్‌ఓల ధర్నా
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. తమ సమస్యలపై గళమెత్తారు. జీఓ 64 ప్రకారం ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం జీతాన్ని పెంచాలని, ఎన్హెచ్ఎం హెచ్ఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా లాయల్టీ బోనస్ చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. నెలవారీ ప్రాతిపదికన జీతం, ప్రోత్సాహకం అందించాలని కోరారు. హెడ్ క్వార్టర్లో నివహించేందుకు వీలుగా హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. ఆందోళనలో సీహెచ్‌ఓలు ఎం.ప్రసన్నకుమార్, మౌనిక, కరుణ్‌కుమార్, తేజశ్వని, శ్వేత తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
గిట్టుబాటుకాని ఉపాధి!
‘గంట్యాడ మండలానికి చెందిన దేముడు అనే వేతనదారుడు ఏప్రిల్ నెలలో ఉపాధి హామీ పనికి వెళ్లారు. 6 రోజుల పనికి అతనికి వచ్చిన వేతనం రూ.930లు. ఈ లెక్కన రోజుకి అతనికి రూ.155 చొప్పన వేతనం వచ్చింది.’ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులు వేతనదారులకు గిట్టుబాటు కావడం లేదు. ఎండలో పనిచేస్తున్నా అరకొర వేతనమే వస్తుండడం వేతనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనంలో సగం వేతనమైనా రాకపోవడం వేతనదారులకు ఆవేదనమిగుల్చుతోంది. జిల్లాలో 3.84లక్షలు జాబ్ కార్డులు ఉండగా, ఇందులో యాక్టివ్‌గా 3.53 లక్షల కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 6.08 లక్షల మంది వేతనదారులు ఉండగా, పనులకు వెళ్తున్నవారు 5.95 లక్షల మంది. 2025–26 సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పనిదినాల లక్ష్యం 1.33 కోట్లుకాగా, ఏప్రిల్ 19 నాటికి 9.21 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. సగం వేతనం రావడంలేదు.. ఉపాధి హామీ పథకం వేతనదారులకు రూ.300 ఉన్న వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.307కు పెంచింది. అయితే, జిల్లాలో పనిచేస్తున్న చాలామంది వేతనదారులకు రోజుకు ఇందులో సగం వేతనం కూడా రావడంలేదు. రోజువారీ వేతనం రూ.155 నుంచి రూ.180 మాత్రమే వస్తోంది. దీంతో పనికివెళ్తున్నా కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేతనదారులకు సుమారు రూ.70 కోట్ల వేతనబకాయిలు చెల్లించకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. పనికి తగ్గ వేతనం వేతనదారులు ఎంత పనిచేస్తే దానికి తగ్గ వేతనం మాత్రమే వస్తుంది. వేతనదారులకు వేతనం ఎక్కువ వచ్చేలా పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. వేతనదారులు 5 నుంచి 6 గంటలు పనిచేస్తే వేతనం ఎక్కువగా వస్తుంది. వేతనదారులకు వేతన బకాయిలు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. – ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా ‘గంట్యాడ మండలానికి చెందిన మణి అనే మహిళ కూడా ఏప్రిల్ నెలలో గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనికి వెళ్లారు. 6 రోజుల పనికిగాను ఆమెకు కూడా రూ.930 వేతనమే వచ్చింది. ఆమెకు కూడా రోజుకి రూ.155 లెక్కన వేతనం రావడంతో గిట్టుబాటుకావడంలేదని వాపోయింది.’ సగం కూలి కూడా రావడం లేదని వేతనదారుల ఆందోళన రోజుకు రూ.155 నుంచి రూ.180 మాత్రమే వస్తున్న వైనం జిల్లాలోని వేతనదారులు 5.95 లక్షలు జిల్లాలో జాబ్ కార్డులు 3.53 లక్షలు కేంద్రం నిర్ణయించిన వేతనం రూ.307 -
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
విజయనగరం, సాక్షి: జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. కాలేజ్ ప్రాంగణంలో ఓ విద్యార్థిని ఫోన్ మాట్లాడుతుండగా.. ఓ మహిళా లెక్చరర్ అడ్డుకుని ఫోన్ లాక్కుంది. ఈ క్రమంలో ఫోన్ ఇవ్వాలంటూ సదరు విద్యార్థిని లెక్చరర్‌ను దుర్భాషలాడింది. అందుకు లెక్చరర్ నిరాకరించడంతో విద్యార్థిని సదరు లెక్చరర్‌ను చెప్పుతో కొట్టింది. లెక్చరర్ సైతం ఆమెపై ప్రతిదాడి చేయగా.. తోటి విద్యార్థులు, ఓ వ్యక్తి అడ్డుపడ్డారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థిని వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రఘు కాలేజ్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...👆తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025రఘు కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య వాగ్యుద్ధం.. టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని.#RaghuEngineeringCollege #Vizianagaram #Vizag #AndhraPradesh #UANow pic.twitter.com/APzPn1isCK— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 22, 2025 -
బొబ్బిలిలో భూ బకాసురులు
బొబ్బిలి రూరల్ : విజయనగరం జిల్లా బొబ్బిలిలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. గిరిజనులను బెదిరించి డీ–పట్టా భూములను కబళిస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించి సాగుభూములుగా మలుస్తున్నారు. ఎవరైనా ప్రశ్చిస్తే బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే బేబీనాయన మనుషులమంటూ హడలెత్తిస్తున్నారు. అమాయక గిరిజనుల కళ్లుగప్పి భూమిని కాజేస్తున్నారు. బొబ్బిలి మండలంలోని మోసూరువలస, డొంగురువలస, కేశాయవలస, కొత్తవలస తదితర గిరిజన గ్రామాలకు వెళ్తే ఆక్రమణదారులు వెదురు కంచెలు నిర్మించి సాగుచేస్తున్న మామిడి, జీడి, టేకు వనాలు సాక్షాత్కరిస్తాయి. దురాక్రమణలు ఇలా.. గోపాలరాయుడుపేట, చిత్రకోటబోడ్డవలస, కాశిందొరవలస తదితర గ్రామ పంచాయతీల పరిధిలో వందల ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిని టీడీపీ నేతలు, అధికారుల అండతో బడాబాబులు పక్కా స్కెచ్‌తో ఆక్రమిస్తున్నారు. ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి కొన్ని కుటుంబాలను ముందుగా రప్పిస్తున్నారు. వారి నివాసం కోసం ఆక్రమించేందుకు సిద్ధమైన భూముల్లో చిన్నచిన్న గుడారాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడి అటవీ భూముల్లో చెట్లను నరికి సాగుభూములుగా మారుస్తున్నారు. నెలలు గడిచాక పట్టాలివ్వాలంటూ వారితో ప్రభుత్వానికి దరఖాస్తు చేయిస్తున్నారు.అనంతరం.. అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి పేరున డీ–పట్టాలు ఇప్పిస్తున్నారు. ఎంత భూమి ఇస్తున్నారన్న విషయం కూడా ఆ వలస జీవులకు తెలీదు. పట్టాలు వచ్చిన వెంటనే వారితో కాగితాలపై సంతకాలు చేయించి ఇక్కడ పనిలేదంటూ మరో ప్రాంతానికి పంపిస్తున్నారు. ఇలా ఇప్పటికే సుమారు 500 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు బడాబాబుల హస్తగతమయ్యాయి. వీరి భూదాహంవల్ల తాతల కాలంలో ఉండే అడవులు, అటవీ జంతువులు కనుమరుగవుతున్నాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికార యంత్రాంగం సమగ్ర దర్యాప్తు చేస్తే భూముల ఆక్రమణ వ్యవహారం బయటపడుతుందన్నది గిరిజన సంఘాలు చెబుతున్నాయి.ఆక్రమణలు వెలుగులోకి ఇలా..సీహెచ్ బొడ్డువలస గ్రామపంచాయతీ కేశాయవలస గిరిజన గ్రామానికి ఆనుకుని ఉన్న ఆక్రమిత భూమిలో టేకు మొక్కలకు నీళ్లుపోసే వాటర్ ట్యాంకు ట్రాక్టర్‌ను నడుపుతున్న డ్రైవర్ పోలిరాజు గతనెల 28న ప్రమాదవశాత్తు మృతిచెందాడు. అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, అధికారులు.. ఇంత పెద్దఎత్తున టేకు మొక్కలు సాగుచేస్తున్నది ఎవరని ఆరా తీయగా అక్కడివారు మొదట ఎమ్మెల్యే బేబినాయన అని, ఎమ్మెల్యే అనుచరులదని చెప్పుకొచ్చారు.విశాఖపట్నంలో నివసిస్తున్న ఎమ్మెల్యే అనుచరుడిదని గిరిజనులు తెలిపారు. టేకు మొక్కలు వేసిన దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో వెదురు ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. సోలార్ ప్యానెళ్లతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటూ అటవీ, డీ–పట్టా భూముల్లో తోటలు పెంచుతున్నారు. సారవంతమైన ఎర్రరేగడి నేల కావడంతో అమాయక గిరిజనులను భయపెట్టి సొంతం చేసుకున్నట్లు సమాచారం. మారుమూల గిరిజన గ్రామం కావడంతో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. అసలా భూములు ఎవరికి చెందినవో, ఏ పంచాయతీ పరిధిలోకి వస్తాయో కూడా రెవెన్యూ అధికారులకు తెలీకపోవడం విచిత్రం. ఆక్రమణల గురించి నాకేం తెలీదు.. గిరిజనుల డీ–పట్టా భూముల ఆక్రమణ వ్యవహారం నాకేమీ తెలీదు. ఫిర్యాదు వస్తే సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. – ఎం. శ్రీను, బొబ్బిలి తహసీల్దార్ తెలుసుకుని చెబుతా.. నేను ఇక్కడకు కొత్తగా వచ్చాను. కొండ భూములను ఇంత పెద్దస్థాయిలో ఎవరు సాగుచేస్తున్నారో తెలీదు. వివరాలు తెలుసుకుని అధికారులకు నివేదిక అందిస్తాను. – పోలినాయుడు, వీఆర్వో, సీహెచ్ బొడ్డవలస -
బాల్య వివాహాలు అరికట్టాలి : కలెక్టర్
పార్వతీపురం టౌన్: బాల్య వివాహాలు అరికట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల పట్ల విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందాలని అందుకు బాల్య వివాహాల వలన కలిగే దు ష్ప్రభావాల గూర్చి స్పష్టంగా వివరించాలన్నారు. వివిధ కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితుల రీత్యా బాల్య వివాహాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సామాజిక స్థితిగతుల పట్ల వివరంగా చెప్పాలని ఆదేశించారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల బాల్యం కొల్పోతారని, చదువు, ఆరోగ్యం కోల్పోతారని. వారికి ఉన్న ఆశలు, ఆశయాలు సాధించే అవకాశం కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటుదన్నారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులకు వివరించాలన్నారు. తాగు నీటి సమస్య తలెత్తరాదు జిల్లాలో తాగు నీటి సమస్య తలెత్తరాదని కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నట్లు మీడియాలో వార్తులు వస్తున్నాయని, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించారు. -
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు
విజయనగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలకు సంబంధించి రెండు, మోసాలకు పాల్పడినవి నాలుగు, ఇతర అంశాలకు సంబంధించి రెండు ఫిర్యాదులు అందాయి. వీటికి స్పందించిన ఎస్పీ వకుల్ జిందల్ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఏఎస్పీ సౌమ్యలత, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీఎస్ఆర్పీ ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం క్రైం -
విశ్రాంత హోంగార్డుకు ‘చేయూత’
విజయనగరం క్రైమ్ : పోలీసు శాఖలో హోంగార్డుగా పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన కాజా రామారావుకు చేయూత కింద రూ.3లక్షలు సోమవారం అందజేశారు. డీపీఓలో ఎస్పీ వకుల్ జిందల్ తన చాంబర్లో హోంగార్డు సిబ్బంది ఒక్క రోజు కేటాయించిన డ్యూటీ అలవెన్స్‌ను రామారావుకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందిలో ఐక్యమత్యానికి ఇలాంటి సాయాలు మరింత దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఏఏ శ్రీనివాలసరావు, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ రమేష్‌కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి విరాళం నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లిలో జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణానికి బొత్స లక్ష్మణరావు తనయుడు బొత్స చైతన్య రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. సోమవారం విజయనగరంలోని తన నివాసంలో ఆలయ కమిటీ ప్రతినిధులకు తన వంతుగా నగదు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చైతన్యకు కృతజ్నతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బెల్లం ఊట ధ్వంసం వీరఘట్టం: మండలంలోని చిన్నగోర శివారు ప్రాంతంలో సారా తయారు చేసేందుకు ఉంచిన 1200 లీటర్ల బెల్లం ఊటలను సోమవారం ధ్వంసం చేసినట్లు ఎస్.ఐ జి.కళాధర్ తెలిపారు. సారా తయారీ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందితో వెళ్లగా సారా తయారీదారులు పరారైనట్లు ఎస్.ఐ తెలిపారు. సారా తయారీకి ఉపయోగించిన ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు పూసపాటిరేగ : భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో అనధికారంగా 12 మద్యం సీసాలు కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ రవికుమార్ తెలిపారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో నాలుగు నెలల కాలంలో 38 అనధికార మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి 355 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 918 లీటర్ల సారా ధ్వంసం పార్వతీపురం టౌన్: గతంలో పలు కేసుల్లో పట్టుబడిన సారా, మద్యం సోమవారం ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ సురేష్‌కుమార్ తెలిపారు. పట్టణ శివారుల్లో 918 లీటర్ల సారా, 17 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా రవాణా, తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో సారా కేసులో పరారీలో ఉన్న పట్టణానికి చెందిన కోలా విజయ్, పాలకొండ కార్తీక్, కోలా పెంటయ్యలను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పదే పదే సారా కేసుల్లో పట్టుబడుతున్న బోమ్మాలి శ్రీనివాసరావు బైండోవర్ ఉల్లఘంచిన కారణంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో రూ.40 వేలు జరీమానా చెల్లించాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు యు.నాగేశ్వరరావు, రేవతమ్మ సిబ్బంది పాల్గొన్నారు. -
యశ్వంత్‌కి బంగారు పతకం
విజయనగరం అర్బన్: విద్యా శాఖ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్ భారత్ కమిటీ సంయుక్త నిర్వహణలో సోమవారం నూజివీడు హీల్ పారడైజ్ స్కూల్ అగిరిపల్లిలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 క్రీడా పోటీలలో తొలి రోజున జిల్లాకు చెందిన ఇనుముల యశ్వంత్ 50 మీటర్ల క్రిపుల్డ్ వాక్ క్రీడాంశంలో బంగారు పతకాన్ని సాధించాడు. ప్రజ్ఞా వైకల్యం, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, మస్తిష్క పక్షవాతం వైకల్యాలున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఈ నెల 23 వరకు జరిగే ఈ పోటీలలో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు పాల్గొంటున్నారని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు తెలిపారు. తొలి రోజు బంగారు పతకం సాధించిన యశ్వంత్ తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అని తెలిపారు. విజేతను డీఈఓ యు.మాణిక్యం నాయుడు, సెక్టోరియల్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధన సిబ్బంది అభినందించారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ● పీజీఆర్ఎస్కు 147 వినతులుపార్వతీపురం టౌన్: పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులు సొంత సమస్యలుగా భావించి పరిష్కార దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 147 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు తావివ్వద్దన్నారు. పరిష్కారమయ్యే సమస్యలతో అర్జీదారులు సంతృప్తి చెందాలని పునఃప్రారంభం కారాదని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, డీఆర్ఓ హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలలో కొన్ని ఇలా.. ● 25 కుటుంబాల నివాసం ఉండే గుమ్మలక్ష్మీపురం మండలం కొండబిన్నిడి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అత్యవసర పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఆ గ్రామానికి చెందిన గిరిజనులు వినతిని అందజేశారు. ● కురుపాం మండలం పెద్దగొత్తిలిలో సచివాలయం, రైతు భరోసా కేంద్ర నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రస్తుతం పాత పంచాయతీ భవనం పాడవ్వడంతో వర్షం నీరు కారుతుందని, పరిపాలనకు ఆటంకం కలుగుతుందని, నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ పి.టి.లోకనాధం వినతిని అందజేశారు. -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
బొబ్బిలి రూరల్: మండలంలోని మెట్టవలస గ్రామానికి చెందిన కొండపల్లి శ్రీహరి(22) సోమవారం సాయంత్రం గున్నతోటవలస గ్రామం వద్ద బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు శ్రీహరి తండ్రి శ్రీను డ్రైవర్ కాగా శ్రీహరి టాటా మేజిక్ వాహనాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శ్రీహరికి సోదరుడు తేజ విద్యాభ్యాసం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించారు. ఉరి వేసుకొని వ్యక్తి మృతి పూసపాటిరేగ : మండల కేంద్రమైన పూసపాటిరేగ వాటర్ ట్యాంకు సమీపంలో అప్పులు బాధ తట్టుకోలేక అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని సోమవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... స్థానికులు బంధువులు అందించిన వివరాల మేరకు విజయవాడకు చెందిన కొమ్ముకూరి రాజేష్ (35) గత కొంత కాలంగా పూసపాటిరేగ పెట్రోల్ బంకు సమీపంలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల కాలంలో హోటల్ నిర్వహణలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. భార్య నెలరోజులు క్రితం పుట్టింటికి వెళ్లిపోవడంతో రాజేష్ ఒక్కడే ఇంట్లో వుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. రాజేష్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు వున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గాప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ
విజయనగరం అర్బన్: ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధులు సహాయ సంస్థ వారి ఆర్థిక సౌజన్యంతో రూ.63 లక్షల విలువ గల రుణాలను 18 మంది దివ్యాంగులకు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ వారి ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్‌గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు రూ.11.60 లక్షలు (ఒక్కొక్కరికి రూ.40 వేలు) 29 ల్యాప్‌టాప్‌లు, మూగ, చెముడు అభ్యర్థులకు రూ.60 వేలు విలువ గల 6 టచ్ ఫోన్లు, మూడు చక్రాల సైకిళ్లు 2, వీల్చైర్లు 2, పంపిణీ చేశారు. -
పరిశీలించి పరిష్కరించాలి
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫిర్యాదులు వాస్తవాలైతే చట్టపరమైన చర్యలతో పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కుటుంబ కలహాలు, భర్త అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై పలు అర్జీలు ఎస్పీ స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన స్టేషన్ సిబ్బందికి ఎస్పీ స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి ఆ ఫిర్యాదులను వాటి పూర్వాపరాలను విచారణ చేసి వాస్తవాలు రుజువైనట్లైతే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం మొత్తం 14 ఫిర్యాదులు జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి అందాయి. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్ఐ ఫ్రకృద్ధీన్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి -
● నిరాశ చెందొద్దు..
నేను పదో తరతగతి ఫలితాల్లో 262 మార్కులతో ఆర్డినరీగా పాసయ్యాను. ఏ మాత్రం బాధపడకుండా పట్టుదలతో చదివి ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేసి, ఆ తర్వాత బీఈడీ చదివాను. డీఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాను. తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిలైనా అంతటితోనే అంతా అయిపోయిందనే భావనను వీడాలి. ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని లేదా తక్కువ మార్కులు వచ్చాయని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి. నిరాశ చెందకుండా పట్టుదలతో చదువుతూ ముందుకెళ్లాలి. – చింతల తిరుపతిరావు, ఉపాధ్యాయుడు -
జిందాల్ కార్మికుల ఆందోళన
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగార యాజమాన్యం అక్రమంగా విధించిన లేఆఫ్‌ను ఎత్తేయాలని, కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కర్మాగారం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. నాలుగు దశాబ్దాలుగా కర్మాగారంలో పనిచేస్తూ బతుకుతున్నామని, ఉన్నఫలంగా మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మూసివేయడం తగదన్నారు. ఏసీఎల్, డీసీఎల్ అధికారులు యాజమాన్యం తీరును ఖండిస్తూ వెంటనే కర్మాగారం తెరిచి కార్మికులకు పని కల్పించాలని ఆదేశించినా స్పందించకపోవడం దారుణమన్నారు. కర్మాగారం తెరిపించేందుకు కృషి చేయాలని కోరుతూ లక్కవరపుకోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్వగృహానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కొత్తవలస తహసీల్దార్‌కు, విజయనగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు తమ గోడు వినిపించారు. కార్యక్రమంలో జిందాల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు లగుడు వామాలు, పిల్లా అప్పలరాజు, ఎస్.భీమయ్య, నమ్మి చిన్నబాబు, పప్పల బంగారనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు శిక్షణ
కొత్తవలస: వియ్యంపేట గ్రామ సమీపంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులు (బాలికల) పాఠశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులకు శిక్షణ తరగతులను డీసీఓ ఎస్.రూపవతి సోమవారం ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 13 ఆశ్రమ పాఠశాలల్లో 51 మంది బాలికలు ఇంటర్ మొదటి సంవత్సరం వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని, వీరందరినీ వియ్యంపేట ఆశ్రమ పాఠశాలకు చేర్చి సప్లిమెంటరీ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. శిక్షణ తరగతులు వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. శిక్షణ ఇచ్చేందుకు 37 మంది అధ్యాపకులను నియమించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ టి.జయశ్రీ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పెంపు విజయనగరం ఫోర్ట్: రాష్ట్రీయ బాలస్వస్థలో పోస్టులకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఫలించిన పీఓ కృషి సీతంపేట: ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి చొరవ ఫలించింది. స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిలకల అవనికి మెరుగైన వైద్యసేవలు అందాయి. ఊపిరితిత్తులు, కాలేయ ఇన్ఫెక్షన్ సమస్యకు 50 రోజుల పాటు కేజీహెచ్‌లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితి నుంచి బాలిక బయటపడింది. రేగిడి మండలం గదబపేట నుంచి పాఠశాలకు సోమవారం చేరుకుంది. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందేలా కృషిచేసిన పీఓకు బాలిక తల్లిదండ్రులు ఆయన కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొర, వైద్యాధికారి విజయపార్వతి పాల్గొన్నారు. -
క్షణికావేశం వద్దు .. జీవితమే ముద్దు
ఈ విషయాలు మరువొద్దు.. ● ఫలితాలు ఎలా వచ్చినా.. విద్యార్థులు పాజిటివ్‌గా తీసుకోవాలి. కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు, చుట్టుపక్కల వారు ప్రవర్తించే తీరు విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. ● ప్రధానంగా క్షణికావేశానికి గురికాకూడదు. తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తమలోని బాధను పంచుకోవడంతో పాటు నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టాలి. ● సభ్యులు, స్నేహితులు, చుట్టు పక్కల వారు ఫెయిలైన విద్యార్థులపై చులకన భావంతో ఉండకూడదు. ఎగతాలి చేసినట్టు మాట్లాడొద్దు. ● చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారో, ఫెయిలైతే అదే స్థాయిలో వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ● ఫెయిలైనా జీవితంలో విజేతలుగా నిలిచిన వారి గురించి తెలియజేయాలి. ఎన్ని చెప్పినా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ● ప్రతిభకు మార్కులు కొలమానం కాదు ● పరీక్షలే సర్వస్వం అనుకోవద్దు ● తల్లిదండ్రులు దండించొద్దు.. ధైర్యం చెప్పాలి ● ముందుంది మంచి జీవితం రామభద్రపురం: పరీక్షలో మంచి ర్యాంకు రాలేదని కొందరు.. మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు.. ఫెయిల్ అయ్యామని మరికొందరు క్షణికావేశానికి గురవుతారు. ర్యాంకు, మార్కులను పక్కవారితో పోల్చుకుని మనస్థాపం చెందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి సరికాదన్నది మేధావుల మాట. విద్యార్థి ప్రతిభకు మార్కులు గీటురాయి కాదు. మార్కులు ఆధారంగా తెలివితేటలు అంచనావేయడం సరైనది కాదన్నది విద్యావేత్తలే చెబుతున్నారు. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టంగా భావించడం తప్పు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించిన వారేంకాదు. విద్యా సంస్థల యాజమాన్యాలు మార్కులు వెంట పరుగెత్త కూడదు. పరీక్షలే సర్వస్వం కాదు. జీవితం ఎంతో ఉందని విద్యావేత్తలు, వైద్యాధికారులు, ఉన్నత స్థాయిలో ఎదిగిన వారు సూచిస్తున్నారు. చదువులో రాణించలేనివారు సాంకేతిక, వ్యాపార, వ్యవ సాయ, క్రీడా రంగాల్లో రాణిస్తున్నారన్నది సత్యం. అందుకే ముందున్నది మంచికాలం అని భుజం తట్టాలి. ఫెయిలైన సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. అండగా నిలబడాలన్నది మానసిక నిపుణుల మాట. పదోతరగతి ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 447 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 22,939 మంది, గతంలో ఫెయిలైన విద్యార్థులు 835 మంది మొత్తంగా 23,774 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో పొరపాటున ఫెయిలైతే దండించవద్దు.. ధైర్యం చెప్పాలని తల్లిదండ్రులకు విద్యావేత్తలు ఇస్తున్న సూచన. -
నకిలీ మావోయిస్టు అరెస్టు
–8లోచేపల మృత్యువాత కురుపాం మండల కేంద్రంలోని సంతకోనేరు చెరువులో నాలుగు రోజులుగా చేపలు మృత్యువాత పడుతున్నాయి. విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలో మావోయిస్టు పేరుతో డబ్బుల కోసం ప్రముఖులను బెదిరించిన వ్యక్తిని విజయనగరం వన్‌టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా చినముషిడివాడకు చెందిన కుచ్చర్లపాటి వెంకటబంగార్రాజు పీపుల్స్ వార్ ఏఓబీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, యాక్షన్ కమిటీ కామ్రేడ్ సాయన్న అలియాస్ బిర్సా పేరుతో నగరంలోని ఇద్దరు ప్రముఖులకు బెదిరింపు లేఖలు ఇచ్చాడు. ఒకరికి రూ.25లక్షలు, మరొకరికి రూ.20 లక్షలు ఇవ్వాలని లేఖల ద్వారా డిమాండ్ చేశాడు. సంబంధిత వ్యక్తులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. ఎస్పీ ఆదేశాలతో నగరంలోని అన్ని సీసీ పుటేజ్‌లను పరిశీలించి నిందితుడు వెంకట బంగార్రాజుగా గుర్తించాం. అతని కదిలికలపై నిఘా పెట్టి విజయనగరంలోని బాలాజీ కూడలి వద్ద అదుపులోకి తీసుకున్నాం. అతని నుంచి విప్లవసాహిత్యం, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేంద్రనాయుడు, హెచ్‌సీ రమణరావు, కానిస్టేబుళ్లు శివశంకర్, గౌరీ శంకర్‌ను డీఎస్పీ అభినందించారు. -
● మార్కులే జీవితం కాదు..
పదో తరగతిలో 359 మార్కులు మాత్రమే వచ్చాయి. ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయి ఫెయిలయ్యాను. మరలా ఎంపీసీలో జాయిన్ అయ్యి పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితం సాధించాను. ఇంజినీరింగ్ చదివి 25 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిందండ్రుల్లో కంగారు ఉండడం సహజం. ఫలితాలు ఎలా ఉంటాయో.. తమకు ఫలితాలు ఎలా వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడడం సహజమే. కానీ పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. నేటి ఓటమి రేపటి విజయానికి మెట్టులాంటిది. – పెద్దింటి రామారావు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూఎస్ఏ -
యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని పెంచడంతో కూలీల కొరతను అధిగమించవచ్చని, క్షేత్ర పరిశీలనలు 150–200 మంది రైతులతో జరిగేలా చూడాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివన్నారాయణ వ్యవసాయ సిబ్బందికి సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఉత్తర కోస్తాలోని అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వ్యవసాయ పరిశోధన, విస్తరణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ శాస్త్రవేత్త రైతుకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. రైతులకు అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందించాలన్నారు. రైతు సేవా కేంద్రాల ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని చెప్పారు. రైతుల ఆదాయం పెంచేలా పరిశోధనలు జరగాలన్నారు. పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చితే ఆదాయం పొందవచ్చని తెలిపారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. పరిశోధన సంచాలకుడు డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ అభ్యదయ రైతుల పొలాల్లో మినీకిట్లు, ప్రదర్శన కేంద్రాల పరిశీలనల్లో రైతుల భాగస్వామ్యం పెరగాల్సి ఉందన్నారు. నైర వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భరత్‌లక్ష్మి మాట్లాడుతూ చెరకు పంట ఇంకా వాణిజ్య పంటగానే ఉందని తెలిపారు. నాబార్డు డీడీఎం మాట్లాడుతూ యువత వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పెరగాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి, శాస్త్రవేత్తలు టి.ఎస్.ఎస్.కె.పాత్రో, కె. లక్ష్మణ్, అనూరాధ, త్రివేణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర పరిశీలనలకు ప్రాధాన్యం పెరగాలి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ శివన్నారాయణ జెడ్పీ సమావేశ మందిరంలో ఉత్తర కోస్తా వ్యవసాయ పరిశోధన, విస్తరణ మండలి సమావేశం -
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
విజయనగరం క్రైమ్: వారం రోజుల పాటు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. నగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్దనున్న అగ్నిమాపక స్టేషన్ సిబ్బంది ఈ వారం రోజులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన నష్ట నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఇదిలా ఉంటే ఆదివారం స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయనగరం డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేంద్ర గిరి, లంకె శ్రీనివాసరావు, డాక్టర్ అరుణ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై వివరించారు. కార్యక్రమంలో ఫైర్‌స్టేషన్ అధికారులు సోమేశ్వరరావు, సంతోష్‌కుమార్, మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
సత్యనారాయణ నేత్రదానం
శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని ఇప్పిలి వీధిలో నివాసం ఉంటున్న నారంశెట్టి సత్యనారాయణ (86) అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన కుమారులు ఎన్వీ మొహెర్ సుధాకర్, ఎన్వీ సురేష్, ఎన్వీ రవికిషోర్, జగదీశ్వరరావులు బరాటం వరప్రసాద్ ద్వారా తండ్రి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయగా, నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇంచార్జి సుజాత, నంది ఉమాశంకర్‌లు సత్యనారాయణ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సభ్యులు దుర్గాశ్రీనివాస్లను అభినందించారు. -
ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు
పార్వతీపురం టౌన్: సీఎం చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అలాగే జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాత బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబులాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకొకరు లేరన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. బలిజిపేట మండలంలో రక్తదాన శిబిరం నిర్వహించి రక్తం యూనిట్లను జిల్లా ఆస్పత్రికి అందజేశారు. కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, టీడీపీ నా యకులు, కార్యకర్తలు, ఆభిమానులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యక్రమాలుగా గురజాడ జయంతి, వర్ధంతి
విజయనగరం టౌన్: ప్రభుత్వ అధికార కార్యక్రమాలుగా గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతులను నిర్వహించాలని జిల్లాకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక గురజాడ స్వగృహంలో సాహిత్య సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో మహాత్మా మన్నించు పేరిట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు మాట్లాడుతూ.. తెలుగు సమాజానికి ఆధునిక ఆలోచనలందించిన మహాకవి గురజాడ అని కొనియాడారు. దేశభక్తి గీతాన్ని రాసిన మహాకవిని ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకూ అందరూ స్మరించుకుంటారు గాని ఆయన పేరిట అవార్డు మాత్రం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ జయంతి, వర్ధంతిలను ఇకపై అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సాహిత్య సంస్థల ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, డాక్టర్ జక్కు రామకృష్ణ, చీకటి దివాకర్, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు పాల్గొన్నారు. కవుల, రచయితల డిమాండ్ -
రక్తదానం చేసిన మంత్రి
గజపతినగరం రూరల్: ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం స్థానిక యువత నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన కూడా రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మక్కువ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు రాజాం సిటీ: జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిరి సురేష్‌బాబుపై రాజాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని ఎస్సై వై.రవికిరణ్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. జనసేన సభ్యత్వ నమోదు కార్డులు స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఆర్కే కాంప్లెక్స్‌లో ఇస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలియజేయడంతో ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తిరి నాగరాజు శనివారం ఉదయం అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నాయకుడు పొగిరి సురేష్‌బాబు నువ్వెందుకు ఇక్కడకు వచ్చావని నాగరాజును దుర్భాషలాడాడు. కులం పేరుతో దూషించడంతో పాటు కాలితో తన్నాడు. పైగా తన అనుచరులతో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. బాధితుడు తప్పించుకుని బయటకు వచ్చి జనసేన నాయకులకు విషయం తెలియజేశాడు. అనంతరం పొగిరి సురేష్‌బాబుపై శనివారం సాయంత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చంద్రబాబు పుట్టిన రోజు.. మనకు వంచన దినం ● అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తివిజయనగరం టౌన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినాన్ని ఎస్సీ రిజర్వేషన్ల వంచన దినంగా పాటిద్దామని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల సర్వేను క్యాస్ట్ సర్వేగా పరిగణిస్తూ జీఓ 91 విడుదల చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజును ఎస్సీ రిజర్వేషన్ల వంచనదినంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం వంచనదినం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దారాన వెంకటేష్ , బుదరాయవలస మధుసూదనరావు, వేమల వంశీ, లోపింటి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి టెక్కలి రూరల్: ఇంట్లో కరెంట్ లేదని, దాన్ని మరమ్మతు చేసే క్రమంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు వదిలేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన పినిమింటి నారాయణరావు(40) అనే వ్యక్తి ఆదివారం తన ఇంట్లో కరెంట్ వచ్చి పోతుండటంతో స్విచ్ బోర్డుకి వచ్చే వైర్లు ఊడిపోవడం గుర్తించి దాన్ని మరమ్మతు చేసేందుకు పూనుకున్నారు. అయితే మరమ్మతు చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కిందకు పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి నారాయణరావు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకు న్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రో దించారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కీర్తన, మహేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. -
పవన్ అనాలోచిత నిర్ణయాలతో రైతులకు తీవ్ర నష్టం
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనాలోచిత నిర్ణయాలతో ఈ రోజు బియ్యం ఎగుమతులు లేక రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీజ్ ద షిప్ వ్యవహారంలో అక్రమాలను వెలికితీస్తామని చెప్పి ఎందుకు మౌనంగా ఉన్నారని దువ్వాడ ప్రశ్నించారు. గతంలో ఏపీ నుంచి విస్తారంగా సన్న రకాలు ఎగుమతులు జరిగాయని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. గతంలో వైఎస్సార్సీపీ పాలనలో రూ.2900 ధర పలికిన సన్న రకాల ధర ఈ రోజు రూ.1700కు పడిపోయిందని అన్నారు. అవి కూడా కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. సన్న రకాలను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనలతో ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల్లో విస్తారంగా సన్న రకాలు పండించారని, ఇప్పుడు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని దువ్వాడ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ పాలనలో విత్తు నుంచి విక్రయం వరకు. రైతుల సంక్షేమం కోసం అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి సుమారు 31 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, ఇదే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గతంలో గోల చేశారని ఇప్పుడు అదృశ్యమైన మహిళల్ని ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెండు బడ్జెట్లలో ఉత్తరాంధ్రకు వచ్చిన ప్రయోజనమేమిటని దువ్వాడ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏడాది కాలంలో సుమారు 80 శాతం పనులు పూర్తి చేశారని ఇప్పుడు టీడీపీ నాయకులు పోర్టు కాంట్రాక్ట్‌ల కోసం కుమ్ములాడుకుంటున్నారు తప్ప పోర్టును పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బారువాను మరో గోవా చేస్తామంటూ ఇటీవల కేంద్ర మంత్రి చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని శ్రీనివాస్ అన్నారు. లింగాలవలస గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రగల్బాలు పలకడం ఆపేసి ఎన్నికల మునుపు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇవేం ఆంక్షలురా బాబూ..!
పూసపాటిరేగ: మత్స్యకారుల జీవనభృతిపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ మెమో జారీ చేయడంపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు. జీవనభృతి మంజూరైన మత్స్యకారులు సంక్షేమ పథకాలకు అనర్హులని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎంతో కాలంగా మత్స్యకారులకు వస్తున్న వేట నిషేధ భృతిపై ఇలా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్య సంపద వృద్ధి కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమలు చేయడం విధితమే. ఈ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. 2019 నుంచి ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి ఏటా మత్స్యకార భరోసా అందజేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వస్తే రూ. 20 వేల జీవనభృతి ఇస్తామని చెప్పిన నాయకులు మొదటి ఏడాది భృతి ఇవ్వకుండా దాటవేశారు. ఈ ఏడాది మే నెలలో భృతి ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించడం దారుణం. జిల్లాలో గతేడాది మత్స్యకార భరోసాకు 3798 మందిని అర్హులుగా తేల్చారు. వీరందరూ వేట విరామ సమయంలో భృతి పొందినప్పటికీ.. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు పొందారు. కాని నేటి కూటమి ప్రభుత్వం మాత్రం జీవన భృతి పొందిన మత్స్యకారులు ఆడబిడ్డ నిధి, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ భరోసా పెన్సన్లకు అనర్హులుగా తేల్చింది. అలాగే 60 ఏళ్లు దాటిన వ్యక్తులు, 300 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగించిన వారు, గ్రామీణ ప్రాంతంలో రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ. 1.44 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్టు ఉన్న మత్స్యకారులను అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఇవేం ఆంక్షలురా బాబూ అంటే గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమం తప్పదు.. వేట నిషేధ భృతి చెల్లించాల్సిన కూటమి సర్కారు లేనిపోని ఆంక్షలు విధించడం దారుణం. భృతి పొందిన వారిని ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తే ఉద్యమం చేయక తప్పదు. బర్రి చినఅప్పన్న , జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం. మత్స్యకారుల జీవనభృతిపై ఆంక్షలు.. ఇంతవరకు అందని వేట నిషేధం భృతి ఇదుగో..అదుగో.. అంటూ కాలయాపన తాజాగా భృతి పొందిన వారికి సంక్షేమ పథకాలు కట్ అంటూ మెమో జారీ ఆందోళనలో మత్స్యకారులు -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి...
క్రైమ్ కార్నర్గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన వర్రి రామారావు (45) ఆదివారం ఉదయం మదనాపురం జంక్షన్ నుంచి ట్రాక్టర్‌పై గ్రామంలోకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపైనున్న గొయ్యిని తప్పించేక్రమంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే రామారావు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లారీ ఢీ కొట్టడంతో ఒకరు.. సాలూరు రూరల్: మండలంలోని జీగిరాం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సాలూరు మండలం మంచాడవలసకు చెందిన తంబరి బంగారయ్య, తూలిగి బంగారయ్యలు సాలూరు నుంచి మంచాడవలసకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సరిగ్గా జీగిరాం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తంబరి బంగారయ్య మృతి చెందాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. తెట్టంగిలో చోరీ.. గుర్ల: మండలంలోని తెట్టంగిలో జమ్ము పైడినాయుడు ఇంటిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు ప్రవేశించి ఐదు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి. నారాయణరావు తెలిపారు. -
గొంతు కోసి నడిరోడ్డుపై వదిలేసి
రణస్థలం: మండలంలోని పైడి భీమవరం నడిబొడ్డున శనివారం సాయంత్రం జరిగిన వివాహిత దారుణ హత్య కలకలం రేపింది. స్థానికులు, జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం సాయంత్రం బోనం పేరంటాలు గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి అవాల భవాని(25) అనే వివాహితను దారుణంగా చాకుతో గొంతు కోసి వెళ్లిపోయాడు. సంఘటన స్థలంలోనే చాకును నీళ్లతో కడిగేసి అక్కడే పడేశాడు. కొన ఉపిరితో ఉన్న భవాని అక్కడకు కొద్ది దూరంలో వైఎస్సార్ విగ్రహం వెనుక బస్టాప్ దగ్గరలో చెరువు గట్టు వరకు వచ్చి అక్కడే పడిపోయి మృతి చెందింది. ఆమె భర్త వెంకట సత్యం లారీ డ్రైవర్‌గా పనికి వెళుతుంటాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలోని బరంపురం దగ్గరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. భవాని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పెద్ద పతివాడ గ్రామం. నాలుగేళ్ల క్రితం పైడిభీమవరం పంచాయతీలోని గొల్లపేట గ్రామానికి చెందిన వెంకట సత్యంతో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. వెంకట సత్యం లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. భవాని పైడిభీమవరంలోని ఒక హోటల్ పని చేస్తోంది. శనివారం మధ్యా హ్నం 3.30 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోయిందని యజమాని చెబుతున్నాడు. ఆ తర్వాత ఆమె సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బస్టాప్ వద్ద విగతజీవిగా కనిపించింది. స్థానికులు సమాచారం అందించడంతో జేఆర్ పురం సీఐ అవతారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 3.30 నుంచి ఆరు గంటల మధ్యలో ఆమె ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హోటల్లో పని చేసిన వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. హత్యగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. పైడిభీమవరంలోని బోనం పేరంటాలు గుడి సమీప ప్రాంతం. సాయంత్రం 6 గంటల సమయం. అంతా రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అంతలో ఒకామె నడుచుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు గమనించి వెళ్లి చూసేలోపే అప్పటికే తెగిన ఆమె గొంతు నుంచి రక్తం ధార కట్టి ఆ ప్రాంతమంతా ఎర్రగా మారిపోయింది. పైడి భీమవరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాతికేళ్ల వివాహితను అత్యంత కర్కశంగా గొంతుకోసి చంపేశారు.పైడిభీమవరం నడిబొడ్డున ఘటన వివాహిత దారుణ హత్య -
ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధి సాధ్యం
విజయనగరం అర్బన్: ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో ఆధునికంగా సాగితే 15 శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి చెందుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి అధికారి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. వ్యవసాయంలో కొత్త ఆలోచనలు, ప్రయోగాలు అమలుచేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ డా.అహ్మద్‌బాబు, జిల్లా అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వద్ధి రేటు సాధనకు ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పండించే పంటలు, కూరగాయలు, పూలు ఇతర ఉద్యాన ఉత్పత్తులకు విశాఖలో మంచి మార్కెట్ ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. అహ్మద్ బాబు మాట్లాడుతూ వృద్ధిరేటు సాధనలో కిందిస్థాయి సిబ్బందిని భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, సీపీఓ పి.బాలాజీ, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌తో జాతీయవాష్ నిపుణుల భేటీ విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత ఆధ్వర్యంలో జాతీయ వాష్ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) నిపుణులు సుధీర్‌కుమార్ బండారీ, సౌమేంద్ర రంజన్ గంగూలి శనివారం భేటీ అయ్యారు. జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనాంశాలను కలెక్టర్‌కు వివరించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. డీఈలు ఢిల్లీశ్వరరావు, యడ్ల గోవిందరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
లక్ష్మీపేటకు అదనపు బందోబస్తు
వంగర: మండల పరిధి లక్ష్మీపేటకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపారు. లక్ష్మీపేటలో శనివారం పర్యటించిన ఆయన ఆక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక న్యాయస్థానాన్ని పరిశీలించారు. 2012 జూన్ 12న జరిగిన ఘటన నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారన్నారు. అనంతరం వంగర పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట రూరల్ సీఐ హెచ్. ఉపేంద్ర ఉన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఆరోగ్యానికి ముప్పు విజయనగరం: ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాసీ్త్రయ పద్ధతుల్లో తొలగించడం ముఖ్య మని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రత్యేక ప్రధా న కార్యదర్శి బి.రాజశేఖర్ అన్నారు. ఈ వ్యర్థా లను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని చె ప్పారు. విజయనగరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇ–వ్యర్థాలపై నగరంలో పైడితల్లి అమ్మ వారి ఆలయం నుంచి కోట వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద విద్యార్థులు, మహిళలు స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఇ–వ్యర్థాలను శాసీ్త్రయంగా తొలగిస్తే వాటి నుంచి ఎంతో విలువైన బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలను వెలికితీయవచ్చన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన ఇ–వ్యర్ధాల సేకరణ కౌంటర్‌ను ప్రత్యేక అధికారి పరిశీలించారు. అనంతరం పైడితల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ అంబేడ్కర్, కమిషనర్ పి.నల్లనయ్య, ఆర్డీఓ కీర్తి, ఈఈ బి.బి.సరిత పాల్గొన్నారు. -
స్థానిక సంస్థలపై..
ఎయిర్పోర్ట్ కోసం మీరేం చేశారో చెప్పండి..? భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారో చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని అడ్డంకులు తొలగించి జీఎంఆర్ సంస్థ పర్యవేక్షణలో ఎల్అండ్టీ సారథ్యంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 23 శాతం పనులు పూర్త్తయినట్లు స్వయానా ప్రస్తుత కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రకటించారు. అడ్డంకులు ఉంటే నిధులు మంజూరయ్యేవా...? టెండర్ దక్కించుకున్న వారు పనులు ప్రారంభించగలరా...? అంతా తామే చేస్తున్నట్లు ప్రకటనలు చేసుకుంటున్న కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ఎయిర్పోర్ట్ కోసం ఒక్క కొత్త అనుమతైనా తీసుకువచ్చారా...? మిగులు రైతుల సమస్యలు పరిష్కరించారా...? మౌలిక వసతుల కల్పనపై కనీసం దృష్టి సారించారా? అన్న ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలి. ● 11 నెలల పాలనలో సాధారాణ నిధులు ఒక్కరూపాయి కూడా విడుదల చేయని వైనం ● మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు ● కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రజా పోరాటం చేస్తాం ● మత్స్యకారులకు రెండేళ్లకు రూ.40వేలు చొప్పున భృతి ఇవ్వాల్సిందే ● ఉపాధి వేతన బకాయిల చెల్లింపులో నిర్లక్ష్య ధోరణి ● బీసీ రుణాల మంజూరులో రాజకీయ జోక్యం తగదు ● కూటమి హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసిందేంటి..? ● జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వెనుకబడిన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంజూరు చేసే రుణాల విషయంలో కూటమి ప్రభుత్వం నిబంధనలు విడుదల చేయకపోవడం దారుణం. జిల్లా వ్యాపంగా 3,379 యూనిట్లు మంజూరు కాగా... జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో అర్హులైన 20,452 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఎవరిని అర్హులుగా గుర్తిస్తారన్న విషయంపై అధికార యంత్రాంగానికి స్పష్టత లేదు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో గుర్ల ఎంపీపీ ఇదే విషయమై ప్రస్తావిస్తే.. స్థానిక ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లేక తీసుకురావాలంటూ అధికారులు చెప్పడం సిగ్గుచేటు. గత ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా రుణాలు మంజూరు చేస్తే.. ఇప్పుడు పార్టీలే ప్రామణికంగా మంజూరు చేస్తారా..? కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన హమీలకు, ప్రస్తుత పాలన తీరుకు పొంతన లేకుండా పోతోంది. ప్రభుత్వ పాలనపై ప్రజా తిరుగుబాటు తప్పదు. విజయనగరం: నిధులు లేక స్థానిక సంస్థలు నీరసిస్తున్నాయని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నాయని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, పంచాయతీలకు సాధారణ నిధుల విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థలపై చిన్నచూపు తగదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మాటల గారెడీతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న కూటమి నేతలు నేడు ప్రజా సమస్యలపై పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించి స్థానిక సంస్థలకు రావాల్సిన సాధారణ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు. జిల్లా ప్రజల సమస్యలపై చర్చించేందుకు, పరిష్కారం చూపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ సమావేశాలకు గైర్హాజరు కావడంతో ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలన తీరు, హామీలు అమలుచేయకపోవడం, ప్రజల ఇబ్బందులు పట్టించుకోకపోవడాన్ని మీడియా సాక్షిగా తెలియజేశారు. ఆయన మాటల్లోనే... రుణాల మంజూరుకు నిబంధనలేవి? పింఛన్లు మంజూరులో మాటల గారెడీ ఎందుకు...? 60 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులకు, భర్తను కోల్పోయిన వితంతువులకు, దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయకుండా సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఇటీవల భర్తలు కోల్పోయిన వితంతువులకు మినహా కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకోసారి అర్హులకు పింఛన్లు మంజూరయ్యేవి. 2023 డిసెంబర్ వరకు అర్హులందరికీ న్యాయం చేశారు. వాస్తవానికి గతేడాది జూన్ నెలలో అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి సచివాలయాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సుమారు 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంఖ్య ఇప్పటికి 15 వేలకు పైగా పెరుగుతందని అంచనా. ఒక్క చీపురుపల్లిలో 330 మంది పింఛన్ కోసం ఇటీవల రోడ్డెక్కి నిరసన చేపట్టిన పరిస్థితులే దీనికి తార్కాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 65.49 పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా... ప్రస్తు తం ఆ సంఖ్య 63.92 లక్షలకు తగ్గింది. అర్హులకు పింఛన్లు మంజూరు కోసం పార్టీ అధిష్టానం సూచనల మేరకు పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబ డడం, సంక్షేమానికి కృషిచేయడంలో వైఎస్సార్సీపీ బ్రాండ్ అంబాసిడర్ అని నిరూపిస్తాం. వేతనదారులు గగ్గోలు పెడుతున్నా.. ఉపాధిహామీ వేతనదారులకు 13 వారాలుగా వేతన బకాయిలు చెల్లించకపోయినా ప్రభుత్వం, ప్రజాప్రతినినధులు పట్టించుకోకపోవడం దారుణం. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వలస నివారణకు ఉపాధి హమీ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. సగటున రోజుకు ఒక్కో వేతనదారునికి కనీసం రూ.307 వేతనం గిట్టుబాటేయ్యేలా చూడాలి. చాలా ప్రాంతాల్లో రూ.50 నుంచి రూ.100 మాత్రమే గిట్టుబాటు అవుతుండడం దారుణం. తక్షణమే వేతన బకాయిలు విడుదల చేయాలి. మత్స్యకారులకు రెండేళ్ల భృతి ఇవ్వాల్సిందే... ఏడాదిలో 60 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధించే సమయంలో ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు అందించాల్సిన వేటనిషేధ భృతిని రెండేళ్ల కాలానికి రూ.40వేల చొప్పున అందించాలి. అర్హులైన 3,798 మంది మత్స్యకారులుకు న్యాయం చేయాలి. ఎన్నికల్లో ఒకలా.. ఇప్పు డు ఒకలా మాట్లాడడం తగదు. హామీ మేరకు ఏడాదికి రూ.20వేల చొ ప్పున ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వం ఏటా ఠంచన్‌గా మత్స్యకార భృతి అందించింది. రాయితీలు కల్పిస్తూ ఆదుకుంది. అన్నింటా విఫలం పరిశ్రమలు తీసుకువస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నేతలు ఎన్నికలకు ముందు హమీలు గుప్పించారు. ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లాలో జిందాల్ పరిశ్రమ మూతబడింది. కార్మికులు రోడ్డున పడ్డారు. దీనికి కూటమినేతలు ఏమని సమాధానం చెబుతారని జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నర్సింహమూర్తి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, తదితరులు పాల్గొన్నారు. -
ప్రవర్తన మారకుంటే జైలుకే
● రౌడీషీట్లర్లకు ఎస్పీ హెచ్చరిక విజయనగరం క్రైమ్: జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఎస్పీ వకుల్ జిందల్ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో తమ తమ స్టేషన్ల పరిధిలో ఉన్న పాత నేరస్తులను శనివారం పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో సంబంధిత స్టేషన్ల ఎస్సైలు హిస్టరీ,రౌడీషీట్లు కలిగిన నేరస్తులను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, చీపురుపల్లి, గరివిడి, గజపతినగరం, ఎస్.కోట, వల్లంపూడి ఇలా 34 స్టేషన్లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్ల ప్రవర్తన, వారు రోజువారీ నిర్వర్తించే పనులపై ఓ కన్నేసి ఉంచాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందికి సెట్ కాన్పరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. రౌడీలు మళ్లీ దురుసుగా నేరాలకు పాల్పడే విధంగా ఉంటే ప్రత్యేకంగా వారిపై నిఘా తీవ్రతరం చేయాలని సూచించారు. 25 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్తెర్లాం: అనధికారికంగా బెల్ట్ దుకాణం నడుపుతున్న వ్యక్తి వద్ద 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై సాగర్‌బాబు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి ఎస్సై మాట్లాడుతూ మండలంలోని నందబలగ గ్రామంలో బమ్మిడి నారాయణరావు అనే వ్యక్తి అనధికారికంగా బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లి దాడి చేశామన్నారు. ఈ దాడిలో 25 మద్యం సీసాలతో పట్టుబడిన నారాయణరావును అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టుకు తరలించామని చెప్పారు. సమగ్ర శిక్షలో సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్● 21 నుంచి తరఖాస్తుల స్వీకరణ విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ పోస్టుల భర్తీకి కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఉత్తర్వుల మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటస్టికల్ అధికారి, అసిస్టెంట్ ఏఎంఓ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పోస్టులకు అర్హతగల ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. దరఖాస్తు తదితర వివరాలను ‘విజయనగరం.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ను సందర్శించిన ఈడీగజపతినగరం : ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో అన్ని మౌలికవసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల రాకపోకల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చి వెళ్లే ఏర్పాట్లు చేశామన్నారు. ఏవైనా బస్సులు విజయనగరం నుంచి గజపతినగరం మీదుగా సాలూరు వెళ్లేవి, సాలూరు నుంచి గజపతినగరం మీదుగా విజయనగరం వెళ్లేవి గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్(డిపోకు)కు రాకుండా డైరెక్ట్‌గా వెళ్లిపోయినట్లయితే తమకు సమాచారం ఇస్తే సంబంధిత డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.అనంతరం కాంప్లెక్స్‌లో తాగునీరు, ప్రయాణికుల మరుగుదొడ్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీపీడీఓ అప్పలనాయుడు, డీఎం శ్రీనివాసరావు, ఆర్టీసీ కాంప్లెక్స్ కంట్రోలర్ ఆరిక తోట జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాథమిక పాఠశాలకు టాటా..?
పాఠశాల ఎత్తివేసే పరిస్థితి మా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలు చేస్తున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థులు ఉన్నత పాఠశాలల వైపు వెళ్లిపోయే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇక్కడ ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం, గ్రామ ప్రజా ప్రతినిధులతో ఆలోచన చేయలేదు. గురుగుబెల్లి స్వామినాయుడు, కళింగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, వాల్తేరు మంచి విధానమే అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక విద్యకు అడ్మిషన్లు ఇవ్వడంలేదు. గతంలో 3 నుంచి 5 వ తరగతివరకూ విలీనమైన ఉన్నత పాఠశాలల్లోనే ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించాం. ఈ విధానంతో ఆయా ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ప్రాథమిక పాఠశాల అక్కడ కొనసాగాలంటే కనీసం 45 మంది విద్యార్థులు దాటి ఉండాలి. యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం. ● ఉన్నత పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచే అడ్మిషన్లు ● ఎక్కడైనా చేరవచ్చంటూ అంటూ జీఓ జారీ ● జిల్లావ్యాప్తంగా 287 ప్రాథమిక పాఠశాలల ఎత్తివేతకు కసరత్తురాజాం: ప్రభుత్వ విద్య బలోపేతం మాట పక్కన పెడితే ఉన్న విద్య అటకెక్కేలా కనిపిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా గడిచిన రెండేళ్ల క్రితం నుంచే కేంద్ర మానవవనరులశాఖ ప్రభుత్వ ప్రాథమిక విద్యను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు ఆర్టీఈని ప్రయోగించింది. అప్పటి రాష్ట్రప్రభుత్వం ఈ విద్యావిధానాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రాభుత్వ ప్రాఽథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల వద్ద ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసింది. మరోవైపు ఎన్ఈపీని గౌరవిస్తూ 3 నుంచి 5 వతరగతి వరకూ కొన్నిగ్రామాల్లోని (ఉన్నత పాఠశాల నుంచి 500 మీటర్లు లోపు ఉన్న పాఠశాలలకు చెందిన) తరగతులను గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారంతో విలీనం చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ విధానాన్ని చాలా గ్రామాల్లో వ్యతిరేకించడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు చాలాచోట్ల యథావిధిగా కొనసాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్రానికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు అన్ని మండల మానవ వనరుల కేంద్రాలకు, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు తమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచే చేరికలు చేసుకోవచ్చునని ఆదేశాలు జారీచేసింది. 287 పాఠశాలల వరకూ విలీనం కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికే చాలామంది ఉద్యోగులు, ప్రధానంగా ఉపాధ్యాయుల్లో ఈ విధానం ఆందోళన కలిగించింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి బాహాటంగానే మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించలేక, కొనసాగించలేక సతమతమవుతున్నారు. ఇప్పటికే ఈ సర్క్యులర్లు అందుకున్న పాఠశాలలు తమ పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల ప్రారంభానికి కసరత్తు చేసుకుంటున్నారు. ఆయా పాఠశాలల్లో ఇదివరకే ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం గుట్టుగా చేస్తున్నారు. ఈ కొత్త జీఓ బయటకు వస్తే చాలామంది నిరుద్యోగుల్లో వ్యతిరేకత అధికమవుతుందనే ఉద్దేశంతో విద్యాశాఖ గుప్చుప్గా తంతు నడిపిస్తోంది. ఈ విషయం తెలిసి నిలదీస్తున్న పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఒకటో తరగతి అడ్మిషన్లు ఇస్తున్నామని, విద్యార్థులకు ఎక్కడ నచ్చితే అక్కడ చేర్పించుకోవచ్చునని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1317 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 168 ప్రాథమికోన్నత పాఠశాలలు, 232 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల పరిధిలో ఒక్కో గ్రామంలో గతంలో విద్యార్థులు, జనాభా సంఖ్య ఆధారంగా ఒకటి నుంచి మూడేసి ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు ఇందులోని 287కిపైగా ప్రాథమిక పాఠశాలలు దగ్గర్లోని ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఎత్తివేతకు సిద్ధంగా రాజాం పట్టణంలోని డోలపట ప్రాథమిక పాఠశాలవింత కొర్రీలుమరోవైపు ప్రాథ మిక పాఠశాలల్లో వంటలు వండుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఖ్య కుదింపు ప్రారంభమైంది. పూర్తిగా మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల విధానం ప్రాథమిక పాఠశాలల్లో అటకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఉన్నత పాఠశాలల్లో చేరిన 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు మళ్లీ వెనక్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం కొత్త కొర్రీ పెడుతోంది. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మళ్లీ వెనక్కు వెళ్లాలంటే కుదరదని కచ్చితంగా చెబుతుంది. అలా తప్పని పరిస్థితుల్లో వెళ్లాలంటే దగ్గరలో 45 మంది విద్యార్థులు దాటి ఉన్న ప్రాథమిక పాఠశాలకు, మోడల్ స్కూల్‌కు వెళ్లాలని చెబుతున్నారు. ఫలితంగా విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లో మానేసి, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. -
డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇచ్చి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, డీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. కొండపల్లి శ్రీనివాస్‌కు వినతిపత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులను రద్దుచేసి సూపర్ సిక్స్‌లో భాగంగా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. పది నెలలు గడిచినా మొదటి సంతకాన్ని అమలు చేయలేదని వాపోయారు. వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటనలు చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మొదటి వారానికి నోటిఫికేషన్ ఇస్తామని జూన్ నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నా రు. జిల్లాలో దాదాపు 20 వేల మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ఏడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో ఒక వైపు కుటుంబం నుంచి ఒత్తిడి మరోవైపు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా డీఎస్సీలో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మురళి, నరేష్, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్ జిల్లా మంత్రికి వినతిపత్రం అందజేత -
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
బొబ్బిలి: ప్రశాంతమైన బొబ్బిలిలో యువత గంజాయికి అలవాటు పడ్డారు. ఈ విషయమై పోలీసులు పెట్టిన నిఘాలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. దీంతో ఆ దిశగా విచారణచేసిన పోలీసులకు ముగ్గురు బీటెక్ విద్యార్థులు పట్టబడినట్లు తెలిసింది. వారు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి కాలేజీలో చదువుకుంటున్న వారుగా గుర్తించారు. పోలీసులు జరుపుతున్న విచారణలో మొత్తం ఏడుగురిని ప్రాథమికంగా గుర్తించి విక్రేతలు, కొనుగోలుదారులే కాకుండా సాగు చేస్తున్న వారి వివరాలు కూడా సేకరించినట్లు సమాచారం. మరో ముఖ్యమైన విషయమేమంటే పోలీసులు గుర్తించిన నిందితుల్లో సుమారు 70ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంజాయిని వినియోగిస్తూ, విక్రయిస్తున్న వారిలో ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మక్కువ మండలంలోని కంచేడువలస, కొయ్యాన పేట గ్రామాలకు చెందిన లక్ష్మ ణరావు, కాంతారావులు బొబ్బిలి పట్టణానికి చెందిన యువకులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఎస్సై ఆర్ రమేష్‌ను వివరణ కోరగా పట్టణంలో విక్రయిస్తూ గంజాయి కలిగి ఉన్న ముగ్గురు బీటెక్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై బుధవారమే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని పూర్తిస్థాయిలో నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలో పూర్తివివరాలను వెల్లడిస్తామన్నారు. వన్‌టౌన్ పోలీసుల అదుపులో మరో ఇద్దరు..విజయనగరం క్రైమ్: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను విజయనగరం వన్‌టౌన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన సమాచారం మేరకు..నగరంలోని గూడ్స్ షెడ్‌వద్ద వన్‌టౌన్ ఎస్సై ప్రసన్నకుమార్ వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు తాను డ్రైవ్ చేస్తున్న బైక్‌ను ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చి మ్యాన్ ఫ్యాక్ ద్వారా యువకుడితో పాటు బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తిని పట్టుకుని విచారణ చేసి రెండు కేజీల గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని శాంతినగర్‌కు చెందిన వాసుపల్లి విజయ్(19)ను మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీ చేసి స్కూటీని, వారు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను కోర్టుకు తరలించగా రిమాండ్ విఽధించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఏడుగురిని గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
పెరుమాళి పీఏసీఎస్‌లో దర్యాప్తు
తెర్లాం: మండలంలోని పెరుమాళి పీఏసీఎస్‌లో అవకతవకలు జరిగాయని శివరామరాజు అనే వ్యక్తి ఇటీవల కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం దర్యాప్తు నిర్వహించారు. బొబ్బిలి సబ్ డివిజనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారి చల్లా పద్మజ పీఏసీఎస్‌కు వచ్చి ఫిర్యాదుదారు, పీఏసీఎస్ అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో దర్యాప్తు చేశారు. పీఏసీఎస్‌లో రైతులకు తెలియకుండా రుణాలు మంజూరు చేస్తున్నారని, నచ్చిన వారిని ఎటువంటి జీవోలు లేకుండా ఉద్యోగులుగా నియమించుకుని వేలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. పెరుమాళి పీఏసీఎస్ పరిధిలో డీసీసీబీ నిధులతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని, ఆ బంక్‌లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని కొరగంజి అశోక్ దర్యాప్తు అధికారి వద్ద తెలిపారు. దీనిపై దర్యాప్తు అధికారి పద్మజ మాట్లాడుతూ పెరుమాళి పీఏసీఎస్‌లో జరిగిన దర్యాప్తులో ఫిర్యాదుదారులు తెలిపిన వివరాలు, సభ్యులు లెవనెత్తిన అంశాలను, సూపర్వైజర్, మేనేజర్ దర్యాప్తుకు హాజరుకాని విషయంపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తానని చెప్పారు. దర్యాప్తులో పీఏసీఎస్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
మూతపడిన జిందాల్ స్టీల్స్
కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం గురువారం అర్ధరాత్రి లేఆఫ్ ప్రకటించింది. విద్యుత్ చార్జీలు, ముడిసరుకు ధరలు పెరగడమే దీనికి కారణమంటూ నోటీస్‌లో పేర్కొంది. కూటమి పాలనలోకి వచ్చిన ఏడాదిలోనే రెండోసారి కర్మాగారం మూతపడింది. గతేడాది మే 17న మూసివేసిన పరిశ్రమను కార్మికుల ఆందోళనతో ఆగస్టులో తెరిచారు. ఇప్పుడు మళ్లీ మూతపడింది. పని కోసం శుక్రవారం తెల్లవారుజూమున వెళ్లిన కార్మికులు కంపెనీకి లేఆఫ్ ప్రకటించినట్టు అతికించిన నోటీస్‌ను చూసి కంగుతిన్నారు. అరకు–విశాఖ రోడ్డుపై బైఠాయింపు కర్మాగారానికి లేఆఫ్ ప్రకటించారన్న వార్తతో కార్మికులు ఆందోళనకు గురై కర్మాగారం వద్దకు చేరుకున్నారు. అరకు–విశాఖ రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్మాగారాన్ని వెంటనే తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొత్తవలస సీఐ సీహెచ్ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు కర్మాగారం వద్దకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరించారు. ఆవేదనలో కార్మికలోకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. కర్మాగారాలకు గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీలను ప్రస్తుతం నిలిపివేయడంతో బిల్లుల భారం భరించలేకపోతున్నాయి. దీంతో మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. జిందాల్ స్టీల్స్‌ను ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియక కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కర్మాగారంలో రెగ్యులర్ కార్మికులు 57 మంది, కాంట్రాక్టు పద్ధతిలో 247 మంది, ఇతర విభాగాల్లో మరో వందమంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. కర్మాగారం మూతపడడంతో వీరి కుటుంబాలు వీధినపడ్డాయి. ఈ కర్మాగారాన్ని 1987 ఆగస్టు 31వ తేదీన ప్రారంభించారు. నాటినుంచి నేటి వరకు 8 పర్యాయాలు కర్మాగారానికి యాజమాన్యం తాళాలు వేసింది. తాజా లేఆఫ్ నేపథ్యంలో యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకునేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. శనివారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. -
మెప్మా ఆర్పీల ఆందోళన
బొబ్బిలి: మెప్మా ఆర్పీలు బొబ్బిలిలో గురువారం ఆందోళనకు దిగారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ శాఖ పీడీ చిట్టిరాజుకు వివరించారు. కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపకపోవడంపై మండిపడ్డారు. నెలకు ఇచ్చే రూ.8వేలు వేతనం ఖాతాలకు జమచేయకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. శ్రమకు తగిన వేతనం ఇవ్వడంలేదంటూ వాపోయారు. గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదుకోసం వేలాది రూపాయల ఖర్చుతో మహిళాభివృద్ధి కార్యక్రమాలు, ఉత్పత్తుల ప్రదర్శనలను నిర్వహించి మెప్నా డీఎం ఏర్పాటుచేసిన యాప్‌లో నమోదు చేశామన్నారు. వాటికి పైసా డబ్బులు ఇవ్వలేదన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటూ బొబ్బిలి మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడంపై మండిపాటు కనీస వేతనాలు చెల్లించాలంటూ మెప్మా పీడీకి వినతి ఆర్పీల ప్రధాన డిమాండ్లు ఇవే.. ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనం నెలకు రూ.18,600 చెల్లించాలి. ఇరవయ్యేళ్ల సీనియార్టీ ఉన్న ఆర్పీలను సీఓలుగా ప్రమోట్ చేయాలి. -
ఉద్యోగ భరోసా కల్పిస్తే విధులకు హాజరవుతాం
కొత్తవలస: ఉద్యోగ భరోసా కల్పిస్తేనే విధులకు హాజరువుతామని అప్పన్నపాలెం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం కార్మికులు స్పష్టంచేశారు. యాజమాన్యం తీరుకు నిరసనగా కార్మికలు రెండు రోజులుగా విధులను బహిష్కరించారు. కర్మాగారం యాజమాన్యంతో వైఎస్సార్టీయూసీ (కార్మిక సంఘం) జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి గణేష్, సీఐటీయూ నాయకులు టి.సూర్యనారాయణ, కార్మిక సంఘ నాయకులు గురువారం చర్చలు జరిపారు. కార్మికులకు ఉద్యోగ భరోసా కల్పిస్తూ రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కర్మాగారం హెచ్ఆర్ మేనేజర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితిని టాప్ మేనేజ్మెంట్కు మెయిల్ చేశానని, అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయుకులు లగుడు వామాలు, గాడి అప్పారావు పాల్గొన్నారు. స్పష్టంచేసిన జిందాల్ కార్మికులు -
ఆన్లైన్లోనే సహకారం
● అన్ని సహకార సంఘాల్లోనూ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి ● పీఏసీఎస్‌ల సేవల్లో పారదర్శకతకు అవకాశం విజయనగరం అర్బన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి, అక్రమాల నిరోధానికి గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సాంకేతికత చర్యలు ఫలించాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని సంఘాల్లోనూ పూర్తయింది. ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దశాబ్దాల కిందట సభ్యత్వం తీసుకున్న రైతులు, రుణాల వివరాలను ఆన్లైన్ చేశారు. గతేడాది మార్చి నెలాఖరుకు ఆడిట్ నివేదికలో ఉన్న బ్యాలెన్స్ ఓచర్లు నమోదు చేశారు. డిజిటలైజేషన్ పూర్తి ఉమ్మడి విజయనగరం జిల్లాలో లాభాలు, నష్టాల్లో నడుస్తున్న అన్ని సహకార సంఘాలను డిజిటలైజేషన్ పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలో 94, పార్వతీపురంలోని 64 సంఘాల్లో దాదాపు 5 లక్షల మంది రైతులు సభ్యులుగా నమోదయ్యారు. ఇటీవల చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ తరువాత 1.4 లక్షల మంది మాత్రమే పక్కా ఆన్లైన్ సేవలకు అర్హులైన రైతులుగా నిర్ధారించారు. కొన్నేళ్లుగా రైతులు పొందుతున్న సేవల ఆధారంగా తుది జాబితాను ఖరారు చేశారు. అక్రమాలకు చెక్ సహకార సంఘాల్లో క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది రుణాల కోసం పర్సంటేజీలు వసూలు చేస్తు న్నారు. 30 శాతానికిపైగా సొసైటీల్లో రైతులు రుణ చెల్లింపులు చేసిన వెంటనేకాకుండా కొందరు సహకార సిబ్బంది తమ అవసరాలకు డబ్బులు వాడుకొని నిదానంగా జమ చేయడం, మరికొందరు సొమ్మును దుర్వినియోగం చేసి రైతులు చెల్లించలేదంటూ మాయచేసిన ఘటనలు గతంలో కనిపించేవి. ఇకపై అలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. డిజిటలైజేషన్ పూర్తయితే బ్యాలెన్స్, ముగింపు నిల్వల వివరాలు పక్కాగా ఉంటాయి. పాత తేదీలకు నమోదుచేసే అవకాశం ఉండదు. రైతు నగదు చెల్లించిన రోజే ఖాతాలో జమచేయాలి. సొసైటీ ఇచ్చిన అప్పులు, రుణ గ్రహీతల వివరాలు, చెల్లింపులు పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న సభ్యుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఉమ్మడి విజయనగరం జిల్లా స్థాయిలో 1.4 లక్షల మంది సభ్యత్వం ఉన్న సంఘాలుగా ఖరారయ్యాయి. ఈ–ప్యాక్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ శతశాతం సంఘాల్లో పూర్తయింది. ఆన్లైన్ కంప్యూటరీకరణ నేపథ్యంలో లావాదేవీలన్నీ పారదర్శకంగా జరగనున్నాయి. ఈ సొసైటీల్లో ఆన్లైన్ సేవలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల తరహాలో బ్యాంకింగ్ ప్రక్రియ సాగనుంది. – సీహెచ్ ఉమామహేశ్వరరావు, సీఈఓ, డీసీసీబీ -
ఎముకల విభాగం వైద్యుడికి మెమో జారీ
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులను సొంత క్లినిక్‌లకు తరలిస్తున్నారనే ఆరోపణలపై ‘మా క్లినిక్‌కు వచ్చే యండి..!’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 15వ తేదీన ప్రచురితమైన కథనానికి సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. రోగిని తన క్లినిక్‌కు రమ్మని చీటీరాసి ఇచ్చిన వైద్యుడికి మెమో జారీ చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ శంబంగి అప్పలనాయుడు తెలిపారు. డీపీఎంఓగా రవికుమార్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: డిస్ట్రిక్ ప్రొగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ ఎం.ఎం.రవికుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీపీఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ ఎం. సూర్యనారాయణ స్థానంలో రవికుమార్ రెడ్డిని నియమించారు. 19న వాష్ కేంద్ర బృందం సందర్శన బాడంగి: వాటర్ అండ్ శానిటేషన్, హైజనిక్ (వాష్) కేంద్ర బృందం ఈ నెల 19న బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించనున్నట్టు ఎంపీడీఓ ఎస్.రామకృష్ణ, గ్రామీణ రక్షితనీటి సరఫరా విభాగం ఏఈఈ రాజశేఖర్ తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా, జల్‌జీవన్‌మిషన్ పనులను పరిశీలిస్తుందన్నారు. ఇందులో భాగంగా గ్రామాన్ని గురువారం పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఢిల్ల్శ్వేరరావు, పంచాయతీ విస్తరణాధికారి సూర్యనారాయణ, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు పాలవలస గౌరు, తదితరులు పాల్గొన్నారు. అప్పన్న అన్నప్రసాద పథకానికి రూ.లక్ష విరాళం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శాశ్వత అన్నప్రసాద పథకానికి విజయనగరానికి చెందిన శివప్రసాద్ గురువారం రూ. లక్షా116లు విరాళం అందజేశారు. దేవస్థానం తరఫున దాతకు స్వామివారి అన్నప్రసాద విభాగం ఏఈఓ పిళ్లా శ్రీనివాసరావు బాండ్ అందించారు. అనంతరం అధికారులు స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదం అందజేశారు. దరఖాస్తు స్థితిని ఓటర్లు తెలుసుకోవచ్చు ● డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి విజయనగరం అర్బన్: ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, సవరణ, ఇతర క్లైమ్లకు సంబంధించిన అంశాలపై చేసిన దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. సీఈఓఆంధ్రా.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో వివరాలు ఉంటాయని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్ఓ తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలో వచ్చిన క్లైమ్లు, వాటి స్థితిగతులను వివరించారు. జిల్లాలో సవరణ అనంతరం జనవరి 6న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం 15,68,048 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల రేషనలైజేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఎన్నికల సూపరింటిండెంట్ భాస్కరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు, అప్పారావు, సోములు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా నేలల్లో నత్రజని లోపం
● పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ● సేంద్రియ కర్బన లోపం కూడా ఎక్కువే.. ● నాలుగు మండలాల్లో జింక్ లోపం ● 2024–25లో 21,175 మట్టి నమూనా పరీక్షలు ● ఈ ఏడాది లక్ష్యం 28,392 విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని నేలల్లో నత్రజని లోపం అధికంగా ఉంది. భూసార పరీక్ష కేంద్రం అధికారులు చేపట్టిన మట్టి నమూనా పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. నత్రజనితో పాటు సేంద్రియ కర్బనం లోపం కూడా ఉన్నట్టు తేలింది. కొన్ని మండలాల్లో జింక్, ఐరన్ లోపం ఉంది. నత్రజని లోపం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పంట ఎదుగుదల లోపించడంతో పాటు పంట దిగుబడి గణనీయంగా తగ్గుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. నత్రజని పంటకు ఆక్సిజన్ లాంటిదని పేర్కొన్నారు. నత్రజని, సేంద్రియ కర్బన పోషకాల భర్తీకి పశువుల గెత్తం, వర్మీ కంపోస్టును పొలాల్లో వేసుకోవాలన్నారు. లేదంటే జీలుగ, కట్టెజనుము, పిల్లిపెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు సాగుచేసి భూమిలో కలియదున్నాలన్నారు. లక్ష్యం 28,392 భూసార పరీక్షలు 2024–25 సంవత్సరానికి సంబంధించి భూసార పరీక్ష కేంద్రం అధికారులు 21,205 మట్టి నమూనా పరీక్షలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా 21,175 పరీక్షలు చేశారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి 28,392 పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 15 సెం.మీ లోతులో వి–షేప్ ఆకారంలో మట్టి నమూనాలు సేకరించనున్నారు. నాలుగు మండలాల్లోని నేలల్లో జింక్ లోపం జిల్లాలోని చీపురుపల్లి, రాజాం, గజపతినగరం, బొబ్బిలిలో జింక్ లోపం ఉంది. జింక్ లోపం నివారణకు దమ్ములో ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ వేయాలి. ● జిల్లాలోని చీపురుపల్లి, బొబ్బిలి మండలాల్లోని భూముల్లో ఐరన్ లోపం కూడా ఉంది. దీని నివారణకోసం అన్నభేది 2.5 గ్రాములు, నిమ్మ ఉప్పు 5 గ్రాముల చొప్పన లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పోషక లోపాలను భర్తీచేయాలి భూమిలో పోషక లోపాలను భర్తీ చేయాలి. మట్టి నమూనా పరీక్షల ఫలితాలను రైతులకు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది 28,392 మట్టి నమూనా పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలో నత్రజని, సేంద్రియ కర్బన లోపం అధికంగా ఉంది. దీనిని నివారించుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. – భానులత, ఏడీ, భూసార పరీక్ష కేంద్రం -
అంబేడ్కర్ దార్శనికత దేశానికే మార్గనిర్దేశం
విజయనగరం అర్బన్: సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేడ్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని, ఆయన దార్శనికత దేశానికి మార్గనిర్దేశం ఇస్తోందని కేంద్ర మాజీ మంత్రి, విద్యావేత్త ప్రొఫెసర్ సంజయ్ పాశ్వాన్ అన్నారు. విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘జాతి నిర్మాణం మరియు మహిళా సాధికారతలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర’ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒక రోజు జాతీయ సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అణచివేత, సాధికారత వంటి సమస్యల పరిష్కారంలో అంబేడ్కర్ చొరవను కొనియాడారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఐజీ సనాది మాట్లాడుతూ మహిళలకు చట్టపరమైన సమాన త్వాన్ని స్థాపించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లుకు ఆయన చేసిన కృషిని వివరించారు. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు విషయాలపై చట్టపరమైన స్పష్టత ఇచ్చారన్నారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ ప్రమాణ్ణి జయదేవ్ మాట్లాడుతూ సామాజిక పనిలో అంబేడ్కర్ తత్వశాస్త్రం ప్రాముఖ్యతను, సమ్మిళిత విధాన రూపకల్పనపై ఆయన ప్రభావాన్ని వివరించారు. యూనివర్సిటీ వీసీ టీవీ కట్టిమణి మాట్లాడుతూ సమాజహితమైన అంశాలపై కళాశాల స్థాయి విద్యాలయాల్లో సెమినార్లు నిర్వహించడం వల్ల చైతన్యవంతమై సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. అనంతరం ముఖ్య అతిథులను వీసీ సత్కరించారు. డాక్టర్ ఎం.నగేష్ ఆధ్వర్యంలో సాగిన సెమినార్లో ప్రొఫెసర్లు జె.ఎం.మిశ్రా, ఎం.శరత్చంద్రబాబు, ఎల్.వి.అప్పసాబా, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్ -
హత్యా..? ఆత్మహత్యా..?
పూసపాటిరేగ: భోగాపురం మండలం రావాడ గొల్లపేట గ్రామంలో గురువారం అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇప్పిలి అంకయ్యమ్మ (55), భర్త రమణ తరచూ రాజాపులోవలో ఉన్న ఎకరా ఢీ పట్టా భూమి విషయంపై గొడవ పడేవారు. డీ పట్టా అత్తపేరు మీద ఉండడంతో ఆ భూమిని విక్రయించేందుకు రమణ పలు మార్లు ప్రయత్నించాడు. దీనిని అంకయ్యమ్మ అడ్డుకుంది. ఈ విషయంపై ఇద్దరు కుమారులు, కుమార్తె సమక్షంలోనే భార్యాభర్తలు వాగ్వాదం చేసుకునేవారు. ఈ క్రమంలో అంకయ్యమ్మ మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె మృతికి భర్త రమణ, మృతురాలి బావ నర్సయ్య, కుమారుడు వెంకటేష్ కారణమని, ఆ సమయంలో ఈ ముగ్గు రూ ఇంట్లోనే ఉన్నారని బంధువులు చెబుతున్నారు. మరోవైపు ఆత్మహత్యకు పాల్పడిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్ఐ సూర్యకళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి ఆస్తి వివాదమే కారణమా? కుటుంబ సభ్యులే హత్యచేశారంటూ బంధువుల ఆరోపణ దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు
–10లో1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చినమేరంగి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీ సులు దాడులు చేశారు. 1800 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. విజయనగరం అర్బన్: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. విజయనగరం నియోజకవర్గం కొండకరకాంలో 12 ఎకరాలు, నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం మోదవలసలో 19.8 ఎకరాలు, గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొండకిండాంలో 57 ఎకరాలు, రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం సంకిలిలో 20 ఎకరాలు, బొబ్బిలి నియోజవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కిలో 100 ఎకరాలు, చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కుమరాంలోని 10 ఎకరాలు, ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం బలిఘట్టంలోని 57 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విజయవాడ ఏపీ సచివాలయంలో సీఎస్ సమావేశ మందిరం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజి ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీరు సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈ సర్వే, నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర, తదితర అంశాలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అంబేడ్కర్, జేసీ ఎస్.సేతుమాధవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
1800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని చినమేరంగి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై గురువారం నిర్వహించిన దాడుల్లో 18 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు సీఐ వీవీఎస్ శేఖర్‌బాబు, కురుపాం ఎకై ్సజ్ ఎస్సైలు రాజశేఖర్, చంద్రకాంత్‌లు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఈ దాడుల్లో 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సారా స్థావరాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు వారికి ముడిసరుకు సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నిర్ధారణ అయితే వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వెయ్యిలీటర్ల సారా ఊటలు ధ్వంసం భామిని: మండలంలోని కొత్తగూడలో గురువారం సారా అమ్మకం దారులపై దాడులు జరిపి 40లీటర్ల సారాతో ఇద్దరు అమ్మకం దారులు బిడ్డిక రవి, బిడ్డిక కొండలరావులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఏఈఎస్ ఏఎస్,దొర ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే దాడిలో వెయ్యి లీటర్ల సారా ఊటలు ధ్వంసం చేసి సారా తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాలకొండ ఎకై ్సజ్ సీఐ కె.సూర్యకుమారి సారథ్యంలో నవోదయం 2 కిం సారా నిర్మూలనలో భాగంగా సారా తయారీకి బెల్లం అందిస్తున్న ఘనసరకు చెందిన భూపతి షణ్ముఖపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. దాడుల్లో పాలకొండ సీఐ సూర్యకుమారితో పాటు మొబైల్ సీఐ మురళి, కొత్తూరు సీఐ కిరణ్మయి, పి.లీలారాణి, పాలకొండ ఎస్సై కొండలరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పేదల భూముల ఆక్రమణపై విచారణ జరిపించండి
సాలూరు: నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో దళితులు, గిరిజనులు, నిరుపేదల భూములు అన్యాయంగా ఆక్రమణలకు గురవుతున్నాయని, మంత్రి సంధ్యారాణికి చిత్తశుద్ధి ఉంటే వాటన్నింటిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మండలంలోని మోసూరు గ్రామంలో దళితులు సుమారు 24 ఏళ్ల క్రితం, వారికి పట్టాలివ్వక ముందు నుంచి బంజరుభూములు సాగుచేసుకోగా తరువాత ప్రభుత్వం వారికి పట్టాలిచ్చిందన్నారు. ఈ పట్టాలు ఇచ్చి సుమారు 20 సంవత్సరాలు దాటిపోయిందని, సుమారు 24 ఏళ్లుగా సాగుచేస్తున్న దళితుల భూముల మీదకు ఇటీవల విచారణలో భాగంగా అధికారులు స్థానిక బీసీలను తీసుకువెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మోసూరులో పాఠశాల భవనం కట్టిన స్థలం ప్రభుత్వానిదా? లేక జిరాయితీ స్థలమా? అన్న విషయం అధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తేల్చకుండానే దళిత ఎంఈఓపై సస్పెన్షన్ విధించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరాయితీ స్థలంలో పాఠశాల భవనం నిర్మించారని, పాఠశాల కావడంతో ఎవరూ ఏమీ అనలేదన్నారు. తరువాత భవనం పడిపోయి నిపపయోగంగా ఉండడంతో, స్థలం యజమాని భూమిని అమ్మగా స్థానిక సర్పంచ్ కొనుగోలు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసిన తరువాత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే మోసూరు గ్రామంలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేయగా, చెరువు ఆక్రమణ వాస్తవమేనని అంగీకరిస్తూ అది ఎవరు ఆక్రమించారో తెలియదని రెవెన్యూ అధికారులు పేర్కొనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వాలి నిజంగా గ్రామంలోని చెరువులు ప్రభుత్వానికి అవసరం లేకపోతే అక్కడ ఉన్న దళితులు, గిరిజనులు, బీసీ, అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలని కోరారు. దళితులు, గిరిజనుల భూములను ఎక్కడైనా ఎవరైనా ఆక్రమిస్తే దర్యాప్తు చేయించి, దర్యాప్తును అనుసరించి సర్వే చేసి అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో తాను మాట్లాడిన విషయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై రాజన్నదొర స్పందిస్తూ, తాను మాట్లాడిన విషయాలను అంశాల వారీగా ప్రజలకు మీడియా ద్వారా వివరిస్తానన్నారు. ఆ సభలో తాను అంబేడ్కర్ రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడానని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, వైఎస్సార్సీపీ నాయకుడు మొకర లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ -
ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్
● విజేత బలిజిపేట ● బహుమతులు అందజేసిన ఏఆర్ ఏఎస్పీవిజయనగరం క్రైమ్: స్థానిక పోలీస్ బ్యారెక్స్‌లో నిర్వహించిన ఏఆర్ కానిస్టేబుల్ సీహెచ్.గోపాలరావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్లో ముగింపు వేడుకలకు ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై బుధవారం రాత్రి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ వాలీబాల్ పోటీలలో నాలుగు పోలీస్స్టేషన్ల పరిధికి చెందిన ఏఆర్,సివిల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేసిన గోపాలరావు ఏఆర్ విభాగానికి ఓ డాక్టర్‌గా సేవలందించారని కొనియాడారు. ఆయన జ్ఙాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం ఆయన సేవలను గుర్తుంచుకోవడమేనన్నారు.ఈ టోర్నమెంట్లో ప్రథమస్థానంలో నిలిచిన బలిజిపేట జట్టుకు రూ.12 వేలు, ద్వితీయస్థానంలో నిలిచిన గంట్యాడ జట్టుకు రూ.8 వేలు తృతీయ స్థానంలో నిలిచిన కొత్తవలస జట్టుకు రూ.6 వేలు కన్సొలేషన్ ప్రైజ్‌గా విజయనగరం జట్టుకు రూ.4 వేలు ఏఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐలు గోపాలరావు, శ్రీనివాసరావు, ఆర్ఎస్సైలు సూర్యనారాయణ, రామారావు, మహేష్, ముబారక్ ఆలీ, దివంగత కానిస్టేబుల్ కుటుంబసభ్యలు పాల్గొన్నారు. -
ఇంటర్ తప్పిన విద్యార్థులు 22లోగా పరీక్షఫీజు చెల్లించాలి
పార్వతీపురంటౌన్: ఇటీవల మార్చి నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం ఇంటర్ బోర్డు పేర్కోన్న నిర్ణీత గడువులోగా ఫీజులు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ ఫీజు చెల్లించేందుకు తుది గడువు అనే విషయాన్ని విద్యార్థుల తల్లితండ్రులు గమనించాలని కోరారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరాల్లో గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. సబ్జెక్టు వారీగా ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.600తో పాటు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చెప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.275, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సులకు హాజరయ్యే వారు రూ. 165 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ బీఐఈ.ఏపీ.జోఓవీ.ఐన్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 22వ తేదీలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే.28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నైతికత, మానవ విలువలు పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 6న జరగనున్నట్లు వివరించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి మంజుల వీణ -
అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమా..?
ఇలా ఈ ముగ్గురే కాదు. జిల్లాలోని వందలాది మంది ప్రజలు ఎన్ని ఆపసోపాలు పడినా..ఆధార్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. జిల్లాలోని ఏ సచివాలయానికి వెళ్లినా, ఎవరిని అడిగినా జిల్లా కేంద్రంలో పెదపోస్టాఫీసుకు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లండి, అక్కడైతేనే చేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం జిల్లాలో సరైన ఆధార్ కేంద్రాలు లేకపోవడమేనని తెలుస్తోంది. గతప్రభుత్వం సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోక పోవడం, సచివాలయాల్లో సరైన పరికరాలు లేకపోవడం, పరికరాలు ఉన్నా సిబ్బంది అందుబాటులో లేకపోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో హెడ్్పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడా టోకెన్లు ముందుగానే బుక్ అవుతున్నాయి. దీంతో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఒక రోజుకు వందటోకెన్లకు పైగా బుక్ అవుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వేకువ జామునుంచే పడిగాపులు హెడ్‌పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో ఆధార్ మార్పుల కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు వేకువ జామునుంచే టోకెన్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం ఈ కార్యాలయాల వద్ద సుమారు 150మందికి పైగా ఒకేసారి వచ్చారు. టోకెన్లు ముందే బుక్ అయ్యాయని తెలియక పడిగాపులు కాశారు. ఈ విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు టోకెన్ల కోసం క్యూలో వేచి ఉన్నారు. జిల్లాలో ఆధార్, సెంటర్లు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో దాదాపు పదుల సంఖ్యలో బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఉన్నా ఎక్కడా సేవలు అందించడం లేని తెలుస్తోంది. గతంలో సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిబ్బంది కొరత, పరికరాలను మూలపడేసిన కారణంగా మారుమూల గ్రామస్తులు జిల్లా కేంద్రంలో ఉన్న బీఎస్ఎన్ఎల్, హెడ్‌పోస్టాఫీసుకు రావాల్సిన దుస్థితి నెలకొంది. -
లైంగికదాడి కేసులో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి పోలీస్‌స్టేషన్‌లో 2020వ సంవత్సరంలో నమోదైన లైంగికదాడి కేసులో ముద్దాయికి విజయనగరం మహిళాకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎన్.పద్మావతి పదేళ్ల కారాగార శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ..గరుగుబిల్లి మండలం, దళాయివలస గ్రామానికి చెందిన ఫిర్యాదిదారు జీవనోపాధి నిమిత్తం 2017వ సంవత్సరంలో ఆకివీడులోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తూ కంపెనీ హాస్టల్లో ఉంటూ జీవనం సాగిస్తుండగా..అదే సంవత్సరంలో గరుగుబిల్లి మండలం, కొంకడివరం గ్రామానికి చెందిన ముద్దాయి బలగ శివ జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్లాడని చెప్పారు. ఈ క్రమంలో బాధితురాలిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని అభయమిచ్చి పలుమార్లు శారీరకంగా లోబరుచుకుని మోసం చేశాడన్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2020లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువైన మేరకు విజయనగరం న్యాయస్థానం పైవిధంగా శిక్ష ఖరారు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును సంబంధించి దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ127 శ్రీ218 శ్రీ228మెరిట్ జాబితా విడుదలగుమ్మలక్ష్మీపురం: ఏకలవ్య, ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన మెరిట్ జాబితా, విద్యార్థులు ఎంపికై న పాఠశాలల వివరాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ అధికారిక వెబ్సైట్ http://twreircet.apcfss.in లో పొందుపర్చినట్లు గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వీర్‌సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యార్థులు/తల్లిదండ్రులు వారి మెరిట్ స్థితిని, ఏ పాఠశాలకు ఎంపికయ్యారో ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకుని తదనంతరం చర్యలకు సిధ్ధపడాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులు తగిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో 2025 ఏప్రిల్ 21 నుంచి 30వ తేదీలోగా ఆయా ఎంపికై న పాఠశాలలకు హాజరై నమోదు ప్రక్రియను పూర్తిచేసుకోవాలని చెప్పారు. ప్రవేశాలకు గడువును పొడిగించబోరని స్పష్టం చేశారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలువిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల గుడివాడలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. స్థానిక కోడి రా మ్మూర్తి వ్యాయామ సంఘం ప్రతినిధి, అభిన వ భీమ పెద్ది లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో శిక్షణ పొందిన క్రీడాకారులు స్ట్రాంగ్ ఉమన్ జారా గోల్డ్ మెడల్ సాధించగా, ఉదయ్ అనే మరో క్రీడాకారుడు ద్వితీయస్థానంలో నిలిచి సి ల్వర్ మెడల్ సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభినందించారు. బైపీసీ విద్యార్థులకు అవకాశం శ్రీకాకుళం రూరల్: ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 19లోగా దర ఖాస్తు చేసుకోవాలని కోరారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం కల్పించి ఫీజును జీతంలో మినహాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 76809 45357 నంబర్‌ను గానీ, రాగోలు జెమ్స్ ఆసుపత్రి లోని బొల్లినేని మెడిస్కిల్స్‌ను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పోలీస్ కుటుంబానికి సిబ్బంది ‘చేయూత’ ● రూ.3 లక్షల ఆర్థిక సాయం విజయనగరం క్రైమ్: ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన కానిస్టేబుల్ సీహెచ్.గోపాలరావు కుటుంబానికి ఏఆర్, సివిల్ సిబ్బంది అండగా నిలిచారు. తాము పోగుచేసిన సొమ్ము రూ.3 లక్షల 60 వేల నగదును ఎస్పీ వకుల్ జిందల్ చేతుల మీదుగా మృతుడి సతీమణి శారదకు గురువారం అందజేశారు. 2000 బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్పీ, ప్రస్తుతం ఏఆర్ కన్వర్షన్‌గా బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్న మిలీనియం బ్యాచ్ కానిస్టేబుల్స్ స్వచ్ఛందంగా పొదుపు చేసిన రూ.3లక్షల 60వేలను సహచర ఉద్యోగి అకాలమరణం చెందడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థికంగా భరోసా కల్పించారని ఎస్పీ వకుల్ జందల్ ఈ సందర్భంగా అన్నారు. మృతుడి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అందుకుగల సర్టిఫికెట్లను డీపీఓలో అందచేయాలని మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఆర్ఐలు గోపాలనాయుడు, రమేష్, శ్రీనివాస్ రావు, మిలీనియం బ్యాక్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరావు, ఉమా మహేశ్వరరావు, పైడితల్లి, కృష్ణమోహన్, శేషగిరి, రమేష్, మోహన్, రమేష్, హరిశంకర్, చిట్టిబాబు, సీతారాం, చక్రధర్, ప్రసాద్‌లు పాల్గొన్నారు. -
ప్రతి 3 నెలలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం
విజయనగరం అర్బన్: ఎస్సీ, ఎస్టీ కులాలు, షెడ్యూల్ తెగలపై జరుగుతున్న దాడులపై నిర్వహించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఇక నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. సమావేశం నిర్వహించిన అనంతరం మినిట్స్‌ను కలెక్టర్‌కు పంపాలని, అక్కడి అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా 30న అన్ని మండలాల్లో ఎస్హెచ్ఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే జరపాలని, ఆ మీటింగ్ మినిట్స్‌ను పంపాలని ఆదేశించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల స్మశానాలు లేవని, మరికొన్ని చోట్ల ఆక్రమించుకున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ముగ్గురు ఆర్డీఓలు అన్ని ఎస్సీ కాలనీల్లో తనిఖీ చేసి శ్మశానాలు ఎక్కడెక్కడ లేవో, ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో పరిశీలిలంచి నివేదిక పంపాలని ఆదేశించారు. కొన్ని చోట్ల 2 గ్లాస్‌ల విధానం ఇంకా అమలవుతోందని సమావేశం దృష్టికి తీసుకెళ్లగా చట్టంపై పోలీసులు అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రఘురాజు, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఎస్పీ సౌమ్యలత, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, ఏపీజీఎల్ఐ ఎ.డి హైమవతి, ట్రాన్స్‌కో ఎస్ఈ లక్ష్మణరావు, డీఎస్పీలు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
తప్పని ఆధార్ తిప్పలు
● కార్డులో మార్పులకు అవస్థలు ● జిల్లాలో పనిచేయని కేంద్రాలు ● సచివాలయాల్లో మూలన పడిన పరికరాలు ● జిల్లా కేంద్రంలో పోస్టాఫీసు వద్ద మాత్రమే నమోదు పార్వతీపురంటౌన్: ● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన ఊర్మిళ తన చంటి బిడ్డతో దయనీయంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద వేచిచూస్తోంది. తనకు ఆధార్‌లో అడ్రస్ మార్పు గ్రామ సచివాలయంలో అవడం లేదని జిల్లా కేంద్రంలో బీఎస్ఎన్ఎల్, పోస్టల్ కార్యాలయాల వద్ద అప్డేట్ అవుతుందన్న సమాచారం తెలుసుకుని పట్టణానికి వచ్చింది. సర్వర్ పనిచేయడం లేదని, 4గంటల కాలం పాటు వేచి చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయింది. ● కొమరాడ మండలం పొడుగువలస గ్రామానికి చెందిన కిల్లక అరుణ మూడు రోజులుగా ఆధార్ అప్డేట్ కోసం వేచి చూస్తోంది. ప్రతిరోజూ బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చి వేచి చూస్తున్నా ఆమెకు టోకెన్ దొరకడం లేదు. సిబ్బందిని టోకెన్ కావాలని అడగ్గా వారం రోజుల పాటు టోకెన్లు ఇచ్చేశామని, అయినా సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.● పార్వతీపురం మండలం ఆర్కె బట్టివలస గ్రామానికి చెందిన వెంకీ తన కుమార్తె, కుమారుడు నాని, దివ్యల ఆధార్ అప్డేట్ చేయడానికి మూడు రోజులుగా పార్వతీపురం పట్టణంలోని పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ టోకెన్లు లేవన్న కారణంతో అప్డేట్ చేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నాడు.