పూసపాటిరేగ: మండలంలోని కుమిలి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జనసేనలోకి వలస వెళ్లినట్లు ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కుమిలి గ్రామ వైఎస్సార్‌సీపీ నాయికుడు గుజ్జు సురేష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమిలి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంజేరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కుమిలి గ్రామానికి చెందిన 40 వైఎస్సార్‌సీపీ కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలో చేరినట్లు పేపరుకు తప్పుడు ప్రకటన ఇచ్చారన్నారు. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాసరి అప్పలరెడ్డి, దాసరి సోమయ్యరెడ్డి, దాసరి రామకృష్ణ, దాసరి అప్పలరెడ్డి, పడాల సూర్యనారాయణ, పడాల అప్పలస్వామి, నాయిని సింహాద్రి, నీలాపు సురేష్, నీలాపు శ్యామల, గోవిందల సూర్యారావు, దాసరి సూర్యనారాయణ, దారపు జోగిరెడ్డి, అక్రమాని అప్పన్న, గండ్రేటి అప్పలరెడ్డిలు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్తే వైఎస్సార్‌సీపీ నుంచి వలస వెళ్లినట్లు తప్పుడు ప్రకటనలు ఇచ్చారన్నారు. కుమిలిలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని, ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త వలస వెళ్లలేదన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని జనసేన నాయకులకు సవాల్ విసిరారు. వాస్తవాలు పక్కనపెట్టి తప్పుడు ప్రకటనలు ఇచ్చుకోవడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గాబు సూరప్పన్నరెడ్డి, కర్రి అప్పారావు, డొంక దుర్గరాజు, దున్న నర్సింగరావు, కనకం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కుమిలి వైఎస్సార్‌సీపీ నాయకులు


